కథ వినగానే నిర్మించాలనుకున్నాం: సుకుమార్‌ | Director Sukumar Speaks About Vrushakarma Movie | Sakshi
Sakshi News home page

కథ వినగానే నిర్మించాలనుకున్నాం: సుకుమార్‌

Mar 7 2026 3:59 AM | Updated on Mar 7 2026 3:59 AM

Director Sukumar Speaks About Vrushakarma Movie

‘‘వృషకర్మ’ చిత్రకథని కార్తీక్‌ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. అప్పుడే ఈ సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. బాపినీడు, నేను కలిసి ఈ చిత్రం నిర్మించాలని డిసైడ్‌ అయ్యాం’’ అని డైరెక్టర్‌ సుకుమార్‌ తెలిపారు. నాగచైతన్య, మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ మూవీ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ బి. నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌పై సుకుమార్‌ ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ‘‘ఇండస్ట్రీకి దొరికిన బెస్ట్‌ టెక్నీషియన్‌ కార్తీక్‌.

అతను కథ చెప్పినప్పుడు విజువల్స్‌ ఇంత అద్భుతంగా వస్తాయని ఊహించలేదు... అద్భుతంగా చేశాడు. సంగీతదర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ ‘విరూపాక్ష’ మూవీకి చాలా హెల్ప్‌ అయ్యాడు. ‘వృషకర్మ’ని కూడా అతను ఎంతగా ఎలివేట్‌ చేస్తాడో నాకు తెలుసు. డీఓపీ రఘుల్‌ ఈ  ప్రాజెక్ట్‌లో చేరడంతో సినిమా కలర్‌ మారిపోయింది. నాగచైతన్య మొదటి నుంచి ఇన్వాల్‌ అవుతూ సినిమా అద్భుతంగా రావడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ప్రోడక్ట్‌ విషయంలో చాలా పాజిటివ్‌గా ఉన్నాను. అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అని సుకుమార్‌ పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement