మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 533.50 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 84,679.86 వద్ద, నిఫ్టీ 167.20 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 25,860.10 వద్ద నిలిచాయి.
అసహి సాంగ్వాన్ కలర్స్, అమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్, అగ్రి టెక్ ఇండియా, ఈప్యాక్ డ్యూరబుల్స్, న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సలోనా కాట్స్పిన్, ఆర్వీ లాబొరేటరీస్, విపుల్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎల్జీ రబ్బరు వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


