'మీ ఇద్దరే గొడవ పెట్టుకుంటున్నారు'.. మర్యాద మనీశ్ ఫైర్!
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. మొదటి వారం నుంచే హౌస్ హాట్హాట్గా సాగుతోంది. నామినేషన్స్ తంతు ముగియగానే ఒకరిపై ఒకరు తమ ఆగ్రహాన్ని ప్రదరిస్తునే ఉన్నారు. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఎపిసోడ్ ఫుల్ సీరియస్గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ఇవాల్టి బిగ్బాస్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మర్యాద మనీశ్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ముల మధ్య పెద్ద వార్ నడిచింది. మీ ఇద్దరు ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటున్నారని ప్రియా, శ్రీజపై మర్యాద మనీశ్ మండిపడ్డారు.నేను కామ్గా ఉన్నానని నన్ను సెపరేట్ చేయడానికి ట్రై చేయకండి అన్నాడు. ఆ తర్వాత ప్రియాశెట్టి.. మర్యాద మనీశ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ప్రోమో చూస్తుంటే హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ ఫైటింగ్ నడిచినట్లు తెలుస్తోంది.Fights heating up! 🔥 #PriyaShetty & #SrijaDammu Vs #ManishMaryada🤯Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat–Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/EUTUXSKlR4— JioHotstar Telugu (@JioHotstarTel_) September 11, 2025