
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది.

ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజైంది. కాగా.. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు.
















