స్టార్‌ హీరోయిన్‌ సీమంతం.. సందడిగా సెలబ్రిటీలు | Celebrities At Actress Sonam Kapoor Baby Shower, Photos And Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Sonam Kapoor Baby Shower: స్టార్‌ హీరోయిన్‌ సీమంతం.. సందడిగా సెలబ్రిటీలు

Feb 8 2026 7:54 PM | Updated on Feb 9 2026 12:11 PM

Sonam Kapoor Baby Shower Attend Celebrities

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌  త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే.. బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్‌.. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ అహుజను 2018లో పెళ్లి చేసుకుంది. 2022లో ఈ జంట తమ మొదటి బిడ్డ కొడుకు (వాయు)ను స్వాగతించారు. గతేడాది నవంబర్‌లో సోనమ్ తన బేబీ బంప్‌ను రివీల్‌ చేస్తూ రెండవ గర్భధారణను ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ ఆనందాన్ని బంధువులు, సన్నిహితులతో పంచుకుంటూ ముంబైలోని తమ నివాసంలో బేబీ షవర్‌(సీమంతం) కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ వేడుకలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. కరీనా కపూర్ , అనిల్ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్, భూమి పెడ్నేకర్,  షబానా అజ్మీ ఈ కార్యక్రమంలో సందడిగా కనిపించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరే కూడా సోనమ్ నివాసంలో కనిపించారు. తరువాత, అనుపమ్ ఖేర్, మసాబా గుప్తా, కునాల్ రావల్, సంజయ్ కపూర్  ఇతరులు కూడా వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement