నీరా ఆర్య బయోపిక్‌లో? | Kangana Ranaut In Early Talks For Neera Arya Biopic | Sakshi
Sakshi News home page

నీరా ఆర్య బయోపిక్‌లో?

Mar 15 2026 12:39 AM | Updated on Mar 15 2026 12:41 AM

Kangana Ranaut In Early Talks For Neera Arya Biopic

బాలీవుడ్‌ హీరోయిన్, భార తీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్‌ ప్రస్తుతం నీరా ఆర్యగా ఒదిగిపోవడానికి కసరత్తులు చేస్తున్నారని టాక్‌. ఎందుకంటే నీరా ఆర్య బయోపిక్‌లో నటించడానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. తన కెరీర్‌లో ఎన్నో సవాల్‌తో కూడిన పాత్రలు చేసిన కంగన ప్రస్తుతం ఆచి తూచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఆమె లోక్‌సభ సభ్యురాలు కావడమే. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న ఆమె గతంలోలా కాకుండా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే నీరా ఆర్య బయోపిక్‌లో నటించడానికి అంగీకరించారట.

స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’కు అనుబంధంగా రాణీ ఆఫ్‌ ఝాన్సీ మహిళా రెజిమెంట్‌ ఉండేది. ఇందులో కీలక సభ్యురాలిగా నీరా ఆర్య వ్యవహరించారు. భారతదేశ తొలి మహిళా గూఢచారిగా ఆమెకు పేరుంది. బ్రిటిష్‌ అధికారిని పెళ్లాడి, సిద్ధాంత విభేదాలతో విడిపోయిన నీరా ఆర్యని బ్రిటీష్‌ అధికారులు అరెస్ట్‌ చేసి, చిత్రహింసలకు గురిచేశారట.

1998 జూలై 26న ఆమె మృతి చెందారు. స్వాతంత్య్ర సంగ్రామంలో చూపించిన ధైర్యసాహసాలు, గూఢచారిగా అద్భుతంగా పని చేసిన వైనం... ఇలా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన జీవితం ఆమెది. అలాంటి నీరా జీవితకథతో శివమ్‌ నాయర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రానుందని సమాచారం. కంగనాని కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్‌ గురించి వివరించగా ఆమె పచ్చజెండా ఊపారని టాక్‌. కంగన ప్రస్తుతం ‘భారత భాగ్య విధాత’ అనే సినిమా చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement