మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశం నేపథ్యంతో రూపొందిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సోషియో ఫ్యాంటసీ సూపర్ నేచురల్ చిత్రంలో సుమంత్ హీరోగా నటించారు. మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
రాజశ్యామల పతాకంపై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. సోమవారం (ఫిబ్రవరి 9) సుమంత్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా కొత్త గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాలోని ముఖ్య పాత్రల్లో ప్రముఖ హీరో, హీరోయిన్లు నటించారని, వారి వివరాలను, రిలీజ్ డేట్‌ను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది.


