మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. పుష్ప తరహాలోనే ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇక హీరోయిన్ విషయంలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రంగస్థలం సమయంలో మొదట అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెను తప్పించి సమంతను తీసుకున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సమయంలో నిరాశ చెందిన అనుపమకు తప్పకుండా మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు తీసుకుంటానని సుకుమార్ మాటిచ్చాడు.
ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. చరణ్-సుక్కూ కాంబో మళ్లీ కలిసింది. అనుపమ కూడా ఇంకా లైమ్‌లైట్‌లోనే ఉంది. ఈసారి ఆమెకు ఛాన్స్ వస్తుందా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. తన కెరీర్‌లో అనుపమ కొన్ని మంచి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా తనకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తనకు ఇప్పటి వరుకు స్టార్ హీరోల రేంజ్‌లో మాత్రం ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. నటనలో మాత్రం అనుపమను తక్కువ చేయలేం. మరి ఈసారైనా ఆమెకు సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా?
సుకుమార్ ఈసారి రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందో, దానికి అనుపమ సరిపోతుందో లేదో చూడాలి. లేకపోతే మరో స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చరణ్-సుక్కూ సినిమా అధికారిక ప్రకటన వచ్చే నెలలో వస్తుంది. హీరోయిన్ ఎవరన్నది అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


