ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు | Allu Sirish Knot With Nayanika today at hyderabad in grand wedding | Sakshi
Sakshi News home page

Allu Sirish: ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు

Mar 6 2026 10:15 PM | Updated on Mar 6 2026 10:19 PM

Allu Sirish Knot With Nayanika today at hyderabad in grand wedding

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. అల్లు అర్జున్‌ పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా.. అల్లు శిరీష్‌- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్‌ భార్య షాలినికి నయనిక బెస్ట్‌ ఫ్రెండ్‌ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్‌- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్‌ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. ‍అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement