హైదరాబాద్‌ షోరూమ్‌లో కొత్త ఎంజీ హెక్టర్ లాంచ్: ధర ఎంతంటే? | New MG Hector Launched at Automotive MG Showroom in Bowenpally | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ షోరూమ్‌లో కొత్త ఎంజీ హెక్టర్ లాంచ్: ధర ఎంతంటే?

Dec 16 2025 7:26 PM | Updated on Dec 16 2025 8:10 PM

New MG Hector Launched at Automotive MG Showroom in Bowenpally

హైదరాబాద్‌లోని బోవెన్‌పల్లిలోని ఆటోమోటివ్ ఎంజీ షోరూమ్‌లో సరికొత్త ఎంజీ హెక్టర్‌ను లాంచ్ చేశారు. ఈ కొత్త మోడల్ కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ డిజైన్ కలిగి.. కొత్త గ్రిల్ డిజైన్ పొందుతుంది. కొత్త అల్లాయ్ వీల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇది సెలాడాన్ బ్లూ అండ్ పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.

5-సీటర్ ట్రిమ్‌లో డ్యూయల్ టోన్ ఐస్ గ్రే థీమ్ ఇంటీరియర్‌.. 6, 7-సీటర్ ట్రిమ్‌ల కోసం డ్యూయల్ టోన్ అర్బన్ టాన్‌ ఇంటీరియర్‌ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కొత్త ఎంజీ హెక్టర్ లాంచ్ సందర్భంగా.. ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ, భారతదేశంలోనే అతిపెద్ద 14 అంగుళాల పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ & అడ్వాన్స్డ్ i-SWIPE టచ్ నియంత్రణలతో కూడిన కొత్త హెక్టర్‌ను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నామని అన్నారు. ఇది కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement