జాన్వీ కపూర్ బర్త్ డే.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్ | Ram Charan Special Wishes To Peddi actress Janhvi Kapoor | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: మా అచ్చియ్యమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. చెర్రీ స్పెషల్ విషెస్

Mar 7 2026 12:30 AM | Updated on Mar 7 2026 12:38 AM

Ram Charan Special Wishes To Peddi actress Janhvi Kapoor

పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌కు మెగా హీరో రామ్ చరణ్ బర్త్‌ డే విషెస్ తెలిపారు. పెద్ది మూవీ సెట్‌లో జాన్వీ కపూర్‌తో ఉన్న స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా సెట్స్‌ నుంచి కొన్ని ఆసక్తికరమైన సీన్స్‌ను చెర్రీ పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర 'అచ్చియమ్మ' గెటప్‌లో కనిపిస్తూ సందడి చేశారు.  ఆమెకు తన వృత్తి పట్ల ఆమెకున్న మక్కువ, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది.. ఈ ఏడాది తనకి మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్‌ డ్రామా పెద్ది. ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి సాంగ్ చికిరి చికిరి అభిమానులను  ఓ ఊపు ఊపేయగా.. ఇటీవల రిలీజైన రైరై రారా అంటూ సాగే పాట కూడా ‍అదే రేంజ్‌లో అలరిస్తోంది.

కాగా.. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement