జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా! | Bigg Boss Srija Dammu about Trolling and Love Life | Sakshi
Sakshi News home page

పార్టీ, పబ్బులకెళ్తా.. మందు ముట్టను, నేనంటే పడి చచ్చేవాడు..

Feb 8 2026 2:06 PM | Updated on Feb 8 2026 2:32 PM

Bigg Boss Srija Dammu about Trolling and Love Life

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష ద్వారా పాపులర్‌ అయింది శ్రీజ దమ్ము. పేరుకు తగ్గట్లుగానే షోలో తన దమ్ము చూపించి తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో అడుగుపెట్టింది. కానీ మొదట్లో ఓవర్‌ యాటిట్యూడ్‌ చూపించి విమర్శలపాలైంది. అయితే తన ముక్కుసూటితనం, ఆటతీరు వల్ల అభిమానులను సైతం సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోలింగ్‌ ఇతరత్రా విషయాలను పంచుకుంది.

ట్రోలింగ్‌
శ్రీజ దమ్ము మాట్లాడుతూ.. మా నాన్న జీవీఎంసీ (మహా విశాఖ నగర పాలక సంస్థ) ఉద్యోగి (పారిశుద్ధ్య కార్మికుడు). నేను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు ఓసారి చీర దోపుకుని చెత్త బ్యాగులు పట్టుకెళ్లాను. దానికి విపరీతంగా ట్రోల్‌ చేశారు. తడిచెత్త, పొడిచెత్త అమ్ముకునేలా ఉంది.. సరిగ్గా సరిపోయింది అని విమర్శించారు. అది చూసి నేను నవ్వుకున్నాను. 

అందుకు సంతోషం
కానీ, మా నాన్న చేసే పని అదే కావడంతో ఇంట్లో వాళ్లు బాధపడ్డారు. ఏదేమైనా బిగ్‌బాస్‌కు వెళ్లి నాకంటూ ఓ పేరు సంపాదించుకున్నందుకు హ్యాపీ. కానీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా కాకుండా వైల్డ్‌ కార్డ్స్‌తో గేమ్‌ ఆడించి బయటకు పంపించినందుకు బాధగా అనిపించింది. నాకే ఎందుకిలా జరుగుతుందని ఏడ్చాను. ఇప్పుడు తల్చుకున్నా బాధనిపిస్తుంది.

నేను పెళ్లి చేసుకునేవాడు..
పార్టీలు, పబ్బులకెళ్తా.. కానీ, మందు మాత్రం తాగను. నాకు కాబోయే భర్త తాగుడుకు బానిసైతే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా.. ఇంకా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మంచి హైట్‌ ఉండాలి, జుట్టుండాలి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. రేపు నేను ఉద్యోగం చేసినా, చేయకపోయినా, ఖాళీగా ఉన్నా అతడే అన్నీ చూసుకునేలా ఉండాలి. నాకయితే ప్రేమపెళ్లి చేసుకోవాలని ఉంది. నేనంటే పడి చచ్చిపోయేవాడు కావాలి.

నా జీవితం నా ఇష్టం
నా డ్రెస్సింగ్‌పై వచ్చే ట్రోల్స్‌ పట్టించుకోను. నేను షార్ట్‌ వేసుకుంటా.. టీషర్ట్‌ వేసుకుంటా.. నీకెందుకు? నా జీవితం నా ఇష్టం. నాకు నచ్చినట్లుగా బట్టలు వేసుకుంటాను. ఇకపోతే సొంతింటి కల ఒక్కటే నాకున్న పెద్ద డ్రీమ్‌. ఇంతవరకు నేనెప్పుడూ సంతోషంగా లేను. ఏదో లైఫ్‌ ముందుకెళ్తుందా? అంటే వెళ్తుందంతే! ప్రశాంతమైన జీవితం దొరికితే సంతోషంగా ఉంటాను. అలా అని డిప్రెషన్‌లో లేను. బిగ్‌బాస్‌ కోసం రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేశా.. ఇప్పుడుమ మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను అని శ్రీజ చెప్పుకొచ్చింది.

చదవండి: సర్వం మాయ బ్లాక్‌బస్టర్‌ హిట్‌.. తండ్రికి కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన దర్శకుడు

Advertisement
 
Advertisement
Advertisement