ఓటీటీలోకి మరో క్రేజీ హాలీవుడ్ యాక్షన్ మూవీ వచ్చేసింది. గత నెలలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్. ఇంతకీ ఏంటీ సినిమా? ప్రస్తుతం ఎందులో చూడొచ్చు?
2022లో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై యాక్షన్ మూవీ లవర్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా 'శిశు'. కేవలం గంటన్నర నిడివి మాత్రమే ఉండే ఈ మాస్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీనికి కొనసాగింపుగా గత నెల 21న 'శిశు: రోడ్ టు రివెంజ్' చిత్రం రిలీజైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. ఈసారి కూడా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయనే చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి విదేశాల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ మన దేశంలోనూ ఓటీటీలో రిలీజయ్యే అవకాశముంది. ఈ సినిమా కూడా గంటన్నర నిడివితోనే తెరకెక్కించారు. మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఓన్లీ యాక్షనే ఉంటుంది.
'శిశు: రోడ్ టు రివెంజ్' విషయానికొస్తే.. రెండో ప్రపంచ యుద్ధంలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్న అటామి కోర్పి(జోర్మా).. తన ఫ్యామిలీ కోసం గుర్తుగా నిర్మించిన ఇంటి చెక్క మొత్తాన్ని ప్యాక్ చేసుకొని వేరే ప్రాంతానికి వెళ్తుంటాడు. ఇది తెలుసుకున్న రెడ్ ఆర్మీ చీఫ్ ఇగోర్ (స్టీఫెన్ లాంగ్) అటామిని చంపేందుకు ఆర్మీతో సహా చిన్నపాటి యుద్ధం ప్రకటిస్తాడు. ఈ భీకర పోరాటంలో అటామి ఎలా గెలిచి, ఇల్లు కట్టుకోవాలనే తన కల నెరవేర్చుకున్నాడనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ)


