రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.
టాప్‌లో ట్రెండింగ్..
థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.
తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్‌లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్‌గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్‌లో కొనసాగడం విశేషం.
కాగా.. ధురంధర్‌లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw
— Netflix India (@NetflixIndia) February 4, 2026


