అతన్ని పడేయాలని ట్రై చేశాను.. కానీ..,: కంగనా రనౌత్‌ | Kangana Ranaut comments on Akshaye Khanna | Sakshi
Sakshi News home page

అతన్ని పడేయాలని ట్రై చేశాను.. కానీ..,: కంగనా రనౌత్‌

Feb 8 2026 4:19 PM | Updated on Feb 8 2026 4:34 PM

Kangana Ranaut comments on Akshaye Khanna

ధురంధర్ సినిమా ఓటీటీలోకి రావడంతో మరోసారి ట్రెండ్ అవుతోంది. అందులో నటించిన అక్షయ్ ఖన్నా మళ్లీ వైరల్ అవుతున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ ఖన్నాపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ఓ వీడియో క్లిప్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. హీరోయిన్‌గా బాలీవుడ్‌లో టాప్‌ రేంజ్‌లో కొనసాగిన కంగనా.. బీజేపీలో చేరి  హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.

'ధురంధర్' (Dhurandhar)సినిమా చూసిన వారందరూ సోషల్‌మీడియాలో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కంగనా రనౌత్ పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్లిప్ 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి సంబంధించింది కావడం విశేషం. 2010లో విడుదలైన నో ప్రాబ్లమ్‌ మూవీ ప్రమోషన్‌ సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. అందులో అనిల్ కపూర్,  సంజయ్ దత్‌లతో పాటు అక్షయ్, కంగనా కూడా కలిసి నటించారు.

అతడ్ని ట్రై చేశాను.. కానీ, పడలేదు: కంగనా
ఈ వీడియోలో కరణ్ జోహార్ మాట్లాడుతూ  ఎవరితోనైనా సరసాలాడటానికి ప్రయత్నించారా అని కంగనాను అడగడంతో ఆమె ఏమాత్రం సంకోచించకుండా.., "అవును అంటూ అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) పేరును చెప్పారు. 'నేను మొదట అక్షయ్‌తో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. ఆ తర్వాత అతడ్ని నిజంగానే పడేయాలని ట్రై చేశాను. కానీ అతడు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నాతోనే కాదు, అతడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు.' స్వయంగా కంగనా రనౌత్ ఆ షోలో అక్షయ్ ఖన్నా గురించి చెప్పిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డెకాయిత్ పాత్ర సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రణ్‌బీర్‌ సింగ​్‌కు ఎంత పేరొచ్చిందో, అక్షయ్ ఖన్నాకు కూడా అంతే పేరొచ్చింది. ఈ సినిమా పార్ట్-2 మార్చి 19న రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement