 
													హౌస్‌లో టెంపరరీ హౌస్‌మేట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అప్పుడే పొగరు చూపిస్తోంది. షో మొదలైన మొదటి రెండు వారాలు తన యాటిట్యూడ్, అరుపులతో పరమ చెత్తగా అనిపించిన ఆమె ఎలిమినేషన్ ముందు మాత్రం మంచి పేరుతోనే బయటకు వచ్చేసింది. కానీ, బయట వస్తున్న సింపతీ, అభిమానం చూశాక గర్వం తలకెక్కింది. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో గురువారం (అక్టోబర్ 30వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
అన్నం మీద అలిగిన మాధురి
తనూజ ఏ ముహూర్తాన రేషన్ మేనేజర్ అయిందో కానీ కిచెన్‌లో ఒకటే గొడవలు.. ఈ సారి ఆ గొడవల్లో మాధురి బలైంది. అన్నం మీద అలిగి కూర్చుంది. తను తినకుండా ఉంటే భరణి (Bharani Shankar) చూసి తట్టుకోలేకపోయాడు. అతడే కాదు, సంజనా, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్.. ఇలా అందరూ తినమని బతిమాలారు. అందరూ పదేపదే అడిగేసరికి కాదనలేక తినేసింది. అలక తగ్గిపోయాక తనూజతో కలిసిపోయి తనకు జడేసింది.
తనూజకి పొగరు: శ్రీజ
మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూర కాస్త మిగిలింది, కావాలనుకున్నవాళ్లు రండని పిలిచింది తనూజ (Thanuja Puttaswamy). దీంతో సాయి సహా మరికొందరు వెళ్లి కూర వేసుకున్నారు. కాసేపటికి శ్రీజ.. కర్రీ ఉందా? అని అడగ్గా తనూజ స్పందించలేదు. దాంతో శ్రీజ.. నేను టెంపరరీ హౌస్‌మేట్‌ని అయినా అడిగినప్పుడు చెప్పండి, అంత యాటిట్యూడ్ అవసరం లేదు.. ఆమె(తనూజ)కు పొగరని ఇందుకే అన్నానంటూ ఫైర్ అయింది. ఇక్కడ పవన్.. తనూజకోసం స్టాండ్ తీసుకోవడం గమనార్హం!

కల్యాణ్‌ను చిత్తు చేసిన ఇమ్మూ
ఇక బిగ్‌బాస్.. కట్టు-పడగొట్టు టాస్క్‌ను రద్దు చేసి మరో గేమ్ ఇచ్చాడు. భరణి పరిస్థితి బాలేనందున అతడి కోసం దివ్య ఆడింది. శ్రీజ ఈ గేమ్‌లో అట్టర్ ఫ్లాప్ అవగా దివ్య అలవోకగా ఆడి గెలిచేసింది. మరో గేమ్‌లో శ్రీజ కోసం కల్యాణ్, భరణి కోసం రాము బరిలో దిగారు. ఇందులో కల్యాణ్ చకచకా ఆడి గెలిచేశాడు. తర్వాతిచ్చిన టాస్క్‌లో మాత్రం కల్యాణ్ చిత్తుగా ఓడిపోయాడు. భరణి కోసం ఆడిన ఇమ్మూ మరోసారి తన పవర్ చూపించాడు. ఇలా భరణి రెండు టాస్కులు గెలిచి ఆధిక్యంలో ఉన్నాడు.
హర్టయిన పవన్
అయితే శ్రీజ కోసం తాను ఆడతానన్నా తన పేరు లెక్కలోకి తీసుకోకపోవడంపై డిమాన్ పవన్ హర్టయ్యాడు. టాలెంట్, స్కిల్ ఉన్నా గుర్తించకపోతే బాధగా ఉంటుంది. ఈజీ గేమ్.. కల్యాణ్ ఆడలేకపోయాడు అని కామెంట్ చేశాడు. ఈ విషయంలో పవన్-శ్రీజకు గొడవ అయింది. తర్వాత కల్యాణ్.. గేమ్‌లో ఓడిపోయినందుకు శ్రీజకు సారీ చెప్పాడు. సారీ చెప్తే గూబ పగిలిపోద్ది.. అన్నీ మనమే గెలుస్తామా?  అంటూ ఫ్రెండ్‌ను ఓదార్చింది. 
శ్రీజ రెండోసారి ఎలిమినేట్
గతంలో నామినేషన్స్‌లో ఉన్నప్పుడు పవన్ సేవ్ చేయడం వల్లే శ్రీజ మరికొన్ని వారాలు హౌస్‌లో ఉంది. అతడే మొన్నటి టాస్క్‌లో దెబ్బలు తగిలించుకుని మరీ శ్రీజను గెలిపించాడు. అయినా పవన్‌ను పక్కనపెట్టడం ఏంటో ఆమెకే తెలియాలి! హౌస్‌లో ఆమె చేస్తున్న ఓవరాక్షన్ వల్ల ఓట్లు కూడా సరిగా పడలేదు. దీంతో ఆమె ఎలిమినేట్ అవగా భరణి హౌస్‌లో ఉండిపోయాడని తెలుస్తోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
