Allu Sirish
-
మారండ్రా బాబూ.. మగవాళ్లు కూడా నగలేసుకోండి: శిరీష్
ఆభరణాలు అనగానే ఆడవాళ్లే గుర్తొస్తారు.. ఏ మగవాళ్లు ఎందుకు వేసుకోకూడదు? అంటున్నాడు కొత్త పెళ్లి కొడుకు అల్లు శిరీష్. ఇటీవలే శిరీష్ మనసుపడ్డ అమ్మాయిని మనువాడాడు. నిశ్చితార్థం దగ్గరి నుంచి పెళ్లి వరకు తనకు నచ్చినట్లుగా రెడీ అయ్యాడు. నెక్లెస్ ధరించాడు. హీరో విజయ్ దేవరకొండ కూడా తన పెళ్లిలో వెరైటీ ఆభరణాలు ధరించి హైలైట్ అయ్యాడు.ఎంగేజ్మెంట్ సమయంలో ట్రోలింగ్అయితే ఇలా బంగారు, వజ్రాభరణాలు ధరించడం వల్ల శిరీష్‌పై కొంత ట్రోలింగ్ జరగ్గా అప్పట్లోనే కౌంటర్ ఇచ్చాడు. తాజాగా మరోసారి తనపై జరిగిన ట్రోలింగ్‌పై స్పందించాడు. ఇప్పుడు ఆడ, మగ అని తేడాలు చూస్తున్నారు.. కానీ, అప్పట్లో మగవాళ్లు కూడా నగలు వేసుకున్నారు. వందేళ్ల క్రితం పురుషులకు, మహిళలకు కలిపే పర్ఫ్యూమ్స్ తయారు చేశారు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా..ఇప్పుడేమో అబ్బాయిలకు బ్లూ అని, అమ్మాయిలకు పింక్ ఫేవరెట్ అంటూ బేధాలు సృష్టించారు. అందుకే నన్ను ఎంత తిట్టుకున్నా సరే ఈ అడ్డుగోడల్ని కూల్చాలనే అనుకున్నాను. అయితే నా అభిప్రాయాల్ని నా చుట్టూ ఉన్న కొందరు అనుమానించారు. ఇప్పుడీ హారాలు వేసుకోవడం అవసరమా? అని ప్రశ్నించారు. ఎహె, ఊరుకోండి, మనం కూడా ట్రై చేయకపోతే ఇంకెవరు చేస్తారు? లేదంటే ఇంకో ఇరవై ఏళ్లు కూడా ఇలాగే ఉంటుంది అని బదులిచ్చాను. నేనే డిసైడ్ చేసుకుంటా..నా జీవితంలోని ప్రత్యేక సందర్భమైన పెళ్లి వేడుకలో నాకు నచ్చినట్లుగా రెడీ అయ్యాను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మగవాళ్లు ఎలా ఉండాలి? ఆడవాళ్లు ఎలా ఉండాలి? అని ఇతరులు నిర్ణయించాల్సిన పని లేదు. నేనేం ధరించాలనేది నాకు తెలుసు, ఇతరులు చెప్పనక్కర్లేదు అని శిరీష్ ముగించాడు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: ధురంధర్ 2 ఛాన్స్ వదిలేసుకున్న ప్రముఖ నటుడు -
పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 6న తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఈ జంట తమకు పుట్టబోయే పిల్లల గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. పుట్టబోయే పిల్లలను తెలుగులో మాట్లాడేలా పెంచాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీ గురించి వివరించాడు.అత్తయ్యకు దొరికిపోయాం..మేమిద్దరం ప్రేమలో ఉన్న విషయం మొదట మా అత్తయ్య(చిరంజీవి సతీమణి సురేఖ)కు తెలిసింది. మేమిద్దరం ఓ రోజు కాఫీ తాగేందుకు బయటకు వెళ్లాం. కాఫీ షాపులో మా అత్తయ్యకు తెలిసివాళ్లు కూడా ఉన్నారు. అది మాకు తెలియదు. మేము కాఫీతాగి బయటకు రాగానే.. వాళ్లు మా అత్తయ్యకు ఫోన్ చేసి చెప్పారు. అలా మా ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. నేను కూడా నయనికను ప్రేమిస్తున్నానే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.నయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు ఇష్టంనయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయానైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. నచ్చకపోతే ముఖం మీదనే నచ్చలేదని చెప్పెస్తుంది. నా సినిమాల్లో నచ్చిన విషయాలను షేర్ చేసుకునేది. పెళ్లికి ముందే మేము పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నాం. మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలనేది నా కోరిక. దీనిపై మేమిద్దరం చర్చించుకున్నాం’ అని శిరీష్ చెప్పుకొచ్చాడు. -
నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా..: అల్లు శిరీష్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అన్నావదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు (మార్చి 6న)న ప్రేయసి నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అప్పటినుంచి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నాడు.విలువైన సలహాతాజాగా తన పెళ్లికి ముందు అన్నయ్య ఇచ్చిన ఐడియా గురించి చెప్పుకొచ్చాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ.. కొన్ని విషయాలు స్వయంగా అనుభూతి చెందాలని అన్నయ్య, నాన్న భావిస్తారు. అందుకనే మనం అడగనంతవరకు వాళ్లు ఎటువంటి సలహాలు ఇవ్వరు. అయితే నా అన్న నాకో విలువైన సలహా ఇచ్చాడు. ఇవే జీవితంలో మధుర క్షణాలుకొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు. అన్నీ అనుకున్నట్లుగా జరగవు. ఫంక్షన్లో కరెక్ట్ సమయానికి దుస్తులు రాకపోవచ్చు, లేదంటే కాస్త ఆలస్యం అవొచ్చు.. అంతమాత్రానికి ఒత్తిడికి లోనవద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు.. వాటిని ఆస్వాదించు అని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు.లవ్స్టోరీతన లవ్‌స్టోరీ గురించి మాట్లాడుతూ.. నా కజిన్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి 2023 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన ఓ పార్టీలో మేమిద్దరం కలుసుకున్నాం. సరదాగా మాట్లాడుకున్నాం.. ఫ్రెండ్స్ అయిపోయాం. తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అయితే నయనిక సోదరి.. మా వదిన స్నేహ మంచి ఫ్రెండ్స్. సీరియస్ కాదేమోనని అనుమానంనావల్ల వారి స్నేహానికి ఆటంకం రాకూడదని భావించాను. అలాగే తను కూడా నేను యాక్టర్‌ను, నేను సీరియస్‌గా ప్రేమించడం లేదేమోనని భయపడింది. అయితే హీరో నితిన్ భార్య షాలిని తనకు మంచి స్నేహితురాలు. నాగురించి రెండు మంచి మాటలు చెప్పేసరికి ధైర్యం తెచ్చుకుంది. అలా గతేడాది అక్టోబర్‌లో డేటింగ్ మొదలుపెట్టాం అని శిరీష్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
నయనిక రెడ్డి అల్లు శిరీష్ పెళ్లిలో హైలెట్ 'శంకు చక్రం' మెహందీ డిజైన్
ఈసారి సెలబ్రిటీల జంట ట్రెండ్‌ని సెట్ చేయడం లేదు. వాళ్లే సరికొత్త ట్రెండ్‌ని సెట్ చేసేలా భారతీయ మూలాలను గౌరవించడం విశేషం. ఈ మార్చి 6న అల్లు శిరీష్ నయనిక రెడ్డీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అల్లు శిరీష్ చేతి మెహందీ అందర్నీ అమితంగా ఆకర్షించింది. మన సంస్కృతికో పాతుకపోయిన గోరింటాకు అంతరార్థాన్ని తెలియజెప్పేలా శిరీష్ చేతి మెహిందీ ఉంది. నిజంగానే మన భారతీయ సంప్రదాయంలో వధువరులను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. నారాయణుడకి తమ ఇంటి ఆడపిల్ల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని అందిస్తున్నాం అన్నట్లుగా కాళ్లు కడిగి మామగారు అల్లుడి చేతిలో పెడతారు. నారాయణ..మా లక్ష్మీకి ఇక నుంచి అన్ని నీవే అని చెబుతారు. ఆ నేపథ్యాన్ని ఇలా శిరీస్ చేతిపై ఉన్న మెహందీ డిజైన్ ద్వారా చెప్పకనేచెప్పారు. ఈ శంకు చక్రాలు ఎక్కువగా వైష్ణవులు తమ భుజాలపై ఛాతీపై ధరిస్తారు. అలాగే ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఇవి దర్శనిమిస్తాయి. నిజంగా ఆ వివాహ వేడుకలో నారయణుడిగా శిరీష్..లక్ష్మీదేవిగా నయనికలు అతిథులకు చూడచక్కని జంటలా కనువిందు చేశారు. ఇక్కడ శంఖం అనేది శుభ శుచికానికి, ధనానికి ప్రతీక అయితే..చక్రం మన జీవిత గమనానికి సంకేతం..ఇక మధ్యలో ఉండే తిరునామాలు..అందరిలోనూ ఉండే సర్వాంతర్మామి ఆ నారాయణుడి అని గొంతెత్తి చెప్పేలా చాలామంది వైష్ణవులు ముఖంపై ధరిస్తుంటారు. కాగా ఈ వివాహ వేడుకలో అల్లు శిరీష్ బంగారు రంగులో క్లిష్టమైన ఎంబ్రాయిడీ కలిగి న్న ఆఫ్ వైట్ సిల్క్ షేర్వానీని ఎంచుకోగా, నయనికా రెడ్డి బంగారం వెండి జర్దోజీ వర్క్‌తో అంకరించబడిన లావెండర్ రంగు పట్టు చీరను ఎంచుకుంది. దానికి అనుబంధంగా రూబీ, వజ్రాల నెక్లెస్‌లు, స్టేట్మెంట్ చెవిపోగులు, గాజులతో ముగ్ధమనోహరంగా ఉంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) (చదవండి: Arjun Saaniya Chandhoks wedding: సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!) -
మిమ్మల్ని కలిసే ఛాన్స్ రాలేదు.. ఆ ప్రేమని జీవితాంతం కొనసాగిస్తూ
అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. నయనిక మెడలో శుక్రవారం రాత్రి మూడు ముళ్లు వేశాడు. ఏడడుగులు నడిచాడు. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే నయనికతో పెళ్లి తర్వాత శిరీష్.. తొలిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈమె తండ్రి శరత్ చంద్రారెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)'మావయ్యా.. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ నేను ఇప్పుడు భార్యగా పిలుచుకునే ఆ మహిళని మీరు పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ భూమిపై నేను ఉన్నంత వరకు ఆ ప్రేమని నేను ఆమెకు అందిస్తాను' అని శిరీష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఆయన ఫొటోతో పాటు కొన్ని పెళ్లి ఫొటోలని కూడా షేర్ చేశాడు.శిరీష్ విషయానికొస్తే నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు. ఇతడి సోదరుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరో కాగా బాబీ నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు చేశారు. శిరీష్ కూడా హీరోగా పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. నయనిక విషయానికొస్తే.. హైదరాబాద్‌కి చెందిన ఈమెది బిజినెస్ ఫ్యామిలీ. ఈమె కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనే. వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ టైంలో శిరీష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
అల్లు వారి పెళ్లి సందడి..
-
హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
-
'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్‌ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్‌లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026 -
ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. -
నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్
అల్లు అర్జున్ సోదరుడు శిరీష్.. ఈ రోజే నయనికని పెళ్లి చేసుకోనున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగ్గా.. టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇకపోతే గురువారం, నయనిక ఇంట్లో పెళ్లి కూతురు వేడుక, పసుపు దంచడం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆ ఫొటోలని నయనిక తన సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం)నయనిక ఇంట్లో జరిగిన ఈ శుభకార్యానికి అల్లు అరవింద్, తన సతీమణి, అల్లు అర్జున్, స్నేహ కుటుంబం హాజరైంది. ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నయనిక అక్కాచెల్లితో పాటు కుటుంబ సభ్యులందరూ ఫొటోల్లో కనిపించారు. ప్రీ వెడ్డింగ్ పార్టీ, రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగినప్పటికీ వివాహం మాత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హడావుడి లేకుండా జరగనుంది.(ఇదీ చదవండి: విజయ్, శిరీష్ దారిలో టాలీవుడ్లో మరో హీరో ప్రేమ పెళ్లి) View this post on Instagram A post shared by Nayanika Reddy (@nayanika_reddy) -
'ప్రతి ఒక్కరికీ అల్లు కుటుంబం తరఫున కృతజ్ఞతలు'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌పై ట్వీట్ చేశారు. తన తమ్ముడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అందమైన జంటకు తమ ఆశీస్సులు కురిపించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు రావడం మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక వెడ్డింగ్ ఈ నెల 6న జరగనుంది. అంతకుముందే టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ఈనెల 2న గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అల్లు స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్లో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. We would like to thank everyone who attended the pre-wedding reception and showered their blessings on the lovely couple. To all those sending their wishes from across the world, our hearts are filled with gratitude.Thank you for all the love and warmth. ALLU FAMILY. pic.twitter.com/0AtL6oCYIu— Allu Arjun (@alluarjun) March 4, 2026 -
యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే
యాంకర్ సుమ గురించి తెలుసు. భర్త రాజీవ్ కనకాల గురించి తెలుసు. వీళ్ల కొడుకు రోషన్ కూడా రెండు సినిమాలు హీరోగా చేశాడు. ఇతడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొద్దిమందికి తెలుసు. కానీ సుమ కూతురు పెద్దగా బయట కనిపించదు. అలాంటిది ఇప్పుడు తల్లితో కలిసి అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే: హీరోయిన్ స్నేహ)టీవీ నటిగా కెరీర్ మొదలుపెట్టిన సుమ.. తర్వాత యాంకర్ అయిపోయింది. ఆ టైంలోనే నటుడు రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకుంది. రాజీవ్ నటుడిగానే అడపాదడపా మూవీస్ చేస్తుంటగా.. సుమ యాంకరింగ్‌తో ఇప్పటికీ బిజీగానే ఉంది. వీళ్లకు కొడుకు రోషన్, కూతురు మనస్విని ఉన్నారు. రోషన్.. బబుల్గమ్, మోగ్లీ అనే చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ అవి హిట్ అవ్వలేదు. కూతురు మనస్విని ప్రస్తుతం చదువుకుంటోంది. పెద్దగా సోషల్ మీడియాలోనూ ఎక్కడ కనిపించదు.ఇప్పుడు తల్లితో కలిసి అల్లు శిరీష్ రిసెప్షన్ వేడుకలో కనిపించడంతో సుమ కూతురు ఇంత పెద్దది అయిపోయిందా అని అనుకుంటున్నారు. సుమ అంత ఎత్తు కూడా ఉంది. మరి తల్లితండ్రి అన్నలానే ఇండస్ట్రీలోకి వస్తుందా? లేదా మరేదైనా ప్రొఫెషన్ ఎంచుకుంటుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
అల్లు శిరీష్ & నయనిక ప్రీ వెడ్డింగ్ వీడియోలు
-
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ, రాజకీయ ప్రముఖులు ( ఫోటోలు)
-
గ్రాండ్‌గా అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫొటోలు, వీడియోలు
స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు శిరీష్.. ఈ శుక్రవారం(మార్చి 06న) నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం(మార్చి 02) సాయంత్రం హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. దీనికి టాలీవుడ్ ప్రముఖులైన నాగార్జున, నాగచైతన్య, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అట్లీతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. The Akkineni family at #AlluSirish & #Nayanika’s Pre-Wedding Reception.#AlluArjunpic.twitter.com/HbwSFXAW7B— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026Legendary Brahmanandam Garu with Icon Star #AlluArjun💜At Pre Wedding Reception of #AlluSirish pic.twitter.com/TKvFEMcaZg— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026Gopichand at #AlluSirish Pre Wedding Reception #AlluArjun pic.twitter.com/oQSTeUk4eG— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026Lakshmi Manchu at #AlluSirish Pre Wedding Reception #AlluArjun #AlluSnehaReddy pic.twitter.com/QGtwefE6sN— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026 -
బాలీవుడ్‌తోనే మొదలైన కెరీర్.. ఫైనలియర్లో ఉన్నప్పుడు!
మరో నాలుగు రోజుల్లో అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పడనుంది. మార్చి 6న నయనిక మెడలో శిరీష్ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు, వేడుకలు జోరందుకున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు శిరీష్ కెరీర్ గురించి ఓ సారి చూసేద్దాం..బాలీవుడ్ మూవీతో కెరీర్ మొదలుప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ సంస్థాపకుడు అల్లు అరవింద్ చిన్న కుమారుడే అల్లు శిరీష్. అరవింద్ పెద్ద కుమారుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే శిరీష్ మాత్రం కొంతకాలంగా సినిమాల సంఖ్య తగ్గించేశాడు. శిరీష్ మూడేళ్ల వయసులో చిరంజీవి 'ప్రతిబంధ్' అనే హిందీ చిత్రంలో బాలనటుడిగా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 2013లో వచ్చిన గౌరవం సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా కంటే ముందుకొత్త జంట చిత్రంతో క్రేజ్ అందుకున్నాడు. శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ: అమెరికన్ బర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ, ఊర్వశివో రాక్షసివో సినిమాలు చేశాడు. 2024లో వచ్చిన బడ్డీ చిత్రంలో చివరిసారి కనిపించాడు. రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. అయితే 2013లో హీరోగా తన కెరీర్ మొదలవడానికే ముందే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విషయం చాలా తక్కువమందికే తెలుసు! కాకపోతే హీరోగా కాదు, నిర్మాతగా! హిందీ గజిని సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించాడు. ఆమిర్ ఖాన్‌కు అభిమానిఈ విషయాన్ని అల్లు శిరీష్ స్వయంగా వెల్లడించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ.. లగాన్, గులాం సినిమాలు చూశాక ఆమిర్ ఖాన్‌కు నేను పెద్ద అభిమాని అయిపోయాను. ఆయనతో కలిసి పని చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అలాంటిది గజిని హిందీ రీమేక్ నా చేతుల్లోకి వచ్చేసరికి నమ్మలేకపోయాను. అప్పుడు నేను కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాను. నాన్న నిర్మాతగా, నేను సహ నిర్మాతగా గజిని తెరకెక్కించాం.అదే ఎక్కువ ఇష్టంతమిళంలో తెరకెక్కిన గజిని సినిమా అంటే నాకు చాలా ఇష్టం. దాని హిందీ రీమేక్ మరింత బాగుండేలా జాగ్రత్తపడ్డాం. ఈ సినిమా కోసం పని చేసిన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. కాబట్టి నాకు హిందీ వర్షన్ అంటేన ఎక్కువ ఇష్టం అని పేర్కొన్నాడు. 2008లో వచ్చిన గజిని ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డుకెక్కింది. అలాగే భారతేశంలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన తొలి హిందీ మూవీగానూ చరిత్ర సృష్టించింది.చదవండి: చదువుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి.. స్పందించిన కమెడియన్ -
అల్లు ఫ్యామిలీలో పెళ్లి.. నయనిక సిస్టర్స్ ఫోటో వైరల్
టాలీవుడ్లో మరో పెళ్లి వేడుక మొదలైంది. సినీ నటుడు అల్లు శిరీష్, నయనికల వివాహం మార్చి 6న ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో కాబోయే కొత్తజంట కలిసి ఫోటోలు దిగారు. వాటిని ఎప్పటికప్పడు సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు అరవింద్ నివాసంలో పెళ్లి కొడుకు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో విజయ్, రష్మికలతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు.సోషల్‌మీడియాలో నయనిక సిస్టర్స్ ఫోటో వైరల్ అవుతుంది. అల్లు కుటుంబానికి కాబోయే కోడలు తన ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. త్రీ సిస్టర్స్ సూపర్ అంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు. సిస్టర్స్ వైబ్ అదిరింది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Nayanika Reddy (@nayanika_reddy) -
అల్లు అర్జున్ ఇంటికి విజయ్, రష్మిక జోడీ (ఫోటోలు)
-
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్
రీసెంట్‌గానే టాలీవుడ్‌కి చెందిన విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ వివాహం.. ఈ శుక్రవారం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. నయనిక అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. గత కొన్నిరోజులుగా బ్యాచిలర్ పార్టీ, కాక్టెయిల్ పార్టీలంటూ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు శిరీష్‌ని పెళ్లి కొడుకుగా తయారు చేసిన వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఈ పెళ్లి వేడుకలో అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేశారు. అలానే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ, నిహారిక తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పెళ్లయిన విజయ్ దేవరకొండ-రష్మిక కూడా ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఈ శుభకార్యంలో కనిపించారు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్-స్నేహ (ఫొటోలు)
-
అల్లు వారి పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎప్పుడంటే?
టాలీవుడ్ మరో పెళ్లి సంబురం మొదలు కానుంది. రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయిన వెంటనే మరో టాలీవుడ్ హీరో పెళ్లికి అంతా సిద్ధమైంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల దుబాయ్‌లో శిరీష్- నయనిక గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా అల్లు శిరీష్ తన పెళ్లి వేడుకకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశారు. అల్లు స్టూడియోస్‌లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయని వెల్లడించారు. మా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి సంతోషిస్తున్నామని అల్లు శిరీష్ పోస్ట్ చేశారు.కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. Nayanika & I are having an intimate wedding with family & friends on 6th March. We are excited to celebrate our Pre Wedding Celebrations with the Telugu film industry prestigiously at Allu Studios on the 2nd March.— Allu Sirish (@AlluSirish) February 26, 2026 -
బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)
-
అయ్యప్ప మాలలో చరణ్.. పార్టీ వివాదంపై శిరీష్ క్లారిటీ
అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. మార్చి 6న అల్లు శిరీష్-నయనికల వివాహం జరగనుంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ తన నివాసంలో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. అందులో రామ్ చరణ్- ఉపాసన దంపతులతో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. తర్వాత కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అయ్యప్పమాలలో ఉన్న రామ్ చరణ్ మద్యం పార్టీలో పాల్గొనడం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్ సమాధానం ఇచ్చారు.చరణ్ విషయంలో నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చారు. ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కు సమాధానంగా ఆయన రిప్లై ఇచ్చారు. పార్టీ ప్రారంభం కాకముందే రామ్ చరణ్ అక్కడికి వచ్చి వెళ్లిపోయారని అల్లు శిరీష్ చెప్పారు. ఆ సమయానికి అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణ లేదన్నారు. చరణ్ కూడా కేవలం హాల్ వరకు మాత్రమే పరిమితం అయ్యారని చెప్పుకొచ్చారు. తమకు శుభాకాంక్షలు చెప్పిన వెంటనే అక్కడి నుంచి తిరిగెళ్లిపోయారని గుర్తుచేశారు. ఆ తర్వాతనే అక్కడ పార్టీ మొదలైందని తెలిపారు. అయ్యప్ప స్వామి మాల పట్ల రామ్ చరణ్‌కు ఎంతటి భక్తి, శ్రద్ధలున్నాయో అందరికీ తెలుసని గుర్తుచేశారు. మాలలో ఉన్నప్పుడు బయట కనీసం నీళ్లు కూడా చరణ్ తీసుకోరని శిరీష్ తెలిపారు.సుమారు 20ఏళ్లగా అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి మాలలో రామ్ చరణ్ కనిపిస్తూనే ఉంటారని అందరికీ తెలిసిందే. ఏడాదిలో కనీసం 100రోజులకు పైగానే ఆయన భక్తి మార్గంలోనే ఉంటారు. అలా ఉండటం వల్ల తనను తాను క్రమశిక్షణగా ఉండటం కోసం ఆపై భక్తి మార్గంలో ఉండటం వల్ల మంచి జరుగుతుందని ఆయన గతంలో చెప్పారు. చరణ్ గురించి పూర్తి విషయాలు తెలీకుండానే ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా అభ్యంతరం తెలుపుతున్నారు.#AlluArjun recently hosted a private celebration exclusively for his close friends and inner circle, creating a warm and intimate atmosphere away from the public eye. The gathering was said to be filled with laughter, bonding, and heartfelt conversations among longtime… pic.twitter.com/M6YtWxTFe2— Australian Telugu Films (@AuTelugu_Films) February 23, 2026 -
పార్టీ టైమ్
అల్లు శిరీష్ – నయనికల వివాహం మార్చి 6న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఇటీవలే ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు అల్లు శిరీష్.సోదరుడి వివాహం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల కోసం అల్లు అర్జున్ తన నివాసంలో ఓ గ్రాండ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి రామ్‌చరణ్ దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. -
గ్రాండ్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఫుల్ జోష్‌లో హీరోయిన్స్ (ఫోటోలు)
-
అల్లు శిరీష్, నయనిక వాలెంటైన్స్ డే ఎలా జరుపుకున్నారంటే.. (ఫోటోలు)
-
మెగా ఫ్యామిలీకే తొలి శుభలేఖ.. చిరంజీవికి ఏమైంది?
అల్లు ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్.. నయనిక మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మార్చి 6న ఈ వివాహ కార్యక్రమం జరగనుంది. శిరీష్ అన్నవదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కూడా ఇదే కావడం విశేషం!పత్రికల పంపిణీఇప్పటికే దుబాయ్‌లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. రెండు రోజుల క్రితం పసుపు దంచే కార్యక్రమం జరిగింది. తాజాగా పెళ్లిపత్రికల పంపిణీని మొదలుపెట్టారు. మొదటి పత్రికను చిరంజీవి- సురేఖ దంపతులకు ఇచ్చారు. ఆ ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మెగాస్టార్‌కు గాయం?మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాం అంటూ ఫోటో షేర్ చేశాడు. అందులో చిరంజీవి దంపతులతో పాటు అల్లు అరవింద్- నిర్మల, శిరీష్ ఉన్నారు. అయితే ఫోటోలో మెగాస్టార్ షోల్డర్ బ్యాగ్ వేసుకుని కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైంది? సర్జరీ జరిగిందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.చదవండి: తిట్ల దండకం ఆపలేదు.. లాగిపెట్టి కొట్టా: బాలీవుడ్ హీరో -
కాబోయే భార్యకు ముద్దుపేరు.. వాలంటైన్స్ డే వీడియో
అల్లు వారి కుటుంబంలో పెళ్లి హడావుడి మొదలైపోయింది. బన్నీ సోదరుడు శిరీష్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనికతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. రెండు రోజుల క్రితమే పసుపు దంచుడు కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని శిరీష్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రేమకథ గురించి, కాబోయే భార్యతో క్యూట్ మూమెంట్స్ ఉన్న వీడియోని షేర్ చేశాడు.శిరీష్.. తనకు కాబోయే భార్య నయనికకు 'క్యూటేష్' అనే ముద్దుపేరు పెట్టుకున్నాడు. వీడియోలో అదే విషయాన్ని చూపించాడు. ప్రపంచం తమని కలిపిందని చెప్పుకొచ్చాడు. పారిస్ వీధుల్లో కొన్ని రొమాంటిక్ క్షణాల్ని చూపించడంతో పాటు నిశ్చితార్థానికి సంబంధించిన విజువల్స్‌ని చూపించాడు. ఇకపోతే మార్చి 6న శిరీష్-నయనిక పెళ్లి జరగనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)
-
అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్
అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ పెళ్లికి రెడీ అయిపోయాడు. నయనికతో మూడు ముళ్లు వేయనున్నాడు. గత నెలలో దుబాయిలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకోగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ ఇంట్లో పసుపు దంచుడు కార్యక్రమం గురువారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)సాధారణంగా హల్దీ పేరుతో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాటికి నో చెప్పిన శిరీష్.. ఇంట్లోనే సంప్రదాయబద్ధంగా పసుపు దంచుకునే కార్యక్రమం చేసుకున్నాడు. ఈ వేడుకలో బన్నీ సతీమణి స్నేహ, పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, మిగతా బంధువులు, పిల్లలు కనిపించారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
కాబోయే భార్యపై ముద్దుల వర్షం.. అల్లు శిరీష్ వీడియో
అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లికి రెడీ అయింది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. ఆరోజు అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కావడం విశేషం!బ్యాచిలర్ పార్టీపెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉండకపోతే ఎలా? సింగిల్ లైఫ్‌కు చెక్ పెట్టబోతున్నాడు కాబట్టి బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలిగా! అందుకే దుబాయ్‌లో శిరీష్- నయనిక గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఓ పడవలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాజాగా ఆ వీడియోను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో అల్లు అర్జున్, స్నేహతో పాటు మిగతా అందరూ నచ్చిన ఫుడ్ ఆస్వాదిస్తూ, డ్యాన్స్ చేస్తూ, ఫోటోలు దిగుతూ సంతోషంగా గడిపారు. శిరీష్ కాబోయే భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. దుబాయ్‌లో జనవరి 30, 31 తేదీల్లో ఈ సెలబ్రేషన్స్ జరిగాయన్నాడు శిరీష్.అలా మొదలైంది.2023 అక్టోబర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. వీరి పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక వచ్చింది. అదే పార్టీకి శిరీష్ కూడా వెళ్లగా.. అక్కడ నయనికను చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో పెద్దలు కూడా ప్రేమకు పచ్చజెండా ఊపారు. అలా ఈ ప్రేమకథ వచ్చే నెలలో పెళ్లిపుస్తకంగా మారనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: 36 తులాల బంగారం.. చెత్త శుభ్రం చేసే మహిళ కాళ్లు మొక్కిన నటుడు -
అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)
-
దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)
-
దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్
అల్లు కుటుంబంలో పెళ్లి సందడి. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్.. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరగ్గా.. మరికొన్ని రోజుల్లో వివాహ వేడుక గ్రాండ్‌గా జరగనుంది. దీంతో ఇప్పుడు అందరూ కలిసి బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నాడు. దీనికి దుబాయి వేదికగా నిలిచింది.(ఇదీ చదవండి: నిజంగా పెళ్లాన్ని అడిగినట్లే అడిగారు: శ్రీలీల)అల్లు శిరీష్, నయనికల బ్యాచిలరేట్ పార్టీ.. శనివారం రాత్రి దుబాయిలో జరిగింది. ఓ పడవలో వీళ్లంతా గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ అన్న బాబీ కూడా తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలని పోస్ట్ చేయగా.. బన్నీ భార్య స్నేహ కూడా పలు ఫొటోలని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'చరణ్' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం)#AlluSirish Pre Wedding shooting Dubai ♥️ pic.twitter.com/HFrY0ux2Rs— Swaasthi (@swaasthi) January 31, 2026 -
అల్లు శిరీష్ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ
నటుడు అల్లు శిరీష్ కొత్త ఏడాదిలో తను ప్రేమించిన ప్రియురాలు నయనికతో ఏడడుగులు వేయబోతున్నాడు. అక్టోబర్‌లో వారిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తన పెళ్లి తేదీని శిరీష్ ప్రకటించాడు. 2026 మార్చి 6న తన పెళ్లి జరుగుతుందని ఒక పాటతో చెప్పాడు. అల్లు అయాన్, ఆర్హలతో కలిసి చేసిన ఒక రీల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.సరదాగా ఉన్న ఆ వీడియోలో బాబాయ్ సంగీత్ ఎప్పుడు అంటూ అని వారు అడగ్గా.. మనం దక్షిణాది వాళ్లం కాబట్టి అలాంటి వేడుక ఉండదని శిరీష్ చెప్తాడు. కానీ, పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్- స్నేహారెడ్డిల వివాహం కూడా 2011 మార్చి 6నే జరిగింది. సెంటిమెంట్‌తో అదే తేదీని శిరీష్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.అల్లు శిరీష్- నయనిక స్నేహం మొదలైన కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. 2023లో వరుణ్‌తేజ్- లావణ్యల పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
మెడలో నెక్లెస్‌తో అల్లు శిరీష్.. కాబోయే భార్యతో..
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ తమ్ముడు, హీరో శిరీష్ (Allu Sirish) ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనిక వేలికి ఉంగరం తొడిగాడు. అక్టోబర్ 31న ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో అతడు వైట్ డ్రెస్సులో మెడకు నెక్లెస్‌తో కనిపించాడు. అటు నయనిక ఎరుపు రంగు లెహంగాలో, ముత్యాల దండతో మెరిసిపోయింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.శిరీష్ లవ్స్టోరీఅల్లు శిరీష్‌కు పెళ్లి చేయాలని అరవింద్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ, శిరీష్ ఓకే చెప్పాలిగా! అలాంటి సమయంలో (2023లో) వరుణ్‌తేజ్- లావణ్యల పెళ్లి జరిగింది. ఈ జంట కోసం హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది.శిరీష్ జర్నీ'గౌరవం' (2013) సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులే అందుకోవడంతో సినిమాలు తగ్గించేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి ఏ సినిమా రాలేదు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: నీళ్ల బాటిల్ రూ.100.. కాఫీ రూ.700.. సుప్రీంకోర్టు సీరియస్ -
నా పిల్లలకైనా చెప్పాలిగా.. లవ్‌స్టోరీ బయటపెట్టిన అల్లు శిరీష్
ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లయిపోయినట్లే! నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ (Allu Sirish)కు హైదరాబాద్‌కు చెందిన నయనికతో నిశ్చితార్థం జరిగింది. శుక్రవారం నాడు ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. శిరీష్-నయనికల ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.వరుణ్- లావణ్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలుఅయితే నయనిక ఎవరు? ఇది పెద్దలు కుదర్చిన సంబంధమా? లేక లవ్‌లో పడ్డారా? ఈ ప్రేమకహానీ ఎప్పుడు మొదలైంది? అని అభిమానులు నెట్టింట ఆరా తీస్తున్నారు. ఈ గందరగోళానికి ఫుల్స్టాప్ పెడుతూ నయనికతో పరిచయం- ప్రేమ గురించి ఓపెనయ్యాడు శిరీష్. నవంబర్ 1న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఎంగేజ్మెంట్లో వారితో కలిసిన దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు శిరీష్. అలా మొదలైందివరుణ్, లావణ్యకు రెండో పెళ్లి రోజు శుభాకాంక్షలు. 2023 అక్టోబర్‌లో మీ పెళ్లి జరిగేటప్పుడు హీరో నితిన్- షాలిని దంపతులు మీకోసం ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి షాలిని తన బెస్ట్ ఫ్రెండ్ నయనికను కూడా రమ్మని ఆహ్వానించింది. అలా ఆ సెలబ్రేషన్స్ జరుగుతున్న రోజు రాత్రి తొలిసారి నయనికను చూశాను. అప్పుడే తనను కలుసుకున్నాను.నా లవ్‌స్టోరీ పిల్లలకు చెప్తా..కట్ చేస్తే రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఫ్యూచర్లో నా పిల్లలు మీరెలా కలుసుకున్నారు నాన్న? అని అడిగితే ఇదిగో, ఇలా మీ అమ్మను కలిశా.. అని ఈ కహానీ అంతా చెప్తాను. నయనిక స్నేహితులకు కూడా పెద్ద థాంక్స్. మీ సర్కిల్లో నన్ను కలుపుకున్నందుకు, ఎంతో బాగా చూసుకున్నందుకు థాంక్స్ అని రాసుకొచ్చాడు. అంటే, వరుణ్-లావణ్యల మ్యారేజ్ సమయంలోనే శిరీష్ పెళ్లికి పునాది పడిందన్నమాట! నితిన్ భార్య ఇచ్చిన పార్టీతోనే శిరీష్‌కు లైఫ్ పార్ట్నర్ దొరికింది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish)చదవండి: షో ఇమేజ్ ఏం కాను? నాగ్ ఉగ్రరూపం.. మోకాళ్లపై కూర్చుని పవన్ వేడుకోలు -
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ -నయనిక ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
గ్రాండ్‌గా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు. ఫైనల్లీ ఎంగేజ్మెంట్ విత్ లవ్ ఆఫ్ మై లైఫ్ నయనిక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు అభినందనలు చెబుతున్నారు. కాగా ఇటీవలే వర్షం కారణంగా ఎంగేజ్మెంట్కు అటంకం కలిగిందని అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఇవాళ వాతావరణం అనుకూలించడంతో నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. కాగా.. అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్.. 'గౌరవం' (2013) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి మరే సినిమా రాలేదు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అందుకే పెళ్లీడు రాగానే వివాహం జరిపించాలని పెద్దలు ముచ్చటపడుతుంటారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా చిన్న కొడుకు విషయంలో అదే ఆశపడ్డాడు. అల్లు శిరీష్‌ను పెళ్లి చేసుకోమని పదేళ్లుగా బతిమాలాడుతున్నాడు. ఎట్టకేలకు తండ్రి మాటకు తలూపి మ్యారేజ్ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.ఈ మధ్యే గుడ్న్యూస్ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని ప్రకటించాడు శిరీష్ (Allu Sirish). తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసులోని మాట మీ అందరికీ చెప్తున్నా.. అక్టోబర్ 31న నయనికతో నా ఎంగేజ్మెంట్ జరుగుతోంది. నా పెళ్లి చూడాలని నానమ్మ ఎంతో ఆశపడింది. కానీ, ఆ కల నెరవేరకుండానే కన్నుమూసింది. తను మా మధ్య లేకపోయినా.. తన దీవెనలు ఎప్పుడూ మాకు అండగా ఉంటాయి అని శుభవార్త చెప్పాడు. దీపావళి సెలబ్రేషన్స్‌లో..అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్‌కు నయనిక సైతం హాజరైంది. ఆమె ఫోటోను పొరపాటున అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అప్పటికింకా శిరీష్.. తనకు కాబోయే భార్య ఫోటో రివీల్ చేయలేదని తెలిసి వెంటనే దాన్ని డిలీట్ చేసింది. ఫ్యామిలీ ఫోటోలో ఆమెను కట్ చేసి షేర్ చేసింది. రేపే నిశ్చితార్థం కావడంతో శిరీష్ కూడా ఆ పనులు చూసుకుంటున్నాడు.ఎంగేజ్మెంట్కు వర్షం ఆటంకంకానీ తుపాను ప్రభావం వల్ల వాతావరణంలో సడన్‌గా మార్పులొచ్చాయి. అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. శిరీష్ నిశ్చితార్థపు పనులకు సైతం ఈ వర్షాలు ఆటంకంగా మారాయి. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేసిన శిరీష్.. బయట ఎంగేజ్మెంట్ చేసుకుందామని ప్లాన్ చేశాం. కానీ, వాతావరణం.. దేవుడి ప్లాన్స్ మరోలా ఉన్నాయి అని రాసుకొచ్చాడు. అందులో నిశ్చితార్థపు వేదిక తడిసిముద్దయినట్లు కనిపిస్తోంది.సినిమాఅల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్.. 'గౌరవం' (2013) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి మరే సినిమా రాలేదు.చదవండి: ప్రియాంక మెడలో కొండచిలువ.. భయమనేదే లేదు! -
పొరపాటున శిరీష్‌కు కాబోయే సతీమణి ఫోటో షేర్ చేసిన 'అల్లు స్నేహ'
నటుడు అల్లు శిరీష్(Allu Sirish) కొద్దిరోజుల క్రితం తన వివాహం గురించి ఒక పోస్ట్ చేశారు. అక్టోబర్ 31న నయనికతో నిశ్చితార్థం చేసుకోనున్నట్లు చెప్పారు. అయితే, తను ఫోటోను మాత్రం ఆయన రివీల్ చేయలేదు. కానీ, దీపావళీ పండుగ సందర్భంగా అల్లు కుటుంబం మొత్తం ఒకచోట చేరి ఘనంగా జరుపుకుంది. ఈ క్రమంలో శిరీష్ వదిన అల్లు స్నేహ ఫ్యామిలీ ఫోటోలను సోషల్‌మీడియాలో పంచకున్నారు. పొరపాటున నయనిక ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. తర్వాత అసలు విషయం గుర్తించిన ఆమె ఆ ఫోటోను కాస్త సైడ్ చేసి ఉంచారు. ఇంతలో నెటిజన్లు డౌన్లోడ్ చేసి శుభాకాంక్షలు చెబుతూ నెట్టింట షేర్ చేస్తున్నారు.నయనిక అల్లు కుటుంబంతో దీపావళి వేడుకలో మొదటిసారి కనిపించారు. ఆ ఫోటోలో అల్లు అర్జున్, అల్లు అరవింద్, స్నేహ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు అందరు ఉన్నారు. నయనిక తన కాబోయే భర్త పక్కన కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఫోటోలను వారు వెంటనే తొలగించినప్పటికీ, నెటిజన్లు వాటిని వైరల్ చేశారు. అయితే, అల్లు కుటుంబం ఆమెను అధికారికంగా ఎప్పుడు పరిచయం చేస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన నయనికతో శిరీష్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వారు పెళ్లి పీటలెక్కుతున్నారు. అక్టోబర్ 31న నిశ్చితార్థం జరగనుంది. డిసెంబరులో విదేశాల్లో వివాహ వేడుక జరగనుందని సమాచారం. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
త్వరలో అల్లు శిరీష్ నిశ్చితార్థం.. అధికారిక ప్రకటన
అల్లు వారి ఇంట్లో శుభకార్యం. బన్నీ సోదరుడు, హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ మధ్యనే మూడు నాలుగు రోజుల క్రితం శిరీష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఇన్ స్టాలో ఫొటోలు పోస్ట్ చేశాడు. నయనిక అనే అమ్మాయితో తన ఎంగేజ్మెంట్ జరగనుందని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కురుక్షేత్ర'.. ట్రైలర్ రిలీజ్)'మా తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసుకు సంబంధించిన ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నయనికతో నాకు నిశ్చితార్థం అక్టోబరు 31న జరగనుంది. కొన్నాళ్ల క్రితమే చనిపోయిన మా నానమ్మ నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కోరుకునేది. ఇప్పుడు ఆమె మా మధ్య లేనప్పటికీ పైనుంచి ఆశీర్వదాలు కచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను' అని శిరీష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.అల్లు అరవింద్ కొడుకుగా అందరికీ తెలిసిన శిరీష్.. 'గౌరవం' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా కొత్త ప్రాజెక్టులు చేయట్లేదు. దీంతో ఏం చేస్తున్నాడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. (ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడా?
అల్లు ఫ్యామిలీలో రాబోయే కొన్ని నెలల్లో పెళ్లి జరగబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. బన్నీ సోదరుడు శిరీష్.. ప్రస్తుతం కొత్తగా సినిమాలేం చేయట్లేదు. చివరగా గతేడాది 'బడ్డీ' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తర్వాత నుంచి అటు ఇండస్ట్రీలో గానీ ఇటు సోషల్ మీడియాలో గానీ పెద్దగా యాక్టివ్‌గా లేడు. అలాంటిది ఇప్పుడు ఇతడు త్వరలో వివాహం చేసుకోనున్నాడని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))హైదరాబాద్‌కి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ కుమార్తెతో శిరీష్‌కి పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారని.. ఇంతలో అల్లు అరవింద్ తల్లి కనకరత్నం చనిపోవడంతో ఇది కాస్త వాయిదా పడిందని వినిపిస్తుంది. వెంటనే కానప్పటికీ రాబోయే కొన్ని నెలల్లో అల్లు ఫ్యామిలీ నుంచి శుభవార్త అయితే రానుందనే టాక్ వినిపిస్తుంది.మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. తండ్రులు కూడా అయిపోయారు. నిహారిక వివాహం చేసుకుంది కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నారు. వీళ్లలో ఇప్పుడు శిరీష్.. పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 11 ఏళ్లలో మూడే సినిమాలు.. అసలు ఎవరీ సుజిత్?) -
ఈ హీరోలు అసలెక్కడున్నారు? సినిమాలు ఎందుకు చేయట్లేదు?
సినిమాల్లో హిట్ కొట్టినంత ఈజీ కాదు క్రేజ్‌ని నిలబెట్టుకోవడం. స్టార్ హీరోలకు పర్లేదు, మూడు నాలుగు ఫ్లాప్స్ పడినా సరే కొత్త ప్రాజెక్టులు వస్తాయి. యంగ్ హీరోల పరిస్థితి అలా ఉండదు. మూవీ ఫెయిలైందంటే తర్వాత దినదిన గండమే. దర్శక నిర్మాతలు కూడా వీళ్లని లైట్ తీసుకుంటారు. రీసెంట్ టైంలో అలా కొందరు హీరోలు పూర్తిగా స్క్రీన్‌పై కనిపించట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఇంతకీ అలాంటి హీరోలు ఎవరు? అసలెక్కడున్నారు? ఏం చేస్తున్నారు?(ఇదీ చదవండి: కొత్తింట్లో అడుగుపెట్టిన వరుణ్ సందేశ్-వితిక)మెగా ఫ్యామిలీలోనే ఇద్దరు హీరోల చేతిలో ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు లేవు. 'ఉప్పెన'తో హిట్ కొట్టి, ఎంట్రీతోనే రూ.100 కోట్ల కలెక్షన్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలియదు. 'ఉప్పెన' తర్వాత మూడు మూవీస్ చేస్తే అవన్నీ ఫ్లాప్. చివరగా 2023 నవంబరులో 'ఆదికేశవ'తో వచ్చాడు. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా హీరోగా ప్రయత్నిస్తున్నాడు గానీ వర్కౌట్ అవట్లేదు. గతేడాది ఆగస్టులో 'బడ్డీ' అనే మూవీతో చివరగా కనిపించాడు. అప్పటినుంచి ఇతడు కూడా సైలెంట్. ప్రస్తుతానికైతే శిరీష్.. ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తోంది.'ఆర్ఎక్స్ 100'తో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ.. తర్వాత కూడా పలు సినిమాలు చేశాడు. మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. కారణమేంటో తెలీదు గానీ గతేడాది రిలీజైన 'భజే వాయువేగం' మూవీ తర్వాత నుంచి సైలెంట్. ప్రస్తుతం ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నాడని తెలుస్తోంది. మరి కొత్త మూవీ అప్డేట్ ఎప్పుడు ఇస్తాడో?ప్రముఖ దర్శకనిర్మాత ఎమ్ఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. 'కేరింత' ఇతడికి గుర్తింపు తీసుకొచ్చింది. కానీ తర్వాత పెద్దగా మూవీస్ వర్కౌట్ కాలేదు. దీంతో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయాడు. ప్రస్తుతానికైతే హీరోగా సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉన్నట్లు కనిపించట్లేదు.90స్లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ కూడా ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. ప్రస్తుతం బిజినెస్ చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు మాత్రం పోస్ట్ చేస్తుంటాడు. వీళ్లతో పాటు అల్లరి నరేశ్ సోదరుడు రాజేశ్ కూడా 'సొంతం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇతడు కూడా సినిమాలకు పూర్తిగా దూరమైపోయి, బిజినెస్‌లోకి ఎంటరైనట్లు తెలుస్తోంది. అప్పట్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు కూడా కొన్నాళ్ల క్రితం నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్, రవితేజ సినిమాల్లో నటించాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పేసినట్లు కనిపిస్తోంది.వీళ్లే కాదు ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచన చాలా మారిపోయింది. సమ్‌థింగ్ స్పెషల్ ఉండే సినిమాలకు మాత్రమే వస్తున్నారు. ఇలాంటి వాటినే ఆదరిస్తున్నారు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం చాలామంది మిడ్ రేంజ్ హీరోలు కూడా రాబోయే కొన్నాళ్లలో ఇంటికే పరిమితమైపోయిన ఆశ్యర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: 'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి) -
బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!
‘మనం బొజ్జలనే కాదు.. అందమైన ఆకృతితో కూడిన కండలను పెంచగలం.. అయితే దీనికి సరైన సమయంలో సరైన మార్గనిర్దేశం అవసరం. అప్పుడే సాధన ఫలితాలనిస్తుంది.. కండలు పెంచేందుకు జెనిటిక్స్‌తో ఎలాంటి సంబంధం లేదు. బాడీ బిల్డింగ్‌పై ఉన్న అపోహలు, తెరలు తొలగిపోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో మనం సత్తా చూపించగలం’ అని సినీనటుడు అల్లు శిరీష్ అన అభిప్రాయాన్ని వెల్లడించారు. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్‌లో ‘డెక్కన్ అప్రైజింగ్–2025 పేరిట ఐసీఎన్ (ఐ కాంపీట్ నేచురల్) సంస్థ నిర్వహించిన సహజసిద్ధ శరీర దృఢత్వ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను, నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం ఫిట్‌నెస్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుర్తింపు అవసరం.. ప్రపంచస్థాయిలో బాడీ బిల్డింగ్‌కి మంచి గుర్తింపు ఉంది. ఇందులో రాణించిన అథ్లెట్లు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మన దేశంలో మాత్రం బాడీ బిల్డర్లు కోచ్‌లుగా మాత్రమే మిగిలిపోతున్నారు. క్రికెట్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు మన దేశంలో ఇచ్చిన ప్రాధాన్యత బాడీబిల్డింగ్కు కూడా దక్కేలా చర్యలు తీసుకోవాలి. అనేక అపోహలు.. శరీర దారుఢ్యానికి మందులు, స్టిరాయిడ్లు వాడతారనే అపోహల కారణంగా చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. అవేవీ అవసరం లేకుండా కూడా సరైన సమయంలో సరైన కోచ్ ద్వారా శిక్షణ తీసుకుని సాధన చేస్తే అంతర్జాతీయ అథ్లెట్లను తయారు చేసుకోవచ్చు.. ఐసీఎన్ లాంటి సంస్థలు ఆ దిశగానే కృషి చేస్తున్నాయి.. అందుకే ఎంతో ఇష్టంతో గత రెండేళ్లుగా ఇక్కడికి వచ్చి అథ్లెట్లను ప్రొత్సహిస్తున్నాను. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు వందల మంది యువత ఈ పోటీల్లో పాల్గొన్న తీరు చూస్తుంటే మన వద్ద కూడా ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నాకు తగ్గ కథ వస్తే..కండలు పెంచేందుకు జన్యుపరమైన సంబంధాలేవీ లేవు. ఫిట్‌నెస్‌కు రాంగ్‌రూట్, షార్ట్‌కట్స్ ఎంత మాత్రం సరైంది కాదు. శరీర తత్వం బట్టి బొజ్జలు వస్తాయనే ప్రచారం సరికాదు. సహజంగానే ఫిట్నెస్ అంటే నాకు ఎంతో ఇష్టం. నా ఎత్తు, బరువు, ఆకృతికి అనువైన మంచి స్పోర్ట్స్ కథ వస్తే అలాంటి సినీమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పటి వరకూ వచ్చిన క్రికెట్, రన్నింగ్, ఫుట్‌బాల్ వంటి కథలు కాకుండా కొత్తగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!) -
పదేళ్లుగా పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు.. కానీ
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలామంది యువత పెళ్లంటే పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ తమ్ముడిని కూడా పదేళ్లుగా పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు అడుగుతున్నా సరే నో చెబుతున్నాడట. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా శిరీష్ బయటపెట్టాడు.అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శిరీష్.. గమనం, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు తదితర సినిమాలు చేశాడు. చివరగా 'బడ్డీ' అనే మూవీలో కనిపించాడు. ప్రస్తుతానికైతే మూవీస్ చేయట్లేదు. గతంలో కలిసి పనిచేసిన ఓ హీరోయిన్ తో శిరీష్ రిలేషన్ లో ఉన్నాడనే రూమర్స్ వచ్చాయి గానీ తర్వాత పెద్దగా సౌండ్ లేదు. మళ్లీ ఇన్నాళ్లకు తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు.(ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాత కూతురి పెళ్లి.. 15 వేలమంది గెస్టులు) అల్లు అరవింద్ నిర్మిచిన #సింగిల్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది నిర్వహించారు. దీనికి హాజరైన శిరీష్ ని పెళ్లెప్పుడు చేసుకుంటారు, ఇప్పటివరకు ఎందుకు చేసుకోవట్లేదని యాంకర్ సుమ అడిగింది. దీనికి సమాధానంగా..'మా ఇంట్లో వాళ్ల కన్నా మీరే ఎక్కువ అడుగుతున్నారు. మీరెప్పుడు కలిసినా నన్ను ఇదే అడుగుతున్నారు. సంబంధం చూస్తారా ఏంటి?' అని అన్నాడు. దీనికి కౌంటర్ గా పక్కనే కూర్చున్న అల్లు అరవింద్.. పదేళ్ల నుంచి చేసుకోమని బతిమాలాడుతున్నా సరే చేసుకోవట్లేదని చెప్పుకొచ్చారు.దీంతో శిరీష్ మాట్లాడుతూ.. పెళ్లయిన నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, మీ లైఫ్ ఎలా ఉంది? నన్ను కూడా చేసుకోమంటారా అని అడిగితే చేసుకోవద్దు, సింగిల్ గానే లైఫ్ బాగుంటుందని సలహా ఇస్తున్నారని చెప్పుకొచ్చాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన సుమ.. నేను పెళ్లి చేసుకోను అని అన్నవాళ్లంతా ఏదో ఓ రోజు చేసుకోవాల్సిందే, మీరు చేసుకుంటారు అప్పుడు నేను వస్తానని నవ్వేసి వెళ్లిపోయింది. ఇదంతా చూస్తుంటే శిరీష్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడేమో అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్) -
అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్
ఒకప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా ఒకే కుటుంబంలా ఉండేది. ఏ పండగ వచ్చినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. కానీ రానురానూ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. అది ఇటీవల తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో హీరో రామ్‌చరణ్ (Ram Charan) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ వరుసకు బావ, బావమరిది అవుతారు. బంధువులుగా కంటే స్నేహితుల్లానే ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవారు. అన్‌ఫాలో చేసిన చరణ్?సడన్‌గా ఏమైందో ఏమో కానీ బన్నీని రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. రామ్‌చరణ్ అన్‌ఫాలో చేసినప్పటికీ అతడి భార్య ఉపాసన మాత్రం ఫాలో అవుతోంది. చరణ్ కంటే ముందు మెగా మేనల్లుడు, హీరో సాయిదుర్గ తేజ్ అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేశాడు. బన్నీని వదిలేసిన చరణ్.. అల్లు శిరీష్ (Allu Sirish)ను మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం. అటు అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం తన భార్య స్నేహారెడ్డిని మాత్రమే అనుసరిస్తున్నాడు.దూరమవుతున్న బంధం?ఏపీ ఎన్నికల సమయం నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య సరైన సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇటీవల తండేల్ (Thandel Movie) ఈవెంట్లోనూ అల్లు అరవింద్.. చరణ్ ఫస్ట్ సినిమా యావరేజ్ కంటే తక్కువే ఆడిందని కామెంట్స్ చేశాడు. ఒక్క వారంలోనే దిల్‌రాజు నష్టాలు చూశాడంటూ.. గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. దీనిపై ట్రోలింగ్ జరగడంతో అల్లు అరవింద్ వివరణ ఇచ్చాడు. రామ్‌చరణ్ తన ఏకైక మేనల్లుడని, తనకు కొడుకులాంటివాడని పేర్కొన్నాడు. ఈ గొడవకు ఫుల్స్టాప్ పెట్టాలని కోరాడు.చదవండి: చరణ్‌కు ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉంది: చిరంజీవి -
'పుష్ప-2కు ఇంటర్నేషనల్ క్రేజ్'.. తమ్ముడి ట్వీట్ వైరల్!
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీపై ఐకాన్ స్టార్ తమ్ముడు అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి.. ఓటీటీలోనూ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దాదాపు ఏడు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పుష్ప-2 చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆదరిస్తున్నందుకు అల్లు శిరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మీ సంస్కృతికి.. అంతగా పరిచయం లేని చాలా భిన్నమైన ఇలాంటి చిత్రానికి ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. క్లైమాక్స్ సీన్‌పై ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ స్పందించడం అద్భుతమని పోస్ట్ చేశారు.సుకుమారా- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప- 2 ది రూల్ జనవరి 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్రలో మెప్పించారు. టాలీవుడ్ నుంచి జగపతి బాబు, సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. I am glad the Pushpa 2 is receiving insane love from Western audience as well. Esp for a film like this which is vastly different from their culture or something they're not too familiar with.. @alluarjun @aryasukku @ThisIsDSP @MythriOfficial https://t.co/KprBKRPluw— Allu Sirish (@AlluSirish) February 4, 2025 -
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు.. ఫోటోలు వైరల్
-
ఓటీటీలో అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమా
టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ' బడ్డీ'. ఆగష్టు 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తమిళ్లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.బడ్డీ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలనుకున్న అల్లు శిరీష్‌కు థియేటర్లో నిరాశే మిగిలింది. ఇప్పుడు ఓటీటీలో అయినా మెప్పిస్తాడేమో చూడాల్సి ఉంది. ఆగష్టు 30న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.బడ్డీ కథ ఇదేఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్‌కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
Buddy Movie Review: అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమా రివ్యూ
టైటిల్: బడ్డీనటీనటులు: అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ తదితరులుదర్శకత్వం: శామ్ ఆంటోన్ నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజాసంగీతం : హిప్ హాప్ తమిళవిడుదల తేది: 02-08-2024టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ' బడ్డీ'. 2022లో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో పలకరించిన శిరీష్ సుమారు రెండేళ్ల తర్వాత వెండితెరపై మెరిశాడు. అయితే, ఈసారి రీమేక్ సినిమాతో వచ్చాడు. తమిళ్లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ బడ్డీ సక్సెస్ అయ్యాడా..? అల్లు శిరీష్ సినీ ప్రియుల్ని ఏ మేరకు అలరించాడో తెలుసుకుందాం.కథ...ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్‌కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? పల్లవి కిడ్నాప్‌కి.. హాంగ్ కాంగ్లో ఉన్న డాక్టర్ అర్జున్ (అజ్మల్ అమీర్)కి ఉన్న సంబంధం ఏంటి? టెడ్డీబేర్‌లో ఆత్మ ఉందని తెలిసిన తర్వాత ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరకు పల్లవిని ఎలా రక్షించాడా..? లేదా..? అనేదే మిగతా కథఎలా ఉందంటే..?అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంతో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. బడ్డీ సినిమా నేపథ్యం కూడా అదే. అయితే ఓ బొమ్మకు ప్రాణం రావడం అనే పాయింట్ కొత్తగా త్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన టెడ్డీకి తెలుగు రీమేక్. అయితే బొమ్మలోకి ఆత్మ రావడం అనే ఒక పాయింట్ మాత్రమే ఆ సినిమా నుంచి తీసుకొని మిగతాదంతా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి తెరకెక్కించాడు. దర్శకుడు మార్చిన అంశాలు బాగున్నప్పటికీ వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో తడబడ్డాడు.అవయవాల అక్రమ కార్యకలాపాలు సాగించే డాక్టర్ అర్జున్ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు. ఆపై వెంటనే పల్లవి (గాయత్రి భరద్వాజ్) కోమాలోకి వెళ్లడం.. అనంతరం ఆమె జీవితంలోకి టెడ్డీబేర్ రావడం వంటి సీన్లు మెప్పిస్తాయి. అయితే, టెడ్డీ బేర్‌కు ప్రాణం వచ్చి రోడ్ మీద తిరుగుతుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు లేదా భయపడుతారు. కానీ, ఇందులో అలాంటివి ఏవీ జరగవు. పైగా సెల్పీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. అది ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదు. అయితే చిన్ని పిల్లలకు కాస్త ఆసక్తిని కలిగించవచ్చు.సెకండాఫ్‌లో కథ అంతా హాంకాంగ్‌కు షిఫ్ట్ అయిపోతుంది. పల్లవి కోసం వెతుక్కుంటూ అల్లు శిరీష్ అక్కడికి చేరుకుంటాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వచ్చే యాక్షన్ సీన్ పర్వాలేదనిపిస్తుంది. మిషన్ గన్ తో టెడ్డీబేర్ చేసే యాక్షన్ సీన్ నవ్వులు పూస్తాయి. ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథ సాగదీతిగా అనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..పైలట్ ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశారు. పల్లవిగా గాయత్రి భరద్వాజ్ చక్కగా నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. విలన్‌గా అజ్మల్ ఎంట్రీ పవర్ ఫుల్‌గా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత సింపుల్‌గా అనిపిస్తుంది. ప్రిషా సింగ్ అలీ, ముకేష్ రిషితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. హిప్ హాప్ తమిళ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
అందుకే నా సినిమాలు లేట్ అవుతున్నాయి: హీరో అల్లు శిరీష్
‘బడ్డీ’ పోస్టర్ రిలీజ్ నుంచి ఇది రీమేక్ అని కామెంట్స్ వచ్చాయి. ఇదిస్ట్రైట్ ఫిల్మ్ అని చెప్పడమే మాకు పెద్ద సవాల్ గా మారింది. ఎంత చెప్పినా ఇది రీమేక్ అనే రాస్తున్నారు. అలాంటి వాళ్లను మనం మార్చలేం, వారికి మొత్తం సినిమా చూపెట్టి ప్రూవ్ చేయలేం కదా. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లకే తెలుస్తుంది "బడ్డీ" స్ట్రైట్ ఫిలిం అని. ఈ మూవీ క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’అన్నారు హీరో అల్లు శిరీష్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 2న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో అల్లు శిరీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ ‘బడ్డీ’ మూవీని లాస్ట్ ఇయర్ మార్చి లో మొదలుపెట్టి జూలైలో సినిమా కంప్లీట్ చేశాం. డిసెంబర్ లోనే రిలీజ్ కు తీసుకురావాలని అనుకున్నాం. నా మూవీస్ కు గ్యాప్ వస్తోంది. ఫాస్ట్ గా చేసి డిసెంబర్ 31 సక్సెస్ పార్టీ చేసుకోవాలని నేనూ నిర్మాత జ్ఞానవేల్ గారూ అనుకున్నాం. అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. బడ్డీ ఫేస్ ను యానిమేట్ చేయాలి. వాటిని పర్పెక్ట్ గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్ ఇవ్వాలి. దాంతో లేట్ అయ్యింది. సమ్మర్ అనుకున్నది ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే కీ పాయింట్ మీదే సినిమా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గకుండా సీజీ వచ్చింది.⇒ డైరెక్టర్ శామ్ ఆంటోనీ ఈ కథతో నా దగ్గరకు వచ్చి టెడ్డీ బేర్ పాయింట్ తో ఉంటుందని చెప్పారు. టెడ్డీ మూవీ తమిళంలో వచ్చింది, అలాగే ఇంగ్లీష్ లోనూ ఇలాంటి సినిమా ఉందని చెప్పాను. మీరు కథ వినండి మీకు కొత్తగా అనిపిస్తుంది, స్టోరీ విన్నాక మల్లీ ఓటీటీలో టెడ్డీ మూవీ చూడండి అన్నారు శామ్ ఆంటోనీ. అలా కథ విన్నాను. టెడ్డీ బేర్ కు ప్రాణం రావడం అనే ఒక్క పాయింట్ ను మాత్రమే దర్శకుడు టెడ్డీ సినిమా నుంచి తీసుకున్నాడు. మిగతాదంతా కొత్త కథ.⇒ "బడ్డీ" కథ వింటునప్పుడు కొత్తగా అనిపించింది. నేనూ రోజు కథలు వింటా...ఒక వెరైటీ పాయింట్ ఏ కథలో దొరుకుతుందా అని వెతుకుతుంటా. ఆ కొత్తదనం "బడ్డీ" కథలో ఫీల్ అయ్యా. నేను ఫస్ట్ టైమ్ పైలట్ గా కనిపించబోతున్నా. నా క్యారెక్టర్ ఇంటెన్స్ గా ఉంటుంది.⇒ ఈ చిత్రంలో లవ్ స్టోరీ ఉంటుంది కానీ చాలా తక్కువ పార్ట్ ఉంటుంది. కథకు ఎంత కావాలో అంతే ఉంచాడు దర్శకుడు శామ్. లవ్ స్టోరీ ఎక్కువ ఉంటే కథ డీవీయేట్ అవుతుందని ఆయన భావించాడు. "బడ్డీ" సినిమా రన్ టైమ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంటుంది. 2 గంటల 8 నిమిషాలు రన్ టైమ్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ కు ఎక్కువ లెంగ్త్ ఉంటే బాగుండదు⇒ హిప్ హాప్ తమిళ చేసిన మ్యూజిక్, బీజీఎం అదిరిపోతుంది. మేము "బడ్డీ" చూసినప్పుడు బీజీఎం సూపర్బ్ గా ఉందనిపించింది. స్పెషల్ షోస్ వేసినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిప్ హాప్ థమిళ చేసిన తని ఓరువన్, ధృవ లాంటి మూవీస్ పాటలు నాకు ఇష్టం.⇒ ప్రొడక్షన్ పరంగా మూవీ చాలా రిచ్ గా ఉంటుంది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. ఒక పాత విమానం కొని దాన్ని మూవీ కోసం ఆర్ట్ వర్క్ చేసి అందులో షూట్ చేశాం. క్లైమాక్స్ ఫైట్ కూడా అందులోనే ఉంటుంది. సినిమాకు కావాల్సింది ఇస్తాను కానీ తక్కువ డేస్ లో షూటింగ్ చేయండని ప్రొడ్యూసర్ చెప్పేవారు. రెండు షిఫ్టుల్లో సినిమాను కంప్లీట్ చేశాం.⇒ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడాన్ని ఇష్టపడను. ఒక సినిమా తర్వాతే మరొకటి. అందుకే నా మూవీస్ లేట్ అవుతున్నాయి. సాధారణంగా చిన్నా, పెద్దా ఏ సినిమా అయినా అనుకున్న టైమ్ కు చేయలేం. ఖచ్చితంగా ఎంతో కొంత ఆలస్యమవుతూనే ఉంటుంది. -
హీరో అల్లు శిరీష్ ‘బడ్డీ’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
అల్లు శిరీష్ 'బడ్డీ'.. అల్లు అర్జున్‌పై ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం బడ్డీ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందించిన ఈ మూవీకి శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ అభిమానులు అంచనాలు మరింత పెంచేశాయి. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తాజాగా బడ్డీ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మీడియా ప్రతినిధులకు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. చిన్నప్పటి నుంచి మీ బెస్ట్ బడ్డీ ఎవరు? అని శిరీష్‌ను అడిగారు.దీనిపై అల్లు శిరీష్ స్పందిస్తూ..' నా బెస్ట్ బడ్డీ మా అన్నయ్య.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం.. మా డాడీ సినిమాలు చూస్తూ ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండేవారు.. రెండు వారాలకొకసారి డాడీ వచ్చేవారు. నేను, అన్నయ్య 9 ఏళ్లపాటు ఓకే రూమ్‌లో ఉండేవాళ్లం. నాన్నతో కూడా షేర్ చేయలేని విషయాలను అన్నయ్యతోనే షేర్ చేసుకుంటా. విషయం ఏదైనా ముందు అతనికే ముందు చెబుతా. ' అని అన్నారు. కాగా.. బడ్డీ సినిమా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిర్మాతతో చర్చించి టికెట్ రేట్లు తగ్గించామని తెలిపారు. అల్లు శిరీష్ నటించిన బడ్డీ ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. నా అన్న.. నా బెస్ట్ "BUDDY"❣️Sibling Goals ❤My brother @alluarjun is my "BEST BUDDY" says Actor @AlluSirish!! 🫂#AlluArjun #AlluSirish #Buddy #TeluguFilmNagar pic.twitter.com/PAxyrX1hIx— Telugu FilmNagar (@telugufilmnagar) July 31, 2024 -
అల్లు శిరీష్ బడ్డీ మూవీ.. గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్!
అల్లు శిరీష్ హీరోగా, గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రానికి శామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బడ్డీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో బడ్డీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.99, మల్టీప్లెక్సుల్లో కేవలం రూ.125 గా నిర్ణయించినట్లు అల్లు శిరీష్ ట్వీట్ చేశారు. కుటుంబమంతా బడ్డీని చూసేందుకు మీకు అవకాశం కల్పిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. దీంతో సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే బడ్డీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. బడ్డీ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. Our team wants you & your whole family to enjoy #Buddy🧸in cinemas. So we've made the prices of ticket accessible. So, buddy.. Are you ready? #BuddyonAug2nd @StudioGreen2 pic.twitter.com/9yV1A3ZqSc— Allu Sirish (@AlluSirish) July 29, 2024 -
ఆ పాత్ర చేయడం కోసం వారిని గమనించా: బడ్డీ హీరోయిన్
అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రిషా సింగ్ బడ్డీ సినిమాలో అవకాశం రావడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ప్రిషా సింగ్ మాట్లాడుతూ .. 'నా ఫొటోలను చూసి ఆడిషన్‌కు పిలిచారు. సెలక్ట్ అయ్యా. అయితే పాత్రలోని వేరియేషన్స్ నేను చేయగలనా అని కూడా ఆలోచించా. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్ర కోసం చాలా మంది ఎయిర్ హోస్టెస్లను గమనించా. వారెలా నడుస్తారు.. ఎలా మాట్లాడుతారు.. ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు? వంటి విషయాలను దగ్గరగా గమనించా. టాలీవుడ్ నటించటం నటిగా నాకొక మంచి అనుభవం. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు.అంతే కాకుండా తనకు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే అభిరుచి ఎక్కువని చెబుతోంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. వైల్డ్ లైఫ్ అంటే కేవలం జంతువులను, చెట్ల ఫొటోలను కెమెరాల్లో బంధించటం మాత్రమే కాదని అంటోంది. వాటి సహజమైన భావోద్వేగాలను కమెరాల్లో బంధించటమేనని వెల్లడించింది. మన కెమెరాల్లో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుందని.. నటన పరంగానూ ఇది నన్ను మెరుగుపరుచుకునేలా చేసిందని తెలిపింది. అందుకే కెమెరా ముందు ధైర్యంగా నటిస్తున్నా అని ప్రిషా సింగ్ చెప్పుకొచ్చింది. కాగా.. బడ్డీ చిత్రం ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. -
మా నాన్న నాతో సినిమా తీయలేదని ఎందుకు అన్నానంటే..
-
అల్లు శిరీష్‌తో ప్రత్యేక రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
ఆకట్టుకుంటున్న 'ఫీల్ ఆఫ్ బడ్డీ' సాంగ్
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ రోజు ఈ సినిమా నుంచి 'ఫీల్ ఆఫ్ బడ్డీ' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను హిప్ హాప్ తమిళ కంపోజ్ చేసి ఐరా ఉడుపితో కలిసి పాడారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించారు. 'చూసాలే ఊసాలే నాలో నీ కలనే...దాచాలే దాచాలే నాలో ఆ కలనే..అంటూ హార్ట్ టచింగ్ గా ఈ పాట సాగుతూ ఆకట్టుకుంది. -
అల్లు శిరీష్ 'బడ్డీ' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ సినిమాలో హీరో నేను కాదు..ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యా: అల్లు శిరీష్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నటిస్తోన్న తాజా చిత్రం 'బడ్డీ'. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సామ్ ఆంటోన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ..' లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా? అని అడిగారు. బడ్డీ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్‌తో యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో నేను కాదు.. టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా చేశా. పుష్ప -2 గురించి నేను ఇప్పుడు మాట్లాడను. మాట్లాడితే మరింత హైప్ క్రియేట్ చేస్తారు. టీజర్, ట్రైలర్ చూసి మీరే డిసైడ్ చేసుకోవాలి.' అని అన్నారు.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెగ ఆకట్టుకుంటోంది. అన్యాయంపై పోరాడే టెడ్డీబేర్‌ను మీరెప్పుడైనా చూశారా..? అంటూ చెప్పే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా చూశారా? అంటూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచేశారు. కాగా.. టెడ్డీ బేర్‌కు సాయం చేసే కెప్టెన్ పాత్రలో హీరో అల్లు శిరీష్ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత అజ్మల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Buddy First Single: పాటతో రూమర్స్‌కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
‘ఊర్వశివో రాక్షసీవో’(2022) తర్వాత అల్లు శిరీష్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఆ సినిమా రిలీజైన కొన్నాళ్లకే బడ్డీ మూవీ అనౌన్స్ చేశాడు. చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒకనొక దశలో ఈ సినిమాను పక్కకు పెట్టేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఓ పాటను రిలీజ్ చేసి రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టారు మేకర్స్. బుధవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..' రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించగా హిప్ హాప్ తమిళ తో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి పాడారు. 'ఆ పిల్ల కనులే, చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే , మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో..' అంటూ మంచి రొమాంటిక్ నెంబర్ గా సాగుతుందీ పాట.శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. -
SRH vs RCB :ఉప్పల్ స్టేడియంలో తారల సందడి (ఫొటోలు)
-
15 ఏళ్ల క్రితం ఇదే మ్యూజియంలో అంటూ అల్లు శిరీష్ కామెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఆవిష్కరించాడు. అక్కడ ఈ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బన్నీ కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ గౌరవం దక్కించుకున్న బన్నీకి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన సోదరుడు అల్లు శిరీష్ కూడా బన్నీని విష్ చేస్తూ దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఇలా గుర్తుచేసుకున్నాడు. '15 ఏళ్ల క్రితం నేను, అన్నయ్య కలిసి దుబాయ్‌లోని ఇదే మ్యూజియానికి టూరిస్టులుగా వచ్చాం. ఆ సమయంలో మ్యూజియంలో ఉన్న పలు విగ్రహాలతో కలిసి ఫోటోలు దిగాం. కానీ ఇంతటి గొప్ప ప్లేస్‌లో మా కుటుంబం నుంచి ఒకరి మైనపు బొమ్మ ఇక్కడ ఉంటుంది అని ఎప్పుడూ ఊహించుకోలేదు. ఆ విగ్రహంతో కలిసి ఫోటోలు దిగుతామని అనుకోలేదు. అన్నయ్యా.. నీ సినీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.' అంటూ అల్లు శిరీష్ శుభాకాంక్షలు చెప్పారు. బన్నీతో దిగిన పోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ కూడా శుభాకాంక్షలు తెలిపింది. బన్నీ భార్యగా తనకెంతో గర్వంగా ఉందని ఆమె తెలిపింది. ఎక్కడైనా సరే తనదైన ముద్రవేసే అల్లు అర్జున్ .. ఇప్పుడు మైనపు విగ్రంతో శాశ్వతంగా అందరినీ ఆకర్షిస్తుంటారని ఆమె తెలిపింది. మార్చి 28 ఎప్పటికీ మా గుండెల్లో ఉండిపోతుందని స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
షూటింగ్ సమయంలో బామ్మ చనిపోవడంతో..: హీరోయిన్
తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ తమిళంలో నిర్మించిన చిత్రం వడక్కుపట్టి రామసామి. కమెడియన్ సంతానం కథానాయకుడిగా నటించిన ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించారు. ఎంఎస్ భాస్కర్, కూల్ జయంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. కార్తీక్ యోగి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 2వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. అతడితో నటించాలనుందన్న అల్లు శిరీష్ ఈ సందర్భంగా శనివారం ఉదయం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు శిరీష్ మాట్లాడుతూ.. హాస్య పాత్రలు పోషిస్తున్నప్పటి నుంచి నటుడు సంతానంను గమనిస్తున్నానని, ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ కథానాయకుడిగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. సంతానం హాస్యం అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఇంటర్వ్యూలు కూడా ఆసక్తిగా చూస్తుంటానని చెప్పారు. సంతానంతో కలిసి నటించాలనుందన్నారు. 65 రోజుల్లో షూటింగ్ పూర్తి సంతానం మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ తనతో రెండు చిత్రాలు చేస్తున్నారని, అందులో మొదటిగా విడుదలవుతున్న చిత్రం ఈ వడక్కుపట్టి రామసామి అని చెప్పారు. 65 రోజుల్లో ఈ చిత్రాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా భారీస్థాయిలో నిర్మించారని చెప్పారు. తాను నటించిన చిత్రాలన్నింటికంటే ఇది భారీ బడ్జెట్ చిత్రమన్నారు. అర్థం చేసుకున్నారు మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వ ప్రసాద్‌కు, క్రియేటివ్ నిర్మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్నారు. షూటింగ్ సమయంలో తన బామ్మ మరణించడంతో చాలా బాధపడ్డానని, దాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచారని చెప్పారు. మంచి బలమైన పాత్రను ఇచ్చిన దర్శకుడు కార్తీక్ యోగికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: క్యాన్సర్‌తో చనిపోయిన ప్రముఖ హీరోయిన్.. ప్రముఖుల నివాళి -
సలార్, దేవర సహా అవన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే.. కానీ ఆ ఒక్కటే..
సంక్రాంతి పండగ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్రియులపై వరాల జల్లు కురిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ పండగ పేరిట పలు సినిమాల అప్డేట్లను వరుస పెట్టి వదులుతోంది. సలార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దేవర, బడ్డీ తదితర చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నట్లు ప్రకటించింది. బాలయ్య 109వ చిత్రం, కార్తికేయ కొత్త సినిమా సహా ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రాల పోస్టర్లు వదులుతూ అవి థియేటర్లో రిలీజైన కొంతకాలానికే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. సందీప్ స్థానంలో అల్లు శిరీష్ అయితే ఇందులో ఆసక్తి గొలుపుతున్న మూవీ బడ్డీ. నిజానికి ఈ సినిమా పేరు వినగానే ఇది తమిళంలో వచ్చిన టెడ్డీ చిత్రానికి రీమేక్ అనుకున్నారంతా! కానీ హీరో సందీప్ కిషన్ ఇది రీమేక్ కాదని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చాడు. థియేటర్లో రిలీజైన తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించాడు. ఇది గతేడాది ముచ్చట. కట్ చేస్తే సడన్‌గా ఈ సినిమాలోకి అల్లు శిరీష్ వచ్చాడు, సందీప్ కిషన్ సైడైపోయాడు!దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు అందరూ పాతవారే! గతేడాది, ఇప్పుడు సేమ్ క్యాప్షన్.. పోస్టర్ మారిందంతే సంక్రాంతి సందర్భంగా అల్లు శిరీష్ 'బడ్డీ' పోస్టర్‌ను రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. పోయిన సంవత్సరం పెట్టిన క్యాప్షన్‌ను యథాతథంగా పెట్టేసింది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్, ఆ తర్వాత ఓటీటీలోకి రాబోతుందని, ఈ ఏడాదిలోనే స్ట్రీమింగ్ ఉంటుందని ప్రకటించింది. ఇది చూసిన జనాలు నవ్వాపుకుంటున్నారు. పోయిన ఏడాది కూడా ఇదే మాట చెప్పావ్, జరగలేదు.. మరి ఈసారైనా ఈ మూవీ రిలీజ్ ఉంటుందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి! Get your guns and spy gear out for SVCC37! 🔫 🔍#SVCC37 is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/MPhOChK1cY — Netflix India South (@Netflix_INSouth) January 15, 2024 https://t.co/mX5PhE4Kg1 Last year 😅 — Tamilmemes3.0 (@tamilmemes30) January 15, 2024 చదవండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా? -
అల్లు బ్రదర్స్ ఇంట్రెస్టింగ్ పిక్స్.. ఒకరు అలా మరొకరు ఇలా!
భర్తతో క్యూట్ ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య స్నేహ మంచు లక్ష్మీ బుగ్గపై ముద్దుపెట్టిన అల్లు శిరీష్ హాట్ వీడియోతో హీట్ పెంచేసిన మృణాల్ ఠాకుర్ క్యూట్ పోజులో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కేక పుట్టించే లుక్‌లో ముద్దుగుమ్మ ప్రియా వారియర్ దీపావళి స్పెషల్.. మంట పుట్టించేస్తున్న సన్నీ లియోనీ సోనాల్ చౌహాన్ స్టన్నింగ్ లుక్.. వీడియో వైరల్ వయ్యారంగా గోడకు వంగి రచ్చ లేపుతున్న రకుల్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
Allu Business Park Launch Pics: అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ (ఫొటోలు)
-
'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే
బేబీ హీరోయిన్ 'వైష్ణవి చైతన్య' పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చి. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్‌గా అయినా కొనసాగాలని పలు షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ.. ఇన్‌స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటున్న తనకు డైరెక్టర్ సాయిరాజేశ్ వల్ల బేబీతో సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి మెరిసింది. వచ్చిన అవకాశం నిలబెట్టుకునేందకు తను కూడా ఎంతగానో కష్టపడింది కూడా. (ఇదీ చదవండి: నో డౌట్.. ఈ కామన్ మహిళ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఖాయం) మొదట కథ విన్నప్పుడు ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తావని డైరెక్టర్ చెప్పినప్పుడు ఎగిరి గంతేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చెప్పింది. ఎందుకంటే తాను కూడా చాంద్రాయణగుట్టలోని ఒక బస్తీ అమ్మాయినే కాబట్టి అంటూ తన ఐడెంటీని దాచుకోకుండా చెప్పుకొచ్చింది. దీంతో ఒక తెలుగమ్మాయి టాలెంట్‌కు దక్కాల్సిన ఫేమ్ తనకు వచ్చింది. (ఇదీ చదవండి: నీకు కృతజ్ఞతే లేదు.. బన్నీని ముందు పెట్టి మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్) తాజాగా వైష్ణవి టాలీవుడ్లో ప్రముఖ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తనను అల్లు అరవింద్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధంచి స్టోరీ కూడా తన వద్ద ఉందని, అది కూడా ఫీమేల్ ఓరియేంటేడ్ అని బేబీ సక్సెస్ మీట్లోనే అల్లు అరవింద్ కొంతమేరకు లీకులు ఇచ్చారు. మరోవైపు అల్లు శిరీష్- వైష్ణవి జంటగా మరో స్టోరీతో కూడా మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్ కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని ఓపెన్‌గానే చెప్పాడు. అల్లు కుటుంబం నుంచి తనకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి. ఎదో ఒక ప్రాజెక్ట్‌లో గీతా ఆర్ట్స్ ద్వారా తన జర్నీలో మరో అడుగు పడటం ఖాయమని తెలుస్తోంది. -
అల్లు శిరీష్ కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్!
మంచి ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల ‘ఊర్వశివో రాక్షసివో’ మంచి హిట్ అందుకున్నారు. ప్రేక్షకుల నుంచి ఈ మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాలో నటీనటుల నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు శిరీష్ కొత్త సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజా సమాచారం ఏమిటంటే, టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌పై శిరీష్ కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతోంది. మేకర్స్ ఈరోజు సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని విడుదల చేశారు. రిలీజ్ చేసిన పోస్టర్లో అల్లు శిరీష్ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్ అతని పక్కన ఫైటింగ్ పొజిషన్లో నిలబడి ఉంది. బడ్డీ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అల్లు శిరీష్ తన బడ్డీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. -
ఇన్‌స్టా స్టార్ శ్వేతా నాయుడుకి గిఫ్ట్ పంపిన అల్లు శిరీష్
యంగ్ హీరో అల్లు శిరీష్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత ఇంత వరకు మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. అయితే తాజాగా అల్లు శిరీష్ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు అఫీషయల్ అనౌన్స్మెంట్ చేశాడు. ఈ మేరకు మెట్రో ట్రైన్లో టెడ్డీబేర్‌తో ఉన్న ఓ పోస్టర్ని వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది తమిళంలో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా సాయేషా సైగల్ నటించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఇన్‌స్టా స్టార్ శ్వేతా నాయుడు కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు టెడ్డీతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..మీ డెటెక్టివ్ స్కిల్‌ను ఉపయోగించి ఈ గిఫ్ట్‌ను నాకు ఎవరు ఇచ్చారో చెప్పుకోండి చూద్దాం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టును షేర్ చేసింది. View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) -
రాజమండ్రిలో అల్లు శిరీష్, అనసూయ, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
OTT release : 'యశోద', 'ఊర్వశివో రాక్షసివో' మూవీస్ థియేటర్స్‌లో మిస్ అయ్యారా?
సినీ అభిమానులకు శుక్రవారం వచ్చిందంటే పండగే. ఎందుకంటే సినిమాలు చాలావరకు ఆరోజే రిలీజ్ అవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. థియేటర్లో సినిమా మిస్ అయిన వాళ్లు ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. మరి ఒకేరోజు ఓటీటీలో మూడు సినిమాలు విడుదలైతే? ఈ శుక్రవారం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. సమంత ప్రధాన పాత్రలో నటించి యశోద సినిమా రీసెంట్గా హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ. 30కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీని థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. రేపు( శుక్రవారం) యశోద సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హీరో నితిన్, కృతిశెట్టి హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. హీరో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేట్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా శిరీష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది.డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ఊర్వశివో రాక్షసివో. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
‘ఓటీటీ’లోకి ‘ఊర్వశివో రాక్షసివో’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అల్లు హీరో శిరీష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్స్‌లో విడుదలైంది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది. డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘ప్రస్తుత కాలానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి చెందిన ప్రేమకథా చిత్రమిది. నేటి తరం యువ జంటలు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇలాంటి సినిమాను ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. ఓ భావోద్వేగాన్ని మన చుట్టూ ఉండే అనే పరిస్థితులు ముందుకు నడిపిస్తాయి. ప్రతి సంబంధం దేనికదే ప్రత్యేకం. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి ఓ ఆలోచనను సమాజం ఆకట్టుకునేలా ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని తెరకెక్కించారు. , వెన్నెల కిషోర్, సునీల్, ఆమని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
అల్లు అరవింద్‌కు నలుగురు కుమారులని తెలుసా?
స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అల్లు అరవింద్. నటుడిగా కాకుండా నిర్మాతగా కెరీర్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో బడా నిర్మాతగా వెలుగొందుతున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ కింద ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఆయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆయనకు ముగ్గురు కుమారులు అని అందరూ అనుకుంటారు. వారే అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేశ్ (బాబీ). కానీ అల్లు అరవింద్‌కు మరో కుమారుడు కూడా ఉండేవాడన్న విషయాన్ని శిరీష్ బయటపెట్టాడు. 'మా నాన్నకు మేం నలుగురం. పెద్దన్నయ్య అల్లు వెంకటేశ్ తర్వాత రాజేష్ జన్మించాడు. వీళ్లిద్దరి తర్వాత అర్జున్ పుట్టాడు. ఐదారేళ్ల వయసులో రాజేశ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నేను పుట్టడాని కంటే ముందే ఇది జరిగింది' అని చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. చదవండి: మనసుకు గాయమంటూ రేవంత్ ఏడుపు చాలా నెర్వస్‌గా ఉంది, అంతా మీ చేతుల్లోనే: సమంత -
అప్పటి వరకు అల్లు శిరీష్ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్
నటి అను ఇమ్మానుయేల్ కోలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడిందని చెప్పవచ్చు. టాలీవుడ్లో పలు చి త్రాల్లో నటించిన ఈమె తమిళంలో విశాల్‌కు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో పరిచయం అయింది. ఆ చిత్రంలో ఈమె పాత్ర పరిమితమే. గుర్తింపు అంతంత మాత్రమే. ఆ తర్వాత శివ కార్తికేయన్‌కు జంటగా నమ్మవీటి పిళ్లై చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో కనిపించలేదు. అయితే తాజాగా కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. చదవండి: Anushka Shetty: ‘నేను యోగ టీజర్‌గా పనిచేశానని అందరికి తెలుసు.. కానీ అది ఎవరికి తెలియదు’ చిత్రం సోమవారం పూజా కార్య క్రమం చెన్నైలో ప్రారంభమైంది. కాగా అను ఇమ్మానుయేల్ గురించి ఇటీవల ఒక వదంతి వైరల్ అవుతోంది. ఈమె తెలుగులో అల్లు శిరీష్ జంటగా ఊర్వశివో.. రాక్షసివో చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ఫుల్ గా ప్రదర్శింపబడుతుంది. ఇక్కడ వర కు బాగానే ఉంది. అసలు కథ ఏంటంటే అను ఇమాన్యుల్ నటుడు అల్లు శిరీష్‌తో ప్రేమాయణం అంటూ ప్రచారం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. దీనిపై స్పందించిన ఆమె తాను అనుకోకుండానే ఈ రంగంలోకి ప్రవేశించానని చెప్పింది. కొన్ని సక్సెస్ఫుల్ చిత్రాల్లోనూ ప్లాప్ చిత్రాల్లోనూ నటించానని చెప్పింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే తాజాగా తెలుగులో అల్లు శిరీష్ సరసన నటించడంతో ఆయనతో ప్రేమలో పడ్డట్టు వదంతులు పుట్టిస్తున్నారని చెప్పింది. ఇలాంటి వాటిని తాను అస్సలు పట్టించుకోనని, అయితే తన తల్లి ఏడ్చేసిందని తెలిపింది. దీంతో అమ్మ వేదన చూసి తనకు బాధ కలిగిందని చెప్పింది. నిజానికి ఊర్వశివో.. రాక్షసివో చిత్రం షూటింగ్‌కు ముందు అల్లు శిరీష్ గురించి తనకు తెలియదని ఆయన్ని చూసింది కూడా లేదని చెప్పింది. చిత్ర షూటింగ్ పూజ సమయంలోనే తాను అల్లు శిరీష్‌ను కలిశానని చెప్పింది. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి కాఫీ తాగితే కూడా రకరకాలుగా కట్టు కథలను అల్లేస్తున్నారని నటి అను ఇమ్మానుయేల్ ఆవేదన వ్యక్తం చేసింది. -
ఏడ్చేసిన అల్లు అర్జున్, వీడియో వైరల్
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ నెల 4న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఊర్వశివో రాక్షసివో బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అల్లు శిరీష్ మాట్లాడుతున్న సమయంలో బన్నీ ఎమోషనలయ్యాడు. 'అరవింద్ గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్నీ అన్న.. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు. ఎప్పుడైనా విష్ చేయాలంటే మై బేబీ సిరి అని రాస్తాడు. నన్ను చిన్నపిల్లాడిలా బుగ్గలు గిల్లి ముద్దు చేస్తుంటాడు. మా అన్నయ్యకు నేనంటే అంత ప్రేమ. అలాంటి అన్నయ్యకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం' అని శిరీష్ మాట్లాడుతున్న సమయంలో బన్నీ కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Brother bond ❤️🥹🤝Bunny got emotional listing to brother @AlluSirish speech at #UrvasivoRakshasivo success celebration#AlluArjun@alluarjun@ArtistryBuzz #Pushpa2 pic.twitter.com/i8UO4MwB1p — ARTISTRYBUZZ (@ArtistryBuzz) November 6, 2022 About #PushpaTheRule 🔥 2023 next sensation #AlluArjun pic.twitter.com/oo9EkHgMls — Monika -YASHODAFromNOV11th (@Iam_MonikAArjun) November 6, 2022 చదవండి: దానివల్ల ఎలిమినేట్ అయ్యానంటే నేను ఒప్పుకోను: గీతూ డబ్బులు, కెరీర్, రిలేషన్.. అన్నింటా ఒత్తిడే: నటి మాజీ భర్త -
Urvasivo Rakshasivo: అందుకే అనుతో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది
‘ఊర్వసివో రాక్షసివో సినిమా చూసినవాళ్లంతా అను ఇమ్మాన్యుయేల్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం సెట్స్‌కి వెళ్లడానికి ముందు మేం చేసిన ముందస్తు సన్నాహాలే. రొమాంటిక్ సన్నివేశాల్లో మాలో ఎలాంటి సందేహాలు లేవు. వీటికి కవితాత్మకంగా తెరపై చూపించామే తప్ప ఎక్కడా అసభ్యంగా చూపించలేదు’అని అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. తమిళ్ సూపర్ హిట్ ‘ప్యార్ ప్రేమ కాదల్’కి రీమేక్‌గా వచ్చిన చిత్రమిది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ శనివారం మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► కథ బాగా నచ్చితే తప్ప సినిమా చేయను. అందుకే సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. రాకేశ్ శశి గతంలో నాకు రెండు మూడు కథలు చెప్పాడు. కానీ అవి వర్కౌట్ కాలేదు. చివరకు ఊర్వశివో రాక్షసివో చిత్రంలో మా కాంబినేషన్ సెట్ అయింది. ► ఈ సినిమా పట్టాలెక్కడానికి ప్రధాన కారణం మా నాన్న(అల్లు అరవింద్). ‘ప్యార్ ప్రేమ కాదల్’ ఆయనకి బాగా నచ్చింది. ఈ సినిమా బాగుంది..నీకు సెట్ అవుతుందని నాతో చెప్పాడు. దాంతో నేను కూడా ఆ సినిమా చూశా. నాకు కూడా బాగా నచ్చింది. మాతృకకు మరింత కామెడిని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ► సినిమా చూసిన వాళ్లంతా మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయావంటూ అభినందిస్తున్నారు. అయితే ఆ పాత్ర చేయడానికి టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ సింధూజ పాత్రలో అనుని తప్ప మరొకరిని ఊహించలేం. ఆ పాత్రలాగే మొండితనం ఉన్న అమ్మాయి అను. అందుకే సింధూజ పాత్రలో ఒదిగిపోయింది. ► నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉంది. సహజీవనంతో ప్రయాణం మొదలు పెట్టి పెళ్లి చేసుకోవాడన్ని ఇష్టపడతా. నా పెళ్లి విషయంలో ఇంట్లో ఒత్తిడేమి లేదు. పెళ్లనేది కూడా హిట్ సినిమా లాంటిదే. దానంతట అదే రావాలి తప్ప మనం అనుకుంటే రాదు(నవ్వుతూ..) ► రొమాంటిక్ కామెడీ సినిమాలకు ఇదివరకు ఓ మార్కెట్ ఉండేది. ఇప్పుడది ఓటీటీ జోనర్ అయింది. సింపుల్ డ్రామాలు, పాత్ర ప్రధానమైన కథలు ఓటీటీల్లోనే చూస్తున్నారు. ‘కాంతార’ తరహా చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాయి. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. -
Urvasivo Rakshasivo: తమ్ముడికి సపోర్ట్‌గా అల్లు అర్జున్
ఎట్టకేలకు అల్లు శిరీష్ ఖాతాలో ఓ హిట్ పడింది. శుక్రవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా.. రెండో రోజు మాత్ర భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. సునీల్, వెన్నెక కిశోర్‌ల కామెడీ, శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఉంది. శుక్రవారం సాయత్రమే సక్సెస్ మీట్ పెట్టి తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఊర్వసివో రాక్షసివో మూవీ రివ్యూ) ఇక ఆదివారం ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. తమ్ముడికి సపోర్ట్‌గా అన్న వస్తుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. సునీల్, వెన్నెల కిశోర్, ఆమని ఇతర కీలక పాత్రలు పోషించారు. 𝑰𝑪𝑶𝑵 𝑺𝑻𝑨𝑹 @alluarjun garu to grace the 𝒀𝑶𝑼𝑻𝑯𝑭𝑼𝑳 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 celebrations of #UrvasivoRakshasivo as chief guest on Nov 6th @ JRC Convention, Hyd. 🤩@AlluSirish @ItsAnuEmmanuel @rakeshsashii @tanvirmir #AchuRajamani @anuprubens @GA2Official pic.twitter.com/s8GAY8Otsi — Geetha Arts (@GeethaArts) November 5, 2022 -
రెండు ఓటీటీల్లోకి రానున్న ఊర్వశివో రాక్షసివో, స్ట్రీమింగ్ అప్పుడే
చాలా గ్యాప్ తర్వాత అల్లు హీరో శిరీష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఫలితంగా శిరీష్ ఖాతాలో ఓ కమర్షియల్ హిట్ పడింది. ఇక థియేటర్లో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. ఈ మూవీని రెండు ఓటీటీ ప్లాట్ఫాంస్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ తెలుగు ఓటీటీ ఆహా వీడియోస్, నెట్‌ఫ్లిక్స్‌లు ఫ్యాన్సీ డీల్‌కు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏ సినిమా అయినా థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాం వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ఈ మూవీ కూడా 2 నెలల రోజుల తర్వాత ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన సుడిగాలి సుధీర్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్ -
అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
Urvasivo Rakshasivo Review: ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ రివ్యూ
టైటిల్: ఊర్వశివో రాక్షసివో నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిశోర్, ఆమని, అనీష్ కురువిల్లా తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాతలు: తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం సమర్పణ: అల్లు అరవింద్ దర్శకత్వం: రాకేశ్ శశి సంగీతం: అచ్చు రాజమణి (మాయారే పాట: అనూప్ రూబెన్స్) సినిమాటోగ్రఫీ: తన్వీర్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: నవంబర్ 4, 2022 గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఊర్వశివో రాక్షసివో'తో నేడు(నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూడేళ్ల విరామం తర్వాత అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శ్రీకుమార్ అలియాస్ శ్రీ(అల్లు శిరీష్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీకి పక్క ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న సింధూజ అలియాస్ సింధు(అనూ ఇమ్మాన్యుయేల్) అంటే చాలా ఇష్టం. సింధూ..కెరీర్లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. అమెరికాలో చదువుకొని ఇండియా వచ్చి మోడ్రన్ లైఫ్‌ని గడుపుతుంది. ఆమెకి పెళ్లి అంటే నచ్చదు. కానీ శ్రీకుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి సహజీవనం చేసేందుకు సిద్ధపడతారు. దీని కోసం శ్రీ తన ఇంటికి దగ్గరలో ఓ ఇల్లుని అద్దెకు తీసుకుంటాడు. మరోవైపు శ్రీకుమార్కి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తుంటారు అతని తల్లిదండ్రులు (ఆమని, కేదార్ శంకర్). శ్రీ మాత్రం తల్లిదండ్రుల దగ్గర సహజీవనం చేస్తున్న విషయాన్ని దాచి, సింధూని పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆమె అందుకు ఒప్పకోదు. కొడుకు పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీ తల్లి ఓ రోజు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత శ్రీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తల్లి కోసం పెళ్లి చేసుకున్నాడా? లేదా ప్రేయసిని దక్కించుకోవడం కోసం సహజీవనాన్ని కొనసాగించాడా? కొడుకు తప్పిపోయాడని శ్రీ పేరెంట్స్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు? సహజీవనం విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా ఉంచడానికి శ్రీ పడిన కష్టాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఎలాంటి గోల్ లేకుండా సాధారణ జీవితాన్ని గడిపే ఓ అమాయకపు యువకుడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే యూత్ టార్గెట్‌గా తీసిన మూవీ అని అర్థమవుతుంది. కథనం కూడా అలాగే సాగుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక రొమాంటి సీన్‌తో ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు లివింగ్ లైఫ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే పాయింట్‌తో దర్శకుడు రాకేశ్ శశి ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో కొత్తదనం ఏమి ఉండదు.. కానీ ఫుల్ కామెడీ, రొమాంటిక్ సీన్స్‌తో సాగడంతో ఎక్కడా బోర్కొట్టినట్లు అనిపించదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ని ఓ వర్గం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా స్ఠార్టింగ్ నుంచే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ సాగుతుంది. ప్రేమించిన అమ్మాయి.. తను పని చేసే ఆఫీస్‌లోకి రావడం.. తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పడానికి హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్ మొత్తం సహజీవనం చుట్టే సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, కామెడీ ఆకట్టుకుంటాయి. సహజీవనం ఎపిసోడ్‌ని క్రికెట్ కామెంట్రీతో ముడిపెట్టి చెప్పడంతో కామెడీ బాగా పండింది. అయితే ఈ చిత్రంలో ఎమోషన్స్‌ని కూడా యాడ్ చేశారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. హీరోయిన్ పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందో అనేదానికి బలమైన కారణాన్ని చూపించలేదు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ..యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. చాలా కాలం తర్వాత అల్లు శిరీష్ తెరపై కనిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా మెరుగుపడింది. మిడిల్ క్లాస్ యువకుడు శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో అదరగొట్టేశాడు. మోడ్రన్ అమ్మాయి సింధూ పాత్రకి అనూ ఇమ్మాన్యుయేల్ న్యాయం చేసింది. తన గ్లామర్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. శిరీష్, అనూల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సునీల్, వెన్నెల కిశోర్‌ల కామెడీ. వీరిద్దరు కలిసి పండించిన కామెడీకి ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. పొసాని కృష్ణమురళి ఒకటి రెండు సీన్స్‌లో కనిపించినా.. తనదైన శైలీ కామెడీతో నవ్వించాడు. హీరో తల్లిగా ఆమని మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించారు.కేదార్ శంకర్, పృథ్వితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అచ్చు రాజమణి సంగీతం బాగుంది. పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. తన్వీర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి, వెబ్‌డెస్క్ -
అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ అల్లు శిరీష్‌తో డేటింగ్లో ఉందంటూ కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లేకపోయినా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తుంది. ఇదే విషయం గురించి అను ఇమ్మానుయేల్‌ని పిలిచి మరి అల్లు అరవింద్ డైరెక్ట్‌గా అడిగేశాడట. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టేసింది. శిరీష్‌తో ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ ఓపెనింగ్ రోజు పూజలోని శిరీష్‌ని నేను కలిశాను. ఆ తర్వాత మూవీ కోసం ఓసారి కాఫీ షాప్‌లో మాట్లాడకున్నాం. ఆ మాత్రానికే డేటింగ్ అంటూ వార్తలు రాసేశారు. అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య మూవీలో నటించాను. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది అంతే. అల్లు అరవింద్ కూడా ఓసారి నన్ను నా కొడుకుతో డేటింగ్లో ఉన్నావా అని అడిగారు. ఆ తర్వాత చాలా సేపు దీని గురించి మాట్లాడి నవ్వుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. -
అదే నాకు అతి పెద్ద ప్రశంస: ‘ఊర్వశీవో రాక్షసివో’ డైరెక్టర్
‘‘ఊర్వశివో.. రాక్షసివో’ చిత్రం వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఈ సినిమా ప్రివ్యూ అయిన తర్వాత శిరీష్‌గారు, ‘తెరపై నేను కనపడలేదు.. నేను చేసిన శ్రీకుమార్ పాత్ర మాత్రమే కనిపించింది.. థ్యాంక్స్’ అన్నారు.. అదే నాకు అతి పెద్ద ప్రశంస. ఆ తర్వాత అల్లు అరవింద్‌గారు కూడా హీరో క్యారెక్టర్ అద్భుతంగా ఉందన్నారు’’ అని దర్శకుడు రాకేష్ శశి అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలిలేని, విజయ్ ఎం. నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ.. ‘‘జతకలిసే, విజేత’ చిత్రాల తర్వాత ‘ఊర్వశివో.. రాక్షసివో’ చేశాను. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ‘విజేత’ చూసి, అల్లు అరవింద్‌గారు నన్ను పిలిపించి, శిరీష్ కోసం కథ సిద్ధం చేయమన్నారు. ఆ తర్వాత శిరీష్‌గారితో ప్రయాణం చేసి ‘ఊర్వశివో.. రాక్షసివో’ కథని రెడీ చేశాను. షూటింగ్ ప్రారంభిద్దాం అనుకున్న సమయంలో లాక్డౌన్ రావడంతో ఆలస్యం అయింది. ఇప్పటివరకూ శిరీష్‌గారు చేయని సరికొత్త పాత్రను ఈ చిత్రంలో చేశారు. ఆయన కెరీర్లో ది బెస్ట్‌గా నిలుస్తుంది. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర నేటి తరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. డైరెక్టర్ మణిరత్నంగారంటే నాకు ఇష్టం. ఆయనలా నాకు సినిమాలు తీయాలని ఉంది’’ అన్నారు. -
'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబం
‘‘సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబం. మనుషుల జీవితాల్లో సినిమా కూడా నిత్యసాధనం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందేలా దర్శక–నిర్మాతలు కృషి చేయాలి’’ అన్నారు హీరో బాలకృష్ణ. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం బిగ్ టికెట్‌ను బాలకృష్ణకు అందించారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘అరవింద్‌గారి అసోసియేషన్‌తో నేను చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’కు మంచి స్పందన లభిస్తోంది. అల్లు రామలింగయ్యగారితో వర్క్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శిరీష్, అను, దర్శకుడిగా రాకేశ్ బాగా చేశారనిపిస్తోంది. ప్రతి మనిషిలో విభిన్నకోణాలు ఉంటాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా ఆ తాలూకు బరువు, బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉంటాయి. కాలంతో ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. సహజీవనం, ఎఫైర్స్ అనేవి కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ‘ఊర్వశివో రాక్షసివో..’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శిరీష్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఈ మూవీలో నటించాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పుట్టిన సినిమా ఇది. మంచి ఎంటర్టైనర్ అండ్ ఓ ఇన్‌డెప్త్ డిస్కషన్ ఈ సినిమాలో ఉంది.. దాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి 60వ బర్త్ డే వేడుకల్లో బాలకృష్ణగారు పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత ఆ ఫంక్షన్లో మా జోష్ తగ్గింది కానీ బాలకృష్ణగారి జోష్ తగ్గలేదు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల తర్వాత నాన్నగారితో ముచ్చటగా మూడోసారి నేను చేసిన ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అల్లు శిరీష్. ‘‘శిరీష్‌గారు, అను వల్ల ఈ సినిమా మేకింగ్ చాలా సాఫీగా జరిగింది’’ అన్నారు రాకేష్ శశి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కొరియోగ్రాఫర్ విజయ్, దర్శకులు మారుతి, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ్, వెంకటేశ్ మహా, దర్శక–నిర్మాత, రచయిత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్, ‘గీతాఆర్ట్స్’ బాబు, సత్య, పూర్ణా చారి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు మాధవ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిపోర్టర్‌పై అను ఇమ్మాన్యుయేల్ ఫైర్.. అడగడానికి వేరే ప్రశ్నలు లేవా?
-
రిపోర్టర్‌పై హీరోయిన్ ఫైర్.. అడగడానికి వేరే ప్రశ్నలు లేవా?
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది అను ఇమ్మాన్యుయెల్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా అల్లు శిరీష్‌తో జతకట్టింది. వీరిద్దరూ కలిసి నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌పై హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ ఫైర్ అయ్యింది. ''మీరు అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య చేశారు. ఇప్పుడు శిరీష్‌తో 'ఊర్వశివో రాక్షసివో' చేశారు... అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్, ఎవరు నాటీ''? అని రిపోర్టర్ అడిగాడు. దీంతో అసహనానికి గురైన అను మీ దగ్గర ఇంతకన్నా మంచి ప్రశ్నలేం లేవా.. అడగడానికి అంటూ కోప్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో అనూకి అంత కోపం ఎందుకో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాగా అను, శిరీష్ ఇద్దరు లవ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. -
అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నాకు రెండు, మూడు సీరియస్ రిలేషన్స్ ఉన్నాయి: అల్లు శిరీష్
అల్లు హీరో శిరీష్ నటించి లేటెస్ట్ మూవీ ఊర్వశీవో రాక్షసివో. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా శిరీష్ ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ, బ్రేకప్‌పై స్పందించాడు. మూవీలో హీరోయిన్‌తో లవ్ ట్రాక్ గురించి చెబుతుండగా యాంకర్ నిజ జీవితంలో కూడా రిలేషన్స్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. చదవండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే.. దీనికి శిరీష్ స్పందిస్తూ.. ఈ కాలంలో రిలేషన్స్ లేకుండా ఎవరుంటారని, తనకు రెండు మూడు సీరియస్ రిలేషన్స్ ఉండేవంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. దీంతో యాంకర్ మీరు ఓ పెద్దింటి అమ్మాయితో సీరియస్ రిలేషన్లో ఉన్నారని, చివరికి మీరే బ్రేకప్ చెప్పారని విన్నాను నిజమెంత అని అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. ‘నాకు గతంలో రెండు మూడు సీరియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అయితే వారందరితో నాకు బ్రేకప్ అయ్యింది. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. ఆ బ్రేకప్స్ వల్ల నేను కూడా బాధపడ్డాను. బ్రేకప్ చెప్పడం వల్ల ఎదుటి వాళ్లకు మాత్రమే పెయిన్ ఉండదు. చెప్పిన వాళ్లకి కూడా ఉంటుంది. అది ఆ నిమిషం మనకు తెలియదు. కానీ, ఏడాది తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది. బ్రేకప్ చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను. అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్ట్ చేస్తున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తుంది. లేదంటే ఇపాటికి నాకు పెళ్లి జరిగి ఉండేది కదా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
పోరీల ఎంటపోకు ఫ్రెండూ అని పాడుతున్న అల్లు శిరీష్
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ బ్యానర్లో రాబోతున్న నెక్స్ట్ మూవీ "ఊర్వశివో రాక్షసివో". అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు, సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలో ‘మాయారే’ అంటూ సాగే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాటను కాసర్య శ్యామ్ రచించారు. అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. చదవండి: ఒంటరిగా రమ్మన్నాడు, కొలతలు అడిగి నీచంగా -
‘ఊర్వశివో రాక్షసివో’.. నుంచి ఫస్ట్ లవ్‌సాంగ్ వచ్చేసింది
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే టీజర్‌ను రిలీజ్ చేయగా,అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేసింది. ‘‘దీంతననా దీంతననా నీ చూపుల దాడి.. చేసిందే చేసిందే ఈ గారడీ’’అంటూ సాగే ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ ఆలపించారు. -
"ఊర్వశివో రాక్షసివో" చిత్రం నుంచి ఫస్ట్‌సాంగ్ రిలీజ్ అప్పుడే
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". GA2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 10న ఈ సినిమా నుంచి దీంతననా అనే సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. -
యూత్‌ని ఆకట్టుకునేలా అల్లు శిరీష్ ‘ఊర్యశివో రాక్షసివో’ టీజర్
అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఊర్యశివో రాక్షసివో’. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. యూత్‌ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది. గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌పై పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అల్లు శిరీష్ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
‘గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. ‘గీతా ఆర్ట్స్ ’మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ చేసిన చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ టీజర్ ,త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. -
దీని కోసం పద్నాలుగేళ్లుగా ఎదురుచూశా: అల్లు శిరీష్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న మూవీ 'ప్రేమ కాదంటా?'. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌తో, ఫస్ట్ లుక్ తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకం అంటూ ట్వీట్ చేయడంతో ఏంటి, శిరీష్ ప్రేమలో పడ్డాడా? అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అతడు స్పందిస్తూ తన కొత్త సినిమా ఫిక్స్ అయిందని పుకార్లకు చెక్ పెట్టాడు. తాజాగా అతడు సోషల్ మీడియాలో మరోసారి ఎమోషనల్ అయ్యాడు. తెలుగులో నాని నటించిన 'జెర్సీ' మూవీ హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ హోర్డింగ్‌లో అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని రాసి ఉండటాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని జుహు సర్కిల్లో ఓ హోర్డింగ్‌లో చూడాలని పద్నాలుగేళ్లుగా ఎదురుచూశాను. మొత్తానికి జరిగింది అని రాసుకొచ్చాడు. కాగా జెర్సీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 31న విడుదలవుతోంది. Waited 14 years to see a billboard of an Allu Entertainment film at the Juhu circle. Finally it's happening. pic.twitter.com/JoOT45hhT1 — Allu Sirish (@AlluSirish) December 24, 2021 -
మర్చిపోలేని రోజు, సోషల్ మీడియాను వీడుతున్నా: అల్లు శిరీష్
Allu Sirish: అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ ప్రస్తుతం 'Prema కాదంట' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హీరో ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేసి మెప్పించాడు. ఇదిలా వుంటే తాజాగా ఈ హీరో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 'ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకమైంది. నా వృత్తిజీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకనుకుంటున్నారా? అది రానున్న రోజుల్లో నేనే చెప్తాను. అప్పటివరకు కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను' అని చెప్పుకొచ్చాడు. 11/11/2021 will be one of the best days in my profesional life. Why, what I'll share over the coming weeks. I've been off social media for a reason :) — Allu Sirish (@AlluSirish) November 11, 2021 దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'అన్నా లవ్ సెట్ అయిందా? పెళ్లి కుదిరిందా?' అన్న ప్రశ్నలకు.. 'నేను వృత్తిపరంగా స్పెషల్ డే అని మరీ మరీ చెప్పాను సామీ' అని సరదాగా రిప్లై ఇచ్చాడు శిరీష్. 'ఏంటన్నా? హాలీవుడ్‌కు వెళ్తున్నావా?' అన్న ప్రశ్నలకు శిరీష్.. 'అలాంటి ఆశయాలేమీ నాకు లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్ అయింది, కథ నచ్చింది అన్న ఆనందం! నా కెరీర్లో ఇది బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందనుకుంటున్నాస అంటూ అసలు మ్యాటర్ రివీల్ చేశాడు. Alanti ambitions nakem le bro. #Sirish7 lock ayyindi, andariki katha nacchindi anna anandam. The best script of my career, I feel. — Allu Sirish (@AlluSirish) November 11, 2021 -
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న హీరో సాయితేజ్?
Sai Dharam Tej Marriage: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారా? మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లిస్ట్ నుంచి త్వరలోనే తప్పుకోనున్నారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇటీవలె రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్ పూర్తిగా కోలుకొని విజయ దశమి సందర్భంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అదేరోజు సాయి తేజ్ పుట్టిరోజు కూడా ఉండటంతో మెగా ఫ్యామిలీలో ఆనందం మరింత రెట్టింపయ్యింది. చదవండి: 'మా' ఎన్నికలపై ఆర్జీవీ సెటైర్లు.. ట్వీట్ వైరల్ ఈ సందర్బంగా తేజ్ కజిన్స్ అతనికి వెల్కం హోం అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. ఇందులో సుష్మిత కొణిదెల, శ్రీజ, నిహారిక, అల్లు శిరీష్ సహా మిగతా కజిన్స్ సైతం తేజ్‌కు ఎంతో ప్రేమగా విషెస్ చెప్పారు. అయితే శిరీష్ మాట్లాడుతూ.. సింగిల్‌గా ఇదే నీ చివరి బర్త్‌డే అవ్వాలనుకుంటున్నా. ఈ మ్యారేజ్ రేస్‌లో నువ్వు నన్ను బీట్ చెయ్యాలనుకుంటున్నా అని సాయి తేజ్ పెళ్లిపై హింట్ ఇచ్చేశాడు. దీంతో ఇప్పటికే సంబంధాలు చూస్తున్నారని, త్వరలోనే సాయి తేజ్ పెళ్లిపై క్లారిటీ రానుందని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వైరల్: షో మధ్యలో బాలయ్యకు ఫోన్ చేసిన రోజా View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్
Allu Ramalingaiah Statue: లెజెండరీ నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లు బ్రదర్స్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో అల్లు అర్జున్,బాబీ, శిరీష్‌లు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్ చేస్తూ.. మా తాత, పద్మశ్రీ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఆయన మాకు ఎంతో గర్వ కారణం. అల్లు స్టూడియోస్ ప్రయాణంలో ఆయన ఎప్పుడూ ఉంటారు అంటూ ఫోటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్సుకుమార్ దర్శకత్వంలో పుష్ఫ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల Unveiled the statue of my grandfather Padmashri #AlluRamalingaiah garu in ALLU Studios on his birth anniversary today along with #AlluBobby & @AlluSirish . He was our pride and will continue to be a part of our journey at Allu studios . pic.twitter.com/UHMZYvgiC3 — Allu Arjun (@alluarjun) October 1, 2021 -
హీరో అల్లు శిరీష్ మెడకు గాయం
Allu Sirish: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ గాయపడ్డాడు. అయితే ఆయన గాయపడింది సినిమా షూటింగ్లో కాదు, వర్కవుట్ సమయంలో! ఈ మధ్య శిరీష్ ఫిట్నెస్ మీద బాగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటిలాగే వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడే ఫొటోతో సహా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. "ఇది ఫ్యాషన్ కోసం పెట్టుకుంది కాదు, స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నిజంగానే మెడకు దెబ్బ తగిలింది" అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో షేర్ చేశాడు. ఇందులో శిరీష్ మెడకు పట్టీ కట్టుకుని కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు అతడికి త్వరగా నయం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మధ్యే హిందీ పాటతో అలరించిన శిరీష్ ప్రస్తుతం రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న "ప్రేమ కాదంట" సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా కనిపించనుంది. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే! -
రెయిన్ బో స్టడీ చేస్తున్న తమన్నా.. రెండే ఆప్షన్లు ఉన్నాయన్న నాని
మనకు రెండే ఆప్షన్లు ఉన్నాయంటున్నాడు హీరో నాని. 1. వ్యాక్సిన్ వేయించుకుని.. క్షేమంగా ఉందాం. 2. మన క్షేమం కోసం వ్యాక్సిన్ వేయించుకుందాం అంటూ టీకా వేయించుకున్న ఫోటోని షేర్ చేశాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌నీల్ తన ముద్దుల కూతురుకు ముద్దుపెడుతున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు హరివిల్లుని అధ్యయనం చేస్తున్నానంటూ ఓ అందమైన ఫోటోని షేర్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడూ హ్యాపీ మూడ్‌లోనే ఉండలేమంటూ సీరియస్ లుక్ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు అల్లువారి అబ్బాయి శిరీష్. View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Nani (@nameisnani) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Prashanth Neel (@prashanthneel) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
నా మోరల్ సపోర్ట్ నువ్వే తమ్ముడూ.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
Allu Arjun : అల్లు వారి చిన్నబ్బాయి, హీరో అల్లు శిరీష్ పుట్టిన రోజు నేడు(మే 30). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడూ.. నువ్ నా బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్.. రాబోయే రోజులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. తమ్ముడితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసుకున్నారు. ఇక తన అన్న అల్లు అర్జున్ చేసిన బర్త్‌డే ట్వీట్‌పై శిరీష్ స్పందిస్తూ.. థాంక్యూ AA(అల్లు అర్జున్).. మీలాంటి అన్నయ్య ముందు నేను ఎదగడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా ఫ్రెండ్.. నా గైడ్ మీరే’ అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేశారు. Many many happy returns of the day to my sweetest brother who is my biggest moral of support . Wish you a wonderful day and a lovely year to come @AlluSirish 😘 pic.twitter.com/DAUtzDoBiC — Allu Arjun (@alluarjun) May 30, 2021 ఇక పుట్టిన రోజు సందర్భంగా అల్లు శిరీష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘ప్రేమ కాదంట’టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తుండగా.. జీఏ2పిక్చర్స్ బ్యానర్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Thank you AA! I'm so fortunate to have grown around an elder brother like you. My best friend & guide in one person. ❤️❤️❤️ https://t.co/0qwJDVvmjW — Allu Sirish (@AlluSirish) May 30, 2021 -
అల్లు శిరీష్- అను ఇమ్మాన్యుయేల్: Prema కాదంట!
సరైన హిట్టు దొరక్కపోతే హీరోలు కొత్త ట్రాక్ ఎక్కుతారు. లేదంటే ప్రేక్షకుల నాడి తెలుసుకుని వారికి నచ్చేరీతిలో సినిమాలు చేసి మళ్లీ సక్సెస్‌ను రుచి చూస్తుంటారు. తాజాగా తెలుగు హీరో అల్లు శిరీష్ ఒకేసారి ఈ రెండు ఫార్ములాలను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పెద్దగా రొమాన్స్ జోలికి పోని శిరీష్ ఈ సినిమాలో మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇక ఈ మధ్య ప్రేమ కథాచిత్రాలు బాగా క్లిక్ అవుతుండటంతో పూర్తిగా లవ్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమాలో తన లుక్‌ను కూడా ఇదివరకే రిలీజ్ చేశారు. ఈ మధ్యే సిక్స్‌ప్యాక్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఈ హీరో తన సినిమాకు సంబంధించి వరుస ప్రీ లుక్‌లు రిలీజ్ చేస్తూ జనాలను ఆకర్షించాడు. నేడు(మే 30) అతడి బర్త్‌డేను పురస్కరించుకుని చిత్రయూనిట్ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు "Prema కాదంట" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అద్దం ముందు ఫొటోలు దిగుతున్న అను ఇమ్మాన్యుయేల్ మీద హీరో ముద్దుల వర్షం కురిపిస్తున్న ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అను, శిరీష్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి టైటిల్‌తోనే వీరిది ప్రేమ కాదని చెప్పేసారా? ఏంటి? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ALLU SIRISH: TITLE + FIRST LOOK POSTERS... On #AlluSirish's birthday today, here's the title of #Sirish6 film: #PremaKadanta... The #Telugu film stars #AlluSirish and #AnuEmmanuel... Directed by Rakesh Sashii... #AlluAravind presentation. #Sirish6FirstLook pic.twitter.com/V3isLWWaxW — taran adarsh (@taran_adarsh) May 30, 2021 చదవండి: ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా -
ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా
ఇటీవల సిక్స్ ప్యాక్‌తో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచిన అల్లు శిరీష్.. ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించి ప్రీలుక్లలో షాకిస్తున్నాడు. ఇప్పటికే అద్దం చాటున అను ఇమ్మాన్యుల్కి ముద్దులు ఇస్తున్న పోస్టర్ని విడుదల చేసి రచ్చ చేసిన ఈ యంగ్ హీరో.. తాజాగా మరో రొమాంటిక్ లుక్‌ని వదిలాడు. ఇందులో మరింత రెచ్చిపోయాడు శిరీష్. ఈ లేటెస్ట్ నయా ప్రీ లుక్ వైరల్ అయింది. మే 30న(శిరీష్ బర్త్‌డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది. ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. ఈ సినిమాలో రెచ్చిపోయినట్లు ప్రీ లుక్ పోస్టర్లు చూస్తే అర్థమవుతంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం. Here's our second prelook. Excited to share the title & first look our film tomorrow at 11am. #sirish6 @GA2Official @ItsAnuEmmanuel #rakeshsashii pic.twitter.com/7nKTuiyJNJ — Allu Sirish (@AlluSirish) May 29, 2021 చదవండి: సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్.. మహానటి జ్ఞాపకాలు.. ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్న: కీర్తి -
అద్దం చాటున శిరీష్ ముద్దులు.. రొమాంటిక్ లుక్ రిలీజ్
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. మే 30న(శిరీష్ బర్త్‌డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది. ఇందులో శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ను అద్దం చాటున ముద్దు పెడుతున్నట్లు ఉంది. ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. తాజా చిత్రంలో లిప్ లాక్ ఇచ్చినట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం. Here’s a movie that gives a refreshing perspective to love and relationship. Presenting the Pre Look of @AlluSirish & @ItsAnuEmmanuel's #Sirish6 💞#Sirish6FirstLook 👉🏻 May 30th at 11 am! ✅ Advance Birthday Wishes to #AlluSirish 🥳#AlluAravind @GA2Official pic.twitter.com/18CIGvgeW6 — Geetha Arts (@GeethaArts) May 27, 2021 -
హీరోయిన్‌కు అల్లు శిరీష్ స్పెషల్ గిఫ్ట్, స్పెషలేంటో?
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ 2013లో ఇండస్ర్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి రూమర్స్ లేవు. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ అను ఇమాన్యుయేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెట్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరేస్తూ ఇద్దరూ కలిసి కాఫీ షాపులు, పార్టీలు అంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే శిరీష్..ఇమాన్యుయేల్‌తో ఇంత క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో వీరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఇక ఇటీవలె అను ఇమాన్యుయేల్ బర్త్‌డే సందర్భంగా అల్లు శిరీష్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ అల్లు శిరీష్ స్పెషల్ విషెస్ చెప్పారు. ఇప్పడు మరోసారి వీరిద్దరి టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ప్రయసిగా ప్రచారంలో ఉన్న అను ఇమాన్యుయేల్‌కు అల్లు శిరీష్ ప్రత్యేకంగా గిఫ్ట్ పంపారు. ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ టీషర్ట్‌పై ప్రింట్ చేయించి అను ఇమాన్యుయేల్‌కు పంపాడు. దీనిపై స్పందించిన ఈ భామ..సైకో అని ఉన్నా దీన్ని క్లాంపిమెంట్గానే తీసుకుంటానని చెబుతూ అల్లు శిరీష్‌ని వియర్డో అంటూ సంభాషించింది. దీన్ని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన శిరీష్..వియర్డోనా...మనలో చాలా కామన్ విషయాలు ఉన్నాయి అంటూ స్వీట్‌గా ఈ భామపై సెటైర్ వేశారు. అంతేకాకుండా ఎనీవే యూ ఆర్ వెల్కమ్ మై ఫేవరేట్.. అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్-అను ఇమాన్యుయేల్ మధ్య జరిగిన ఈ చాట్ సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. శిరీష్ తన పోస్టులో మై ఫేవరెట్...అంటూ గ్యాప్ ఇవ్వడంతో వీరి మధ్య ఏదో ఉందని, అందుకే ఇంత క్లోజ్‌గా నిక్ నేమ్స్ కూడా పెట్టుకున్నారని నెట్టింట ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటిదాకా శిరీష్ స్పందించలేదు. చదవండి: కొన్నాళ్లుగా హీరోయిన్‌తో రిలేషన్షిప్లో ఉన్న అల్లు శిరీష్! తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే -
నేను హ్యాంగ్ అవుట్ అయ్యేది అక్కడే : అల్లు శిరీష్
అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. రీసెంట్గా ఆయన తొలిసారి బాలీవుడ్లో నటించిన ఓ మ్యూజిక్ ఆల్భమ్ 100 మిలియన్ క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. 'విలయాటి షరాబి' అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇక తాజాగా తనకెంతో ఇష్టమైన ప్లేస్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కాఫీ షాప్స్, బుక్ స్టోర్స్ తర్వాత తాను అంతగా హ్యాంగ్ అవుట్ అయ్యే ప్రదేశం ఇదేనంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. ఇది మరక్కడో కాదు..స్వయంగా వాళ్లింటిలోని గార్డెన్ ఏరియా. ఈ ప్లేస్‌లో తాను చిల్ అవుతానంటూ ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఇక ఇంట్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో తాను కూడా టెస్టులు చేయించుకున్నానని, అయితే రెండుసార్లు తనకు నెగిటివ వచ్చిందని పేర్కొన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే..అల్లు శిరీష్ నటించిన చివరి మూవీ ఏబీసీడీ. ఈ చిత్రం అనంతరం అను ఇమాన్యుయేల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ అను ఇమాన్యుయేల్‌తో శిరీష్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై శిరీష్ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. చదవండి: హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్ తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే -
తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే
అల్లు శిరీష్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన తొలిసారి బాలీవుడ్లో నటించిన ‘విలయాటి షరాబి’ మ్యూజిక్ ఆల్భమ్ 100 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయింది. గతనెల చివర్లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ స్పెషల్ వీడియో సాంగ్ ఇంటర్నెట్కు షేక్ చేసింది. అల్లు శిరీష్, హెలి దరువాలా జంటగా చేసిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది.దీంతో రిలీజ్ అయిన తక్కువ కాలంలోనే వీడియోకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా తమ్ముడు సక్సెస్‌పై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. 'బిగ్ కంగ్రాట్ శిరీష్. నీ పాట వంద మిలియన్ వ్యూస్‌ని సాధించినందుకు గర్వంగా ఉంది' అంటూ అభినందించారు. ఇక ఊహించని ఈ సర్ ప్రైజ్‌కి అల్లు శిరీష్ సైతం ఆనందంలో మునిగితేలుతున్నాడు. ఈ పాట ఇంత సక్సెస్ అవుతుందని ఊహించలేదని, ఈ సాంగ్ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) చదవండి : హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్ అల్లు స్నేహారెడ్డి ఐడియాకి సమంత ఫిదా -
హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్
ఇండస్ర్టీలో హీరోయిన్లతో ప్రేమ విషయానికి వస్తే కొందరు హీరోలు గుర్తొస్తారు. కొన్నాళ్ల పాటు వారి లవ్ స్టోరీ ఇండస్ర్టీ మొత్తం హాట్ టాపిక్ అవుతోంది. ఇంకొందరేమో అమ్మాయిలంటేనే చాలా దూరంగా ఉంటారు. ఈ కోవలోకే వస్తారు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్. 2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. అయితే తాజాగా శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి.. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాల్లో నటించింది ఈ భామ.. ఇప్పుడు అల్లు శిరీష్‌తో ప్రేమలో ఉందని ఇండస్ట్రీలో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి కొంతకాలంగా వీరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్గా అల్లు శిరీష్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండు రోజుల క్రితం మార్చి28న నటి అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు కావడంతో అల్లు సిరిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. లేట్‌గా విషెస్ చెబుతున్నానని నాకు తెలుసు..కానీ ఈ వీడియోతో రావడానికి లేట్ అయ్యింది. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ శిరీష్ విషెస్ చెప్పారు.ఎప్పుడూ సినిమాలు లేదా ఫిట్‌నెస్‌పై మాత్రమే దృష్టి పెట్టే శిరీష్..కొన్నాళ్లుగా అను ఇమ్మాన్యుయేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారని కూడా తెలుస్తుంది.ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న మహా సముద్రం సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, శిరీష్ ఓ సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి : వకీల్‌సాబ్ ట్రైలర్ లాంచ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ దర్శకుడితో ప్రేమలో ప్రముఖ హీరోయిన్! -
బాలీవుడ్ పాటకి.. అల్లు శిరీష్ ఆట.. ఇదో రికార్డు
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. సొంతంగా ఎదిగేందుకే ప్రయత్నిస్తున్నాడు యంగ్ హీరో అల్లు శిరీష్. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. అవార్డు ఫంక్షన్లకు తనదైన శైలీలో హోస్టింగ్ చేసి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒక నటుడిగా ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఆల్బమ్‌లో నటించి మరో రికార్డు క్రియేట్ చేశాడు. ‘విలయాటి షరాబి’ అంటూ సాగుతున్న పాటలో హేలీతో కలిసి ఆడిపాడారు. దర్శన్ రావల్, నీతి మోహన్ ఆలపించిన ఈ గీతానికి కుమ్మార్ లిరిక్స్ అందించారు. లిజో జార్జ్-డీజే స్వరాలు సమకూర్చారు. ఆ సాంగ్‌ను ట్విటర్లో షేర్ చేసిన శిరీష్ ‘ఆనందకరమైన పార్టీ సాంగ్ విడుదలైంది. కచ్చితంగా హోళీ పార్టీలో మీరంతా ఈ సాంగ్‌కు చిందేస్తారు. ఈ మ్యూజిక్ వీడియోలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా’అంటూ రాసుకొచ్చారు. బాలీవుడ్ ఆల్బమ్ చేసిన తొలి దక్షిణాది హీరోగా గుర్తింపు సంపాదించాడు. -
బర్త్‌డే పార్టీలో అల్లు అర్జున్ హంగామా
చావు కబురు చల్లగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శరత్ చంద్ర నాయుడు బర్త్‌డే వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తళుక్కున మెరిశాడు. సోమవారం అతడి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు హాజరైన బన్నీ దగ్గరుండి కేక్ కట్ చేయించాడు. అనంతరం అతడికి ఆప్యాయంగా కేక్ తినిపించాడు. ఈ పార్టీలో నిర్మాత అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతున్నాయి. ఇందులో బన్నీ లుక్ సరికొత్తగా ఉండటంతో 'అన్న మళ్లీ లుక్ మార్చాడురోయ్..' అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. 'స్టైల్ నీ డీఎన్ఏలోనే ఉంది', 'స్టైలిష్ స్టార్లు ఊరికే అయిపోరు మరి..' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా శరత్ చంద్ర.. బన్నీకి కుడి భుజంలా ఉంటూ అతడి వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఇదే విషయాన్ని బన్నీ 'చావు కబురు చల్లగా' ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ప్రస్తావిస్తూ అతడిపై ప్రశంసలు కురిపించాడు. తనకన్నీ శరతే అని, అతడు తన ఫ్యామిలీ మెంబర్ అని పేర్కొన్నాడు. చదవండి: ఏం సక్కగున్నావ్రో.. అందరి కళ్లు బన్నీ పైనే! అల్లు అర్జున్ను కలిసి ‘కేజీఎఫ్’ డైరెక్టర్.. ఫొటో వైరల్ -
మెగా ఫ్యామిలిలో మళ్లీ పెళ్లి బాజాలు..
మెగా బ్రదర్ నాగాబాబు ముద్దుల కుమార్తె నిహారిక వివాహం ఇటీవల వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 9న ఉదయ్‌పూర్ వేదికగా జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేశారు. ఇక మెగా కుటుంబంలో పెళ్లి సందడి జరిగి వారం తిరగకముందే మరో శుభవార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మెగా ఫ్యామిలిలో త్వరలోనే మళ్లీ పెళ్లి బాజాలు మోగనునట్లు దీని సారాంశం. పెళ్లి విషయంలో అయితే చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ ముందు వరుసలో ఉన్నారు. వీరిలో సాయి ధరమ్ పెళ్లి ఖాయం అయ్యిందని అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఈ హీరో కుండబద్దలు కొట్టాడు. అంతేగాక పెళ్లి చేసుకోవడం కంటే సోలోగా ఉంటేనే తనకు సంతోషంగా ఉంటుందన్నారు. చదవండి: ఐమ్యాక్స్‌లో మెగా హీరో దీంతో ఈ పెళ్లి వార్త ప్రస్తుతం అల్లు శిరీష్పైకి మళ్లింది. త్వరలోనే శిరీష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మెగా హీరో సాయిధరమ్ తేజ్ వెల్లడించారు. తను నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రమోషన్లో ఇటీవల తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘శిరీష్ నాకంటే పెద్దవాడు. వచ్చే ఏడాది తన పెళ్లి జరగవచ్చు. నేను పెళ్లి చేసుకునేందుకు ఇంకా సమయం ఉంది. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని పెళ్లికి ముందే పూర్తి చేయాలి’. అని తెలిపారు. ఇక ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు సంబరంలో మునిగితేలుతున్నారు. త్వరలోనే ఇటు అల్లు ఫ్యామిలీతోపాటు కొణిదెల కుటుంబంలో మరో పెద్ద పండగ రాబోతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పెళ్లెప్పుడు బాబాయ్ : అల్లు అయాన్ -
‘సూర్యగ్రహణం అప్పుడు సరిగా ప్రార్థించకపోతే’
హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాల గురించే కాకుండా.. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను కూడా ఆయన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇంట్లో జెంగా ఆడుతున్న ఓ చిన్న వీడియోను శిరీష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆటలో భాగంగా శిరీష్ చెక్క ముక్కను బయటకు తీస్తున్న సమయంలో టవర్ కూలిపోయింది. దీంతో అతను ఓటమి చెందాడు. ఈ ఫన్నీ వీడియోను షేర్ చేసిన శిరీష్.. సూర్య గ్రహణం సమయంలో సరిగా ప్రార్థించకపోతే ఇలానే జరుగుతోంది అని పేర్కొన్నారు.(చదవండి : ఫ్యాక్ట్ : నయన్-విఘ్నేశ్‌లకు కరోనా సోకిందా?) ఇక, జెంగా ఆట విషయానికి వస్తే ఇందులో.. ముందుగా చెక్క ముక్కలను టవర్ మాదిరిగా పేర్చుతారు. ఈ ఆటను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆడతారు. ఈ ఆటలో పాల్గొనవారు టవర్ కూలిపోకుండా.. వంతుల వారీగా మధ్యలో ఉన్న ఒక్కో చెక్కముక్కను బయటకు తీసి పైభాగంలో పెట్టాలి. అయితే ఎవరు చెక్క ముక్క బయటకు తీసేటప్పుడు టవర్ కూలిపోతుందో వాళ్లు ఓటమి చెందినట్టు. అంతకుముందు ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి అల్లు అరవింద్‌కు శిరీష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నేడు తన తల్లి నిర్మల పుట్టిరోజు సందర్భంగా విషెస్ చెప్పారు. View this post on Instagram This is what happens if you don't pray properly during the surya grahan 😂😂😂 #jenga #weekendvibes A post shared by Allu Sirish (@allusirish) on Jun 21, 2020 at 7:14am PDT -
పెళ్లెప్పుడు బాబాయ్ : అల్లు అయాన్
సాక్షి, హైదరాబాద్ : షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే మన సినీ తారలు లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయం గడుపుతున్నారు. కొందరు కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టారు. మరికొందరేమో ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఫ్యాన్స్‌కు చేరువగానే ఉంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌లు తమ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. తమ పిల్లలతో కలిసి చేసిన ఫన్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. (చదవండి : హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం) తాజాగా అల్లు అర్జున్ సతీమని స్నేహారెడ్డి, అయాన్, అల్లు అర్జున్‌కి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో అల్లు అయాన్ తన బాబాయ్ శిరీష్ పెళ్లి గురించి ఆపిల్ శిరిని అడగటంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇందులో అల్లు అర్జున్ తనయుడు అయాన్ తన తండ్రి పెట్టుకున్న యాపిల్ వాచ్‌తో సంభాషిస్తూ..మీ పేరేమిటి అని అడుగుతాడు. అవతల నుంచి సిరి అని సమాధానం వస్తుంది. నువ్వు మా బాబాయ్‌వా అని ప్రశ్నించగా.. మీరేం అడుగుతున్నారో అర్థం కావడం లేదు అని అవతల నుంచి సమాధానం వచ్చింది. బాబాయ్ అంటే అంకుల్ అని, మీ పెళ్లెప్పుడు అని యాపిల్ సిరిని అడుగుతాడు. ఈ వీడియోకి ‘ఆపిల్ శిరీ మరియు అల్లు శిరీ దగ్గర ఆన్సర్ లేదు’అంటూ కామెంట్ పెడుతూ.. స్నేహారెడ్డి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయాన్.. తన బాబాయ్ అనుకొని జరిపిన సంభాషణ నెటిజన్స్‌తో పాటు బన్నీ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. (చదవండి : శింబు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజేందర్) -
బాబాయ్‌తో కలిసి చిందులు..
హైదరాబాద్ : హీరో అల్లు శిరీష్.. తన సోదరుల పిల్లలతో కలిసి సందడి చేశారు. అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ, అల్లు వెంకట్ కుమార్తె అన్వితలతో కలిసి ఓ సాంగ్‌కు చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బన్నీ భార్య స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఫన్ విత్ శిరి బాబాయ్’ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో అన్విత, అయాన్లు తమకు తోచిన స్టేప్పులు వేశారు. అర్హ మాత్రం పక్కన ఉన్న అయాన్, వెనకాల ఉన్న శిరీష్ ఏం చేస్తున్నారో చూసుకుంటూ.. చాలా క్యూట్ క్యూట్ స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ వీడియోపై శిరీష స్పందిస్తూ.. ‘2020లో అంకుల్ విధుల్ ఇవ్వే.. అందులో పిల్లలతో టిక్‌టాక్‌లు చేయించడం కూడా ఉంది’ అని పేర్కొన్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. శిరీష్ నటించిన చివరి చిత్రం ఏబీసీడీ విడుదలై నేటికి(మే 17) ఏడాది పూర్తి అయింది. అయితే ఇప్పటివరకు శిరీష్ తన తదుపరి చిత్రానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. (చదవండి : బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ) View this post on Instagram Fun with Siri Babai ❤️ A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on May 16, 2020 at 2:47am PDT -
అల్లు శిరీష్‌తో.. అనూ ఇమ్మాన్యుయేల్..!
‘శైలజారెడ్డి అల్లుడు (2018)’ తర్వాత తెలుగులో కాస్త స్లో అయినట్లున్నారు హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. మళ్లీ స్పీడ్‌ను అందుకోవాలనే ఆలోచనతో తాజాగా ఓ తెలుగు సినిమాకు అను సైన్ చేశారట. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమైన ‘విజేత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అను హీరోయిన్గా నటించబోతున్నారని సమాచారం. ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటిస్తారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట శశి. -
చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది : శిరీష్
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఫేక్ పోస్టులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం కూడా కష్టతరంగా మారింది. తమపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి పలువురు సెలబ్రిటీలు పోలీసులను ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ ఫేక్ పోస్టుపై హీరో అల్లు శీరిష్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఓ నెటిజన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన శిరీష్.. నకిలీ స్ర్కీన్షాట్లు పోస్ట్ చేసి.. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. అయితే శిరీష్ స్పందించిన వెంటనే.. సదరు నెటిజన్ ఆ పోస్ట్‌ను తొలగించాడు. నాలుగేళ్ల తర్వాత.. మరో ట్వీట్లో అల.. వైకుంఠపురములో మ్యూజిక్ నైట్‌కు తను హాజరవుతున్నట్టు చెప్పారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తన సోదరుడి చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌కు హాజరవుతున్నట్టు తెలిపారు. 2016 సరైనోడు ఆడియో ఫంక్షన్‌కు హాజరయ్యానని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరు అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్.. పలు చిత్రాల్లో మెప్పించారు. గతేడాది ఏబీసీడీ చిత్రంతో శిరీష్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలు అవార్డు ఫంక్షన్లకు ఆయన హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. Please dont post fake screenshots and create such negativity. I'll be compelled to take legal action for doing such mischief. — Allu Sirish (@AlluSirish) January 6, 2020 -
స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...
ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీ అల్లు అరవింద్! ఇప్పటికీ బిజీ! కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు. అంత ఖాళీ లేనప్పుడు ఇప్పుడెలా కూర్చున్నారు?! ఇంత దగ్గరగా! ఇంత లవ్లీగా! ఇంత ప్లెజెంట్‌గా! ఇదంతా ఆయన బెటర్ హాఫ్ నిర్మల ఆయనకు ఇచ్చిన స్పేస్! స్పేస్ చేసుకోవడం కాదు.. స్పేస్ ఇచ్చుకోవడం ఉంటే.. ఆ దాంపత్యం ఎప్పటికీ స్వీట్ అండ్ స్ట్రాంగ్ అంటున్నారు.. మిస్టర్ అండ్ మిసెస్ అల్లు అరవింద్. మీ పెళ్లి బంధం ‘అల్లుకున్న’ రోజుల గురించి? అరవింద్: (నవ్వుతూ)... మా నాన్నగారు, నిర్మల పెదనాన్న ఫ్రెండ్స్. ‘మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడు పల్లెటూరి అమ్మాయిని చేసుకోనంటున్నాడు. మినిమమ్ విజయవాడ అమ్మాయి అంటున్నాడు. చూడండి’ అని ఆయనతో మా నాన్నగారు అంటే, ‘మా తమ్ముడు కూతురు పెళ్లీడుకొచ్చింది. వాళ్లతో మాట్లాడతాను’ అన్నారాయన. ఆ తర్వాత నాన్నగారు వెళ్లి చూసొచ్చి, ‘అమ్మాయి బాగుంది. నాకు నచ్చింది’ అని చెప్పేశారు. నేను చూడ్డానికి వెళ్లాక పెద్దగా ఇంటర్వ్యూలు లేవు. అమ్మాయిని చూపించారు. అంతే.. తాంబూలాలు మార్చుకున్నారు. పెళ్లిచూపులకి, పెళ్లికి మధ్య గ్యాప్ ఎంత? అరవింద్: 1974లో మా పెళ్లి జరిగింది. పెళ్లి చూపులకి, పెళ్లికి మధ్య ఐదు నెలలు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఓసారి కాఫీకి తీసుకెళదామని ట్రై చేశాను. ‘మా అమ్మను అడగండి’ అంది. ‘నువ్వు అడుగు. వాళ్లు పంపిస్తే వెళదాం’ అన్నాను. ఊహూ అంది. యాక్చువల్‌గా మా అత్తగారు పాతకాలం మనిషిలా ఉండరు. అప్పట్లో మా అత్తగారిని మ్యానేజ్ చేసుకుని ఉంటే, ఈవిడని కాఫీకి తీసుకెళ్లగలిగేవాడిని. ముందు అది తెలియలేదు. ఆ తర్వాత మా అత్తగారు పాతకాలపు మనిషి కాదని తెలిసింది. మీకు ముగ్గురు సిస్టర్స్. మీ పెళ్లయ్యేనాటికే వాళ్ల పెళ్లయిందా? అరవింద్: నా చెల్లి వసంత పెళ్లి, మా పెళ్లి ఒక్క రోజు తేడాలో జరిగింది. ఏప్రిల్ 7న మా పెళ్లి. 8న ఇద్దరి రిసెప్షన్ ఒకే రోజు జరిగింది. మరి.. పెళ్లయ్యాక కాఫీకి వెళ్లారా? నిర్మల: వెళ్లాం. మా రిసెప్షన్ మదరాసులో జరిగింది. ఆ వేడుక కోసం మా అమ్మానాన్న వచ్చారు. వాళ్లని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కి వెళ్లాం. ఇంటికి వచ్చేటప్పుడు భుహారీ హోటల్లో కాఫీ తాగాం. అప్పట్లో అది పెద్ద హోటల్. అరవింద్‌గారిలో మీకు నచ్చిన లక్షణాలు? నిర్మల: దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. కూల్‌గా ఉంటారు. అది బాగా నచ్చుతుంది. అయితే మా పెళ్లయిన కొత్తలో ‘ఏంటీ.. ఏం చెప్పినా సీరియస్‌గా తీసుకోరు’ అనుకునేదాన్ని. అరవింద్: మామూలుగా భర్త అంటే కొంచెం సీరియస్‌గా అలా ఉంటారు కదా. నేనలా ఉండకపోయేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇంత లైట్‌గా ఉన్నారేంటి అనుకుంది. అయితే కొన్ని సందర్భాల్లో నా కోపం చూసి, ఓహో కోపం కూడా వస్తుందనుకుంది. మీ కుటుంబానికి సినిమా పరిశ్రమతో సంబంధం లేదు కదా.. మరి ‘అల్లువారింట్లో’ అడ్జస్ట్ కావడానికి ఇబ్బందిపడ్డారా? నిర్మల: మా నాన్నగారిది ఆయిల్ బిజినెస్. సినిమాలతో సంబంధం లేదు. దాంతో పూర్తిగా వేరే కల్చర్‌లోకి వచ్చినట్లు అనిపించింది. మాది బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఇంట్లో చాలామంది పనివాళ్లు ఉండేవారు. నాన్న బిజినెస్ వ్యవహారాలు చూసుకునేదాన్ని. అంత లిబరల్గా పెంచారు. నన్ను క్వీన్లానే చూసుకున్నారు. మరి అత్తింట్లో కూడా క్వీన్లానే ఉన్నారా? నిర్మల: అరవింద్‌గారు, ఇంకా అందరూ అలానే చూసుకుంటారు (నవ్వుతూ). అరవింద్: అయితే తనకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ. ఇంటికి పెద్ద కోడలిగా అన్నీ చూసుకుంది. పెళ్లికి ముందు ఉన్నంత లిబరల్గా అయితే లేదు. జాయింట్ ఫ్యామిలీనే కదా? నిర్మల: అవును. మా పెళ్లితో పాటు ఒక ఆడపడుచుకి పెళ్లయింది. తను కూడా కొన్నాళ్లు మాతోనే ఉంది. ఈయన అక్కగారు పెళ్లి చేసుకోలేదు. అప్పటికి సురేఖ (చిరంజీవి సతీమణి)గారికి కూడా పెళ్లి కాలేదు. సురేఖగారిది, నాదీ ఇంచు మించు ఒకే ఏజ్ కావడంతో బాగా కలిసిపోయేవాళ్లం. మా పుట్టింట్లో మా మేనత్తలతో కలిసి పెరిగాను. అలా ఉమ్మడి కుటుంబం నాకు అలవాటే. దాంతో ఇబ్బందిగా అనిపించలేదు. అరవింద్: తనకి మనుషులంటే ఇష్టం. చిరంజీవిగారు, సురేఖగారి పెళ్లి మీ చేతుల మీద జరిగిందనుకోవచ్చా? అరవింద్: అవును... దగ్గరుండి తనే బాధ్యతగా చేసింది. స్క్రీన్‌పై మీ మావయ్య (అల్లు రామలింగయ్య) గారు కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. నటుడిగా అంత జోవియల్‌గా కనిపించిన ఆయన మీతో ఎలా ఉండేవారు? అరవింద్: ఈవిడకి ఆయన వెరీ గుడ్ ఫ్రెండ్. నిర్మల: అవును. మావయ్యగారు వెరీ ఫ్రెండ్లీ. అరవింద్: ఆయనకు భోజనం పెట్టడం అన్నీ చేసేది. వయసు పైబడిన తర్వాత నాన్నకు ఆరోగ్యం సహకరించకపోతే భోజనం తినిపించేది. మామాకోడలు అంత బాగుండేవాళ్లు. నిర్మల: నన్ను కూతుళ్లతో సమానంగా చూశారు. ఎప్పుడూ నన్ను పేరుతో పిలవలేదు. ‘అమ్మాయి’ అనే పిలిచేవారు. ఆయన షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక వీళ్లెవరూ దొరికేవారు కాదు. దాంతో ఏదైనా చెప్పాలనుకుంటే నాతోనే షేర్ చేసుకునేవారు. అరవింద్: నాపై చాడీలు కూడా చెప్పేవారు. ‘ఆ వెధవ...’ అంటూ నన్ను తిట్టేవారు. మా కాపురంలో పుల్లలు పెట్టేవారు కూడా (నవ్వులు). నిర్మల: అవును.. ‘చూడమ్మాయి.. వాడు లేట్‌గా వస్తున్నాడంటే పని ఉందని కాదు.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి’ అనేవారు. అరవింద్: ఎలా చెప్పేవారంటే.. ‘అమ్మాయి.. వాడు పది తర్వాత ఇంటికి వచ్చాడు. అంత పనేం లేదు. ఓ కంట కనిపెట్టు’ అనేవారు. అవి విన్నప్పుడు మీకు భయం అనిపించేదా? నిర్మల: అలా ఏం లేదు. మావయ్యగారు అలా అన్నారని ఆయనతో చెప్పేదాన్ని. ఇద్దరం నవ్వుకునేవాళ్లం. అరవింద్: నాన్నతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు చాలా గౌరవం కూడా ఇచ్చేది. అంతెందుకు? ఇప్పటికీ మా అమ్మ అలా హాల్లోకి వస్తే టక్కున లేచి నిలబడుతుంది. నిర్మల: ఆ రోజుల్లో అత్తగారు అంటే.. అలానే గౌరవించేవాళ్లు. ఆరోగ్యం సహకరించినంత వరకూ అత్తయ్యగారే అన్నీ చూసుకున్నారు. వంట చేసేటప్పుడు మాత్రం ఏం చేయాలని మాట్లాడుకుని చేసేవాళ్లం. నేను నాన్‌వెజ్ పెద్దగా తిననని నా కోసం వేరే చేసేవారు. నాకు వేడిగా తినడం అలవాటు. అందుకని అందరి కోసం వెయిట్ చేయకుండా తినమనేవారు. దాంతో నాకు అమ్మ ఇంటికి, అత్తింటికి తేడా తెలియలేదు. అత్తగారిని చూడగానే లేచి నిలబడే జనరేషన్ నుంచి వచ్చారు. మారిన కాలంలో ఇప్పటి కోడళ్లు అలా చేయకపోవచ్చు. ఈ మార్పు? నిర్మల: ఆ రోజుల్లో అలా ఒక అలవాటు ఉండేది. అత్తయ్యగారు అని కాదు. అప్పట్లో పెద్దవాళ్లు ఎవరు వచ్చినా లేచి నిలబడటం అనేది ఒక పద్ధతి. అప్పట్లో ఆడవాళ్లు పెద్దగా బయటకు వెళ్లడం ఉండేది కాదు. ఇప్పుడు ఆడవాళ్లు బయటకు వెళుతున్నారు. నిరూపించుకుంటున్నారు. ఇప్పటి కోడళ్ల అలవాట్లు ఇప్పటి కాలానికి కరెక్ట్. అరవింద్: మీకో విషయం చెప్పనా.. మా ఆవిడని ‘ఉత్తమ అత్తగారు’ అని మా కోడళ్లే చెబుతారు. అందుకే ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాం. అత్తాకోడళ్లు ఫ్రెండ్లీగా ఉంటారు. మా కోడళ్లు మా ఆవిడని ‘నో నాన్సెన్స్’ అత్తగారు అని అంటారు (నవ్వుతూ). ఉమ్మడి కుటుంబంలో గొడవలు లేకుండా ఉండాలంటే ఏదైనా టిప్స్? నిర్మల: నేను ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటాను. కాలంతో పాటు మనం కూడా మారాలి. ఫలానా విషయం గురించి బన్నీకి చెప్పకపోయావా అమ్మా? అంటే బన్నీ గురించి మీకు తెలుసు కదా అత్తయ్యా అంటుంది. అరవింద్: వారి జీవితాలను ఓవర్‌ల్యాప్ చేయం. ఎవరి స్పేస్ వారికి ఇస్తాం. బాబీ, బన్నీ, శిరీష్.. ఈ ముగ్గురి మనవళ్లను చూసుకుని అల్లు రామలింగయ్యగారు మురిసిపోయిన విశేషాల గురించి? అరవింద్: పిల్లలతో బాగా ఆడుకునేవారు. మా పెద్దబ్బాయి బాబీ మీద ఒకసారి ఆయనకు ఎందుకో కోపం వచ్చింది. కర్ర తీసుకుని, వాడిని కొట్టడానికి ముందుకొస్తే, బాబీ పరిగెత్తాడు. కొంచెం పరిగెత్తాక ‘రేయ్.. ఆయాసం వస్తోంది. వచ్చి ఒక దెబ్బ తిని వెళ్లు’ అంటే, వాడు దగ్గరకొచ్చి ఒక్క దెబ్బ తిని వెళ్లాడు (నవ్వుతూ). అరవింద్‌గారు 45 ఏళ్ల వయసులో తన తండ్రితో చెంప దెబ్బ తిన్నారు. ఆ విషయాన్ని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. ఆ చెంప దెబ్బ విషయం మీకు తెలుసా? అరవింద్: కారు ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ, ఇంటికి రాగానే బ్రేక్ స్పీడ్‌గా వేశాను. నాన్నగారు విండ్ షీల్డ్‌కి కొట్టుకోబోయారు. ఆ కోపంతో నా చెంప మీద ఒక్కటిచ్చారు. మా ఆవిడ చూసేసిందేమోనని కంగారుపడ్డాను కానీ చూడలేదు. ఈ వయసులో కూడా నాన్నతో తన్నులు తిన్నాడనుకుంటుందేమోనని కంగారు. లోపలికెళ్లి నాన్న కొట్టిన విషయం చెప్పి, అమ్మ దగ్గర గొడవపడదామనుకున్నాను. కానీ అమ్మతో చెప్పేటప్పుడు తను వింటుందేమోనని మ్యాటర్‌ని సైలెంట్ చేసేశాను. కట్ చేస్తే.. బెడ్రూమ్లోకి వెళ్లగానే ఎందుకండీ మావయ్యగారు అలా కొట్టారు అంది. అబ్బా... తెలిసిపోయిందనుకున్నాను. తను వరండాలో నిలబడి చూసిందట. నాన్న నన్ను అలా కొట్టగానే భయపడి లోపలికి పారిపోయింది. పిల్లల పెంపకం బాధ్యతను ఇద్దరూ సమానంగా తీసుకున్నారా? అరవింద్: నేను బాధ్యత తీసుకోలేదు. ఆ అవసరం రాకపోవడం నా అదృష్టమనే చెప్పాలి. 1973లో ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి ఈరోజు వరకూ బిజీగా ఉన్నాను. పిల్లల విషయాలను మా అమ్మ, నా పెద్ద చెల్లి వసంత, ఈవిడ.. ఈ ముగ్గురూ చూసుకున్నారు. మా చెల్లి కొన్నాళ్లు మాతోనే ఉంది. ఆవిడకి మేనల్లుళ్లు అంటే చాలా ప్రేమ. ఇప్పటికీ బాబీ, బన్నీ, శిరీష్ మా మీద కోపం వస్తే వాళ్ల మేనత్తకి కంప్లైంట్ చేస్తారు. బన్నీ (అల్లు అర్జున్)ని హీరోని చేయాలని ఎవరు అనుకున్నారు? నిర్మల: మా పెళ్లయిన నాలుగైదేళ్లకు చిరంజీవిగారితో సురేఖగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత చిరంజీవిగారి ఫంక్షన్స్ అవీ చూసి, బన్నీ హీరో అయితే బాగుంటుందనుకునేదాన్ని. ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతాయి.. స్టేజ్ మీద బన్నీని చూసుకోవచ్చు అనే ఇమాజినేషన్ ఉండేది. కానీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి, మెచ్యుర్టీ వచ్చాక ఇండస్ట్రీలోకి వెళితే బాగుంటుందనుకునేదాన్ని. అయితే తను ఇష్టపడితేనే.. నా అభిప్రాయాన్ని పాటించాలనుకునేదాన్ని కాదు. మీక్కూడా బన్నీని హీరోగా చూడాలని ఉండేదా? ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’తో పోల్చితే ఆ తర్వాతి సినిమాల్లో బన్నీ మేకోవర్ సూపర్.. అలా మార్చుకున్న తీరు గురించి? అరవింద్: బన్నీకి పట్టుదల ఎక్కువ. అనుకుంటే సాధిస్తాడు. యానిమేషన్ స్కూల్లో అడ్మిషన్ కావాలి. రోజుకు పది నుంచి 12 గంటలు ప్రాక్టీస్ చేస్తే కానీ అక్కడ పాస్ అవుతారు. ఓ మూడు నెలలు ప్రతి రోజూ 12 గంటలు సాధన చేశాడు. అక్కడ అడ్మిషన్ వచ్చింది. బన్నీ మంచి యానిమేటర్. అయితే సీట్ వచ్చాక ‘గంగోత్రి’కి చాన్స్ వచ్చింది. ‘ఒక సెమిస్టర్ మానేయ్.. ‘గంగోత్రి’ క్లిక్ అయితే చూద్దాం’ అన్నాను. ‘గంగోత్రి’ తర్వాత ‘ఆర్య’ చేశాడు. ప్రూవ్ చేసుకున్నాడు. దాంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు. అరవింద్‌గారికి ఇంటిని పట్టించుకునే తీరిక లేదు కాబట్టి ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య వాదనలు జరిగేవా? నిర్మల: అలా ఏం లేదు. ఇల్లు బాగుండాలంటే నేనన్నా వర్క్ చేయాలి లేదా ఆయన అయినా వర్క్ చేయాలి. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలంటే ఆయన నాతోనే ఉండాలి అనుకుంటే కుదరదు. నేను ఈ జనరేషన్ వాళ్లకి అదే చెబుతాను. మనం అన్ని సౌకర్యాలు అనుభవించాలంటే జీవిత భాగస్వామికి తప్పనిసరిగా స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు అరవింద్గారినే తీసుకోండి.. ఆయన ఏ పనీ చెయ్యకుండా నాతోనే ఉండాలి అనుకుంటే గీతా ఆర్ట్స్‌లాంటి పెద్ద సంస్థను ఎలా మేనేజ్ చేస్తారు? మా పిల్లలకు అన్నీ సమకూర్చాలంటే ఆయన స్పేస్ ఆయనకు ఇవ్వాల్సిందే. అలా కాకుండా బాగా పని మీద ఉన్నప్పుడు ‘ఇంటికి రండి’ అని నేను సతాయించకూడదు. అలా ఇంట్లోవాళ్లు సతాయిస్తే.. ‘అయ్యో ఇంటికి వెళ్లాలా’ అని ఆలోచిస్తారు. ఆ ఆలోచన రాకుండా మేనేజ్ చేయటంలోనే నేను ఆయనకు స్పేస్ ఇచ్చినట్లు. తప్పనిసరిగా ఆయనకు ఆ క్రియేటివ్ స్పేస్ నేను ఇస్తాను. ఫైనల్లీ.. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఏం చేయాలి? అరవింద్: భార్యాభర్తల మధ్య నమ్మకం ముఖ్యం. మా పెళ్లైన ఈ 45 సంవత్సరాల్లో ఇంత పెద్ద గ్లామర్ ఇండస్ట్రీలో నేను ఉన్నప్పటికీ ఏనాడూ తను నన్ను అనుమానించలేదు. అదే మా పెద్ద సక్సెస్. అసలు మనస్పర్థలను రోజుల తరబడి సాగనివ్వకూడదు. ఏదైనా సరే ఇద్దరూ కూర్చుని, మాట్లాడుకోవాలి. నిర్మల: మళ్లీ చెబుతున్నాను. పార్టనర్‌కి స్పేస్ ఇవ్వండి. మా ఇద్దరి విషయంలో మొదట్లోనే ఓ అగ్రిమెంట్ ఉంది. అదేంటంటే ‘క్యారెక్టర్ ఈజ్ యువర్సెల్ఫ్’. అంటే.. నువ్వేంటో అదే నీ క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్ మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టం. అందుకని ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని మేం ఒకరికొకరు చెప్పుకోం. మన క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉంటాం. మా జీవితం హ్యాపీగా గడిచిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. భార్యాభర్తలు కష్ట సుఖాలను సమానంగా పంచుకుంటూ ముందుకెళ్లడం మంచి వైవాహిక జీవితానికి నిదర్శనం. మీ జీవితంలో జరిగిన ఓ విషాద ఘటన (కుమారుడు చనిపోవడం) తాలూకు బాధను ఎలా అధిగమించారు? అరవింద్: ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యం అండీ. నిర్మల కూడా చాలా ధైర్యం ఉన్న మనిషి. మా మూడో అబ్బాయి శిరీష్ పుట్టడం వెనకాల ఒక కారణం ఉంది. బన్నీ తర్వాత పుట్టిన అబ్బాయి చనిపోయాడు. ఆ బాబుకి ఐదేళ్లు. మాకు ఊహించని షాక్. ముగ్గురు బాబులు ఉన్నారు కదా, ఇక పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకుంది. కానీ మూడో బాబు చనిపోయాక.. మళ్లీ తన కడుపున ఆ బాబు పుడతాడని, ‘రీకేనలైజేషన్’ (మళ్లీ పిల్లలు పుట్టడానికి) చేయించుకోవాలనుకుంది. 30ఏళ్ల క్రితం వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి చెందలేదు. అయినా తను ఆ నిర్ణయం తీసుకుంది. ‘మేజర్ ఆపరేషన్ సార్. మూడు గంటలు జరుగుతుంది. అయినా పిల్లలు పుట్టే చాన్స్ పది శాతమే’ అని డాక్టర్ అన్నారు. అప్పట్లో మూడు గంటల ఆపరేషన్ అంటే లైఫ్ రిస్క్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా.. వద్దని నిర్మలతో అన్నాం. గైనకాలజిస్ట్ కూడా ఇదే చెప్పారు. అయినా సరే నిర్మల ఒప్పుకోలేదు. ఆపరేషన్ చేయించుకుంది. కానీ, ఆ తర్వాత కొన్ని నెలల వరకూ గర్భం రాలేదు. దీంతో ఓ వైద్య పరీక్ష చేశాం. సారీ.. ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది అన్నారు. ఈ విషయం ఆమెకు చెప్పడానికి సందేహించాం. కానీ తనకు తెలిసిపోయింది. అయితే ‘ఐ విల్ గెట్ బ్యాక్ మై సన్’ అంది నిర్మల. అన్నట్లుగానే.. ఆ తర్వాతి నెల తను ‘కన్సీవ్’ అయింది. అలా పుట్టిన బాబే శిరీష్. నిర్మల: ఆ బాబు చనిపోయాడు, నేను ఏడ్చినా, ఏం చేసినా రాడు. ఈ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేసుకోవచ్చని ఆలోచించాను. అందుకే మొండిగా ఆపరేషన్ చేయించుకున్నాను. స్నేహాని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు మీ ఇద్దరి రియాక్షన్? అరవింద్: అర్జున్ ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ విషయం మా ఇంట్లో అయిదు నిమిషాల్లోనే సెటిల్ అయ్యింది. ముందు స్నేహ విషయం బన్నీ తన అమ్మ దగ్గరే చెప్పాడు. నిర్మల: అర్జున్ వచ్చి స్నేహాని చేసుకుంటాను అంటే, నువ్వు చేసుకున్నా, మేం వేరే అమ్మాయిని చూసి చేసినా నువ్వు హ్యాపీగా ఉండాలి. మాకు ముఖ్యం అదే. నువ్వు హ్యాపీగా ఉంటే మేం హ్యాపీ అన్నాను. – డి.జి. భవాని -
అల్లు శిరీష్ సందడి
-
హుందాగా స్పందించిన అల్లు శిరీష్
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ పుట్టినరోజు నేడు. అల్లు రామలింగయ్య మనవడిగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా వెండితెరకు పరిచయం అయిన శిరీష్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రొటీన్ ఫార్ములా కథలను కాకుండా డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు శిరీష్. ఈ ట్వీట్లో శిరీష్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఏబీసీడీ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు శిరీష్. మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించిన శిరీష్ ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తానన్నాడు. ‘మేమంతా మీకు మంచి సినిమా అందించేందుకు చాలా కష్టపడ్డాం. కానీ అంచనాలను అందుకోలేకపోయాం’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్లాప్ సినిమాలకు కూడా సక్సెస్మీట్లు పెట్టి హడావిడి చేస్తున్న తరుణంలో శిరీష్ స్పందించిన తీరు హుందాగా ఉందంటున్నారు విశ్లేషకులు. ❤️🙏🏽 pic.twitter.com/kSUyKPNQbM — Allu Sirish (@AlluSirish) 30 May 2019 -
ఆ పరీక్షలో పాసయ్యాం
‘‘సినిమాను ఒక్కొక్కరు ఒక్కో దృష్టికోణంతో చూస్తారు. అందుకే సినిమా హిటై్టనా, ఫ్లాపైనా కొన్ని విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ విమర్శలను విశ్లేషించుకుంటూ, కొత్తతప్పులు చేయకుండా ముందుకు వెళ్లడమే ఒక ఫిల్మ్ మేకర్‌గా నా పని’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్ అన్నారు. అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏబీసీడీ’. మలయాళ ‘ఏబీసీడీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజైంది. ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని ‘మధుర’ శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన చెప్పిన విశేషాలు. ∙నా కెరీర్లో ఇప్పటివరకు తీసినవన్నీ కాన్సెప్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ సినిమాలే. కమర్షియల్ సినిమాలు అంతగా తీయలేదు. అందుకే మంచి కాన్సెప్ట్ ఉన్న ‘ఏబీసీడీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సోమవారం కూడా మంచి కలెక్షన్స్ రావడం ముఖ్యం. ఈ సోమవారం పరీక్షలో మేం పాసయ్యాం. ∙‘ఒక్క క్షణం, శ్రీరస్తు శుభమస్తు’ సినిమాల్లో అల్లు శిరీష్ కామెడీ టైమింగ్ నచ్చి ఈ చిత్రానికి తీసుకున్నాం. శిరీష్ ఇంటెలిజెంట్, సిన్సియర్ యాక్టర్. బాగా నటించాడు. దర్శకుడు సంజీవ్ బాగా చేశాడు. యష్ రంగినేనిగారు బాగా సపోర్ట్ చేశారు. నా సినిమాలకు నిర్మాత డి. సురేశ్‌బాబుగారి సహకారం ఉండాలనుకుంటాను. ∙నా కెరీర్లో నేను చేసిన తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయడం అంత ఈజీ కాదు. బహుశ ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ రీమేక్ కావొచ్చు. నా దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత నిర్మాతగా సినిమాలు చేస్తున్నాను. హిందీలో కరణ్ జోహార్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎక్కువగా నిర్మిస్తారు. అప్పుడప్పుడు సినిమాలను డైరెక్ట్ చేస్తారు. నేను కూడా ఆయనలా అన్నమాట. మంచి ఎగై్జటింగ్ కథ దొరికితే మళ్లీ డైరెక్ట్ చేస్తాను. భవిష్యత్‌లో వెబ్‌సిరీస్‌లకు మంచి డిమాండ్ ఉంటుంది. నేను నిర్మించాలనుకుంటున్నాను. కానీ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఉన్నప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ∙మామూలుగా సినిమా విడుదలైన మొదటిరోజే థియేటర్లో చూస్తూ యూఎస్ నుంచి లైవ్ అప్డేట్స్ ఇస్తుంటారు. థియేటర్స్‌లో అప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ కూర్చుంటే వారు సినిమాను ఏం ఆస్వాదించగలరు? సినిమా చూసి కాస్త రిలాక్స్ అయ్యి వారి అభిప్రాయాలు చెబితే బాగుంటుందని నా అభిప్రాయం. ∙మా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘దొరసాని’. ఈ చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితా–రాజశేఖర్ కుమార్తె శివాత్మికలను పరిచయం చేస్తున్నాం. జూలై 5న సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. -
‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్‌ప్యూజ్డ్ దేశీ) జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అల్లు శిరీష్, రుక్సర్ ధిల్లాన్, భరత్, రాజా, నాగబాబు సంగీతం : జుడా సాండీ దర్శకత్వం : సంజీవ్ రెడ్డి నిర్మాత : మథురా శ్రీధర్, యష్ రంగినేని మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ హీరోగా ప్రూవ్ చేసకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నాడు. తెలుగులో నాలుగు సినిమాలు హీరోగా నటించినా స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చే హిట్ ఒక్కటి కూడా పడలేదు. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో ఈ మంచి సక్సెస్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమాతో అయిన అల్లు శిరీష్ సూపర్ హిట్ సాధించాడా..? కథ : అరవింద్ ప్రసాద్ (అల్లు శిరీష్) అలియాస్ అవి.. న్యూయార్క్‌లో సెటిల్ అయిన ఇండియన్ మిలియనీర్ విద్యా ప్రసాద్ (నాగబాబు ) కొడుకు. తన అత్త కొడుకు బాషా అలియాస్ బాలషణ్ముగం (భరత్)తో కలిసి సరదాగా లైఫ్ గడిపేస్తుంటాడు. నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాంటి బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. తన కొడుక్కి డబ్బు విలువ, జీవితం విలువ తెలియ జేయాలనుకున్న విద్యా ప్రసాద్.. వెకేషన్ పేరుతో అవి, బాషాలను ఇండియాకు పంపిస్తాడు. అలా ఇండియాకు వచ్చిన వారిద్దరిని నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని చెప్తాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉండిపోయిన అవికి లోకల్ పొలిటీషన్ భార్గవ్‌తో గొడవ అవుతుంది. అవి, భార్గవ్‌ల మధ్య గొడవకు కారణం ఏంటి..? అమెరికాలో పెరిగిన అవి, బాషాలు ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? ఓ సాధారణ యువకుడిగా ఇండియాలో అడుగుపెట్టిన అవి.. సెలబ్రిటీగా, యూత్ ఐకాన్‌గా ఎలా మారాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : అల్లు శిరీష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మంచి పరిణతి చూపించాడు. ఎలాంటి రెస్పాన్సిబులిటీ లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రలో సరిగ్గా సరిపోయాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి నటన కనబరిచాడు. బాలనటుడిగా సుపరిచితుడైన భరత్ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. తన పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ నటనకు పెద్దగా అవకాశం లేని పాత్రలో కనిపించారు. లుక్స్ పరంగా మాత్రం మంచి మార్కులు సాధించారు. హీరో తండ్రి పాత్రలో నాగబాబు ఒదిగిపోయాడు. విలన్‌గా రాజా పరవాలేదనిపించాడు. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, శుభలేక సుధాకర్, కోట శ్రీనివాసరావు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్ది పాటు మార్పులతో రీమేక్ చేశాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. కథ పరంగా బాగానే ఉన్నా కథనంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. బలమైన సంఘర్షణ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇండియా వచ్చిన తరువాత హీరో ఇబ్బంది పడే సన్నివేశాల్లో మరింత కామెడీ, ఎమోషన్స్ చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు సాదా సీదాగా నడిపించేశాడు. కథలోనూ బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవటం కూడా మైనస్ అయ్యింది. జుడా సాండీ అందించిన సంగీతం బాగుంది. ‘మెల్ల మెల్ల మెల్ల మెల్లగా’ పాటతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. అమెరికాలో తెరకెక్కించిన సీన్స్‌తో పాటు హైదరాబాద్‌లోని స్టమ్లో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా కలర్ఫుల్గా కెమెరాలో బంధించారు సినిమాటోగ్రాఫర్ రామ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటం బలమైన సన్నివేశాలు లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
స్టార్డమ్ ఏబీసీడీలు కూడా శిరీష్ స్టార్ట్ చేయాలి
‘‘ఏబీసీడీ’ సినిమా ట్రైలర్ చూస్తుంటే నా ‘పిల్ల జమీందార్’ సినిమా గుర్తుకు వస్తోంది. నా సినిమాను మించి ‘ఏబీసీడీ’ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు హీరో నాని. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అన్నది ఉపశీర్షిక. డి.సురేశ్‌బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ– ‘‘నేను యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు శిరీష్‌ను అప్పుడప్పుడు కలిశాను. అప్పుడు తను కాస్త లావుగా, బొద్దుగా ఉండేవాడు. సినిమా బిజినెస్ గురించి చాలా మంచి ఆర్టికల్స్ రాసేవాడు. ప్రొడక్షన్లో అరవింద్‌గారికి మంచి సక్సెసర్ దొరికాడని అనుకున్నాను. కట్ చేస్తే తను యాక్టర్ అయిపోయాడు. తన కెరీర్‌కు సంబంధించి ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేసిన శిరీష్, తన స్టార్డమ్కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ–‘‘రెండేళ్ల కిందట నా కజిన్ రామ్‌చరణ్ ‘ఏబీసీడీ’ మలయాళ సినిమా సీడీ నాకు ఇచ్చి, ఈ క్యారెక్టర్ నీకు కరెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పాడు. సినిమా చూస్తే చాలా బాగుందనిపించింది. ఈ సినిమాలో హీరో డబ్బు విలువ తెలియకుండా పాడైపోయాడని భావించిన తండ్రి అతన్ని బాగు చేసుకోవడానికి ఏం చేశాడనేదే కథ. బన్నీకి, రామ్‌చరణ్‌కు 21 ఏళ్లు వచ్చినప్పుడు కారు కొనిచ్చారు. నాకు 21 ఏళ్లు వచ్చాక మంచి స్పోర్ట్స్ కారు కొనివ్వమని నాన్నను అడగ్గానే ‘చెప్పుచ్చుకుని కొడతాను.. నీ వయసువాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తున్నారు. నీకు కారు కొనివ్వడమే లగ్జరీ. అలాంటిది స్పోర్ట్స్ కారు కొనివ్వమని అడుగుతున్నావ్’ అని కొనివ్వలేదు. నీ కారుకి బడ్జెట్ ఇంత అనుకుంటున్నాను అంటే, ఆ రోజు నేను కోపానికి పోయి ‘నాకు వద్దులే, నా సొంత డబ్బులతోనే కొనుక్కుంటాను’ అన్నాను. అయితే ఆ కారు కొనడానికి నాకు మూడేళ్లు పట్టింది. అప్పుడు నాన్న చేసిన పనివల్ల డబ్బు విలువ తెలిసి వచ్చింది. కాబట్టి ఈ సినిమాను మా నాన్నకు డెడికేట్ చేస్తున్నాను. ఈ చిత్రంలో నా తండ్రి పాత్రలో నాగబాబుగారిని తప్ప మరెవరినీ ఊహించుకోలేను’’ అన్నారు. ‘‘మధుర’ శ్రీధర్ నాకు మంచి స్నేహితుడు. అతనితో కొంతకాలంగా ట్రావెల్ చేస్తున్నాను. అల్లు అరవింద్‌గారు కూడా నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాతో శిరీష్‌కు పెద్ద విజయం రావాలి’’ అన్నారు డి.సురేశ్‌బాబు. ‘‘అందరికీ థాంక్స్’’ అని ‘మధుర’ శ్రీధర్ రెడ్డి అన్నారు. ‘‘మధుర శ్రీధర్’తో ట్రావెల్ చేసేటప్పుడు మా నాన్నతో ఉన్నట్లే అనిపించింది. అల్లు శిరీష్ సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్ హీరో కూడా. కొత్త డైరెక్టర్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. శిరీష్ నాకు లైఫ్ లాంగ్ హీరోగా ఉంటారు’’ అన్నారు సంజీవ్ రెడ్డి. రుక్సార్ థిల్లాన్, మ్యూజిక్ డైరెక్టర్ జుడా సాందీ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులు పాల్గొన్నారు. -
‘ఏబీసీడీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
ప్రెసిడెంట్‌గారి మనవరాలు
లండన్‌లో పుట్టి గోవాలో పెరిగి బెంగళూరులో చదువు పూర్తి చేసింది రుక్షర్ ధిల్లాన్. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైన రుక్సర్ ఆమధ్య ‘కృష్ణార్జున యుద్ధం’తో ‘ప్రెసిడెంట్‌గారి మనవరాలు’గా తెలుగు తెరపై మెరిసింది. అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న రుక్షర్ గురించి కొన్ని ముచ్చట్లు... డిగ్రీ తరువాతే... గోవాలో నైంత్ గ్రేడ్ పూర్తయిన తరువాత తదుపరి చదువుల కోసం బెంగళూరు వచ్చింది రుక్షర్. అక్కడ బిషప్ కాటన్ హైస్కూల్లో చదువుకుంది. ఆ తరువాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. బెంగళూరులో వ్యాపారప్రకటనల్లో నటిస్తున్న రోజుల్లోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే... ‘‘డిగ్రీ తరువాతే సినిమాలు’’ అని డిసైడ్ కావడంతో సినిమాల జోలికి వెళ్లలేదు. తొలి సినిమా ‘రన్ ఆంటోనీ’ సినిమాతో వెండితెరకు పరిచమైంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో రాజ్‌కుమార్ మనవడు వినయ్ రాజ్‌కుమార్ సరసన నటించింది. ఈ సినిమాలో సూసైడ్ బాంబర్‌గా నటించింది. ఆమె నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ‘కృష్టార్జున యుద్ధం’ సినిమాలో రియా పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. షో టైమ్ ‘షో టైమ్’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఎందుకంటే ఆ సినిమాను డైరెక్టర్ చేయబోయే యస్.యస్.కాంచీ బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి కజిన్ అనేదే ఆమె ఉత్సాహానికి కారణం. ‘సెలెక్ట్ అవుతానా!’ అనే చిన్న బెరుకు ఉండేదట. మొత్తానికైతే ఆడిషన్లో సెలెకై్ట ఆ సినిమాలో భాగమైపోయింది. చారిత్రక పాత్రలు... విభిన్నమైన పాత్రలు చేయడం అంటే తనకు ఇష్టం అని చెబుతుంది రుక్షర్. సంజయ్ లీలా బన్సాలీ సినిమాల్లో కనిపించే చారిత్రక పాత్రలు వేయడమంటే తనకు ఇష్టమట. ‘భాంగ్రా పా లె’ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన రుక్షర్ ‘ఫలానా ఇండస్ట్రీలో మాత్రమే పనిచేయాలని ఉంది’లాంటి పట్టింపులు లేవు అని చెబుతుంది. ‘ప్రాంతీయ చిత్రాలు కూడా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి’ అంటూ ప్రాంతీయ చిత్రాల గొప్పతనాన్ని చెప్పకనే చెప్పింది రుక్షర్. -
‘ ఏబీసీడీ ’మూవీ ట్రైలర్ లాంచ్
-
‘రిచ్‌గానే పుట్టాను.. రిచ్‌గానే పెరిగాను’
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ సరైన హిట్ కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. చివరగా.. ‘ఒక్క క్షణం’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈసారి పక్క భాషలో హిట్ అయిన ఓ చిత్రం కన్నేశాడీ ఈ హీరో. మళయాలంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని ఏబీసీడీ(అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్స్, సాంగ్స్‌తో మంచి హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మాష్టర్ భరత్ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించగా.. జుడా శాండీ సంగీతాన్ని సమకూర్చారు. -
‘తుగ్లక్’గా నందమూరి హీరో
ఇటీవల 118 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు మల్లిడి వేణు డైరెక్షన్లో సోషియే ఫాంటసీ సినిమాలో నటించేందుకు కల్యాణ్ రామ్ ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఫాంటసీ సినిమా కావటంతో బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అవుతుందని తెలుస్తోంది. అందుకే రిస్క్ లేకుండా ఈ సినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట కల్యాణ్ రామ్. మల్లిడి వేణు సినిమాను ముందుగా అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడట. కానీ ఫైనల్ కల్యాణ్ రామ్ ఓకె చెప్పటంతో ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
‘ఏబీసీడీ’ మెల్ల మెల్లగా సాంగ్ లాంచ్
-
అల్లు వారి ‘ఏబీసీడీ’ వాయిదా..!
అల్లు ఫ్యామిలీ హీరోగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు శిరీష్. హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఏబీసీడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మళయాలంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా మార్చి 1న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏబీసీడీ రిలీజ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు అన్‌సీజన్ కావటం, మార్చి నెలలో విద్యార్థులు పరీక్షలతో బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో మార్చి నెలాఖరున రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మార్చి 22న ఏబీసీడీ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శిరీష్‌కు జోడిగా రుక్సర్ ధిల్లాన్ నటిస్తున్నారు. -
ఆకట్టుకుంటోన్న ‘ఏబీసీడీ’ మోషన్ పోస్టర్!
ఎంతో కాలంపాటు బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న అల్లువారబ్బాయి అల్లు శిరీష్‌కు ఏబీసీడీ రూపంలో హిట్ వచ్చేట్టు కనిపిస్తోంది. మాలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌తో ప్రేక్షకులముందుకు రాబోతోన్న ఈ చిత్ర మోహన్ పోస్టర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ)గా అల్లు శిరీష్ హాస్యాన్ని పండించబోతున్నాడని ఈ మోషన్ పోస్టర్లో తెలుస్తోంది. అమెరికాలో పుట్టిపెరిగిన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో విలేజ్‌కు వచ్చి ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
అప్పటినుంచి అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయా
మెగా హీరో, అల్లువారబ్బాయి అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిస్తుంటారు. ప్రస్తుతం ఈ హీరో మలయాళ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏబీసీడీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే అల్లు శిరీష్ తాజాగా చేసిన ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ నటించిన 'ఆర్య 2' 2009లో ఇదే రోజు(నవంబర్ 27)న విడుదలైంది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ‘నేను సినిమాలు చూస్తూ ఎమోషన్ కి లోనైన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది 'ఆర్య 2' సినిమాలో అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం తన గొంతుపై కత్తి పెట్టుకున్న సీన్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ సీన్ చూసిన దగ్గర నుంచే అల్లు అర్జున్‌కి అభిమానినయ్యాను. 'ఆర్య', 'ఆర్య 2' ఈ రెండు సినిమాల్లోను ప్రేమ.. స్నేహం.. త్యాగం గురించి గొప్పగా చెప్పారు. అందుకే ఈ సినిమాలంటే నాకెంతో ఇష్టం’ అంటూ ట్వీట్ చేశారు. -
ముగింపు దశలో ‘ఏబీసీడీ’
‘ఒక్క క్షణం’ సినిమాతో పలకరించిన అల్లు శిరీష్‌కు నిరాశే మిగిలింది. అనుకున్నస్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని అల్లువారబ్బాయి మలయాళ రీమేక్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మాలీవుడ్‌లో హిట్ అయిన ‘ఏబీసీడీ’ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యుల్‌ను నవంబర్ 2న ప్రారంభించింది చిత్రయూనిట్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన అల్లు హీరో
కెరీర్లో భారీ హిట్ లేక సతమతమవుతున్నాడు మెగాహీరో అల్లు శిరీష్. దాంతో ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేస్తున్నాడు. ‘ఒక్క క్షణం’ తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. ‘1971’ సినిమా వచ్చినా అది డబ్బింగ్ చిత్రం ఖాతాలోకి వెళ్లిపోయింది. గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మెగాహీరో మాలీవుడ్‌లో హిట్ అయిన ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో అదే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన నటించే అవకాశం ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సర్ థిల్లాన్ సొంతం చేసుకున్నారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తనకి ఈ సినిమాతో మంచి హిట్ లభిస్తుందని ఈ మెగా హీరో కోటి ఆశలు పెట్టుకున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్ న్యూస్‌ను అల్లూ శిరీష్ స్వయంగా ట్విటర్లో షేర్ చేశాడు. ‘సినిమాలో నేను కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్లో నటిస్తున్నాను కావచ్చు. కానీ ప్రేక్షకులందరికీ ఫిబ్రవరి 8, 2019న థియేటర్లో వినోదాన్ని పంచడం పక్కా’అంటూ పోస్ట్ చేశాడు. -
అల్లు శిరీష్‌కు ఎంత పెద్ద మనసో..!!
విండోస్ యూజర్‌గా 20 ఏళ్ల పాటు కొనసాగిన టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, మ్యాక్ యూజర్‌గా మారిపోయారు. తన అన్న అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్‌తో అల్లు శిరీష్‌కు కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. ఈ సందర్భంగా తన అన్నకు కృతజ్ఞత చెబుతూ.. అల్లు శిరీష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వెంటనే రిప్లైగా ఓ యూజర్ ఒక ట్వీట్ చేశాడు. ‘అన్నా నాకు కూడా ఒక చిన్న ల్యాప్‌టాప్ గిఫ్ట్ ఇవ్వు అన్నా. నేను కొనాలి అంటే ఇంకో మూడేళ్లు పడుతుంది. నాకు ఫ్యామిలీ ఉంది. శాలరీ తక్కువ. నా ఉద్యోగంలో ల్యాప్‌టాప్ వాడకం ఎక్కువ కానీ నాకు ల్యాప్‌టాప్ లేదు. కానీ నేను మీకు చాలా పెద్ద అభిమానిని శ్రీ’ అంటూ అల్లు అర్జున్‌కు, అల్లు శిరీష్‌కు ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేశాడు. అభిమాని బాధను అర్థం చేసుకున్న వెంటనే అల్లు శిరీష్, ‘అయ్యో.. బాధపడకు బ్రదర్, నీవు సంపాదిస్తున్నావు. మీ కుటుంబాన్ని పోషిస్తున్నాయి. నా దగ్గర కొత్త ల్యాప్‌టాప్ ఉంది. నా సోని వైవో ల్యాప్‌టాప్‌ను నీవు తీసుకో. కూల్. నాకు డైరెక్ట్ మెసేజ్ పంపు. చీర్స్’ అంటూ ఈ యంగ్ హీరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అల్లు శిరీష్‌కు ఎంతో పెద్ద మనసో అంటూ.. అభినందనలు వెల్లువ కొనసాగుతోంది. సూపర్ అన్నయ్య మీలాంటి వాళ్లు రిప్లయ్ ఇవ్వడమే గొప్ప గిఫ్ట్ అని, దయా హృదయం అంటూ.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అల్లు శిరీష్ అభిమానులు. కొంతమంది కొంటె అభిమానులు ‘అన్నా.. నాకు ఎప్పుడు ఇస్తావు గిఫ్ట్’ అంటూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. బ్రదర్ నాకు ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ కావాలి. కొనాలంటే ఐదేళ్లు పట్టేలా ఉంది అంటూ మరో యూజర్ కొంటెగా రిప్లయి ఇచ్చాడు. అన్నా అలాగే ఇంకొంచెం పెద్ద మనసు చేసుకుని ఏపీ 9 బీడ్ల్యూ 666 ని నాకు ఇచ్చేయ్ అంటూ ట్వీట్ చేశాడు. త్వరలో అల్లు అర్జున్ మీకు కొత్త కారు గిఫ్ట్‌గా ఇస్తారంటూ కూడా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. After being a Windows user for 20 yrs I've made the move to MacOS. Thank you @alluarjun for the gift. From my BenQ Joybook in school to now, you've always gifted me my laptops. pic.twitter.com/9G7oZs6Kd6 — Allu Sirish (@AlluSirish) September 26, 2018 Ayyo.. Dont worry bro, you earn and support your family.. Since I have new laptop, you take my Sony Vaio. Cool? Send me a DM. Cheers. https://t.co/GTKLDWn7I5 — Allu Sirish (@AlluSirish) September 27, 2018 -
యాక్టర్లు.. టీచర్ల అవతారం ఎత్తారు..
బంజారాహిల్స్: ‘నేను డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యాను’ అంటారు చాలామంది. అయితే ఇప్పుడు కొంతమంది యాక్టర్లు.. టీచర్ల అవతారం ఎత్తారు. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. 2014లో ఏర్పాటైన ‘టీచ్ ఫర్ ఛేంజ్’ స్వచ్ఛంద సంస్థ.. సర్కార్ స్కూళ్లలోని విద్యార్థుల్లో ఆంగ్ల పరిజ్ఞానం పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 200 ప్రభుత్వ పాఠశాలలను ఈ సంస్థ దత్తత తీసుకుంది. మొత్తం 600 మంది వలంటీర్లు వారానికోసారి ఆయా స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు ఇంగ్లిష్‌లో రాయడం, చదవడం, మాట్లాడటం నేర్పిస్తారు. ఈ సంస్థను మరింత ప్రోత్సహించేందుకు కొందరు సినీ తారలు ముందుకొచ్చారు. వీలైన సమయంలో పాఠశాలలకు వెళ్లి గంటపాటు ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్ సింగ్, రెజీనా, ప్రణీత, అల్లు శిరీష్ తదితరులు ఈ సంస్థకు చేయూతనందిస్తున్నారు. వీరు ఆసక్తిగా పాఠాలు బోధిస్తుండడంతో పాటు విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, హిమాయత్‌నగర్, ఫిలింనగర్, సికింద్రాబాద్ తదితర సర్కారు బడుల్లో రెజీనా, ప్రణీత పాఠాలు బోధించారు. ఇదో సంతృప్తి.. పేద విద్యార్థులకు పాఠాలు చెప్పడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ప్రతి నెలా రెండుసార్లు స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు క్లాస్ తీసుకుంటున్నాను. – రెజీనా టీచర్ వృత్తి ఎంతో గౌరవప్రదమైంది. నేను చదువుకునేరోజుల్లోటీచర్లను ఎంతో గౌరవించేదాన్ని.– రకుల్‌ప్రీత్ సింగ్ -
‘ఎంసీఏ’ అంటే కొత్త అర్థం చెప్పిన మెగాహీరో!
ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయ్ కాదు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే అంతకంటే కాదు. ఎంసీఏ అంటే అల్లువారబ్బాయి అల్లు శిరీష్ కొత్త అర్థాన్ని చెప్పారు. బుధవారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సెలబ్రెటీలు చిరుని కలిసేందుకు క్యూ కట్టారు. ఇలానే ఈ యువ హీరో కూడా చిరుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. చిరుతో దిగిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘చివరగా నేను నా సిగ్గును జయించి.. మా మామయ్యను ఓ సెల్ఫీ అడిగాను. నేను కూడా కోట్లలో ఒక్కడినే.. నేనెప్పుడూ గర్వ పడుతుంటా.. ఎంసీఏ (మెగాస్టార్ చిరంజీవి అభిమాని)ని అయినందుకు’ అంటూ పోస్ట్ చేశాడు. Finally overcame my shyness and asked my Uncle for a selfie! Like crores of others I am always a proud MCA (Megastar Chiranjeevi Abhimani). #megaselfie pic.twitter.com/kxmGIDXiYH — Allu Sirish (@AlluSirish) 22 August 2018 -
కథా చర్చలకు కాస్త బ్రేక్ అంటున్న మెగా హీరో!
మెగా హీరోలందరిలో కెల్లా అల్లు శిరీష్ కాస్త నెమ్మదించాడు. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ‘ఒక్క క్షణం’ తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. 1971 సినిమా వచ్చినా అది డబ్బింగ్ చిత్రం ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ మెగాహీరో మాలీవుడ్‌లో హిట్ అయిన ఏబీసీడీ సినిమాను రీమేక్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీమేక్‌కు సంబంధించిన స్టోరీ డిస్కషన్ బెంగళూరులో జరుగుతోంది. కథలో మార్పులు చేర్పులు చేయడానికి అక్కడ కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ పనికి కాస్త విరామం ఇస్తూ.. సైక్లింగ్‌కు వెళ్తున్నామంటూ శిరీష్ ట్వీట్ చేశాడు. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. Taking a break from our story sessions and cycling around. #bengaluru #abcd pic.twitter.com/hxX8h0yniu — Allu Sirish (@AlluSirish) August 11, 2018 -
సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు!
ఈ మాట వింటుంటే ఎక్కడో విన్నట్టుంది కదూ. కాకపోతే సెల్ఫీలకు బదులు అక్కడ డబ్బులు అని ఉంటుంది. ‘అవును మరి డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు’.. ఈ మాటని టీవీ యాడ్స్‌లో పదేపదే చెప్పి, తన వేషదారణతో ఫేమస్ అయ్యారు లలితా జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్. అయితే గతకొంతకాలం నుంచి ఈ యాడ్ టీవీల్లో పెద్దగా కనిపించటం లేదు. అయినా సరే ఈయన చెప్పిన డైలాగ్‌ను మాత్రం జనం మరిచిపోలేదు. తాజాగా మెగా హీరో అల్లు శిరీష్.. ఈయన్ను ఎయిర్‌పోర్ట్‌లో కలిసినప్పుడు ఓ సెల్ఫీ దిగి ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు! లక్ ఉండాలి. హహ అంటూ.. ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను .. ఓ సెల్ఫీ అడిగాను’ అంటూ కిరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. Selfies evvariki urike raavu! Luck undali ;) Haha! Met Lalitha Jewelry MD, Mr Kiran Kumar on the flight. Had to ask for a selfie! pic.twitter.com/NjBoDnVR6s — Allu Sirish (@AlluSirish) July 3, 2018 -
సూర్య సినిమాలో బొమన్ ఇరానీ!
కోలీవుడ్‌లో ఓ భారీ మల్టిస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ సూర్య, మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు. కేవీ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో ‘అత్తారింటికి దారేది’ ఫేం బొమాన్ ఇరానీ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రకటించారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్‌కు తాతగా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే తాజాగా సూర్య , మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న సినిమాలో అవకాశం వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్ కూడా నటించనున్నాడు. ఇది సూర్యకు 37వ చిత్రం. గతంలో కేవీ ఆనంద్ డైరక్షన్లో వచ్చిన వీడొక్కడే, బ్రదర్స్‌తో హిట్స్ కొట్టిన సూర్య ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. Welcome to Kollywood, @bomanirani sir! #Suriya37 https://t.co/LNUAkSDVTb — Allu Sirish (@AlluSirish) June 22, 2018 -
అసహనం వ్యక్తం చేసిన మెగాహీరో
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే మెగాహీరో అల్లు శిరీష్. తన అభిమానులు వేసే ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతూ ఉంటారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే అల్లు శిరీష్ ఓ విషయంపై అసహనం వ్యక్తం చేశారు. చూస్తుంటే ఆ విషయం ఏదో కానీ తనకు ఎక్కడ లేని కోపాన్ని తెచ్చిపెట్టినట్టుంది. ఇంతకీ ఏం జరిగిందంటే. అల్లు శిరీష్ ఈ మధ్యే ఎయిర్టెల్ నుంచి వోడాఫోన్ నెట్‌వర్క్‌కు మారారట. అయితే వోడాఫోన్ నెట్వర్క్ సర్వీస్ చాలా ఘోరంగా ఉందని, బ్యాడ్‌నుంచి వరెస్ట్‌కు వచ్చినట్టైందని ఆవేదన వ్యక్తం చేశారు. 4జీ సర్వీస్ వదిలేయండి, కనీసం 2జీ కూడా సరిగా పనిచేయడం లేదని, ఒక్కోసారి కాల్ డ్రాప్స్ అవుతున్నాయని, సిగ్నల్ కూడా ఉండటంలేదని వాపోయారు. ఈ విషయంపైనే ఈ మెగా హీరో ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలియదంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. అల్లు శిరీష్ ప్రస్తుతం కన్నడ రీమేక్ ఏబీసీడీలో నటిస్తున్నారు. "You'll never realise the value of something while you have it." Ported from Airtel to Vodafone. Its a move from bad to worse. Forget 4G, even 2G doesn't work most times. Forget call drops there's no signal only. Regret it! Lesson learnt. @VodafoneIN 😂😂😂 — Allu Sirish (@AlluSirish) June 21, 2018 -
ఆ ‘సర్ప్రైజ్’ రివీల్ చేసిన మెగా హీరో
పలు చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న బాల నుటుడు భరత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తనున్నారు. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కనున్న ఏబీసీడీ చిత్రంలో హీరో ఫ్రెండ్ పాత్రను పోషించనున్నారు. ఈ విషయాన్ని శిరీష్ సోమవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. నిన్న అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు చెప్పిన శిరీష్ నేడు ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ చిత్రంలో శిరీష్‌కు ఫ్రెండ్ పాత్రలో భరత్ ఫుల్ లెన్త్ పాత్రలో కనపించనున్నారు. శిరీష్ ట్వీట్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందిసూ.. భరత్‌కు అల్ ది బెస్ట్ చెబుతున్నారు. వెంకీ, పోకిరి, ఢీ, రెడీ, కింగ్ వంటి అనేక చిత్రాల్లో భరత్ చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. మాలీవుడ్‌లో హిట్ అయిన ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అమెరికా నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ బాణీలు అందిస్తారు. కృష్ణార్జున యుద్దం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్సర్ థిల్లార్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. Master Bharath will be seen in a full length role as my best friend in ABCD. He transitions from child artiste to a character actor with this film. Welcome, Bharath. #ABCDTelugu pic.twitter.com/v4ES88ynp3 — Allu Sirish (@AlluSirish) June 11, 2018 -
అల్లు శిరీష్‌కు జోడీగా రుక్సర్?
హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ కృష్ణార్జున యుద్దం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌పరంగా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా అల్లు శిరీష్ నటిస్తోన్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైంది. అల్లు శిరీష్ మలయాళ రీమేక్ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాలీవుడ్‌లో హిట్ అయిన ఎబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యూఎస్ నుంచి ట్రిప్ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. Happy to share that @RuksharDhillon plays the female lead in ABCD. Hello & welcome onboard Rukshar! #ABCDTelugu pic.twitter.com/uJUvWi3M3k — Allu Sirish (@AlluSirish) June 1, 2018 -
చిన్నారి తమ్ముడికి ప్రేమతో : అల్లు అర్జున్
అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ హార్ట్ టచింగ్ ట్వీట్‌తో శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా జీవితంలోని తొలి చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ చిన్నారి నా కళ్లముందే పెరిగి పెద్దయ్యాడు. నా జీవితంలో అతి ఎక్కువ జ్ఞాపకాలను, రహస్యాలను పంచుకుంది కూడా ఇతనితోనే. నా చిన్నారి తమ్ముడు సిరి (శిరీష్)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ తో పాటు అల్లు శిరీష్, అల్లు అర్జున్ ఫ్యామిలీ కేక్ కట్ చేయిస్తున్న ఫొటోను ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. శిరీష్ ప్రస్తుతం మలయాళ సినిమా ఏబీసీడీ రీమేక్‌తో పాటు సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. Happy Birthday Day to the 1st Baby in my Life . The baby who grew in front of my eyes from the beginning of my time . The one with whom I shared the maximum amounts of memories & secrets 😉. My Baby Brother Siri . Happy Birthday 😘🎂. @AlluSirish pic.twitter.com/2EntnQXe6Y — Allu Arjun (@alluarjun) 30 May 2018 -
రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో అల్లు శిరీష్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌ను గాడిలో పెట్టే సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొద్ది రోజులుగా శిరీష్ చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో రకరకాల వార్తలు ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై శిరీష్ క్లారటీ ఇచ్చాడు. కొద్ది రోజులుగా తాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాట్టుగా వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టి పారేశాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు శ్రీకాంత్ అడ్డాలను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. శిరీష్ ప్రస్తుతం తెలుగులో ఏబీసీడీ రీమేక్‌తో పాటు సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. -
ఇక స్పీడ్ పెంచుతా
‘‘నా సినిమా కథలు ముందుగా నాన్న వింటారు. సెట్స్‌కు వెళ్లే ముందు బన్నీ (అల్లు అర్జున్) కూడా వింటాడు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకుంటాను. షూటింగ్ పూర్తి చేసి, ఎడిటింగ్ అయిన తర్వాత కూడా వారికి సినిమా చూపిస్తా’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. నేడు (బుధవారం) పుట్టినరోజు జరుపుకుంటున్న శిరీష్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో దుల్కర్ సల్మాన్ చేసిన మలయాళ ‘ఏబీసీడీ’ రీమేక్ ఒకటి. సూర్యగారు హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నటిస్తున్నా. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌గారు కూడా ఉన్నారు. సూర్యగారికి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీ. జూలై 1న లండన్‌లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ‘ఏబీసీడీ’ రీమేక్‌లో మిలియనీర్ కొడుకుగా కనబడతా. సంజీవ్ కొత్త డైరెక్టర్ అయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తనపై నాకు నమ్మకం ఏర్పడింది. రీమేక్ చేయడం చాలా కష్టం. రీమేక్‌ల గురించి మనం ఆలోచించినంతగా ప్రేక్షకులు ఆలోచించరు. వారికి సినిమా నచ్చితే చాలు. ఇలాంటి సినిమాలే చేయాలని హద్దులు పెట్టుకోలేదు. ‘ఒక్క క్షణం’ సినిమా కమర్షియల్‌గా ఆశించినంత రిజల్ట్ ఇవ్వలేదు. నా వరకు నా కెరీర్లో బెస్ట్ మూవీ అది. ఇతర హీరోల్లా వేగంగా సినిమాలు చేయడం లేదు. మా అన్నయ్య వచ్చి 15 ఏళ్లు అవుతున్నా 17 సినిమాలే చేశాడు. ఒక సినిమాపై ఫోకస్‌గా ఉంటే క్వాలిటీ బాగుంటుంది అనేది కరెక్టే. కానీ కమర్షియల్‌గా ముందుకెళ్లాలంటే ఎక్కువ చిత్రాలు చేయాలి. ఇకపై స్పీడ్ పెంచి, ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. -
కన్ఫ్యూజ్డ్ దేశీ.. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్
దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం ఏబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) చిత్రం తెలుగు రీమేక్‌లో అల్లు శిరీష్ నటిస్తున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు సంజయ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీని తీసుకున్నట్టు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ‘ఆపరేషన్ అలిమేలమ్మ, చమక్’ వంటి కన్నడ సూపర్ హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చారు జుడా స్యాండీ. ‘‘ఏబిసిడికు జుడా స్యాండీను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాం. కన్నడలో యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. వెల్కమ్ టూ టాలీవుడ్ బ్రో’’ అంటూ స్యాండీను టాలీవుడ్‌కు వెల్కమ్ చేశారు శిరీష్. ‘‘తెలుగు సినిమాలో పార్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా, చాలా గౌరవంగా కూడా ఉంది’’ అని పేర్కొన్నారు జుడా స్యాండీ. -
అల్లు వారబ్బాయిది నెగెటివ్ రోల్ కాదట..!
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన అల్లు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ సినిమా 1971 బెయాండ్ బార్డర్స్‌లో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. తాజా సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలోనూ శిరీష్ నటించేందుకు అంగీకరించాడు. అయితే ఈ సినిమాలో శిరీష్ నెగెటివ్ రోల్లో నటిస్తున్నట్టుగా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన శిరీష్ టీం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో శిరీష్ చేసేది నెగెటివ్ రోల్ కాదని, ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో శిరీష్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. వీడొక్కడే, రంగం చిత్రాల దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోహన్‌లాల్ మరో కీలకపాత్రలో నటిస్తుండగా.. అఖిల్ ఫేం సయేషా హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. -
అభిమాన నటుడితో మెగా హీరో
మలయాళ స్టార్ హీరో కంప్లీట్‌యాక్టర్ మెహన్ లాల్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. సూర్య హీరోగా వీడొక్కడే, బ్రదర్స్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఓ టాలీవుడ్ యంగ్ హీరో కూడా నటించనున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్, మెహన్ లాల్, సూర్య కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ తన సోషల్ మీడియా పేజ్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన అభిమాన హీరో సూర్యతో కలిసి నటించటం, మోహన్ లాల్ లాంటి టాప్ హీరోతో రెండో సారి కలిసి నటించే అవకాశం రావటం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు శిరీష్. Excited to be onboard for #Suriya37. As a @Suriya_offl fan its a dream come true to share screen space with him. Honoured to be sharing screen space with Lal sir again. Thx @anavenkat sir for giving me this opportunity. pic.twitter.com/9xIKz4Mc28 — Allu Sirish (@AlluSirish) 13 May 2018


