ఒక సినిమాకు అవార్డ్ వచ్చిందంటే అందులో కంటెంటే ప్రధాన కారణం. చిన్న సినిమాలైనా కంటెంట్ బాగుంటే అవార్డులు వచ్చేస్తుంటాయి. అలా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డ్ అందుకున్న తొలి మరాఠీ సినిమా సబర్ బొండా. ఈ మూవీని క్యాక్టస్ పియర్స్ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైంది ఆ తర్వాత అమెరికాలో జరిగిన సన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సబర్ బొండా అనే పేరుతో ఈ సినిమా ప్రదర్శించారు. అంతేకాకుండా ఈ సినిమాని గోథెన్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించారు.
తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మరాఠీ చిత్రంలో భూషణ్ మనోజ్, సురాజ్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రోహన్ పరశురామ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కుల కథగా ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీని టాలీవుడ్ హీరో రానాకు చెందిన స్పిరిట్ మీడియా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం.
Between rituals of loss and moments of connection, a new sense of belonging emerges
Watch Sabar Bonda (Cactus Pears), Sundance Film Festival award winner, now on Netflix#SabarBondaOnNetflix @LotusVisualPro @bhushaan_manoj @suraaj_suman pic.twitter.com/egLzFRgDmv— Netflix India (@NetflixIndia) February 6, 2026


