
దేశీయ స్టాక్‌మార్కెట్‌కు వచ్చే వారం వరుసగా వరుస సెలవులు ఉన్నాయి. దీపావళి పండుగ కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రెండు రోజులు మూతపడనున్నాయి. అయితే వచ్చే సోమవారం అంటే అక్టోబర్ 20న మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా.. లేదా? అన్న సందేహం ఇన్వెస్టర్లలో ఉంది. ఏయే రోజుల్లో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సెలవు ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన స్టాక్ మార్కెట్ హాలిడే (Stock Market Holidays) క్యాలెండర్ ప్రకారం.. దీపావళి (Diwali 2025) లక్ష్మి పూజ, బలిప్రతిపదా కారణంగా అక్టోబర్ 21, 22 తేదీలలో సెలవు ఉంటుంది. ఆయాల రోజుల్లో సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.
అక్టోబర్ 20న అమావాస్య తిథి రావడంతో ఈ రోజున పలు రాష్ట్రాల్లో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. కానీ భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తెరిచే ఉంటాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అక్టోబర్ 21న వ్యాపారులు, ఇన్వెస్టర్ల కోసం 'ముహూర్త్ ట్రేడింగ్' పేరుతో ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:45 గంటల వరకు ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ జరగనుంది.
2025లో రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు
ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన మార్కెట్ హాలిడే క్యాలెండర్ లో 2025లో మొత్తం 14 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇంకా మిగిలిన సెలవులు కింది విధంగా ఉన్నాయి..
అక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజ
అక్టోబరు 22 - బలిప్రతిపాద
నవంబర్ 5 - ప్రకాష్ గురుపుర్బ్ శ్రీ గురునానక్ దేవ్
డిసెంబర్ 25 - క్రిస్మస్