
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలామంది యువత పెళ్లంటే పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ తమ్ముడిని కూడా పదేళ్లుగా పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు అడుగుతున్నా సరే నో చెబుతున్నాడట. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా శిరీష్ బయటపెట్టాడు.
అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శిరీష్.. గమనం, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు తదితర సినిమాలు చేశాడు. చివరగా 'బడ్డీ' అనే మూవీలో కనిపించాడు. ప్రస్తుతానికైతే మూవీస్ చేయట్లేదు. గతంలో కలిసి పనిచేసిన ఓ హీరోయిన్ తో శిరీష్ రిలేషన్ లో ఉన్నాడనే రూమర్స్ వచ్చాయి గానీ తర్వాత పెద్దగా సౌండ్ లేదు. మళ్లీ ఇన్నాళ్లకు తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు.
(ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాత కూతురి పెళ్లి.. 15 వేలమంది గెస్టులు)
అల్లు అరవింద్ నిర్మిచిన #సింగిల్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది నిర్వహించారు. దీనికి హాజరైన శిరీష్ ని పెళ్లెప్పుడు చేసుకుంటారు, ఇప్పటివరకు ఎందుకు చేసుకోవట్లేదని యాంకర్ సుమ అడిగింది. దీనికి సమాధానంగా..'మా ఇంట్లో వాళ్ల కన్నా మీరే ఎక్కువ అడుగుతున్నారు. మీరెప్పుడు కలిసినా నన్ను ఇదే అడుగుతున్నారు. సంబంధం చూస్తారా ఏంటి?' అని అన్నాడు. దీనికి కౌంటర్ గా పక్కనే కూర్చున్న అల్లు అరవింద్.. పదేళ్ల నుంచి చేసుకోమని బతిమాలాడుతున్నా సరే చేసుకోవట్లేదని చెప్పుకొచ్చారు.
దీంతో శిరీష్ మాట్లాడుతూ.. పెళ్లయిన నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ‍్ళి, మీ లైఫ్ ఎలా ఉంది? నన్ను కూడా చేసుకోమంటారా అని అడిగితే చేసుకోవద్దు, సింగిల్ గానే లైఫ్ బాగుంటుందని సలహా ఇస్తున్నారని చెప్పుకొచ్చాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన సుమ.. నేను పెళ్లి చేసుకోను అని అన్నవాళ్లంతా ఏదో ఓ రోజు చేసుకోవాల్సిందే, మీరు చేసుకుంటారు అప్పుడు నేను వస్తానని నవ్వేసి వెళ్లిపోయింది. ఇదంతా చూస్తుంటే శిరీష్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడేమో అనే సందేహం వస్తోంది.
(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్)