
రీసెంట్‌గా 'లోక' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్, అలానే 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి.. బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. రవి మోహన్ (జయం రవి) హీరోగా చేస్తున్న లేటెస్ట్ తమిళ సినిమా 'జీనీ'. దీని నుంచి అబ్దీ అబ్దీ అంటూ సాగే వీడియో సాంగ్‌ని తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఇందులో కల్యాణి-కృతి స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
(ఇదీ చదవండి: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)
ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటలో హీరో రవి మోహన్ కూడా ఉన్నప్పటికీ కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ తమ డ్యాన్స్ మూమెంట్స్‌తో తెగ హైలెట్ అయిపోతున్నారు. గతంలో ఇలాంటి పాట ఎక్కడో చూశామే అన్నట్లు అనిపిస్తుంది కానీ చూస్తున్నంతసేపు డ్యాన్ మాత్రం భలే చేశారు కదా అనిపిస్తుంది. 'జీనీ' అర్జునన్ చిత్రానికి అర్జునన్ దర్శకుడు కాగా.. ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురానున్నారు.
(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్)