డ్యాన్స్‌తో అదరగొట్టిన శ్రీలీల.. వీడియో వైరల్..! | Tollywood Actress Sreeleela Dance Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Sreeleela: డ్యాన్స్‌తో అదరగొట్టిన శ్రీలీల.. వీడియో వైరల్..!

Feb 6 2026 6:29 PM | Updated on Feb 6 2026 7:06 PM

Tollywood Actress Sreeleela Dance Goes Viral In Social Media

హీరోయిన్ శ్రీలీల ఈ ఏడాది పరాశక్తితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమైంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న ఈ మూవీ మార్చి 26వ థియేటర్లలో సందడి చేయనుంది.

ఇదిలా ఉంచితే శ్రీలీల తాజాగా హైదరాబాద్‌లోని ఓ మాల్‌ ఓపెనింగ్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తన టాలెంటన్‌ను బయటపెట్టింది. అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. ఉస్తాద్ భగత్ సింగ్‌లోని దేక్‌లేంగే సాలా అంటూ సాగే పాటకు స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలీల స్టెప్పులకు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు.

 

Advertisement
 
Advertisement
Advertisement