జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక 'లక్ష్మీ రావే మా ఇంటికి'. భావోద్వేగాలు, బంధాలు, బాధ్యతలు, కుటుంబ సవాళ్లతో అల్లుకున్న కథతో దీన్ని రూపొందించారు. డిసెంబర్ 22 నుంచి ఇది ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10గంటలకు ప్రసారం కానుంది. ఈ సీరియల్లో హర్ష్ నాగ్పాల్, దర్శిని గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. మీర్ సయ్యద్, ఐశ్వర్య, ఇందు ఆనంద్, వెంకట్ గౌడ్, శ్రీవాణి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
అనుకోకుండా ముడిపడిన రెండు జీవితాలే ఈ సీరియల్ స్టోరీ. అనాథగా పెరిగిన తెలివిగల అమ్మాయి శ్రీలక్ష్మి(దర్శిని గౌడ), ఊహించని విధంగా ధనవంతుడైన మధుసూదన్(హర్ష్ నాగ్పాల్) జీవితంలో అడుగుపెడుతుంది. అనేక సమస్యలతో సతమతమయ్యే లక్ష్మి ఆత్మవిశ్వాసంతో మధుసూదన్ ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నంలో లక్ష్మి ఎదుర్కొనే ఇబ్బందులేంటి? లక్ష్మి ఎలా మధుసూదన్ మనసు గెలుచుకుంది అనేదే స్టోరీ.


