Stock Market
-
మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మళ్ళీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 211.41 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,846.74 వద్ద, నిఫ్టీ 43.40 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 23,559.95 పాయింట్ల వద్ద నిలిచాయి.టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ట్రెంట్, హిందాల్స్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఐటీసీ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.రెపో రేటు తగ్గించిన ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్థిరంగా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 213.12 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టపోయి 78,058.16 వద్ద, నిఫ్టీ 92.95 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టపోయి 23,603.35 వద్ద నిలిచాయి.సిప్లా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి కంపెనీలు లాభాలను చవి చూశాయి. ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారతి ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరంగా స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం గత సెషన్‌తో పోలిస్తే స్థిరంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 23,696కు చేరింది. సెన్సెక్స్(Sensex) 30 పాయింట్లు పెరిగి 78,303 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.66 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.39 శాతం లాభపడింది. నాస్డాక్ 0.19 శాతం ఎగబాకింది.ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. కొత్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ వడ్డీ రేట్లు, పరపతి విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ కీలకంగా చూసేది ద్రవ్యోల్బణాన్నే. వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) డిసెంబర్ త్రైమాసికానికి 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 4.8 శాతంగా ఉంటుందన్నది ఎస్బీఐ రీసెర్చ్ అంచనా. జనవరి నెల ద్రవ్యోల్బణం 4.5 సమీపంలో ఉండొచ్చని పేర్కొంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్ 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.9 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.72 శాతం లాభపడింది. నాస్డాక్ 1.35 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: అక్రమ జామర్స్‌తోనే కాల్ డ్రాప్స్అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు నిన్నటి సెషన్లో అరశాతం పెరిగాయి. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లకు ‘టారిఫ్’ రిలీఫ్
ముంబై: మెక్సికో, కెనడాపై సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లు మంగళవారం బలంగా పుంజుకున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలూ, అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ అంశాలూ కలిసొచ్చాయి. సెన్సెక్స్ 1,397 పాయింట్లు పెరిగి 78,584 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 378 పాయింట్లు బలపడి 23,739 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది నెలరోజుల గరిష్టం కావడం విశేషం.ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,472 పాయింట్లు పెరిగి 78,659 వద్ద, నిఫ్టీ 402 పాయింట్లు ఎగసి 23,763 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ⇒ ఇటీవల మార్కెట్ పతనంలో భాగంగా పలు రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.35%, 1.25 శాతం పెరిగాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లలో మాత్రం లాభాల స్వీకరణ జరిగింది. ⇒ రంగాల వారీగా అత్యధికంగా క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 3.50% పెరిగింది. ఇండస్ట్రియల్స్ 2.50%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.40%, విద్యుత్, ఫైనాన్షియల్ సర్విసెస్ సూచీలు రెండు శాతం లాభపడ్డాయి. ⇒ స్టాక్ మార్కెట్( stock market) దాదాపు రెండు శాతం ర్యాలీతో మంగళవారం రూ.5.96 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.425 లక్షల కోట్ల(4.88 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకుంది. ⇒ రూపాయి విలువ జీవితకాల కనిష్టం(87.11) నుంచి స్వల్పంగా రికవరీ అయ్యింది. డాలర్ మారకంలో నాలుగు పైసలు బలపడి 87.07 వద్ద స్థిరపడింది. ట్రంప్ వాణిజ్య యుద్దానికి తాత్కాలిక తెరవేయడంతో అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 108 స్థాయికి దిగివచ్చింది. ఈ అంశం దేశీయ కరెన్సీకి కలిసొచ్చిందని నిపుణులు తెలిపారు. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు భారీ లాభాలను చవి చూశాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,203.43 పాయింట్లు లేదా 1.56 శాతం లాభంతో 78,390.17 వద్ద, నిఫ్టీ 373.80 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో.. 23,734.85 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రెంట్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.గత కొన్ని రోజులుగా వరుస నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (ఫిబ్రవరి 4)న శుభారంభం పలికాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఇకపోతే.. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్(Sensex) 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.71 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.76 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.2 శాతం దిగజారింది.7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టారిఫ్ వార్.. బొమ్మాబొరుసు!
సాక్షి, బిజినెస్ డెస్క్: ట్రంప్ దూకుడు చూస్తుంటే.. ఇతర దేశాలను కాళ్లబేరానికి తెచ్చుకునే వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రేపోమాపో మనకూ సుంక‘దండన’తప్పకపోవచ్చు. ఇప్పటికే పలుమార్లు భారత్‌ను ‘అమెరికాకు అతిపెద్ద టారిఫ్ ముప్పు’గా అభివర్ణించారు కూడా. డీ–డాలరైజేషన్ చర్యల నుంచి వెనక్కతగ్గకపోతే బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా హెచ్చరించారు. అయితే, అమెరికా టారిఫ్‌లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని స్వయంగా ఆ దేశ ఆర్థిక వేత్తలు, నిపుణులే హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కకావికలం అవుతాయని, దీంతో ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి.. ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు దారితీస్తుందని చెబుతున్నారు. సుంకాల విధింపుతో ఎగుమతిదారులు ఆమేరకు రేట్లు పెంచుతారు. అమెరికా ప్రజలు కూడా ఆయా దేశాల ఉత్పత్తులను అధిక ధరలకు కొనుక్కోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.మన ఎగుమతులకు లాభమేనా?ట్రంప్ టారిప్ వార్తో ప్రస్తుతానికి కొన్ని రంగాల్లో ఎగుమతిదారులకు కొంత లాభమేనని పరిశ్రమవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుతానికి మనపై సుంకాలు విధించకపోవడంతో చైనా ఉత్పత్తులతో పోలిస్తే మన ఎగుమతులకు పోటీతత్వం పెరుగుతుందని భారతీయ ఎగుమతిదారుల సంఘం (ఫియో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. అయితే, భారత్‌లోకి చైనా సహా పలు దేశాల నుంచి చౌక దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, ఇది మన పరిశ్రమలకు ముప్పుగా మారొచ్చని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకాల విషయంలో తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ సూచించారు.ఆటోమొబైల్: భారత వాహన విడిభాగాల సంస్థలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉంది. పరిశ్రమ అసోసియేషన్ (ఏసీఎంఏ) ప్రకారం 2024–25లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. ఇందులో 3.67 బిలియన్ డాలర్లు, అంటే 28 శాతం అమెరికాకే వెళ్లాయి. తాజాగా ఇతర దేశాలపై టారిఫ్‌ల పెంపుతో యూఎస్‌లో మన వాటా పెంచుకోవడానికి సదవకాశమని కొంతమంది పరిశ్రమవర్గాలు చెబుతున్నారు. ‘ఆహార, వ్యవసాయ రంగాలతో పాటు వాహన విడిభాగాల రంగాలు తక్షణం ప్రయోజనం పొందుతాయి. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి’అని వాణిజ్య విధాన విశ్లేషకుడు ఎస్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.టెక్స్టైల్స్: ట్రంప్ తాజా టారిఫ్‌లు భారత టెక్స్టైల్ రంగానికి బూస్ట్ ఇస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది’అని తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం (టీఈఏ) అధ్యక్షుడు కె.ఎం. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.ఫార్మా: భారత ఫార్మా రంగం అప్రమత్తతతో పాటు ఆశావహ ధోరణితో వేచిచూస్తోంది. ‘జెనరిక్స్‌లో చైనా చాలా పటిష్టంగానే ఉన్నప్పటికీ, అమెరికాకు పెద్దగా ఎగుమతి చేయడం లేదు. ప్రధానంగా యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్ (ఏపీఐ), కెమికల్స్ వంటివి ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు మనకు వీటిని కూడా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. అయితే, మనం వాటి కోసం చైనాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి’అని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) మాజీ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.స్టీల్: ట్రేడ్ వార్ మరింత ముదిరితే సరఫరా వ్యవస్థల్లో తీవ్ర కుదుపులకు ఆస్కారం ఉంది. వివిధ దేశాల నుంచి భారత్‌కు దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, పరిస్థితులను నిశితంగా గమనించి చర్యలు చేపట్టాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సీఈఓ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. చైనా స్టీల్ ఉత్పత్తి భారీగానే కొనసాగనున్న నేపథ్యంలో యూఎస్ దెబ్బకు ఇతరత్రా అందుబాటులో ఉన్న దేశాలకు ఎగుమతులను మళ్లించవచ్చని ఆర్సెలర్ మిట్టల్ వైస్–ప్రెసిడెంట్ రంజన్ ధార్ తెలిపారు.ఎలక్ట్రానిక్స్: చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలతో తక్షణం ప్రయోజనం పొందే రంగాల్లో ఇదొకటి. అయితే, తక్షణం దీని ప్రయోజనం పొందేలా పాలసీ రూపకర్తలు, పరిశ్రమ వర్గాలు చర్యలు తీసుకోవాలని భారతీయ సెల్యులర్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. భారత్‌ను ఎగుమతి హబ్‌గా చేసుకుంటున్న యాపిల్‌తో పాటు మోటరోలా వంటి చైనా బ్రాండ్లు మన దగ్గరున్న టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్ వంటి తయారీదారుల నుంచి అమెరికాకు ఎగుమతులను మరింత పెంచే అవకాశం ఉంది. యాపిల్, శాంసంగ్ దన్నుతో 2024లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 20.4 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో యాపిల్ వాటా 65 శాతం కాగా (12.8 బిలియన్ డాలర్లు), శాంసంగ్ వాటా 20 శాతంగా (4 బిలియన్ డాలర్లు) ఉంది.దిగుమతులు, రూపాయి, స్టాక్ మార్కెట్‌కు దెబ్బ...ట్రేడ్ వార్ 2.0... ప్రపంచ దేశాల కరెన్సీ మార్కెట్లను సైతం కుదిపేస్తోంది. అనేక దేశాల కరెన్సీలతో డాలర్ విలువ మరింత బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ ఇప్పటికే 110 స్థాయికి చేరింది. దీంతో మన రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కిపోతోంది. తాజాగా డాలరు మారకంలో 87 కిందికి పడిపోయింది. ఒకపక్క, ఎగుమతిదారులకు కాస్త ఊరట లభించినప్పటికీ.. మన వాణిజ్యం ఇప్పటికీ లోటులోనే ఉన్న నేపథ్యంలో దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. ఇక అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెంపు భయాలు పెరిగాయి.యూఎస్‌లోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇవ్వడంతో డాలర్ జోరుకు ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రభావంతో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన స్టాక్ మార్కెట్ నుండి పొలోమంటూ నిధులను వెనక్కి తీసేసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి రివర్స్ గేర్‌లో ఉన్న ఎఫ్‌పీఐలు ట్రంప్ విజయం తర్వాత ఇంకాస్త జోరు పెంచారు. ఈ ఏడాది జనవరిలోనే రూ.87,000 కోట్ల విలువైన షేర్లను భారత్ మార్కెట్లలో విక్రయించడం విశేషం. దీంతో స్టాక్ సూచీలు ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి 10 శాతం పైగానే కుప్పకూలాయి. వెరసి టారిఫ్ వార్ దేశీ స్టాక్ మార్కెట్లకూ అతిపెద్ద ముప్పుగా మారుతోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా...2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గతేడాది అమెరికాకు భారత ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు మన ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి.అనుకూలం⇒ ఫార్మా – చైనాపై టారిఫ్‌ల నేపథ్యంలో మన జెనరిక్ కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి.⇒ టెలికం పరికరాలు – ఇతర దేశాలతో పోలిస్తే మన ఎగుమతులు జోరందుకుంటాయి.⇒ ఎలక్ట్రానిక్స్ – దేశీ తయారీ కంపెనీలకు అమెరికా మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది.⇒ టెక్స్టైల్స్ – భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.⇒ ఫుడ్–అగ్రి ప్రోడక్టŠస్ – ఆహార, వ్యవసాయ రంగాలకు తక్షణ ప్రయోజనం.⇒ ఆటోమొబైల్ విడిభాగాలు – యూఎస్‌లో మన కంపెనీల ఎగుమతుల వాటా పెంచుకోవడానికి సదవకాశం.⇒ పెట్రోలియం ఉత్పత్తులు – ఎగుమతులు పుంజుకోవడానికి చాన్స్.⇒ ఐటీ సేవలు – రూపాయి పతనంతో మరింత ఆదాయం సమకూరుతుంది.ప్రతికూలం⇒ రూపాయి – డాలర్ భారీగా బలపడటంతో దేశీ కరెన్సీ విలువ మరింత పడిపోవచ్చు.⇒ స్టాక్ మార్కెట్ – విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో పెట్టబడులు తరలిపోయి.. మార్కెట్ ఇంకా పడిపోవచ్చు.⇒ ముడిచమురు – దిగుమతులు మరింత భారమై.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ⇒ బంగారం – రూపాయి పతనంతో విదేశీ మార్కెట్‌తో పోలిస్తే ధరలు కొండెక్కవచ్చు.⇒ యంత్రపరికరాలు – దేశీ కంపెనీలు దిగుమతి చేసుకునే పరికరాలు, సామగ్రి ధరలు మరింత పెరుగుతాయి.⇒ వంటనూనెలు – భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల నూనె ధర మరింత హీటెక్కవచ్చు.⇒ ఎరువులు – వ్యవసాయానికి అవసరమైన ఎరువుల దిగుమతి భారమవుతుంది. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.22 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో.. 77,186.74 వద్ద, నిఫ్టీ 122.85 పాయింట్లు లేదా 0.52 శాతం నష్టంతో 23,359.30 వద్ద ఉన్నాయి.బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లార్సెన్ & టూబ్రో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్(Sensex) 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(US Index) 109.7 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం దిగజారింది.7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రంప్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
కేంద్ర ఆర్థికమంత్రి గత శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ రకంగా మార్కెట్‌కు రుచించలేదు. మధ్య తరగతి, వేతన జీవులకు ప్రాధాన్యమిస్తూ సాగిన బడ్జెట్లో మార్కెట్ డిమాండ్లేవీ నెరవేరకపోవడంతో బడ్జెట్‌కు ముందు వచ్చిన ర్యాలీ కొనసాగలేదు. పన్ను స్లాబులు, రేట్లలో చేసిన మార్పుల వల్ల సామాన్యుల ఆదాయం పెరుగుతుందని, తద్వారా కొనుగోలు శక్తి ఇనుమడిస్తుందన్న ఉద్దేశంతో ఆటో మొబైల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో మాత్రం హడావుడి కనిపించింది. గతవారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీ లు దాదాపు 1.5 శాతం దాకా పెరిగాయి. ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు యధావిధిగానే నిరాశపరిచాయి. కేవలం బడ్జెట్ మీద దృష్టితోనే గత వారమంతా మార్కెట్ నడిచింది. అందువల్లే ప్రీ-బడ్జెట్ ర్యాలీ వచ్చింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 1316 పాయింట్లు పెరిగి 77506 వద్ద, నిఫ్టీ 390 పాయింట్లు లాభపడి 23482 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు కూడా లాభాల్లోనే సాగాయి.ఈవారంబడ్జెట్ ప్రభావం సోమవారం మార్కెట్లపై స్పష్టంగా కనిపించవచ్చు. మార్కెట్ వర్గాలను మెప్పించే చర్యలు బడ్జెట్లో లేకపోయినప్పటికీ సామాన్యులకు కలిగే ప్రయోజనం వల్ల పెట్టుబడులు పెరగవచ్చని అంచనా. దీని ఫలితాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అదే సమయంలో వారం చివర్లో... అంటే శుక్రవారం రిజర్వు బ్యాంకు ప్రకటించబోయే పాలసీలో వడ్డీ రేట్లు పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఇది కొంత సానుకూల అంశం.ట్రంప్ చర్యలుకెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్ లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడటం ప్రపంచ మార్కెట్లను మళ్లీ వణికిస్తోంది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. వీటి ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను పడదోస్తూనే ఉంటాయి.ఆర్థిక ఫలితాల కంపెనీలుఈవారం మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో మోటో, ఐటీసీ, ఎస్బీఐ, మహీంద్రా & మహీంద్రా ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో ఎల్ఐసీ, టాటా పవర్పె, ఆరోబిందో ఫార్మా, దివీస్, జైడస్ లైఫ్, టాటా కెమికల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, థర్మాక్స్, టొరెంట్ పవర్, కమిన్స్, గుజరాత్ గ్యాస్, అపోలో టైర్స్, ఎన్ఎండీసీల ఫలితాలపైనా ఓ కన్నేసిఉంచాల్సిందే.ఎఫ్ఐఐలుమార్కెట్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత జనవరి నెల మొత్తానికి రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపారు. పెట్టుబడులను తరలిస్తున్నారు. గత అక్టోబర్‌లో రూ.1.14 లక్షల కోట్ల షేర్లు విక్రయించిన వీరు మళ్లీ అధిక స్థాయిలో అమ్మకాలకు పాల్పడింది జనవరి నెలలోనే కావడం గమనార్హం. దీని ప్రభావం రూపాయిపై పడుతోంది. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు నెల మొత్తానికి దాదాపు రూ.76,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. గత వారం మొత్తం మీద విదేశీ మదుపర్లు రూ.20,000 కోట్ల నికర అమ్మకాలు జరపగా అదే వారంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.19,000 కోట్ల నికర కొనుగోళ్లు జరిపి మార్కెట్లను నిలబెట్టారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లలో ప్రస్తుతానికి సానుకూల సంకేతాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ నిఫ్టీ 23500 పైన ఉన్నంతవరకు ఫర్వాలేదు. ఈ ధోరణి కొనసాగితే మాత్రం సూచీలు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 23650 ని ప్రధాన నిరోధంగా భావించాలి. ఇది దాటితే 23800, 23920 వద్ద నిరోధాలున్నాయి. మొత్తం మీద 24000 పాయింట్లు అనేది ప్రస్తుతానికి పెద్ద అవరోధంగా భావించొచ్చు. దానికంటే ముందు 23200, 23050, 22850, స్థాయిల వద్ద నిఫ్టీ కి మద్దతు లభించొచ్చు. ఒకవేళ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి విస్తృతమైతే 22500 దాకా పడిపోయినా ఆశర్యపోనక్కర్లేదు. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాలమెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు మరింత ఇబ్బందికరంగా మారినా సూచీలు ఇంకా ఇంకా పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 15.1 శాతం క్షీణించి 14.1 దగ్గర ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ బుల్స్ కు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
బడ్జెట్ 2025-26.. నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది ఆమెకు ఎనిమిదో బడ్జెట్, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడవ పర్యాయం ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రెండవ పూర్తి స్థాయి బడ్జెట్.బడ్జెట్ ప్రకటన కారణంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఫిబ్రవరి 1వ తేదీ శనివారం అయినప్పటికీ ఉదయం 9:15 గంటల నుండి ప్రారంభమయ్యాయి. సానుకూల అంచనాలతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు మధ్యాహ్నం 12 ప్రాంతంలో నష్టాల్లోకి జారుకున్నాయి.మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు పతనమయ్యాయి. మరోవైపు హెల్త్‌కేర్ ఇండెక్స్ మాత్రం లాభాల్లో చలిస్తోంది. -
బడ్జెట్ రోజున స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 23,576కు చేరింది. సెన్సెక్స్ 267 పాయింట్లు ఎగబాకి 77,755 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.5 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం దిగజారింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలుపార్లమెంట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో శనివారం మార్కెట్లో పూర్తిస్థాయిలో ఓపెన్‌లో ఉంటాయి. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బడ్జెట్ తర్వాత మార్కెట్లు ఎలా రియాక్ట్ అయ్యాయంటే
2020: కొత్త ట్యాక్స్ స్లాబులతో పన్ను రేట్లలో మార్పులు జరిగినా, పరిశ్రమ వర్గాలకు అనువైన నిర్ణయాలేవీ బడ్జెట్ లో లేకపోవడం సెంటిమెంట్ ను దెబ్బతీసి సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పడిపోయింది.2021: ఇది పూర్తిగా విభిన్న బడ్జెట్. కోవిడ్ తొలిదశ ప్రభావంతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారీస్థాయిలో మౌలిక రంగ కేటాయింపులు జరిగాయి. స్టార్ట్ అప్ లకు ట్యాక్స్ హాలిడేలు వంటి వృద్ధి ప్రేరక చర్యలతో మార్కెట్ ఆనందానికి అవధులు లేవు. దీంతో సెన్సెక్స్ బడ్జెట్ రోజున ఏకంగా 2314 పాయింట్లు పెరిగింది. గత రెండు దశాబ్దాల స్టాక్ మార్కెట్ బడ్జెట్ డే చరిత్రలో ఇది అత్యుత్తమంగా నిలిచిపోయింది.2022: ఇది కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో సెన్సెక్స్ 849 పాయింట్లు పెరిగింది. 2023: ఈ బడ్జెట్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఫలితంగా ఆరోజు సెన్సెక్స్ ఒకదశలో 1100 పాయింట్లు పెరిగినా చివరకు 158 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది.2024: మూలధన లాభాలపై అధిక పన్ను విధించడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1 శాతం పడిపోయింది.బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లు/ట్రేడర్లు ఇలా చేయండి⇒ బడ్జెట్ రోజున మార్కెట్లో హెచ్చుతగ్గులు భారీ స్థాయిలో ఉంటాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయాల్లో తొందరపాటుతో వ్యవహరించకండి.⇒ట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయండి. సాధ్యమైనంత వరకు ఒకట్రెండు రోజులు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మంచిది.⇒బడ్జెట్ అనంతరం నిపుణుల/విశ్లేషకుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్కెట్లో కదలికలు సాగుతూ ఉంటాయి. కాబట్టి వారు ఏం చెబుతున్నారో ఆలకించండి.⇒ బడ్జెట్ రోజు ట్రెండ్ ను అంచనా వేయడం చాలా కష్టం. పెరుగుతున్నాయి అనుకునే లోపే సూచీలు పడిపోతాయి. పడిపోతున్నాయి అనుకునే లోపే పైకి ఎగసిపోతాయి. మీకు మార్కెట్లో అనుభవం లేకపోతే బడ్జెట్ రోజు ట్రేడింగ్ చేయకండి. లాభాల మాట అటుంచి భారీ నష్టాలు కళ్లచూడాల్సి వస్తుంది.⇒ బడ్జెట్ లో ఏయే రంగాలకు ఏమేరకు కేటాయింపులు జరిగాయో సమగ్రంగా గ్రహించండి. తదనుగుణంగా సంబంధిత రంగాలకు చెందిన షేర్లపై దృష్టి పెట్టండి.⇒అనాలోచిత నిర్ణయాలతో, గుడ్డిగా షేర్లు కొనేయకండి.-బెహరా శ్రీనివాస రావు మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు -
బడ్జెట్: మార్కెట్లకు జోష్ ఇస్తేనే...!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే మరో బడ్జెట్ వెలుగు చూసేది రేపే. ఈ బడ్జెట్ పై ఇప్పటికే గణనీయమైన అంచనాలున్నాయి. ఇదొక విప్లవాత్మకమైన బడ్జెట్ అవుతుందనే మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత 13 నెలలుగా ఎడతెరిపి లేకుండా షేర్లను అమ్ముకుంటూ మన మార్కెట్ కు చుక్కలు చూపిస్తున్న విదేశీ మదుపర్లు.. ఈసారి బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెడతారనడంలో సందేహం లేదు. గత జనవరి నుంచి చూస్తే ఈ జనవరి చివరికి వీళ్ళు దాదాపు రూ. 3.80 లక్షల కోట్ల షేర్లను విక్రయించి మన మార్కెట్ కు గట్టి నష్టాన్నే కలిగించారు.వీళ్ళ పయనం ఇదేమాదిరి కొనసాగకూడదంటే ఆర్ధిక మంత్రి మార్కెట్ ఫోకస్ తో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను వెలువరించాల్సి ఉంటుంది. 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.3-6.8% నమోదుకావొచ్చని అంచనా. ప్రపంచ అస్థిర, అనిశ్చిత వాతావరణంతో మన ఆర్ధిక వ్యవస్థ సైతం ఇబ్బందులు పడుతోంది. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లింది. ప్రభుత్వం ఒత్తిడిలో ఉందన్న విషయం ఇది చెప్పకనే చెబుతోంది.ఈనేపథ్యలో స్టాక్ మార్కెట్ విశ్వాసాన్ని పెంచే, ఇన్వెస్టర్ల మనసు చూరగొనే అంశాలపై ఈసారి బడ్జెట్ లో దృష్టి సారించాల్సిందే. గత నాలుగు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ నడుస్తోంది. దానికి తోడు శుక్రవారం వెలువడ్డ ఆర్ధిక సర్వే మార్కెట్ కు ఉత్సాహాన్నే ఇచ్చింది. దీన్ని నిజం చేస్తూ బడ్జెట్ సాగాల్సిన అవసరం ఉంది. మరి మార్కెట్ సెంటిమెంట్ ను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందా... నివ్వెరపరుస్తుందా? అన్నది రేపు ఎటూ తేలిపోతుంది.⇒ పన్నుల విధానంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మార్కెట్ వర్గాలు గట్టిగానే పట్టుబడుతున్నాయి.⇒ దీర్ఘ కాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో సమూల మార్పులు తీసుకు రావాలని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం దీర్ఘకాలిక లాభాలు అనేవి మూడేళ్లకు పైబడితేనే పన్నురహితంగా ఉంటున్నాయి. అలాగే డివిడెండ్లను కూడా మామూలు ఆదాయంగానే పరిగణించి పన్ను విధిస్తున్నారు. ఇలా చేయడం రెండుసార్లు పన్ను విధించడమే అవుతుందని, డివిడెండ్ ఆదాయాన్ని పన్నులనుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.⇒ షేర్ల లావాదేవీలపై విధించే పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ లావాదేవీల పన్నును ప్రస్తుతమున్న 0.625% నుంచి తగ్గిస్తే డెరివేటివ్స్ లావాదేవీలు ఊపందుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరే మార్గాల్లో ఇదొకటి. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఎంతవరకు పాజిటివ్ గా స్పందిస్తుంది అన్నది సందేహమే.⇒ ఈ రెండూ జరిగితే మార్కెట్ సెంటిమెంట్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో లిక్విడిటీ పెరిగి రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులతో ముందుకొస్తారు.⇒ మరోపక్క మౌలిక రంగానికి కేటాయించే నిధులు మార్కెట్ కు ఉత్సాహాన్ని ఇస్తాయి. రోడ్లు, రైల్వేలు , రక్షణ రంగాలకు కేటాయింపులు పెంచితే సదరు నిధులు వినియోగాన్ని విస్తృతం చేస్తుంది. ముఖ్యంగా సిమెంట్, నిర్మాణ రంగాల్లో వినియోగం పెరగడం ద్వారా ఆయా రంగాలకు చెందిన షేర్లకు డిమాండ్ పెరుగుతుంది.⇒ ఇక తయారీ, వ్యవసాయం, విద్యుత్ వాహనాలు వంటి రంగాలకు తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడం, పాలసీ పరంగా సంస్కరణలు తీసుకురావడం ప్రధానం. విధానపరమైన నిర్ణయాలు సంబంధిత రంగాల షేర్లపై మదుపరులకు మక్కువ పెంచుతాయి. తద్వారా తయారీ రంగంలో సెంటిమెంట్ పెరుగుతుంది.⇒ సబ్సిడీలు లేదా సంస్కరణలు వ్యవసాయ, అగ్రి బిజినెస్ రంగంలో కొత్త మార్పులను తీసుకొచ్చి ఆ రంగాల్లో డిమాండ్ పెంచుతాయి. దీర్ఘ కాలిక వృద్ధికి ప్రోత్సాహమిచ్చే ఇటువంటి చర్యలకు మార్కెట్లు ఆటోమేటిక్ గానే పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి.భారత ఆర్ధిక రంగానికి సంబంధించినంతవరకు బడ్జెట్ అనేది ఒక ప్రధాన సంఘటన. పన్ను సంస్కరణలు, రాబడులు, వ్యయాలు, ఆయా రంగాలకు కేటాయింపులు, విధానపరమైన నిర్ణయాలు, అనుకూల/ప్రతికూల అంశాలు.. ఇత్యాది అంశాల సమాహారమే బడ్జెట్. మార్కెట్ వర్గాలకు బడ్జెట్ రుచించకపోతే భారీగా పడగొట్టేస్తారు. నచ్చిందా నెత్తిన పెట్టుకుంటారు. ప్రస్తుతం గత రెండు, మూడు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ కనిపిస్తోంది. తాజా బడ్జెట్ అంచనాలను చేరుకోకపోతే మాత్రం దాని పరిణామాలు మామూలుగా ఉండవు.ఇప్పటికే నిక్కు నీలుగుతున్న మార్కెట్ మరింత పడిపోవడం ఖాయం. దూరమవుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా ఎంత చేటు చేయాలో అంతా చేసేస్తారు. అదే సమయంలో చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్లోకి రాలేని పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా పడిపోయే మార్కెట్లు దేశ ఆర్ధిక వ్యవస్థపై పెనుప్రభావం చూపిస్తాయి. ఆర్ధిక మంత్రికి ఈవిషయాలన్నీ తెలియనివి ఏమీ కావు. అందరినీ మెప్పించే నిర్ణయాలతోనే ముందుకెళ్తారని ఆశిద్దాం. కొద్ది గంటలు ఓపిక పట్టి చూద్దాం... ఏం జరుగుతుందో... -
స్టాక్ మార్కెట్‌కు ఆర్థిక సర్వే ఊతం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2024-25ను సమర్పించిన అనంతరం దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా నాల్గవ సెషన్లో లాభాలను కొనసాగించాయి. ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి 77,549.92 పాయింట్లకు చేరుకున్న తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 740.76 పాయింట్లు లేదా 0.97 శాతం పెరిగి 77,500.57 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 258.90 పాయింట్లు లేదా 1.11 శాతం పెరిగి 23,508.40 స్థాయిల వద్ద ముగిసింది. ఈరోజు ఇండెక్స్ 23,530.70-23,277.40 రేంజ్లో ట్రేడయింది. నిఫ్టీ50లో టాటా కన్స్యూమర్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, లార్సెన్ & టూబ్రో, కోల్ ఇండియా నేతృత్వంలోని 47 స్టాక్‌లు 6.24 శాతం వరకు లాభాలను చూశాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ హోటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ 0.82 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 1.89 శాతం, 2.11 శాతంతో బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ నేతృత్వంలోని అన్ని రంగాల సూచీలు వరుసగా 2.04 శాతం, 2.44 శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మెటల్, ఓఎంసీలు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు శుక్రవారం 1 శాతంపైగా లాభాలతో ముగిశాయి.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ 2024-25 కోసం డి-స్ట్రీట్ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ కారణంగా భారతీయ ఈక్విటీ మార్కెట్ శనివారం ట్రేడింగ్‌కు తెరిచి ఉంటుంది. -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 134.73 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 76,894.55 వద్ద, నిఫ్టీ 46.20 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,295.70 వద్ద కొనసాగుతున్నాయి. యూనియన్ బడ్జెట్ సమావేశాల వేళ నేడు స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగానే ముందుకు సాగుతున్నాయి.లార్సెన్ & టూబ్రో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. భారతి ఎయిర్టెల్, కోల్ ఇండియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస లాభాలు.. సెన్సెక్స్ హ్యాట్రిక్
దేశీయ స్టాక్‌మార్కెట్లు (Stock Market ) గురువారం లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో సెషన్లోనూ పైకి కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 226.85 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 76,759.81 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు గరిష్టంగా 76,898.63 వద్ద ట్రేడవగా, కనిష్ట స్థాయి 76,401.13 వద్ద నమోదైంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ (Nifty) 86.40 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 23,249.50 వద్ద ముగిసింది. గురువారం ఈ ఇండెక్స్ 23,311.15 నుంచి 23,139.20 రేంజ్లో ట్రేడ్ అయింది.భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్ నేతృత్వంలోని టాప్ గెయినర్ స్టాక్‌లు 4.87 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. నిఫ్టీ50లోని 35 సానుకూలంగా ముగిశాయి. మరోవైపు టాటా మోటార్స్, ఐటీసీ హోటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ 6.98 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. ఈ ఇండెక్స్‌లోని 17 స్టాక్‌లు నష్టాలను చవిచూశాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.12 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ స్వల్పంగా 0.01 శాతం తగ్గింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించింది. ఈ ధఫా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ శనివారం రోజున వెలువడుతుండడంతో ఆరోజు మార్కెట్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని సెబీ తెలిపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ వడ్డీరేట్లు యథాతథం.. స్వల్ప లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు లాభపడి 23,204కు చేరింది. సెన్సెక్స్(Sensex) 49 పాయింట్లు ఎగబాకి 76,581 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76.56 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.47 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.51 శాతం దిగజారింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించింది. ఈ ధఫా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ శనివారం రోజున వెలువడుతుండడంతో ఆరోజు మార్కెట్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని సెబీ తెలిపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 వరుసగా రెండవ సెషన్లోనూ లాభాలను నమోదు చేశాయి. 30-షేర్ల సెన్సెక్స్ 631.55 పాయింట్లు లేదా 0.83 శాతం పురోగమించి రోజు గరిష్ట స్థాయి 76,589.93కి చేరిన తర్వాత 76,532.96 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 205.85 పాయింట్లు లేదా 0.90 శాతం లాభపడి 23,163.10 వద్ద ముగిసింది. ఈ సూచీ బుధవారం 23,181.35 నుంచి 22,976.50 రేంజ్లో ట్రేడయింది.విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 3.32 శాతం పెరగడంతో స్మాల్‌క్యాప్ షేర్లు ఛార్జ్‌లో ముందంజలో ఉన్నాయి. కాగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 2.31 శాతం లాభంతో ముగిసింది.శనివారం పనిచేయనున్న మార్కెట్లుకేంద్ర బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నందున వచ్చే శనివారం (ఫిబ్రవరి 1) దేశీయ స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) రెండూ శనివారం పూర్తి ట్రేడింగ్ సెషన్లను నిర్వహించనున్నట్లు ధ్రువీకరించాయి .తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో ఈక్విటీ మార్కెట్లు ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు తెరిచి ఉంటాయని, కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ సాయంత్రం 5:00 గంటల వరకు ట్రేడింగ్ ఉంటుందని ఎక్స్ఛేంజీలు వివరించాయి. అయితే, సెటిల్మెంట్ సెలవు కారణంగా "T0" సెషన్ షెడ్యూల్ మాత్రం ఉండదు. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ ఉదయం 9:00 నుండి 9:08 వరకు జరుగుతుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
త్వరలో ఫెడ్ వడ్డీరేట్లపై నిర్ణయం.. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ(Nifty) 70 పాయింట్లు లాభపడి 23,021కు చేరింది. సెన్సెక్స్(Sensex) 219 పాయింట్లు ఎగబాకి 76,124 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.88 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.92 శాతం లాభపడింది. నాస్డాక్ 2.03 శాతం ఎగబాకింది.అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బ్యాంకులు, ఫైనాన్స్ షేర్ల జోరు
ముంబై: ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టడంతో బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. వచ్చే నెల ద్రవ్య పరపతి సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే అంచనాలూ మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 535 పాయింట్లు పెరిగి 75,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 22,957 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా అదే ట్రెండ్ కొనసాగించాయి.బ్యాంకులు, ఫైనాన్స్‌తో పాటు వడ్డీరేట్ల సంబంధిత షేర్లైన ఆటో, రియల్టీ, కన్జూమర్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,145 పాయింట్లు బలపడి 76,513 వద్ద, నిఫ్టీ 308 పాయింట్లు ఎగసి 23,138 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే ట్రేడింగ్ చివర్లో ఫార్మా, ఇండస్ట్రీయల్, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు కొంత లాభాలు కోల్పోయాయి. ట్రంప్ వాణిజ్య విధానాలపై అనిశ్చితులు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రకంపనల ప్రభావంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ట్రంప్ వాణిజ్య సుంకాల పెంపు భయాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 86.57 వద్ద ముగిసింది.⇒ ఆర్థిక వ్యవస్థలోకి రూ.1.50 లక్షల కోట్లు జొప్పించేందుకు ఆర్బీఐ పలు చర్యలు ప్రకటించడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు మెరిశాయి. యాక్సిస్ బ్యాంకు 3.20%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఐసీఐసీఐ బ్యాంకు 2.15%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2% లాభపడ్డాయి. బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు 1–0.50% పెరిగాయి. మరోవైపు ఫెడరల్ బ్యాంక్ 5%, యస్ బ్యాంక్ 1.5%, కెనరా బ్యాంకు 1% మేర నష్టపోయాయి. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 535.23 పాయింట్లు లేదా 0.71 శాతం లాభంతో 75,901.41 వద్ద, నిఫ్టీ 128.10 పాయింట్లు లేదా 0.56 శాతం లాభంతో.. 22,957.25 వద్ద నిలిచాయి.బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, HDFC బ్యాంక్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 22,904కు చేరింది. సెన్సెక్స్ 326 పాయింట్లు ఎగబాకి 75,692 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.14 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.55 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.46 శాతం నష్టపోయింది. నాస్డాక్ 3.07 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైదరాబాద్ అమెజాన్‌లో రూ.102 కోట్ల మోసంఅమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ఆర్1 ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమను కుదిపేస్తుంది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్‌పై పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)