యాక్టర్‌ని చాలెంజ్‌ చేసే స్క్రిప్ట్‌ ఇది: బాబీ సింహా | Bobby Simha and Hebba Patel New Movie Grand Opening Pooja Ceremony | Sakshi
Sakshi News home page

యాక్టర్‌ని చాలెంజ్‌ చేసే స్క్రిప్ట్‌ ఇది: బాబీ సింహా

Dec 16 2025 2:20 AM | Updated on Dec 16 2025 2:20 AM

Bobby Simha and Hebba Patel New Movie Grand Opening Pooja Ceremony

బాబీ సింహా, హెబ్బా పటేల్‌ హీరోయిన్లుగా, తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో ఓ సినిమా ప్రారంభమైంది. మెహర్‌ యరమతి దర్శకత్వంలో యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత – డిస్ట్రిబ్యూటర్‌ వంశీ నందిపాటి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత ఎస్‌కేఎన్‌ క్లాప్‌ ఇచ్చారు. తనికెళ్ళ భరణి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ అందించారు.

ఈ సందర్భంగా బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘యాక్టర్‌ని చాలెంజ్‌ చేసే స్క్రిప్ట్‌ ఇది. ఈ చిత్రంలోని తాత పాత్రలో భరణిగారు నటిస్తున్నారని తెలిసి, హ్యాపీ ఫీలయ్యాను. యువ ఫ్యాషనేట్‌ ప్రోడ్యూసర్‌’’ అని చెప్పారు. ‘‘దర్శకుడిగా ఇది నా తొలి సినిమా. మీ అందరి సపోర్ట్‌ కోరుకుంటున్నాను’’ అన్నారు మోహర్‌. ‘‘నా స్నేహితుడు మెహర్‌ చెప్పిన ఈ కథ వినగానే నాకు బాబీ సింహాగారే గుర్తొచ్చారు. కథ నచ్చి, ఈ సినిమా చేస్తానని బాబీగారు చెప్పడం మాకు ఉత్సాహాన్నిచ్చింది’’ అని తెలిపారు యువకృష్ణ. ‘‘బాబీ సింహాకి ఇది చాలెంజింగ్‌ స్క్రిప్ట్‌’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ సినిమాకు సంగీతం: సిద్ధార్థ సదాశివుని.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement