breaking news
The Raja Saab Movie
-
డబుల్ బొనాంజ
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. మాళవికా మోహనన్, రిద్ది కుమార్ ఇతర హీరోయిన్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 17) నిధీ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘ది రాజాసాబ్’లోని ఆమె కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది.దసరాకి టైటిల్: నిధీ అగర్వాల్ లీడ్ రోల్లో నటించనున్న కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈ దసరా పండగకి రానుంది. ఎన్. నిఖిల్ కార్తీక్ దర్శకత్వంలో పుప్పల అప్పలరాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ ఎవరూ ఊహించని కొత్తపాత్రలో కనిపిస్తారు. ఈపాత్రలో ఆమె కనబరిచే నటన ఆమె కెరీర్లో మైల్‌స్టోన్‌లా నిలిచిపోతుంది’’ అని పుప్పల అప్పలరాజు పేర్కొన్నారు. ఇలా రెండు సినిమాల అప్డేట్స్తో ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజ ట్రీట్ ఇచ్చారు నిధీ అగర్వాల్. -
వీరీ వీరీ గుమ్మడిపండు ఈ సినిమా వచ్చేదెప్పుడు?
ఒకప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని, థియేటర్స్ దొరికితే చాలు... సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నాన్–థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు, బాక్సాఫీస్పోటీ, ఓటీటీ సంస్థల నిబంధనలు... ఇలా ఓ సినిమా రిలీజ్ కావడానికి, కాకపోవడానికి చాలా కారణాలే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇంకా విడుదల వాయిదా పడుతూ వస్తున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ఈ సెప్టెంబరు 5న చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అనుష్కా శెట్టి ‘ఘాటి’, రష్మికా మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’, తేజ సజ్జా ‘మిరాయ్’, ‘ది బెంగాలీ ఫైల్స్’, శివకార్తికేయన్ ‘మదరాసి’ వంటి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఇన్ని సినిమాలు ఒకే తేదీకి రిలీజ్ కావడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో వీటిలో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని, ఈ వాయిదా పడే చిత్రాల్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఉండొచ్చనే టాక్ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు సెప్టెంబరు 5న రిలీజ్ కావాల్సిన విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ చిత్రం సెప్టెంబరు 19కి వాయిదా పడింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను అరుణ్ ప్రభు దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ – స్పిరిట్ మీడియా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. 200 కోట్ల రూ పాయల భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ ‘భద్రకాళి’ సినిమా కథనం సాగుతుంది.సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్?నిర్మాతలు–సినీ కార్మికుల మధ్య వేతనాల పెంపు విషయమై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు జరగడం లేదు. ఈ ప్రభావం సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలపై పడొచ్చు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆగస్టు 5 నుంచి మొదలు కావాల్సిన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ మొదలు కాలేదు. దీంతో షూటింగ్‌కు ఆలస్యమౌతోంది. సమ్మె కారణంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంకా రవితేజ ‘అనార్కలి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ చిత్రబృందాలు తమ సినిమాలను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించాయి. కానీ సినీ కార్మికుల ప్రస్తుత సమ్మె కారణంగా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తోంది. అలాగే డిసెంబరులో రిలీజ్‌కు సిద్ధమౌతున్న అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రంపై కూడా ఈ సమ్మె ప్రభావం కాస్త గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.సత్యలోకానికి పయనం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘విశ్వంభర’ సినిమా ఇంకా థియేటర్స్‌లోకి రాలేదు. సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా విడుదల కాకపోవడంతో సమ్మర్‌కి థియేటర్స్‌లోకి వస్తుందని ఆడియన్స్ ఊహించారు. కానీ సమ్మర్లో కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఆ మాటకొస్తే... ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత లేదు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మించిన ఈ ‘విశ్వంభర’ ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు గ్రాఫిక్స్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో క్వాలిటీ పరంగా చిత్ర యూనిట్ రాజీ పడకుండాపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయిస్తోందని సమాచారం. గ్రాఫిక్స్ కోసమే రూ. 25 కోట్లకుపైగా బడ్జెట్‌ను మేకర్స్ కేటాయించారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే.ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా టీజర్ విడుదల కావొచ్చని, ఈ సినిమా విడుదల తేదీపై అప్పుడు ఓ స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక పద్నాలుగు లోకాలను దాటి, హీరో సత్యలోకం వెళ్లి, అక్కడ హీరోయిన్ను ఎలా కలుసుకుంటాడు? అనే నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో విశ్వంభర అనే పుస్తకం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ పుస్తకంలోని అంశాల ఆధారంగానే హీరో సత్యలోకానికి వెళ్తాడని, ఈ క్రమంలో హీరోకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో రావు రమేశ్ నటించారని టాక్.ఆలస్యంగా రాజాసాబ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్, కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్, వీటీవీ గణేశ్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావడం లేదని, సంక్రాంతికి ఈ విడుదలయ్యే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం ‘ది రాజాసాబ్’ విడుదల వాయిదాకు ప్రధాన కారణమట. పైగా ఈ సినిమా కోర్టు కేసులో ఇరుక్కుందనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘ది రాజాసాబ్’ చిత్రం ప్రధానంగా తాత–మనవడి అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్య పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో ‘రాజా డీలక్స్’ అనే భవనం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ భవనం లోపలే ప్రధాన కథ జరుగుతుందని తెలిసింది.పండక్కి రానట్లే! రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల మళ్లీ జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ ఆగస్టు 27న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ విడుదల వాయిదా పడిందని భోగట్టా.ఇంకా రెండు పాటల చిత్రీకరణ ఉందని, అలాగేపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కి కూడా ఇంకా సమయం పట్టేట్లు ఉందని... ఈ కారణాల వల్లే ‘మాస్ జాతర’ ఈ వినాయకచవితి పండక్కి థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం లేదనే టాక్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను తొలుత ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే 9కి వాయిదా వేశారు. ఇటీవల ఆగస్టు 27న రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆగస్టు 27న కూడా ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే రైల్వేపోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రైల్వేస్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందట. అలాగే హీరో రవితేజ–విలన్ నవీన్‌చంద్ర కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌ను అలరించేలా ఉంటాయని తెలిసింది.సంబరాలు ఎప్పుడు? సాయి దుర్గా తేజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. రూ. 125 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ చైతన్యా రెడ్డి, కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.కానీ ఆ తర్వాత ఈ సెప్టెంబరు 25నే పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’, బాలకృష్ణ మైథలాజికల్ అండ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. దీంతో సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ విడుదల వాయిదా పడుతుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 80 శాతంపైనే పూర్తయింది. కానీ విడుదల తేదీపై మేకర్స్ నుంచి మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబరు 25న ‘ఓజీ’, ‘అఖండ 2’ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి కాబట్టి ఈ తేదీకి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా రాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి అతి త్వరలోనే ఓ స్పష్టత రావొచ్చు. ఇక రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని తెలిసింది.స్వయంభూ నిఖిల్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా, సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఓ దశలో ఈ దసరాకు ‘స్వయంభూ’ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారట మేకర్స్. కానీ భారీ వీఎఫ్ఎక్స్, యుద్ధ సన్నివేశాలు ఉండటంతోపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం పడుతుందని, ఈ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. శక్తికి, ధర్మానికి చిహ్నమైన సెంగోల్ (బంగారు రాజదండం) నేపథ్యంలో ‘స్వయంభూ కథనం సాగుతుందట. మరో విషయం ఏంటంటే... ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నారని సమాచారం.ఓం శాంతి శాంతి శాంతిః తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అ΄్పాజీ) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణ, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బా, వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్ నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఆ మధ్య ఈ సినిమాను ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఆగస్టు 1న ఈ సినిమా విడుదల కాలేదు. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక మలయాళంలో సూపర్‌డూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రూపొందిందని తెలిసింది. భార్యాభర్తల నేపథ్యంలో ‘జయ జయ జయ జయహే’ సినిమా కథనం సాగుతుంది. మహిళలంటే చులకన భావం ఉన్న ఓ భర్తకు అతని భార్య ఏ విధంగా బుద్ధి చెప్పిందన్నదే ఈ సినిమా కథనం.భార్యాభర్తల కథ లావణ్యా త్రి పాఠి, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. భార్యాభర్తల అనుభందం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి)’ చిత్రాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌ను విడుదల చేశారు. అయితే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఇలా ఈ ఏడాదిలో రిలీజ్‌కు సిద్ధం అవుతూ, ఇంకా విడుదల తేదీని కన్ఫార్మ్ చేసుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
ది రాజాసాబ్ హీరోయిన్‌కు ప్రభాస్ సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడని మనకు తెలిసిందే. అంతేకాదు.. అతిథులకు మర్యాద చేయడంలో ఇంకా ముందుంటారు. అది సెట్లో అయినా.. ఇంట్లో అయినా సరే కడుపునిండా భోజనం పెట్టే పంపిస్తాడు. అలా ఇప్పటికే షూటింగ్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు సైతం భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు.తాజాగా హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్‌కు భోజనం పంపించారు మన ప్రభాస్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ప్రభాస్‌తో పాటు వంశీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఆంధ్ర వంటకాలతో పాటు అద్భుతమైన మీల్స్ దొరికాయని సంతోషం వ్యక్తం చేసింది.ది రాజాసాబ్‌లో నిధి..ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ ఫిల్మ్ ది రాజాసాబ్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ది రాజాసాబ్ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌తో పాటు రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్?ఇటీవలే ఏపీకి ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్ ప్రయాణించారు. ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు వెళ్లిన నిధి అగర్వాల్‌కు ఏకంగా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని బోర్డ్ ఉన్న కారులో వెళ్లారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆ కారు ఏర్పాటులో తన ప్రమేయం లేదంటూ క్లారిటీ ఇస్తూ లేఖను పోస్ట్ చేసింది. గతనెల రిలీజైన హరిహర వీరమల్లులో హీరోయిన్గా నిధి అగర్వాల్ కనిపించింది.Thank you sooo much Shyamala Garu for this wonderful meal.. very very sweet of you ❤️🤗😍 thank you Prabhas sir and Vamsi garu 🤍 pic.twitter.com/BnR7k4Khj0— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 12, 2025 -
భాగ్యనగరంలో భారీ సెట్స్.. స్టార్ హీరోల షూటింగ్ అప్డేట్స్
తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు ఇక్కడే నివాసం ఉంటుంటారు (ఇతర భాషల వాళ్లు మినహా). సినిమా షూటింగ్‌లకు అనువైన స్టూడియోలు ఇటు భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్టింగులు వేసి చిత్రీకరణలు జరుపుతుంటారు మేకర్స్. ప్రస్తుతం భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాగచైతన్య, రామ్ పోతినేని, విజయ్ సేతుపతి, సాయిదుర్గా తేజ్, తేజా సజ్జా, అఖిల్ అక్కినేని, సిద్ధు జొన్నలగడ్డ వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషా రుగా పాల్గొంటున్నారు. ఇక భాగ్యనగరంలో ఎవరెక్కడ? షూటింగ్లో పాల్గొంటున్నారో ఆ విశేషాలేంటో చూద్దాం...అజీజ్ నగర్లో రాజా సాబ్ ‘బాహుబలి’ సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మారుతి. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాత పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిందట.. మరో పది శాతం చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరగా షూటింగ్‌ని పూర్తి చేసి ఈ సినిమాకి ఎంతో కీలకం కానున్న గ్రాఫిక్స్ పనులపై దృష్టి పెట్టనున్నారట మారుతి. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయని టాక్. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉస్తాద్ హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ‘గబ్బర్ సింగ్’ (2012) చిత్రం మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ΄ోలీసాఫీసర్ ΄ాత్ర చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల ఈ సినిమా పతాక సన్నివేశాలు పూర్తయినట్లు ప్రకటించారు మేకర్స్. క్లైమాక్స్‌లో భాగంగా నబకాంత మాస్టర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. డ్రాగన్ జోరు ‘దేవర’ వంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో ΄ాటు ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు దర్శకుడు. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జూన్ 25న విడుదలకానుంది. శంకరపల్లిలో పెద్ది రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో(2021) బ్లాక్‌బస్టర్ అందు కున్న బుచ్చిబాబు సానా ‘పెద్ది’కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ΄ాన్ ఇండియా మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. రామ్‌చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అలాగే భాగ్యనగరం సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో నైట్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. రామ్‌చరణ్, జాన్వీలపై ఈ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రత్యేకమైన సెట్లో... ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో ΄ాటు వంద కోట్ల క్లబ్లో చేరారు నాగచైతన్య. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీని తెరకెక్కించిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, ఇతర తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మిస్టీక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన ఫిజికల్‌గానూ కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు కూడా. ‘తండేల్’ తర్వాత నాగచైతన్య, ‘విరూ΄ాక్ష’ తర్వాత కార్తీక్ వర్మ కాంబినేషన్లో రానున్న ‘ఎన్సీ 24’ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ముచ్చింతల్‌లో ఆంధ్ర కింగ్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, కన్నడ హీరో ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. రామ్–భాగ్యశ్రీలతో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూ΄÷ందిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌గా నటించిన ఉపేంద్రకి వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో... విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. టబు, కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్‌పై పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ ΄ాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతితో ΄ాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్ చిత్రీకరణలో ΄ాల్గొంటున్నారట. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. బూత్ బంగ్లాలో లెనిన్ అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న చిత్రం ‘లెనిన్’. ‘ఏజెంట్’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ఇది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో అఖిల్, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే కొద్ది రోజులు షూటింగ్లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఇందుకుగల కారణాలు మాత్రం బయటకు రాలేదు. అఖిల్‌కి జోడీగా ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తుక్కుగూడలో సంబరాలు... సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరో, హీరోయిన్‌తో ΄ాటు ఇతర తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట రోహిత్ కేపీ. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 25న ప్రేక్షకులముందుకు రానుంది. పతాక సన్నివేశాల్లో యోధ ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జా ‘హను–మాన్’ (2024) చిత్రంతో ΄ాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న మరో ΄ా¯Œ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ‘మిరాయ్’ చిత్రం 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లో సెప్టెంబర్ 5న విడుదలకానుంది. శంకరపల్లిలో తెలుసు కదా ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధం, వినోదం, భావోద్వేగాల నేపథ్యంలో రూ΄÷ందుతోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా హీరో హీరోయిన్లతో ΄ాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు నీరజ కోన. దీ΄ావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ జరుపుకుంటున్న సినిమాలు పైన పేర్కొన్నవి కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
సంక్రాంతి బరిలో..?
వచ్చే సంక్రాంతి పండక్కి రాజా సాబ్ థియేటర్స్‌కు రానున్నాడా? అంటే అవుననే సమాధానమే ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ హారర్ కామెడీ ఫ్యాంటసీ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాను డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్నది తాజా టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
రాజా సాబ్తో పూరి సాబ్
హీరో ప్రభాస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్ నిరంజన్’(2009) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రానుందంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు ప్రభాస్ కానీ, అటు పూరి జగన్నాథ్ కానీ ఎక్కడా స్పందించ లేదు. ‘బాహుబలి’ సినిమా తర్వాత వరుసపాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్’, ‘ఫౌజి’(వర్కింగ్ టైటిల్) అనే సినిమాల్లో నటిస్తున్నారు.ఇక విజయ్ సేతుపతి హీరోగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. కాగా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌లోకి పూరి జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్, పూరి, చార్మీ కలిసి మాట్లాడుకుంటున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.రాజా సాబ్తో పూరి సాబ్ అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. పుట్టినరోజు ప్రత్యేకం... ‘ది రాజా సాబ్’ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం(జూలై 29) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ చిత్రం నుంచి సంజయ్ దత్ ప్రత్యేక ΄ోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఆ నటుడి ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. రొమాంటిక్ హారర్ కామెడీగా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ సంజయ్ దత్ బర్త్ డే కావడంతో స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆయన 66వ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్లో సంజయ్ దత్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. దక్షిణాది సినిమాలతో సంజయ్ దత్ బిజీగా ఉన్న సంజయ్ దత్.. బాలీవుడ్‌లోనూ 'బాఘి 4', 'వెల్కమ్ టు ది జంగిల్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన మరో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్- 2' ఆగస్టు 1 న థియేటర్లలోకి రిలీజ్ కానుంది.Team #TheRajaSaab wishes the Powerhouse and versatile Sanju Baba - @DuttSanjay a very Happy Birthday 💥💥Get ready to witness a terrifying presence that will shake you to the core this Dec 5th in cinemas 🔥🔥#TheRajaSaabOnDec5th#Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi… pic.twitter.com/PFgPzOnqea— The RajaSaab (@rajasaabmovie) July 29, 2025 -
నటులలో మేకవన్నె పులులున్నారు: హీరోయిన్
సినిమా పరిశ్రమలో తనకు అనిపించింది మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి గట్స్ ఉన్న అతి కొద్ది మంది నటీమణుల్లో మాళవిక మోహన్(Malavika Mohanan) ఒకరు. 2013లో 'పట్టం పోలే' అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత కన్నడం, హిందీ, తమిళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా 'ది రాజాసాబ్' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ హీరోగా నటించిన 'పేట' చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ భామ తొలి చిత్రంతోనే పెర్ఫార్మెన్స్తో అదరగొట్టి సినీ ప్రముఖల దృష్టిలో పడ్డారు. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్, ధనుష్‌కు జంటగా మారన్, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ తదితర చిత్రాల్లో నటించి, తానేమిటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రం ది రాజాసాబ్తోపాటు తమిళంలో కార్తీకి జంటగా 'సర్దార్–2' చిత్రంలోనూ నటిస్తున్నారు. తాను అనుకున్నది నిర్మొహమాటంగా వ్యక్తం చేసే ఈమె ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో ఆడ, మగ అనే తారతమ్యం ఉండకూడదన్నారు. అయితే అది ఇక్కడ చాలా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటులకు దొరికే మర్యాద నటీమణులకు ఇక్కడ ఇవ్వరని పేర్కొన్నారు. పారితోషికం విషయంలోనూ సమానత్వం లేదని పేర్కొన్నారు. హీరోలకు పారితోషికం అడిగినంత ఇస్తున్నారనీ, హీరోయిన్లకు మాత్రం తగ్గించి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ పక్షపాత ధోరణి మారాలన్నారు. ఇకపోతే సినిమాలో కొందరు నటులు ఉన్నారనీ, వారు మహిళల మధ్య మంచి వారిగా కనపించే ప్రయత్నం చేస్తారన్నారు. అలాంటి మేకవన్నె పులులు సమయం వచ్చినప్పుడు వారి అసలు రంగును బయట పెడతారని అన్నారు. అలా గత 5 ఏళ్లుగా ముఖానికి అందమైన మాస్క్ వేసుకున్న పలువురు నటులను తాను చూశానని పేర్కొన్నారు. వాళ్లంతా బుద్ధిమంతులు అని భావించరాదనీ ఏయే సమయాల్లో నటీమణులతో మంచిగా ఉండాలన్నది వారికి బాగా తెలుసన్నారు. కానీ, కెమెరా వెనుక వారు ఎలా మారుతారు అన్నది తాను కళ్లారా చూశానని నటి మాళవిక మోహన్ పేర్కొన్నారు. ఈ బ్యూటీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారోగానీ, ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
'రాజాసాబ్'పై కొత్త రూమర్స్.. మరోసారి తప్పదా?
కొన్నాళ్ల ముందు రిలీజైన 'రాజాసాబ్' టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబరు 5న మూవీ రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు సినిమా మరోసారి వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.లెక్క ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 10న 'రాజాసాబ్'ని థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం మిగిలిన సీన్స్ అన్ని పూర్తిచేసే పనిలో టీమ్ అంతా ఉంది. త్వరలో సాంగ్స్ చిత్రీకరణ కోసం ఫారిన్ కూడా వెళ్లనున్నారు. అలాంటిది ఇప్పుడు 'రాజాసాబ్' సంక్రాంతికి రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)'రాజాసాబ్' ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈ వాయిదా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థల డిసెంబర్ డీల్స్ అన్నీ పూర్తయ్యాయని, వచ్చే ఏడాది జనవరికి అయితే ఒకటి రెండింటివి ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే 'రాజాసాబ్' దెబ్బ పడే ప్రమాదముంది. ఎందుకంటే డిసెంబరులో సోలో తేదీని వదులుకుని.. సంక్రాంతికి వస్తే కలెక్షన్స్ తగ్గిపోతాయి. అలా కాదని డిసెంబరులోనే వస్తారా అనేది చూడాలి.మరోవైపు బాలకృష్ణ 'అఖండ 2'.. సెప్టెంబరు 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈ తేదీ కూడా మారి డిసెంబరుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ vs బాలయ్య అవుతుందేమో? మరోవైపు డిసెంబర్ 5నే బాలీవుడ్ నుంచి 'ధురంధర్' అనే మూవీ రిలీజ్ కానుంది. దీని వల్ల ప్రభాస్ మూవీకి ఇబ్బంది ఏం ఉండదు. సరే ఇవన్నీ పక్కనబెడితే ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ నిజమా కాదా అనేది కొన్నిరోజుల్లో క్లారిటీ వస్తుందేమో?(ఇదీ చదవండి: ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ) -
రాజాసాబ్ బ్యూటీ.. విజయ్ దేవరకొండ మూవీతో డెబ్యూ ఇవ్వాల్సిందట!
తన ప్రత్యేకమైన స్టయిల్, స్వతంత్ర భావనతో ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించే మాళవిక మోహనన్ త్వరలోనే టాలీవుడ్లో స్టార్‌గా వెలుగొందనుంది. ఆ విషయాలే మీకోసం.. రాజాసాబ్ బ్యూటీ..మాళవిక మోహనన్ (Malavika Mohanan) కొన్ని తమిళ, మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తాజాగా ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలో నాయికగా నటించడంతో ఆమెకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చేసింది. మాళవిక తండ్రి కె.యు. మోహనన్ కూడా సినీరంగానికే చెందినవాడు. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘తలాష్’, ‘ఫక్రే’ వంటి ఎన్నో సినిమాలకు కెమెరా బాధ్యతలు నిర్వహించారు.తండ్రితో లొకేషన్‌కి..మాళవిక.. కేరళలోని పయ్యనూర్ అనే గ్రామంలో జన్మించింది. అయితే చిన్నప్పటి నుంచి ముంబైలోనే పెరిగింది, చదువుకుంది కూడా అక్కడే. కేవలం చదువు పూర్తి చేయాలనే ఉద్దేశంతో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది కాని, అసలు ఆసక్తి సినిమాలవైపే! ఒకసారి తండ్రి మోహనన్ యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేస్తుండగా, ఆమె లొకేషన్‌కు వెళ్లింది. ఆ యాడ్‌లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఆసక్తిఆమె నటనపై చూపిన ఆసక్తిని గమనించిన మమ్ముట్టి, తన కుమారుడు దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం ఇప్పించారు. అలా మాళవిక కెరీర్ మొదలైంది. ‘పట్టమ్ పొలే’ అనే మలయాళ చిత్రం ఆమె మొదటి సినిమా. ఆ సినిమా సమయంలో కాస్ట్యూమ్స్ డిజైనర్ అనారోగ్యం కారణంగా పని చేయలేకపోయారు. దాంతో మాళవిక తన దుస్తులను తానే డిజైన్ చేసుకుంది. అక్కడి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆసక్తి పెరిగి, ‘ది స్కార్లెట్ విండో’ అనే పేరుతో తన బ్రాండ్ ప్రారంభించింది.ధైర్యం ఎక్కువే!మాళవిక చాలా ధైర్యంగా ఉండే అమ్మాయి. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పెడుతుంటే, కొందరు నెటిజన్లు తప్పుడు కామెంట్లు పెట్టారు. మర్యాదగా, పద్ధతిగా ఉండాలని సూచనలు ఇచ్చారు. దానికి స్పందనగా పద్ధతిగా చీర వేసుకున్న ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో కూడా షార్ట్, చిన్న చొక్కా ఉండడంతో మరింత సెన్సేషన్ అయింది. ‘ఒక ఆడపిల్ల ఏ బట్టలు వేసుకోవాలో, ఎలా ఉండాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవరి పని వారు చూసుకుంటే బెటర్’ అని కౌంటరిచ్చింది.విజయ్ దేవరకొండతో మూవీభవిష్యత్తులో డైరెక్టర్ లేదా సినిమాటోగ్రాఫర్‌గా మారాలనేది ఆమె ఆశ. రింగులు అంటే మాళవికకి చాలా ఇష్టం. వందల సంఖ్యలో రింగులు కలెక్ట్ చేసింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – తెలుగులో ఆమెకి వచ్చిన మొదటి అవకాశం ‘రాజా సాబ్’ సినిమా కాదు. మొదట విజయ్ దేవరకొండ సినిమా కోసం ఎంపికైంది. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఆ సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు ‘హీరో’.తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంసూపర్ స్టార్ రజనీకాంత్ అంటే మాళవికకి విపరీతమైన అభిమానం. ఆయనతో ‘పేట’ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎంతో థ్రిల్ అయ్యిందట! అలాగే విజయ్‌తో ‘మాస్టర్’ సినిమాలో కూడా నటించింది. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రత్యేకమని మాళవిక చెప్పింది. ‘ఒక్క సినిమాలో కనిపించినా చాలు – తెలుగు వారు ఎంతగానో ప్రేమిస్తారు. అలా అభిమానించే ప్రేక్షకులు మరే భాషలో ఉండరని నాకు అనిపిస్తుంది’ అని చెప్పింది. ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ప్రభాస్తో పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ – ‘షూటింగ్ మొదలైన వారం రోజుల్లోనే ప్రభాస్ ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం వచ్చేది. దాదాపు ముప్పై నుంచి నలభై మంది తినగలిగేంత పెద్ద పరిమాణంలో వంటలు వచ్చేవి. భోజనం బాగా నచ్చినా, అంత తినలేకపోయా’ అని తెలిపింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ – మాళవిక చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకే బిల్డింగ్‌లో పెరిగారు. అందుకే తనకి అత్యంత సన్నిహితుడిగా విక్కీని భావిస్తానని చెబుతుంది. మలయాళ అమ్మాయి అయిన మాళవికకి మట్టి పాత్రలో వండే చేపల కూర అంటే విపరీతమైన ఇష్టం. డైటింగ్‌ను పక్కనపెట్టి, షూటింగ్ లేనప్పుడు తల్లి బీనా చేత వండించుకుని, ఆ చేపల కూర తింటూ ఆనందపడుతూ ఉంటుంది.చదవండి: ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా -
రాజా సాబ్ సెట్లో తెలుగు నేర్చుకుంటున్నాను : సంజయ్ దత్
‘‘వెంకీ సార్, సుప్రీత్‌లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ‘కేడీ: ది డెవిల్’ని గొప్పగా నిర్మించారు. ధృవ నా తమ్ముడులాంటివారు. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా ‘కేడీ: ది డెవిల్’ సినిమాకి విజయం అందించాలి’’ అని సంజయ్ దత్ పేర్కొన్నారు. ధృవ సర్జా హీరోగా, రీష్మా నానయ్య హీరోయిన్గా ప్రేమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కేడీ: ది డెవిల్’. సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషించారు. వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. సంజయ్ దత్ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌తో నాకెంతో అనుబంధం ఉంది. ఎంతో మందితో కలిసి పని చేశాను. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాను. ఆ సెట్లో తెలుగు నేర్చుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ధృవ సర్జా మాట్లాడుతూ–‘‘సంజయ్ దత్, శిల్పా శెట్టి వంటి వారితో పని చేయడం సంతోషంగానే ఉంటుంది. త్వరలో విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్. శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘నేను నా తొలి చిత్రం హిందీలో కాకుండా తెలుగులో (సాహసవీరుడు సాగరకన్య) చేశాను. ఇప్పుడు చేసిన ఈ ‘కేడీ: ది డెవిల్’లో అన్ని వాణిజ్య అంశాలున్నాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. హీరోయిన్ రీష్మా నానయ్య, కేవీఎన్ ్ర΄÷డక్షన్ బిజినెస్ హెడ్ సుప్రీత్ మాట్లాడారు. -
ప్రభాస్ ది రాజాసాబ్తో బాక్సాఫీస్ క్లాష్.. ఆ పని చేయరనుకుంటున్నా: కేజీఎఫ్ నటుడు
ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్, కల్కి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాను కూడా ది రాజాసాబ్ రిలీజ్ రోజునే రానుందని మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ వీడియోతో పాటు విడుదల తేదీని కూడా వెల్లడించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్తో రణ్వీర్ సింగ్ పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ క్లాష్‌పై కేజీఎఫ్ నటుడు సంజయ్ దత్ స్పందించారు. తాజాగా తాను నటించిన కేడీ ది ముంబయి డెవిల్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దురంధర్, ది రాజాసాబ్ అదే రోజు రిలీజ్ కావడంపై సంజయ్ దత్ మాట్లాడారు.సంజయ్ దత్ మాట్లాడుతూ..' ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్. ది రాజాసాబ్, దురంధర్ చిత్రాల్లో నా రోల్స్ చాలా భిన్నమైనవి. ఈ రెండు సినిమాలు ఓకే రోజు విడుదల అవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్లు కూడా ఈ పని చేయరని అనుకుంటున్నా' అని పంచుకున్నారు. -
ప్రభాస్ రెమ్యునరేషన్లో భారీ కోత.. ‘రాజాసాబ్’కి ఎంతంటే?
టాలీవుడ్లో నిన్నా మొన్నటి దాకా నెంబర్ వన్ హీరో అంటే తడుముకోకుండా చెప్పగలిగిన పేరు ప్రభాస్(Prabhas). దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన బాహుబలి 2 సినిమాలు ప్రభాస్ స్టార్ డమ్‌ని మిగిలిన హీరోలకు అందనంత స్థాయికి తీసుకెళ్లిపోయాయి. టాలీవుడ్ ను దాటేసి పాన్ ఇండియా స్థాయికి ఎగబాకిన క్రేజ్‌తో ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అటు రెమ్యునరేషన్ పరంగా గానీ, అఖిలభారత స్థాయి ఇమేజ్ పరంగా గానీ చూస్తే టాప్‌లో నిలిచాడు ప్రభాస్. అయితే ఇదంతా ఇప్పుడు గతం. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల తర్వాత ప్రభాస్ నెంబర్ వన్ స్థానం బీటలు వారింది. ఆ స్థానానికి అల్లు అర్జున్ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. ఈ నేపధ్యంలో రెమ్యునరేషన్ పరంగానూ ప్రభాస్ తగ్గాడనే వార్త ఒకటి సినిమా పరిశ్రమలో వినిపిస్తోంది.భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోల్లో ముందుండే ప్రభాస్, మళ్లీ హారర్ కామెడీ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab Movie) అనే సినిమాతో తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. హాస్య చిత్రాలకు పేరొందిన మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ అందుకున్న పారితోషికం గురించి వినిపిస్తున్న వార్తలు ప్రభాస్ నెంబర్ వన్ స్థానాన్ని చర్చనీయాంశంగా మార్చాయి.బాహుబలి తర్వాత సాధారణంగా ఒక్క సినిమాకు రూ.150 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడట ప్రభాస్, అలాంటిది ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రం రూ.100 కోట్లకే ఓకే చెప్పినట్లు సమాచారం. అంటే ఏకంగా రూ.50 కోట్ల తగ్గింపుని ఆయన అంగీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ముందు విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమా భారీగా వసూళ్లు సాధించలేకపోవడం, ప్రభాస్ నటన, గెటప్ కూడా తీవ్రంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొనడం వంటి వాటి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.ఏదేమైనా ఇది ప్రభాస్ నెం1 స్టార్ ఇమేజ్‌ని సందేహాస్పదం చేసేదే. అయితే రెమ్యునరేషన్లో తగ్గింపును అంగీకరిస్తూన్న కొందరు ప్రభాస్ అభిమానులు చెబుతున్న ప్రకారం...ఇది ఇమేజ్‌కు సంబంధించినది కాదు. ‘ది రాజా సాబ్’ కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణ బాధ్యతలు చూస్తోంది. ఇదే సంస్థ ఆదిపురుష్ ను కూడా నిర్మించింది. కాబట్టి ఆది పురుష్ ద్వారా నష్టాలను ఎదుర్కున్న నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభాస్ తన వంతుగా ఈసారి కొంచెం వెనక్కి తగ్గారని అంతే తప్ప ఆయన క్రేజ్‌కు ఏ మాత్రం తగ్గింపు లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పుష్ప సిరీస్‌తో మంచి దూకుడు మీదున్న బన్నీ... అట్లీ సినిమాకు భారతీయ సిని చరిత్రలోనే ఎవరూ అందుకోనంత రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభాస్ ఇలా వెనుకడుగు వేయడం టాలీవుడ్ నెం1 ఫైట్‌ను ఆసక్తిగా మారుస్తోంది.ఇక ది రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే.. రొమాంటిక్ హారర్ కామెడీగా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు మారుతి కి ఇది ఓ పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ కానుండగా, నిర్మాతగా టీ.జి. విశ్వప్రసాద్ వ్యవహరిస్తున్నారు. సినిమా విడుదల తేదీని డిసెంబర్ 5, 2025 గా ప్రకటించారు. ఈ సినిమా మరోసారి తమ హీరో సత్తా ఏంటో చూపించనుందని ప్రభాస్ అభిమానులు బల్ల గుద్ది చెబుతున్నారు. -
‘నన్ను పెళ్లి చేసుకో’ అని కోరిన అభిమాని.. హీరోయిన్ ఫన్నీ రిప్లై
‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ఓ అమ్మాయిని ఓ అబ్బాయి డైరెక్ట్‌గా అడిగితే తడబడే అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. కానీ మాళవికా మోహనన్లాంటి అమ్మాయిలైతే అదే స్పీడుతో సమాధానం ఇచ్చేస్తారు. సరదాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో కబుర్లు చెప్పాలనుకున్నారు ఈ బ్యూటీ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.ఓ అభిమాని ‘నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగాడు... అంతే... ‘నాకు దెయ్యాలంటే భయం’ అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు మాళవిక. అలా ఎందుకు చెప్పారంటే, అతని ‘ఎక్స్’ ఖాతా పేరు ‘ఘోస్ట్’ అని ఉంది. ఆ పేరుని వాడుకుని, ఇలా సరదాగా మాళవిక చెప్పారు. రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్"తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం గురించి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీలవుతున్నట్లు ఆమె తెలిపింది. ప్రభాస్ ను ఫస్ట్ టైమ్ సెట్స్ లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్ మెంట్ గా తాను ఫీలైనట్లు మాళవిక తెలిపింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని ఆమె పేర్కొంది. -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. ఏకంగా రూ.5 కోట్లు సేవ్ చేసిన తమన్!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రాని మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల కాగా.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. హారర్, కామెడీతో పాటు విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ముగ్గురు హీరోయిన్లతో ఓ స్పెషల్ సాంగ్‌ను మారుతి ప్లాన్ చేసినట్లు చేస్తోంది. ఓ ఫుల్ మాస్ సాంగ్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారు. దీనికోసం ఓ హిందీ పాటను రీమిక్స్ చేయాలని భావించారు. అయితే ఆ సాంగ్ మ్యూజిక్ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ ది రాజాసాబ్ టీమ్‌ను దాదాపు రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు టాలీవుడ్ బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్ మరో ప్లాన్‌కు రెడీ అయ్యారు. తమన్‌తోనే ఓ ప్రత్యేక సాంగ్‌ను కంపోజ్ చేయనున్నారట. ముగ్గురు హీరోయిన్లతో చేసే పాటకు తమన్ తన రేంజ్లో అదిరిపోయే సంగీతం కొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ది రాజాసాబ్ టీమ్‌కు దాదాపు రూ.5 కోట్ల రూపాయలు సేవ్ అయినట్లే. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం తమన్ ఎలాంటి బీట్స్ అందిస్తాడో వేచి చూడాల్సిందే. ఎందుకంటే స్పెషల్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో తమన్ హై టాలెంటెడ్ అని మనందరికీ తెలిసిందే. కాగా.. ది రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.#Prabhas to Groove with Three Heroines in a Special Song!👉 The shooting of #RajaSaab is nearly complete, with just two songs left to be filmed.👉 Initially, the team had planned a high-energy remix of a popular old Hindi classic. However, the music rights came with a… pic.twitter.com/OnBKt4x2FL— PaniPuri (@THEPANIPURI) June 18, 2025 -
టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌తో సినిమా చేయాలని ఉంది: ది రాజాసాబ్ హీరోయిన్
కోలీవుడ్ భామ మాళివిక మోహనన్ ది రాజాసాబ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.అయితే తాజాగా మాళవిక మోహనన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది. ఆస్క్ మాళివికా పేరుతో ట్విటర్ వేదికగా పలువురు నెటిజన్స్ అడిగి ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఓ నెటిజన్ మీరు నెక్ట్స్ మూవీ ఏ డైరెక్టర్‌తో సినిమా చేయాలనుకుంటున్నారు? ఆ దర్శకుడితోనే ఎందుకు? అని ప్రశ్నించాడు. దీనికి మాళవిక ఊహించని ఆన్సరిచ్చింది. ప్రస్తుతం నా దగ్గర పెద్ద లిస్టే ఉంది.. కానీ నేను రాజమౌళితో సార్‌తో పని చేయడం తనకిష్టమని తెలిపింది. ఇది చూసిన నెటిజన్స్ త్వరలోనే మీ కోరిక నెరవేరుతుందని కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: 'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్))కాగా.. గతేడాది తంగలాన్ మూవీతో మెప్పించిన మాళవిక కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ది రాజాసాబ్‌లో కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. I have a long list but if I had to pick one maker right now I would love to work with Rajamouli sir! ☺️ https://t.co/Mvovp1TzOd— Malavika Mohanan (@MalavikaM_) June 18, 2025 -
ది రాజా సాబ్ టీజర్.. ఆ డైలాగ్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా?
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. రొమాంటిక్ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ మన రాజా సాబ్ టీజర్ విడుదలైంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్ థ్రిల్లింగ్‌గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.అయితే ఈ టీజర్‌లోని ఓ డైలాగ్‌ను ఏకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడేశారు. ప్రజలకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. అందులో ది రాజాసాబ్ టీజర్‌లోని డైలాగ్‌ను చూపించారు. హలో హలో బండి కొంచెం మెల్లగా.. అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం కల్పించే ప్రయత్నం చేశారు.అంతేకాకుండా ప్రభాస్ మిర్చి సినిమాలో విజువల్స్‌ను కూడా ట్రాఫిక్ పోలీసులు వినియోగించారు. మిర్చి చిత్రంలో హెల్మెట్ ధరించిన బైక్‌పై వస్తున్న విజువల్స్‌ను ఇందులో చూపించారు. వీటితో పాటు సాహో మూవీలోని కొన్ని సీన్స్‌ను కూడా ఇందులో కలిపేశారు. కనీసం ఇది చూసైనా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా పోలీసులు చేసినా ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.మారుతి రియాక్షన్..ఈ వీడియో చూసిన ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి స్పందించారు. ఇది చాలా ఫర్ఫెక్ట్.. మా సినిమా డైలాగ్‌ను పాజిటివ్ కోణంలో ఉపయోగించడం సూపర్ అంటూ ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. కాగా.. ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ది రాజా సాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. Yes sir perfect... thank u for using our footage in positive manner— Director Maruthi (@DirectorMaruthi) June 17, 2025 #HYDTPweBringAwareness📢ℋℯ𝓁𝓁ℴ... ℋℯ𝓁𝓁ℴ....!బండి కొంచెం మెల్లగా #𝕯𝖗𝖎𝖛𝖊 చేయండి డార్లింగ్❤️𝖉𝖆𝖗𝖑𝖎𝖓𝖌.🏍️#WearHelmet#DarlingPrabhas #TheRajaSaab pic.twitter.com/OHSeM6kd1D— Hyderabad Traffic Police (@HYDTP) June 17, 2025 -
ఆ టైమ్‌లో నాకు ప్రభాస్ ఒక్కడే సపోర్ట్‌గా నిలిచాడు: మారుతి
‘‘నేను దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో మా కాంబినేషన్లో(ప్రభాస్–మారుతి) మూవీ అనుకున్న ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యారు. కానీ, అలాంటి టైమ్‌లో నాకు సపోర్ట్‌గా నిలిచిన ఒకే ఒక వ్యక్తి ప్రభాస్‌గారు. అందుకే ‘ది రాజా సాబ్’ ను ఒక సవాల్‌గా తీసుకుని సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని డైరెక్టర్ మారుతి తెలిపారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. (చదవండి: 'ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారు'.. ఎస్కేఎన్ కామెంట్స్ వైరల్!)హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ–‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడు’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. కొంత షూటింగ్, సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి’’ అన్నారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘ది రాజా సాబ్’ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి, కెమేరామేన్ కార్తీక్ పళని, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ మాట్లాడారు. -
'ది రాజా సాబ్పై నెగెటివ్ క్యాంపెయిన్'.. నిర్మాత ఎస్కేఎన్ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. రొమాంటిక్ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. మన రాజా సాబ్ టీజర్ విడుదలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్ థ్రిల్లింగ్‌గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.అయితే ఇవాళ నిర్వహించిన టీజర్ ఈవెంట్‌కు నిర్మాత ఎస్కేఎన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ టీజర్‌తో పాటు సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకు ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారని ఆరోపించారు. ఈ సినిమా మొదలైనప్పుడు నెగెటివ్ చేసినా నిర్మాత.. టీజర్ చూశాక రేపటి నుంచి పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. మారుతి ఎప్పుడూ అలాంటి క్యాంపెయిన్స్‌ను నమ్మలేదు. తన బెస్ట్ ఇస్తానని చెప్పాడు. డిసెంబర్ 5న పాన్ ఇండియా షేక్ అవుతుంది' ఎస్కేఎన్ కామెంట్స్ చేశారు. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఎవరా? నిర్మాత టాలీవుడ్లో చర్చ మొదలైంది.(ఇది చదవండి: 'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్))ఈ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్‌లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రభాస్ 'ది రాజాసాబ్' HD మూవీ స్టిల్స్
-
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ది రాజాసాబ్' టీజర్ విడుదల
-
'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్)
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ది రాజాసాబ్' (The RajaSaab) టీజర్ వచ్చేసింది. రొమాంటిక్ హారర్ కాన్సెప్ట్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే వారి అంచనాలకు మించే ఈ చిత్రం ఉండొచ్చని చెప్పవచ్చు. సంగీతం తమన్ అందించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. -
ఈరోజు మా నాన్న ఉండుంటే.. ఆ థియేటర్‌తో 'మారుతి' అనుబంధం
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). సోమవారం టీజర్ విడుదల కానుంది. ఈ క్రమంలో పలు థియేటర్స్ వద్ద ప్రభాస్, మారుతి కటౌట్స్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. వాటిని చూసిన దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. గతంలో తన తండ్రి అరటిపళ్లు అమ్మినచోట ఇప్పడు తన కటౌన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ మారుతి తెలిపారు. ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేసిన మారుతి.. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. మచిలీపట్నం, వైజాగ్‌లో మారుతి పెరిగారు. ఆ ప్రాంతాలతో ఆయనకు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.'మచిలీపట్నం - సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్)తో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ మా నాన్నగారికి ఒకప్పుడు చిన్న అరటిపళ్లు దుకాణం ఉండేది. ఎప్పటికైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఈ థియేటర్లో విడుదలైన అందరి హీరోల సినిమాల బ్యానర్స్ నేను ఎంతో ఆశతో కట్టేవాడిని. ఒక్కసారైనా నా పేరు ఇక్కడ చూడాలని కలలు కనేవాడిని. ఇప్పుడు ఇదే థియేటర్ వద్ద నిలబడి చూస్తుంటే.. నా ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో అన్ని గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు జీవితం పరిపూర్ణమైందనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎవరికైనా ఇంతకు మించి ఇంకేం కావాలి. కానీ, ఈరోజు మా నాన్న ఉండుంటే చాలా గర్వపడేవారు. ఆయన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉంది. ఏదైనా ఉన్న సమయంలోనే మన బాధ్యతలను పూర్తి చేయాలి. మన డార్లింగ్‌ను వెండితెరపై నేను ఎలా చూపించాలని ఆశ పడ్డానో మీ అందరికీ చూపించనున్నాను. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది.' అని ఆయన అన్నారు.MACHILIPATNAM - Siri complex (krishna Kishore in past)This is the place where my father once had a small banana stall…Where I used to write for banners of all heroes films released in this theater dreaming with hope :) I was one of those who wished “okkasaraina mana peru… pic.twitter.com/Wnu3cCUoOz— Director Maruthi (@DirectorMaruthi) June 16, 2025 -
ప్రభాస్ ది రాజాసాబ్ టీజర్.. టైమ్ ఫిక్స్ చేసిన డైరెక్టర్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్‌ను తేదీని కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.అయితే ఇప్పటికే జూన్ 16న ఉదయం 10:52 గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ మారుతి తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఆల్ సెట్ డార్లింగ్స్.. లెట్స్ రాక్ ఫ్రమ్ టుమారో' అంటూ టైమ్ ఫిక్స్ చేశారు.టీజర్‌పై అధికారిక ప్రకటన రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం. ది రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.All SET darlings Hope u all ready 💖 Let's rock from tomorrow 10.52 am#TheRajaSaabTeaser pic.twitter.com/Q2aGbYAcnU— Director Maruthi (@DirectorMaruthi) June 15, 2025 -
అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి
సాక్షి, మచిలీపట్నం: జీవితం అందరికీ పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు చూసిన తర్వాత కానీ విజయాలు సొంతం కావు. దర్శకుడు మారుతి (Maruthi) జీవితం కూడా అంతే! ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేశాడు. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో ఆర్య సినిమా కొని డిస్ట్రిబ్యూటర్‌గా హిట్టందుకున్నాడు. తర్వాతి కాలంలో దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్లు, ఫ్లాపులు అన్నీ చూశాడు. హారర్ జానర్అంతెందుకు, 2022లో ఆయన చివరగా తీసిన పక్కా కమర్షియల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకుంది. అయినా సరే తనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రభాస్ (Prabhas)తో ద రాజా సాబ్ (The Raja Saab Movie) అనే హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. తాజాగా మారుతి.. మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్టివల్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1999లో హైదరాబాద్‌కు వెళ్లాను. అంతకుముందు వైజాగ్‌లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. బొమ్మలు గీసుకునేవాడినినేను కూడా అక్కడ పండ్లు అమ్ముతూ.. సినిమాలు రిలీజైనప్పుడు వాటిని చూసి నా నోట్‌బుక్‌లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 1999లో హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడు నాకు స్టిక్కరింగ్ షాపు ఉండేది. నెంబర్ ప్లేట్లు తయారు చేసేవాడిని. హిందూ కాలేజీలో చదువుకుంటూనే నెంబర్ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైనా వెళ్తాడనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే! రూ.400 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నా.. అంచనాలు పెంచేసిన మారుతిరాజా సాబ్ మీరు ఊహించినదానికంటే ఒకశాతం ఎక్కువే ఉంటుంది. జూన్ 16న టీజర్ రిలీజ్ చేస్తున్నాం అని రాజాసాబ్‌పై అంచనాలు పెంచేశాడు మారుతి. అటు ఎక్స్ (ట్విటర్)లోనూ ఒట్టేసి చెబుతున్నా.. రాజా సాబ్ మూవీ ఓ వేడుకలా ఉంటుందని ట్వీట్ చేశాడు. మారుతి దర్శకుడిగా ఈ రోజుల్లో, బస్‌స్టాప్, ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే, బాబు బంగారం, మంచి రోజులొచ్చాయ్.. ఇలా పలు సినిమాలు చేశాడు. Still feels like yesterday :)#PremaKathaChitram Memories are fresh in my mind….♥️ And now even more excited for this anniversary… because after a long time stepping back into that zone again…..But this time it’s a horror fantasy.I promise #TheRajaSaab will be a celebration… https://t.co/naoZekmCBH— Director Maruthi (@DirectorMaruthi) June 7, 2025 చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు -
'ది రాజాసాబ్' నుంచి బిగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). తాజాగా ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ వంటి అంశాలను ఒక పోస్టర్‌తో చిత్ర యూనిట్ తెలిపింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 16న ఉదయం 10:52గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. రీసెంట్గా విదేశాల నుంచి తిరిగొచ్చిన ప్రభాస్ టీజర్ డబ్బింగ్ వర్క్ కూడా పూర్తిచేశారట. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం.తాతా మనవళ్ళుగా ప్రభాస్‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. వాస్తవంగా ఈ సినిమా విడుదల ఏప్రిల్ 10న రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉండటంతో వాయిదా పడింది. ఇంకా కొంత భాగం షూటింగ్ పనులు కూడా ఉన్నాయట. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది.ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. A day that promises a festival on the big screens just like we all dreamt of seeing our dearest darling #Prabhas ❤️❤️❤️A lot more exciting days ahead…#TheRajaSaab pic.twitter.com/PFdV1mcqDJ— Director Maruthi (@DirectorMaruthi) June 3, 2025 -
ప్రభాస్ సినిమాపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
‘రాజాసాబ్’తర్వాత ప్రభాస్(Prabhas) నటించబోయే సినిమా ఏంటి? అనేదానిపై రకరకాల చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్(Spirit) సినిమా చేయాల్సింది. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పనులు కూడా ప్రారంభించారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ ప్రభాస్ మనసు మార్చుకున్నాడని, స్పిరిట్‌ని పక్కకు పెట్టి ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా స్పిరిట్ కంటే ముందే ‘యానిమల్’ సీక్వెల్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్పిరిట్ సినిమా నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ చేసిన తర్వాతనే ‘యానిమల్ పార్క్’ తెరకెక్కిస్తాడని చెప్పాడు. మరో రెండు మూడు నెలల్లో ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం కానుందన్నారు. 2027లో ఈ చిత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. భూషన్ కుమార్ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.కాగా, ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో టూర్లో ఉన్నాడు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత రాజాసాబ్ షూటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత భూషన్ చెప్పినట్లుగా స్పిరిట్ చేస్తారు. సందీప్ కోరిక మేరకు ఈ సినిమా కోసం ప్రభాస్ వరుసగా 65 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట.ఈ మూవీ తర్వాత హనురాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’(ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం స్పిరిట్, పౌజీతో పాటు ప్రశాంత్ వర్మ సినిమా కూడా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో సలార్ 2, నాగ్ అశ్విన్‌తో ‘కల్కి 2’ చేయాల్సి ఉంది. -
ప్రభాస్ ది రాజాసాబ్.. టీజర్ రిలీజ్‌పై హింట్ ఇచ్చిన డైరెక్టర్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాను రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ రెబల్ స్టార్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్‌కు సంబంధించిన ఓ హింట్ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.హై అలర్ట్.. హీట్ వేవ్స్ మరింత పెరగనున్నాయి అని ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.దీంతో వచ్చేనెలలోనే ది రాజాసాబ్ టీజర్ విడుదల కానుందని హింట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని.. విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి రాగానే తనతో డబ్బింగ్ పూర్తి చేసి టీజర్ విడుదల తేదీని రివీల్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి సందడి చేయనుంది.HIGH ALERT…‼️HEAT WAVES gonna rise even higher from mid May! 🔥🔥🔥 pic.twitter.com/EdEdtMCq6E— Director Maruthi (@DirectorMaruthi) April 23, 2025 -
ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి
పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ ఆలస్యమవుతూనే ఉన్నాయి. ప్రతిదీ చెప్పిన సమయానికి అస్సలు రిలీజ్ కావట్లేదు. లెక్క ప్రకారం 'రాజాసాబ్' ఈ 10వ తేదీన రిలీజ్ కావాలి. కానీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానులు ఫుల్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు. (ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)చాన్నాళ్ల క్రితం రాజాసాబ్ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తవలేదు. దీంతో ఈ ఏడాది రిలీజ్ అవుతుందా వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. తాజాగా డైరెక్టర్ మారుతిని ట్విటర్ లో అదే ప్రశ్న అడిగారు.తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్ని దర్శకుడు మారుతి దర్శించుకున్నాడు. ఆ ఫొటోలు పోస్ట్ చేయగా 'రాజాసాబ్' రిలీజ్ ఎప్పుడని ఫ్యాన్స్ అడిగారు. దీంతో మారుతి సమాధానమివ్వాల్సి వచ్చింది. 'రిలీజ్ అనేది నా ఒక్కడి చేతుల్లో లేదు. ఎలాంటి అప్డేట్ అయినా పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ ఇస్తుంది' అని మారుతి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)షూటింగ్ అప్డేట్ గురించి మరో అభిమాని అడగ్గా.. 'కొంత టాకీ, పాటల షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. చాలా గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇచ్చిన ఔట్ పుట్ బాగుంది. చిత్రీకరణ పూర్తవగానే పాటలు రిలీజ్ చేస్తాం. మా కష్టాన్ని చూపించేందుకు మేం కూడా ఎదురుచూస్తున్నాం' అని డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చాడు.డైరెక్టర్ చెప్పిన దానిబట్టి చూస్తే ఈ ఏడాదిలో రాజాసాబ్ రిలీజ్ కష్టమే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్) -
సమ్మర్ కష్టమే.. ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చిన ‘మెగా’ బ్రదర్స్!
టాలీవుడ్‌కి సంక్రాంతి తర్వాత సమ్మర్ మంచి సీజన్. వేసవి సెలవుల్లో పలు పెద్ద సినిమాలతో పాటు మీడియం, చిన్న చిత్రాలు కూడా విడుదల అవుతుంటాయి. స్కూల్, కాలేజీ పిల్లలకు సెలవులు ఉండడంతో వారిని టార్గెట్ చేస్తూ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అయితే ప్రతి సమ్మర్‌కి కనీసం రెండు, మూడు పెద్ద సినిమాలైనా సందడి చేసేవి. కానీ ఈ సారి మాత్రం యావరేజ్ సినిమాలతోనే సరిపెట్టుకోవాలేమో. సమ్మర్లో సందడి చేస్తామని చెప్పిన మెగా హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చేలా కనిపిస్తోంది. వీరితో పాటు ప్రభాస్ కూడా వేసవి సీజన్‌కి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ‘విశ్వంభర’ మూవీ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ కొడుకు రామ్ చరణ్ కోసం చిరు వెనక్కి తగ్గాడు. దీంతో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’సంక్రాంతికి రిలీజైంది. కానీ చిరంజీవి చేసిన త్యాగానికి గేమ్ ఛేంజర్ న్యాయం చేయలేకపోయింది. అది పక్కన పెడితే.. విశ్వంభర సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ మేకర్స్ మళ్లీ మనసు మార్చుకున్నారట. సమ్మర్లో కాకుండా.. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే సమ్మర్లో చిరును తెరపై చూడడం కష్టమే.మరోవైపు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) ‘హరిహర వీరమల్లు’ కూడా రిలీజ్‌ని వాయిదా వేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ జరుగుతోంది. పవన్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉందట.ఈ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. వీఎఫెక్స్ వర్క్ కూడా పెండింగ్‌లోనే ఉంది. ఈ లెక్కన ఈ చిత్రం కూడా వేసవిలో రిలీజ్ అవ్వడ కష్టమే అంటున్నారు సినీ పండితులు.ఇక మెగా ఫ్యామిలీ హ్యాండిచ్చినా.. ప్రభాస్ అయినా సమ్మర్లో ఎంటర్టైన్ చేస్తారనుకుంటే.. అది కూడా కష్టమే అంటున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదట. ఈ చిత్రాన్ని ముందు చెప్పినట్లుగా ఏప్రిల్‌లో రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. జూన్ లేదా జులైలో ఈ చిత్రం రిలీజయ్యే అవకాశం ఉంది. ఇలా పెద్ద సినిమాలన్నీ తమ విడుదలను వాయిదా వేసుకుంటే.. యావరేజ్, చిన్న చిత్రాలు మాత్రం రిలీజ్‌కు రెడీ అంటున్నాయి. -
అవకాశం ఇస్తామంటూ తిప్పించుకున్నారు : హీరోయిన్
సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలని చాలా మంది కలలు కంటారు. అయితే కొందరు మాత్రమే ఆ కల నెరవేర్చుకుంటారు. మరికొంత మందికి నటించాలని ఉన్నా..అవకాశాలు రావు. ఒక్క చాన్స్ కోసం ఎన్నో రోజులు వేచి చూస్తారు. అవకాశం వచ్చినప్పుడే తమ టాలెంట్‌ని నిరూపించుకుంటారు. ఆ తర్వాత దర్శకనిర్మాతలే వారి ఇళ్ల చుట్టు తిరుగుతారు. కానీ మొదట వచ్చే ఆ ఒక్క చాన్స్ కోసం కొంతమంది ఎన్నో కష్టాలు పడతారు. ఎన్నో అవమానాలను, మోసాలను భరించి.. తమ కలను నెరవేర్చుకుంటారు. అలా తాను కూడా తొలి సినిమా కోసం చాలా కష్టాలు పడ్డానని అంటోంది అందాల తార నిధి అగర్వాల్(Nidhi Agarwal). దాదాపు రెండేళ్ల పాటు ఆఫీసుల చుట్టు తిరిగితే కానీ తనకు అవకాశం రాలేదని చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి తన సినిమా కష్టాల గురించి వివరించింది.(చదవండి: అల్లు అర్జున్‌కు అనారోగ్యం.. అందుకే ఇక్కడకు రాలేదు: అల్లు అరవింద్)దీపికా పదుకొణెను చూసి సినిమాల్లోకి..నేను సినిమాల్లోకి రావడానికి కారణం దీపికా పదుకొణె. ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొనే ఇండస్ట్రీలోకి వచ్చా. తెరపై దీపికను చూసి..నేను కూడా హీరోయిన్ అవుతానని ఇంట్లో చెప్పాను. మొదట్లో ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ముందు చదువు పూర్తి చెయ్.. ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నారు. కొన్నాళ్ల తర్వాత సినిమాలపై నాకున్న పిచ్చి చూసి..మా నాన్నగారే ప్రోత్సహించారు. హీరోయిన్గా ట్రై చెయ్ అని చెప్పారు. అలా ఇంట్లోవాళ్ల అనుమతితో ఇండస్ట్రీలోకి వచ్చాను.రెండేళ్ల పాటు తిరిగాసినిమా చాన్స్‌లు ఈజీగా వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ ఒక్క చాన్స్ రావడం అంత ఈజీ కాదు. నేను అయితే దాదాపు రెండేళ్ల పాటు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టు తిరిగాను. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. కొంతమంది దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేశారు. రెండు మూడు సార్లు ఆఫీసుల చుట్టు తిప్పించుకొని..ఆ తర్వాత మీకు అవకాశం లేదని బయటకు పంపించేశారు. చివరిగా మైఖేల్ మున్నా సినిమా ఆడిషన్‌కి వెళ్తే.. అక్కడ నేను సెలెక్ట్ అయ్యాను. దాదాపు 300 మందిని ఆడిషన్ చేయగా.. అదృష్టం కొద్ది నేను సెలెక్ట్ అయ్యాడు. ఆ సినిమా చూసి నాకు నాగ చైతన్య(Naga Chaitanya) ‘సవ్యసాచి’లో చాన్స్ వచ్చింది.అందుకే గ్యాప్ వచ్చిందిఈ మధ్యకాలంలో నేను సినిమాలు తగ్గించాను అని చాలా మంది అంటున్నారు. అది వాస్తవమే. కానీ అవకాశాలు రాలేక కాదు.. ఓ ఒప్పందం కారణంగా సినిమాలు చేయట్లేదు. పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అయితే ఆ సినిమా పూర్తయ్యేవరకు ఇతర చిత్రాల్లో నటించకూడదని నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది. అదే సమయంలో నాకు ది రాజా సాబ్(The Raja Saab) మూవీలో అవకాశం వచ్చింది. దాంతో హరిహర వీరమల్లు మేకర్స్ ని ఆ సినిమాలో చేస్తాను అని అడగగా వాళ్ళు ఓకే చేశారు. ఈ రెండు చిత్రాలు నా కెరీర్‌కి చాలా స్పెషల్ అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. -
ది రాజాసాబ్ భామకు క్రేజీ ఆఫర్.. ఆ స్టార్ నటుడితో తొలిసారి!
గతేడాది తంగలాన్‌తో సూపర్ కొట్టిన హీరోయిన్ మాళవిక మోహనన్. కొత్త ఏడాదిలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ సరసన ది రాజాసాబ్‌లో కనిపించనుంది. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ లైన్లో ఉండాగానే మరో క్రీజీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ.మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ చిత్రంలో మాళవిక నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మాలీవుడ్ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ హృదయపూర్వం అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మాళవిక మోహనన్‌ను ఎంచుకున్నట్లు మాలీవుడ్‌లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మాళవిక తొలిసారి మోహన్ లాల్‌తో జతకట్టనుంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఫిబ్రవరి 10న కొచ్చిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.మాళవిక విషయానికొస్తే పట్టం పోల్ (2013)సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బియాండ్ ది క్లౌడ్స్, పెట్టా (2019), మాస్టర్ (2021) చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది విక్రమ్ మూవీతో విభిన్నమైన పాత్రతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా యుధ్రా సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం రెబల్ స్టార్ పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్‌లో కనిపించనుంది. ఇటీవల మాళవిక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న ఓ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం 2025 వేసవిలో గ్రాండ్ రిలీజ్ కానుంది. -
ప్రభాస్ హీరోయిన్‌కి వేధింపులు.. రంగంలోకి పోలీసులు!
సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal). సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. ఆయన బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు.వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నిధిబాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్లో రాణిస్తున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో ఈ బ్యూటీకి ఇక అవకాశాలు రావడం కష్టమే అని అనుకున్నారు అంతా.. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా చాన్స్‌లు వచ్చాయి. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌లతో నటిస్తోంది.‘రాజాసాబ్’తో రొమాన్స్మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab). కామెడీ హారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మిగతా హీరోయిన్లలో పోలిస్తే నిధి పాత్రకు కాస్త ప్రాధాన్యత ఎక్కువే ఉందట. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‘వీరమల్లు’కి జోడీగాపవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu). క్రిష్ సారథ్యంలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో రానుంది. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా నిధి నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న ఈ చిత్రం మొదటి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది. -
ది రాజాసాబ్ ఆన్ ట్రాక్.. రూమర్స్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ!
కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇటీవల బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి.. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు. నా నవ్వు చూస్తే చాలు.. ది రాజాసాబ్ గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజాసాబ్ విడుదల వాయిదా పడిందంటూ వార్తలొచ్చాయి. అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ మూవీ రానుందని.. అందువల్లే ది రాజాసాబ్ డేట్ మారినట్లు న్యూస్ వైరలైంది.డే అండ్ నైట్ జరుగుతోంది..తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. ది రాజాసాబ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ డే అండ్ నైట్ షెడ్యూల్స్ నిరంతరాయంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ది రాజా సాబ్ టీజర్ విడుదల కానుందని మరికొన్ని ఊహాగానాలు వస్తున్నాయని తెలిసింది. ఇలాంటి వాటిని ఎవరూ కూడా నమ్మవద్దని కోరుతున్నట్లు టీమ్ వెల్లడించింది. ఈ మూవీకి సంబంధించి సరైన సమయంలో మేమే అప్డేట్స్ ఇస్తామని ట్విటర్ ద్వారా కోరింది నిర్మాణ సంస్థ. ఈ ప్రకటనతో ది రాజాసాబ్ చిత్రంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.గాయం కావడం వల్లే రూమర్స్..'ది రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. #TheRajaSaab shooting is progressing rapidly with continuous day and night schedules. Nearly 80% of the shoot has been completed, and post production work is in full swingWe’ve noticed various speculations circulating about the teaser release during Christmas or New Year. We… pic.twitter.com/qJIX2AXxDh— People Media Factory (@peoplemediafcy) December 18, 2024 -
ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్ వాయిదా పడ్డట్లే
లెక్క ప్రకారం ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి. కానీ గత కొన్నిరోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అధికారికంగా ఏం చెప్పలేదు గానీ దాదాపు వాయిదా పడ్డట్లే. ఎందుకంటే యంగ్ హీరో సిద్ధు జొన్నల్లగడ్డ.. అదే తేదీకి తన కొత్త సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటించడంతో ఈ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ కొత్త సినిమా)'టిల్లు' సినిమాలతో ఫేమస్ అయిన సిద్ధు.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' మూవీ చేస్తున్నాడు. 'బేబి' వైష్ణవి చైతన్య హీరోయిన్. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 'రాజాసాబ్' వాయిదా గురించి వీళ్లకు క్లారిటీ ఉన్నట్లు ఉంది. అందుకే అంత కచ్చితంగా అదే డేట్ వేశారు.'రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. (ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త) -
‘భయం’తో బాక్సాఫీస్‌పై దాడి.. కాసుల వర్షం కురిసేనా?
హారర్ సినిమాలు ఏ మాత్రం ఆడియన్స్‌కు కనెక్ట్ అయినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. అందుకే కథాబలం ఉన్న భయపెట్టే కథలు తమ దగ్గరకి వస్తే చేసేందుకు భయపడరు హీరోలు, హీరోయిన్లు. కథలోని భయాన్నే భరోసాగా చేసుకుని, ప్రస్తుతం కొందరు నటీనటులు హారర్ సినిమాలు చేస్తున్నారు. ఆ స్టార్స్ చేస్తున్న హారర్ చిత్రాల గురించి తెలుసుకుందాం.రాజా డీలక్స్ థియేటర్లో రాజా సాబ్ ప్రభాస్ కటౌట్ చాలు బాక్సాఫీస్ భయపడటానికి. కానీ వెండితెరపై ప్రభాస్ భయపడితే ఎలా ఉంటుంది? ఆడియన్స్‌ను ప్రభాస్ భయపెడితే ఎలా ఉంటుంది? అనేది ‘రాజా సాబ్’ సినిమాలో చూడొచ్చు. ‘ప్రేమకథా చిత్రమ్’తో ఆడియన్స్‌ని నవ్విస్తూనే భయపెట్టి, బాక్సాఫీస్ కాసులను కురిపించిన దర్శకుడు మారుతి ‘రాజా సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. ‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇప్పుడు సినిమాలోనూ... నాగచైతన్య కెరీర్లో ఇప్పటివరకూ హారర్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు లేవు. అయితే హారర్ టచ్ ఉన్న ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ సిరీస్‌కు వీక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఓ పర్ఫెక్ట్ హారర్ మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ సినిమాతో దర్శకుడు కార్తీక్‌వర్మ దండు ఆడియన్స్‌ను బాగా భయపెట్టి, బాక్సాఫీస్ వద్ద డబ్బులు రాబట్టుకున్నారు. ఈ దర్శకుడు తెరకెక్కించనున్న కొత్త సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ‘విరూపాక్ష’ను మించిన హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని, కథకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఓ ఎత్తైన పర్వతం పైకి ఎక్కుతున్న నాగచైతన్యను ఓ పక్షి కన్నులో నుంచి చూపించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌కు ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్‌లోని ఈ 24వ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. కొరియన్ కనకరాజు లవ్‌స్టోరీ, యాక్షన్ జానర్స్‌లో సినిమాలు చేశారు వరుణ్ తేజ్. అయితే ఈసారి కొత్తగా ప్రయత్నించాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యారు. అందుకే ఓ హారర్ కామెడీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్. ‘రన్ రాజా రన్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ వంటి చిత్రాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో ఉంటుంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్‌గా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. మార్చిలో చిత్రీకరణ అంటున్నారు కాబట్టి, వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఊహించవచ్చు. చీకటి–వెలుగుల మధ్యలో...! చీకటి వెలుగుల మధ్య దాగి ఉన్న ఓ మిస్టరీని చేధించే పనిలో పడ్డారట బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా కౌశిక్ పెగుళ్లపాటి దర్శకత్వంలో ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. సాయి శ్రీనివాస్ కెరీర్‌లోని ఈ 11వ చిత్రంలో ‘కిష్కింధపురి’ అనే కల్పిత ప్రాంతం ఉంటుందని, అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయని, ఈ నేపథ్యంలో ఓ హారర్ కథను కౌశిక్ రెడీ చేసుకున్నారనీ భోగట్టా. ఈ సినిమాకు ‘కిష్కింధపురి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు. రహస్యాలను కనిపెట్టే యువతిగా∙ఈ ఏడాది ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) వంటి హారర్ సినిమాతో ఆడియన్స్‌ను ఆలరించారు తమన్నా. ఈ సినిమాలో ఓ పాజిటివ్ ఆత్మగానే కనిపించారు. అలాగే ఈ ఏడాదే విడుదలైన హిందీ బ్లాక్‌బస్టర్ హారర్ ఫిల్మ్ ‘స్త్రీ 2’లోనూ మెరిశారు తమన్నా. కానీ ఆమె పాత్రకు హారర్ టచ్ లేదు. ఓ స్పెషల్ సాంగ్‌తోనే సరిపోయింది. కాగా ప్రస్తుతం తమన్నా ‘ఓదెల 2’ అనే మైథలాజికల్ హారర్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగసాధువు శివశక్తి పాత్రలో కనిపిస్తారు తమన్నా. హెబ్బా పటేల్, వశిష్ఠ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై డి. మధు ఈ నిర్మిస్తున్నారు. మరోవైపు గాంధారి కోటలోని రహస్యాలను కనిపెట్టే యువతి పాత్రలో నటించారు హన్సిక. ‘శ్రీ గాంధారీ’ సినిమా కోసం హన్సిక ఈ పాత్ర చేశారు. హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్ ఇతర కీలక పాత్రధారులు. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా సత్యం రాజేశ్ ‘పొలిమేర 3’, తిరువీర్ ‘మసూద 2’, వంటి హారర్ సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. మరికొందరు యువ దర్శకులు కూడా హారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. - ముసిమి శివాంజనేయులు -
‘రాజా సాబ్’ చూడాలంటే.. నా పక్కన ఒకరు ఉండాల్సిందే: నిధీ అగర్వాల్
‘‘నేను తెలుగు బాగా మాట్లాడగలను. కేవలం ‘అందరికీ నమస్కారం’ అనే బ్యాచ్ కాదు’’ అన్నారు హీరోయిన్ నిధీ అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో ‘రాజా సాబ్’, పవన్ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ సమయం కుదిరినప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేని నిధీ అగర్వాల్ చాలా విరామం తర్వాత ‘ఆస్క్ నిధి’ పేరుతో నెటిజన్లతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కెరీర్, వ్యక్తిగత విషయాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. మీకు తెలుగు మాట్లాడటం వస్తుందా మేడం? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘నాకు తెలుగు మాట్లాడటం బాగా వస్తుంది. కేవలం ‘అందరికీ నమస్కారం’ అంటూ జస్ట్ అలా మాట్లాడే బ్యాచ్ కాదు’’ అంటూ సూటిగా జవాబిచ్చారు. ‘తెలుగులో ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అనే మరో ప్రశ్నకు.. ‘‘నేను మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. మీకు బోర్ కొట్టకుండా మీ అభిమానం పొందే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నా. అయితే 2025లో తెలుగులో నేను నటించిన ఎక్కువ సినిమాలు విడుదలవుతాయి’’ అని చెప్పారు. ‘జీవితంలో ఏది చాలా ముఖ్యం అనుకుంటారు?’ అనే మరో ప్రశ్నకు ‘‘ప్రశాంతత’’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘ఓ నటిగా మీకు చాలా కష్టంగా అనిపించేది ఏంటి?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘‘పీఆర్ మెయింటేన్ చేయడం నాకు చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘మీకు హారర్ సినిమాలంటే ఇష్టమేనా? ఒంటరిగా కూర్చొని చూస్తారా?’ అనే ప్రశ్నకు ‘‘అస్సలు చూడలేను. నాతో పాటు ఎవరో ఒకరు ఉండాల్సిందే. ‘రాజా సాబ్’ (హారర్ నేపథ్యంలో రూపొందుతోంది) సినిమా చూడ్డానికి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో థియేటర్స్‌కి రండి’’ అని బదులిచ్చారు. అలాగే మరికొందరు నెటిజన్ల ప్రశ్నలకు నిధీ అగర్వాల్ స్పందిస్తూ– ‘‘ప్రభాస్‌గారితో కలిసి నటించిన ‘రాజా సాబ్’ సినిమా సెట్లో ఎంతో సరదాగా పని చేశాం. ఈ మూవీ టీమ్‌లో ఎంతో నిజాయతీ ఉంది. ‘హరి హర వీరమల్లు’ సెట్లో పవన్ కల్యాణ్‌గారితో ఇటీవల ఓ సెల్ఫీ తీసుకున్నాను... త్వరలోనే ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. రాబోయే నూతన సంవత్సరంలో నేను నటించిన ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీరమల్లు’ విడుదలవుతాయి.. ఆ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువవుతాను. ఆ రెండు చిత్రాలతో పాటు మరో సర్ప్రైజింగ్ మూవీ కూడా ఉంది.. త్వరలోనే ఆ మూవీ ప్రకటన కూడా వస్తుంది’’ అంటూ తెలిపారు నిధీ అగర్వాల్. -
మరో జన్మ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి: ది రాజాసాబ్ నటి
టాలీవుడ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై సీనియర్ నటి జరీనా వాహబ్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ తాజా చిత్రం ది రాజా సాబ్ గురించి ఆమె మాట్లాడారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో జరీనా వాహబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ తీరు గురించి ఆమె మాట్లాడారు. మరో జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నానని జరీనా వెల్లడించారు.జరీనా వాహబ్ మాట్లాడుతూ..' నేను ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ మూవీ చేస్తున్నా. ది రాజాసాబ్‌లో నటిస్తున్నా. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. మరో జన్మ ఉంటూ ఉంటే నాకు ఇద్దరు కొడుకులు ఉండాలి. అందులో తప్పకుండా ప్రభాస్ లాంటి కుమారుడు నాకు కావాలని కోరుకుంటా. అంత మంచి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. అతనొక స్టార్ అనే ఫీలింగ్ లేదు. సెట్లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలిస్తే షూటింగ్ సిబ్బందితో పాటు అందరికీ భోజనాలు ఇంటికి ఫోన్ చేసి మరి తెప్పిస్తాడు. ప్రభాస్ నిజమైన డార్లింగ్' అంటూ ప్రశంసలు కురిపించింది.ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. -
ప్రభాస్‌తో నయనతార ‘స్పెషల్’ స్టెప్పులు..?
స్పెషల్ సాంగ్.. బడా హీరోల సినిమాల్లో ఇది మరింత స్పెషల్ అయిపోయింది. సినిమాలో స్టార్ హీరోయిన్లు ఒకరిద్దరు ఉన్నపటికీ.. స్పెషల్ సాంగ్‌కి వచ్చేసరికి కచ్చితంగా మరో స్టార్ హీరోయిన్ని తీసుకొస్తున్నారు. మార్కెట్ లెక్కలేసి మరీ ఐటమ్ సాంగ్‌పై ప్రత్యేక దృష్టిపెడతున్నారు. హీరో రేంజ్‌కి తగ్గట్లుగా స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ డ్యాన్స్ చేయిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుండగా..ఇప్పుడు ప్రభాస్ కోసం మరో స్టార్ హీరోయిన్ ‘ప్రత్యేక’ స్టెప్పులేసేందుకు రెడీ అవుతోందట. ఆమే లేడీ సూపర్‌స్టార్ నయనతార.ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. మారుతి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉందట. దాని కోసం ఓ భారీ సెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అయితే ఈ స్పెషల్ సాంగ్‌ని మరింత స్పెషల్ చేసేందుకు నయనతారని బరిలోకి దింపబోతున్నారట. ఇప్పటికే ఈ పాట కోసం మారుతి నయనతారని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాట చేసేందుకు నయన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. గతంలో మారుతి తెరకెక్కించిన బాబు బంగారం సినిమాలో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పరిచయంతోనే రాజాసాబ్తో స్టెప్పులేసేందుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాగా, ప్రభాస్, నయన్ కలిసి గతంలో యోగి అనే సినిమాలో నటించారు. మళ్లీ చాలా కాలం తర్వాత ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది నయనతార. వీరిద్దరి కలయికలో రాబోతున్న స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. -
'రాజాసాబ్' కోసం సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్
మారుతి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజాసాబ్‌లో ఆరు పాటలు ఉంటాయని అందులో ఒకటి పాపులర్ రీమిక్స్ సాంగ్ ఉంటుందని తెలిపారు. దీంతో ఆ హిట్ సాంగ్ ఏదై ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది.భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదని ఆయన అన్నారు. ఈ చిత్రం స్కేల్‌ను కూడా ఎవరూ ఊహించలేరని ఆయన అన్నారు. అయితే, రాజాసాబ్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హిట్ సినిమా నుంచి ఒక పాటను రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన రైట్స్ కోసం కూడా ఆయన సుమారుగానే ఖర్చు చేసినట్లు టాక్. సంజయ్‌దత్ హీరోగా నటించిన 'ఇన్సాఫ్ అప్నే లాహూ సే' సినిమా నుంచి 'హవా హవా..' అనే సాంగ్‌ను డైరెక్టర్ మారుతి ఎంపిక చేసుకున్నారట. 1994లో వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ కోసం థమన్ ఆ పాటనే రీమిక్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ప్రభాస్ లుక్‌పై మంచి టాక్ వస్తుంది. 2025 సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా
సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుందంటే మిగతా ఏ ఇండస్ట్రీల్లోనూ ఆ టైమ్‌కి వేరే పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్‌కి పెట్టుకోరు. ఒకవేళ అలా కాదనుకుంటే షారుక్ 'డంకీ' మూవీకి అయినట్లు కలెక్షన్స్ డ్యామేజ్ అవ్వొచ్చు. కానీ తమిళ హీరో ధనుష్ మాత్రం తన కొత్త మూవీని 'రాజాసాబ్'కి పోటీగా బరిలో నిలబెట్టాడు.సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇందులో ఏ మార్పు ఉండకపోవచ్చు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఇకపోతే ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా 'ఇడ్లీ కడై' (ఇడ్లీ మాత్రమే). ఇప్పుడు ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 10నే థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ మూవీ అంటే తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రభాస్ మూవీ ఉంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. తమిళంలో మాత్రం థియేటర్ల, కలెక్షన్ దగ్గర 'రాజాసాబ్'కి ఇడ్లీ మూవీ వల్ల ఇబ్బంది ఉండొచ్చు.ధనుష్ అదే తేదీన తన మూవీ రిలీజ్ చేయడానికి కారణముందనే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఉగాది ఉన్నట్లే తమిళ న్యూ ఇయర్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఉంది. దీంతో ఆ లాంగ్ వీకెండే ధనుష్ టార్గెట్. ఇదంతా చూస్తుంటే 'రాజాసాబ్' రిలీజ్‌తోపాటు ధనుష్ మూవీ రిలీజ్ విషయంలోనూ మార్పు ఉండకపోయే అవకాశాలే ఎక్కువ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు హిట్ సినిమాలు.. ఏది ఎందులో?) -
ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురు చూశా: ది రాజాసాబ్ హీరోయిన్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ మోషన్ పోస్టర్ లుక్‌ను రివీల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. పుట్టినరోజున ది రాజాసాబ్ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. న్యూ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన అవకాశం రావడంపై స్పందించింది. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని తెలిపింది. తెలుగులో నా మొదటి సినిమానే ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మాళవిక ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. ఇటీవల తంగలాన్ మూవీతో అలరించిన మాళవిక మోహనన్.. ది రాజాసాబ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో మొదటి సినిమానే రెబల్ స్టార్‌తో కలిసి నటించడం ఈ ముద్దుగుమ్మకు కలిసి వస్తుందేమో వేచి చూడాల్సిందే. ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈ ఏడాదిలో యుద్రా సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది తంగలాన్ బ్యూటీ. -
‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!
‘ది రాజాసాబ్’ అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘ది రాజాసాబ్’. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని చేతిలో సిగార్ పటుకొని మహారాజులా కూర్చున్నాడు. మొత్తంగా ఈ సినిమాలో ప్రభాస్‌ని ఓ డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నట్లు మోషన్ పోస్టర్‌తో చెప్పేశాడు డైరెక్టర్ మారుతి. (చదవండి: ఒకే ఒక మాటతో ట్రెండింగ్‌లోకి వచ్చేసిన ‘స్పిరిట్’)ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
ట్రెండింగ్‌లో ‘స్పిరిట్’.. రూమర్సే నిజమయ్యాయి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన ఒకవైపు ‘రాజాసాబ్’, మరోవైపు ‘ఫౌజీ’సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే అటు సందీప్, ఇటు ప్రభాస్ ఇద్దరూ వేరు వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుంటే యానిమల్ సినిమాతో సందీప్ ట్రెండ్ సెట్ చేశాడు. ఆ సినిమా సక్సెస్‌లో ఎక్కువ శాతం సందీప్ కష్టమే ఉంది. ప్రభాస్‌తో సందీప్ సినిమా అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్‌తో పాటు సాదారణ సినీ ప్రేక్షకుల్లోనూ ‘స్పిరిట్’పై ఆసక్తి పెరిగింది. ప్రభాస్‌ను తెరపై ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ పెరిగింది.అప్డేట్ ఇచ్చిన సందీప్స్పిరిట్ స్టోరీ ఇదేనంటూ గత కొన్నాళ్లుగా రకరకాల కథలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసుగా నటించబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న చర్చే కానీ.. మేకర్స్ మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అప్డేట్ ఇచ్చేశాడు. ప్రభాస్‌తో ఎలాంటి కథ చెప్పబోతున్నాడో చెప్పేశాడు.పోలీస్ స్టోరీతాజాగా ‘పొట్టేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి సందీప్ రెడ్డి వంగా గెస్ట్‌గా వెళ్లారు. ఈ క్రమంలో యాంకర్ సుమ ‘స్పిరిట్’ సినిమా అప్డేట్ ఇవ్వాలని కోరింది. దీంతో సందీప్ పలకపై ‘పోలీస్ స్టోరీ’ అని రాసి చూపించాడు. అయితే స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీసుగా కనిపించబోతున్నాడని గత కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని సందీప్ ధ్రువీకరించడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేకుండా పోయింది. ప్రభాస్ బర్త్‌డే(అక్టోబర్ 23) రోజు స్పిరిట్ అప్డేట్ రావడం సంతోషంగా ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం స్పిరిట్( #Spirit) ఎక్స్‌లో ట్రెండింగ్‌గా మారింది. దీంతో పాటు సలార్-2 (#Salaar2), ది రాజాసాబ్( #TheRajaSaab ) హాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. బర్త్ డే రోజే వచ్చేస్తున్నాడు!
రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న చిత్రం ది రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని తెగ ఆరా తీస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం ది రాజాసాబ్ టీమ్ అప్డేట్తో ముందుకొచ్చింది. మరో రెండు రోజుల్లో డార్లింగ్ బర్త్ డే కావడంతో డైరెక్టర్ మారుతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈనెల 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు బ్లాస్టింగ్ ఖాయమని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే అదే రోజున టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు ది రాజాసాబ్ టీమ్ రాయల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో రెబల్ స్టార్ న్యూ లుక్‌లో అదిరిపోయేలా కనిపించాడు.(ఇది చదవండి: ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్.. అది రెబల్ స్టార్ క్రేజ్!)ఇప్పటికే ది రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Swag turned up to the MAX 😎&Now….your Celebrations will go off in STYLE 😉 A ROYAL TREAT AWAITS on 23rd Oct 💥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/wEu31XSGFW— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024 -
‘రాజా సాబ్’ మేకింగ్ వీడియో చూశారా?
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ఫై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నేడు డైరెక్టర్ మారుతి బర్త్‌డే(అక్టోబర్ 8). ఈ సందర్భంగా రాజాసాబ్ మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: 'పుష్ప 2'.. ఫస్ట్ హాఫ్ అంతా రెడీ)ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగార్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.