‘ది రాజాసాబ్‌ 2’ కూడా ఉంది.. టైటిల్‌ ఇదే! | The Raja Saab 2: This Is Title Of Prabhas The Raja Saab Sequel | Sakshi
Sakshi News home page

‘ది రాజాసాబ్‌ 2’ లో జోకర్‌గా ప్రభాస్‌.. టైటిల్‌ ఇదే!

Jan 9 2026 7:15 AM | Updated on Jan 9 2026 9:43 AM

The Raja Saab 2: This Is Title Of Prabhas The Raja Saab Sequel

పాన్‌ ఇండియా సినిమాలకు  సీక్వెల్స్ ప్రకటించడం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ముఖ్యంగా ప్రభాస్‌ చిత్రాలన్నింటికి పార్ట్‌ 2 ప్రకటిస్తున్నారు.  ఇప్పటికే 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలకు సీక్వెల్‌ కథలు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి ‘ది రాజాసాబ్‌’ కూడా చేరింది. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'ది రాజాసాబ్' ఈరోజు(జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కొనసాగింపు కూడా ఉంది. 

( చదవండి: ది రాజాసాబ్‌ మూవీ రివ్యూ)

పార్ట్‌ 2కి ‘రాజాసాబ్‌ సర్కస్‌: 1935’గా టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఇందులో ప్రభాస్ జోకర్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు. రాజాసాబ్‌ సినిమా ఎండింగ్‌లో సీక్వెల్‌కి లీడ్‌ ఇస్తూ ప్రభాస్‌ లుక్‌ని పరిచయం చేశారు. ఇది సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కావచ్చనే చర్చ నడుస్తోంది. ట్రైలర్‌లో చూపించిన చాలా సన్నివేశాలు రాజాసాబ్‌లో చూపించలేదు. అవన్నీ పార్ట్‌ 2లో చూపించే అవకాశం ఉంది. 

'ది రాజాసాబ్'లో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో సీక్వెల్ ప్రకటన ఫ్యాన్స్‌కు ఊరట కలిగించింది.సీక్వెల్ వివరాలు, షూటింగ్ షెడ్యూల్ గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement