
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఒక దానిలో ఉన్న మూవీస్.. మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ డబ్బింగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. పెళ్లికి ముందే తొందరపడి పేరెంట్స్ అయిన ఓ జంట.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే పాయింట్‌తో ఎమోషనల్ గా తీసిన ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)
2023లో తమిళంలో 'డాడా' టైటిల్‌తో ఓ సినిమా రిలీజైంది. హిట్ అయింది. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ ఏడాది జూన్‍లో 'పాపా' పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కాకపోతే డబ్బింగ్ బొమ్మ కావడం వల్ల ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే జూలై చివరలో ఆహా ఓటీటీలోకి వచ్చింది. తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
'పాపా' విషయానికొస్తే.. మణికంఠ (కవిన్), సింధు (అపర్ణ) క్లాస్‌మేట్స్. వీళ్ల మధ్య మొదలైన స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. అయితే కాస్త తొందరపడేసరికి పెళ్లికి ముందే మణి వల్ల సింధు గర్భం దాల్చుతుంది. ఆ విషయం తెలిసిన కుటుంబ పెద్దలు వీళ్లని దూరం పెడతారు. దీంతో మణి- సింధు ఓ అద్దె ఇంట్లో ఉంటూ చదువు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? జన్మనిచ్చిన వెంటనే బిడ్డను వదిలేసి సింధు ఎందుకు వెళ్లిపోయింది? ఆ చిన్నారిని పెంచేందుకు మణి ఎంతగా కష్టపడ్డాడు? మణి జీవితంలోకి మళ్లీ సింధు వచ్చిందా? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)