
తమిళ దర్శకుడు బాలా గురించి ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియదు. ఎందుకంటే అప్పట్లో శివపుత్రుడు, సేతు, నేనే దేవుడిని, వాడు వీడు, పరదేశి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు. తర్వాత కాలంలో పూర్తిగా దర్శకత్వం తగ్గించేశారు. అయితే సెట్ లో హీరోహీరోయిన్లని ఈయన కొడతారనే టాక్ ఉంది. ఇప్పుడు ఈ విషయమై యువ హీరోయిన్ ఇవానా రియాక్ట్ అయింది.
'లవ్ టుడే' సినిమాతో హీరోయిన్ గా ఫేమస్ అయిన ఇవానా.. అంతకు ముందే తమిళంలో బాలా దర్శకత్వంలో 'నాచియార్'(తెలుగులో ఝాన్సీ) సినిమాలో ఈమె ఓ పాత్ర పోషించింది. అయితే ఈ మూవీ చేసేటప్పటికీ తాను 12వ తరగతి చదువుతున్నానని, సెట్ అంతా చాలా కొత్తగా అనిపించేదని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా)
అయితే బాలా తనని ఎప్పుడు కొట్టలేదని, షూటింగ్ టైంలో చాలా బాగా చూసుకున్నారని ఇవానా చెప్పుకొచ్చింది. కాకపోతే యాక్టింగ్ స్కూల్ లా సెట్ వాతావరణం అంతా చాలా స్ట్రిక్ట్ గా ఉండేదని అప్పటి విషయాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.
'లవ్ టుడే' తర్వాత అదే హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'లో అతిథి పాత్రలో కనిపించింది. తెలుగులోనూ ఈమెకు రెండు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అందులో ఒకటైన '#సింగిల్' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం (మే 09) థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్)