 
													అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ (Ford).. తమిళనాడులోని చెన్నై ప్లాంట్‌లో తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.
ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్‌లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది నాలుగు సంవత్సరాల విరామం తర్వాత.. భారతదేశంలో ఉత్పత్తికి పునరాగమనాన్ని సూచిస్తుంది. ఒప్పందం ప్రకారం.. ఫోర్డ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
ఫోర్డ్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత 600 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంస్థకు చెందిన కొత్త సౌకర్యంలో సంవత్సరానికి 2,35,000 ఇంజిన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ఉత్పత్తి 2029లో ప్రారంభం కానుంది. కాగా ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంజిన్లను కంపెనీ.. ఎగుమతి చేయనుంది. కాబట్టి ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉంటాయి.
ఇదీ చదవండి: ఏడేళ్లుగా వెయిటింగ్.. నా డబ్బు రీఫండ్ చేయండి: శామ్ ఆల్ట్‌మాన్
2021లో ఫోర్డ్.. భారతదేశంలో వాహనాల తయారీని నిలిపివేసింది. దీనికి కారణం కంపెనీ ఊహకందని నష్టాలను చవిచూడటమే. ఒకప్పుడు ఎకోస్పోర్ట్, ఎండీవర్, ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసిన మరైమలై నగర్ ప్లాంట్.. అప్పటి నుంచి (2021 నుంచి) ఖాళీగానే ఉంది.
Hard work and dedicated follow up of #TeamCMMKStalin pays off !#Ford is officially back to Chennai! 🎊
Today, Ford and the Government of Tamil Nadu signed an MoU in the presence of Honourable @CMOTamilNadu Thiru. @MKStalin avargal and our Honourable DyCM Thiru @Udhaystalin… pic.twitter.com/NDwFyz4Utf— Dr. T R B Rajaa (@TRBRajaa) October 31, 2025

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
