ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సిరీస్‌ల్లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. 2016 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. గత నెలలోనే ఐదో సీజన్ తొలి వాల్యూమ్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో భాగంగా నాలుగు ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అద్భుతమైన రెస్పాన్ అందుకుంది. ఇప్పుడు రెండో వాల్యూమ్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా విడుదల చేశారు.
(ఇదీ చదవండి: హిందీ మార్కెట్‌లో ఊహించని దెబ్బ.. 'అఖండ 2' టోటల్ ఫ్లాప్)
అమెరికాలోని హాకిన్స్ అనే ఓ పల్లెటూరిలో నలుగురు ఫ్రెండ్స్(అబ్బాయిలు) ఉంటారు. ఓ రోజు రాత్రి వీళ్లకు ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఇంతకీ ఈమె ఎవరు? వీళ్ల ఐదుగురితో పాటు మరికొందరు కలిసి వెక్నా అనే అతీంద్రయ శక్తి నుంచి తమ ఊరిని ఎలా కాపాడుకున్నారు అనేది ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. అయితే ఎలెవన్ అనే అమ్మాయికి ఇప్పటివరకు పవర్స్ ఉండగా.. నలుగురు పిల్లల్లోని విల్ అనే అబ్బాయికి కూడా పవర్స్ వచ్చినట్లు చూపించి ఐదో సీజన్ తొలి వాల్యూమ్‌ని ముగించారు. రెండో వాల్యూమ్‌లో ఎలెవన్, విల్, నం.8 కలిసి వెక్నా అనే అతీంద్రయ శక్తులున్న విలన్‌ని ఎలా ఎదిరిస్తాయనేది చూపించబోతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)


