
గత కొన్నిరోజుల నుంచి మంచు కుటుంబం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎందుకంటే మనోజ్-విష్ణు మధ్య మొదలైన పంచాయితీ.. కొన్నిరోజుల ముందు వరకు కూడా సాగింది. మరీ ముఖ్యంగా 'కన్నప్ప'కు పోటీగా తన 'భైరవం' సినిమాని రిలీజ్ చేస్తానని మనోజ్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. కన్నప్ప వాయిదా పడటంతో మనోజ్ కూడా సైలెంట్ అయిపోయాడు.
(ఇదీ చదవండి: ఆ దర్శకుడు నన్ను కొట్టలేదు.. బాగా చూసుకున్నాడు: హీరోయిన్ ఇవానా)
సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే మంచు మనోజ్ నుంచి మరో క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. 'అత్తరు సాయిబు' పేరుతో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. గతంలో '90 ఎమ్ఎల్' తీసిన దర్శకుడు శేఖర్ రెడ్డి.. మనోజ్ తో మూవీ చేయబోతున్నాడని తెలుస్తోంది.
టైటిల్ చూస్తేనే సమ్ థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. మరి ఈ మూవీలో మనోజ్ ఎలా కనిపిస్తాడో ఏమో? ప్రస్తుతానికి ఇదంతా ఇంకా అనధికారికమే. త్వరలో ప్రకటిస్తారేమో? మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. చాన్నాళ్లుగా సినిమాలకు దూరమైన ఇతడు.. 'మిరాయ్', 'భైరవం' సినిమాల్లో నటించాడు. ఈ రెండు ఈ ఏడాదే థియేటర్లలోకి రానున్నాయి.
(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్)