ది రాజాసాబ్ మూవీతో తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో కొత్తగా ఎనిమిది నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సీన్స్‌లో ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా ఉంటుందని అభిమానులకు శుభవార్త చెప్పారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన బ్లాక్‌బస్టర్ మీట్‌లో మారుతి క్లారిటీ ఇచ్చారు. ది రాజాసాబ్‌లో ప్రభాస్‌ను కొత్తగా చూపించామని మారుతి అన్నారు.
మారుతి మాట్లాడుతూ..' హైదరాబాద్‌లో షో సరైన టైమ్‌లో పడలేదు. అందుకు నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. ఒక మిడ్ రేంజ్ దర్శకుడు ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా చేశారు. ప్రభాస్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించా. ఈ ప్రక్రియలో కాస్త కొత్తగా చూపించాలనుకున్నా. మైండ్ గేమ్‌గా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు నచ్చేసింది. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదంటున్నారు. ప్రభాస్‌తో నేను సింపుల్‌గా కమర్షియల్ సినిమా తీయొచ్చు కానీ.. ఇలాంటి కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ఆయన ప్రయత్నించారు. కామన్ ఆడియన్స్‌కు చాలా మందికి ఈ సినిమా రీచ్ అయింది. ఒక్క షో, ఒక్కరోజులోనే సినిమాను నిర్ణయించకూడదు' అన్నారు.
పదిరోజులు ఆగితేనే సినిమా ఏంటనేది తెలుస్తుందని డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ మూవీలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అర్థం కానీ వాళ్లే తిడుతున్నారని అన్నారు. ఓల్డ్ గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ను టీజర్, పోస్టర్స్‌లో చూపించాం.. కానీ సినిమాలో కనిపించలేదని అభిమానులు చాలా మంది ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ల కోసమే ఈరోజు సాయంత్రం నుంచి ఆ లుక్ ఉన్న సన్నివేశాలు యాడ్ చేస్తున్నామని తెలిపారు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్ చేస్తున్నాం.. వాటికి సెన్సార్ కూడా పూర్తయిందన్నారు. కొత్తగా మొత్తం 8 నిమిషాల సీన్స్ యాడ్ అవుతాయని మారుతి వెల్లడించారు.
THE ONE YOU ALL HAVE BEEN WAITING FOR 🔥🔥
OLD GETUP SEQUENCE is finally adding from today’s evening shows onwards 🤙🏻🤙🏻#TheRajaSaab#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/aOz3n9XsqE— The RajaSaab (@rajasaabmovie) January 10, 2026


