
తమిళంలో పలు సినిమాలని తీసిన నిర్మాత ఇషారీ గణేశ్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయిపోయారు. ఎందుకంటే తన పెద్ద కుమార్తె ప్రీతికి భారీగా ఖర్చు చేసి పెళ్లి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ పెళ్లెప్పుడు? ఎవరెవరు రాబోతున్నారు?
వేల్స్ యూనివర్సిటీ, వేల్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో అటు విద్యా రంగంలో, ఇటు సినిమా నిర్మాణంలో గుర్తింపు తెచ్చుకున్న ఇషారీ గణేశ్.. తన పెద్ద కూతురు ప్రీతికి చెన్నైలో శనివారం (మే 09) వివాహం చేయనున్నారు. ఈ వేడుకకు తమిళ సినీ ప్రముఖులైన రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, ధనుష్, సూర్య, శివకార్తికేయన్ తదితరులు రాబోతున్నారు.
(ఇదీ చదవండి: మంచు మనోజ్.. 'అత్తరు సాయిబు'?)
మరోవైపు గణేశ్ తండ్రికి రాజకీయ నేపథ్యం కూడా ఉండటంతో తమిళ రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లికి విచ్చేయనున్నారు. మొత్తంగా 15 వేల మందికి పైగా అతిథులు ఈ పెళ్లికి వెళ్లనున్నారు. పూర్తిగా తమిళ సినిమాలే నిర్మించిన ఇషారీ గణేశ్ కు టాలీవుడ్ హీరోలతో పరిచయం ఉందో లేదో? లేదంటే తెలుగు హీరోలు కూడా ఈ పెళ్లికి హాజరవుతారేమో చూడాలి?
తాజాగా గురువారం.. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో సంగీత్ వేడుక జరుగుతోంది. దీనికి హీరో సూర్య హాజరై కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు. పక్కనే రెట్రో సక్సెస్ మీట్ ముగించుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్)