ముగింపు దశలో ‘ఏబీసీడీ’  | Allu Sirish ABCD Movie Final Schedule Starts On 2nd November | Sakshi
Sakshi News home page

Nov 3 2018 5:51 PM | Updated on Nov 3 2018 5:53 PM

Allu Sirish ABCD Movie Final Schedule Starts On 2nd November - Sakshi

‘ఒక్క క్షణం​’ సినిమాతో పలకరించిన అల్లు శిరీష్‌కు నిరాశే మిగిలింది. అనుకున్నస్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టాలని అల్లువారబ్బాయి మలయాళ రీమేక్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మాలీవుడ్‌లో హిట్‌ అయిన ‘ఏబీసీడీ’ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు.

ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌ చివరి షెడ్యుల్‌ను నవంబర్‌ 2న ప్రారంభించింది చిత్రయూనిట్‌. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లు శిరీష్‌ సరసన రుక్సార్‌ థిల్లాన్‌ నటిస్తున్నారు. సంజీవ్‌ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై యశ్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement