లగ్జరీ ఇల్లు కొన్న బాలీవుడ్‌ హీరో | Homebound Movie Actor Ishaan Khatter Buys Apartment in Mumbai | Sakshi
Sakshi News home page

లగ్జరీ ఫ్లాట్‌ కొన్న కుర్ర హీరో.. ఇంటి ధర రూ.30 కోట్లా?

Feb 8 2026 4:44 PM | Updated on Feb 8 2026 4:53 PM

Homebound Movie Actor Ishaan Khatter Buys Apartment in Mumbai

'హోంబౌండ్‌' సినిమా హీరో ఇషాన్‌ ఖట్టర్‌ కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలోని పాలి హిల్‌ ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్‌ కొనుగోలు చేశాడు. నవరోజ్‌ అపార్ట్‌మెంట్‌లోని 14వ నెంబర్‌ ఫ్లాట్‌ను తన సొంతం చేసుకున్నాడు. దీని విలువ రూ.29.37 కోట్లు అని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ కింద అదనంగా రూ.1.76 కోట్లు ఖర్చు చేశాడని సమాచారం.

సినిమా
ఇషాన్‌ ఖట్టర్‌ చిన్న వయసులోనే ఇల్లు సొంతం చేసుకోవడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి తల్లిదండ్రులు నీలిమ అజీమ్‌- రాజేశ్‌ ఖట్టర్‌ ఇద్దరూ కూడా యాక్టర్సే కావడం విశేషం! ఇషాన్‌ ఖట్టర్‌.. గతంలో కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగానూ పని చేశాడు. బియాండ్‌ ద క్లౌడ్స్‌, ధడక్‌, ఖాలీ పీలి ఫోన్‌ బూత్‌, పిప్పా వంటి పలు హిందీ సినిమాలు నటించాడు.

ఆస్కార్‌ రేసు నుంచి అవుట్‌
గతేడాది రిలీజైన హోంబౌండ్‌ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సత్తా చాటింది. అంతేకాదు ఆస్కార్‌ రేసులో అడుగుపెట్టి అంచనాలు పెంచేసింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిలిం కేటగిరీలో భారత్‌ నుంచి హోంబౌండ్‌ మూవీ అధికారికంగా ఎంపికైంది. ఈ విభాగంలో మొత్తం 15 సినిమాలను షార్ట్‌ లిస్ట్‌ చేయగా అందులో స్థానం సంపాదించుకుంది. జనవరి 22న మరోసారి షార్ట్‌ లిస్ట్‌ చేసినప్పుడు మాత్రం హోంబౌండ్‌ ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో ఆస్కార్‌ నుంచి నిరాశగా వెనుదిరిగింది.

చదవండి: తెలుగులో ఏకైక సినిమా.. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

Advertisement
 
Advertisement
Advertisement