 
													తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్, మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్, ఆర్జే సూర్య (RJ Surya) జీవితంలో పెళ్లి ఘడియలు వచ్చేశాయి. బుల్లితెర నటి సుధీర చెల్లెలు, ఆర్జే శౌర్యతో అతడి నిశ్చితార్థం జరిగింది. గురువారం జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆర్జే సూర్య ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్
ఈ ఎంగేజ్‌మెంట్‌కు బుల్లితెర నటి సుష్మ కిరణ్ సహా పలువురు హాజరయ్యారు. సుధీర.. కథలో రాజకుమారి సీరియల్‌లో యాక్ట్ చేసింది. ఆర్జే సూర్య.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అమ్మ బీడీలు చుడితే నాన్న తాపీ పని చేసేవాడు. తండ్రి పనికి వెళ్తేనే ఆ కుటుంబానికి పూట గడిచేది. కుటుంబ పరిస్థితి వల్ల సూర్య స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే పాన్ షాప్‌లో సోడా సీసాలు క్లీన్ చేసే పనికి కుదిరాడు. అలా రోజుకు 10 రూపాయలు సంపాదించాడు. 
మిమిక్రీ ఆర్టిస్ట్
ఓ అమ్మాయితో బ్రేకప్ అయి డిప్రెషన్‌లో ఉన్న సమయంలో ఆర్జేగా ఆఫర్ వచ్చింది. ఇంకేముంది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హీరోల గొంతును మిమిక్రీ చేస్తూ ఆకట్టుకున్నాడు. వాక్చాతుర్యంతో అబ్బురపరిచాడు. అలా తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోనూ పాల్గొని ఎనిమిది వారాలు హౌస్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఫైమాతో కలిసి బీబీ జోడీ సీజన్ 1లో పాల్గొని విన్నర్‌గా నిలిచాడు.
చదవండి: ఘనంగా నారా రోహిత్ వివాహం..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
