యాక్షన్‌ భోగి | Sharwanand massy and intense look from Bhogi movie revealed | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ భోగి

Mar 7 2026 3:54 AM | Updated on Mar 7 2026 3:54 AM

Sharwanand massy and intense look from Bhogi movie revealed

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్‌ ఫెస్ట్‌’ అన్నది ట్యాగ్‌లైన్‌. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్‌ హయతి, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. కాగా శుక్రవారం (ఫిబ్రవరి 6) శర్వానంద్‌ బర్త్‌డే.

ఈ సందర్భంగా ‘భోగి’ మూవీ నుంచి ఆయన పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా భారీ పాన్‌–ఇండియా మూవీగా ‘భోగి’ రూపొందుతోంది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నాం.

ఈ చిత్రంలో శర్వానంద్‌ ఇప్పటివరకూ కనిపించని రస్టిక్, ఇంటెన్స్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్‌ ఇప్పటికే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఆగస్టు 28న రక్షా బంధన్‌ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.    

జిద్ధి జిద్ధి...:  శర్వానంద్‌ హీరోగా నటించిన చిత్రం ‘బైకర్‌’. అభిలాష్‌ కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించారు. విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. జిబ్రాన్‌ సంగీతం అందించారు. శర్వానంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ‘జిద్ధి జిద్ధి...’ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ పాటని జిబ్రాన్, షెన్బగరాజ్, అరవింద్‌ శ్రీనివాస్, సుదర్శన్‌ రామ్‌ పాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement