ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ | Upcoming OTT Telugu Movies December Third Week 2025 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం ఇన్ని సినిమాలా.. మరి థియేటర్లలో?

Dec 15 2025 11:48 AM | Updated on Dec 15 2025 12:28 PM

Upcoming OTT Telugu Movies December Third Week 2025

మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో హాలీవుడ్ మూవీ 'అవతార్ 3' రిలీజ్ కానుంది. దీంతో పాటు 'గుర్రం పాపిరెడ్డి', 'సకుటుంబానాం', ఫెయిల్యూర్ బాయ్స్, దేవగుడి, కామ ది డిజిటల్ సూత్రాస్ లాంటి చిన్న తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. మన దగ్గర అవతార్ 3తో పాటు దేనిపైనా పెద్దగా బజ్ అయితే ప్రస్తుతానికి లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ 18 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: అత్యధిక రెమ్యునరేషన్‌తో 'బిగ్‌బాస్‌' నుంచి భరణి ఎలిమినేట్‌..)

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే కొత్త మూవీస్ విషయానికొస్తే.. ప్రేమంటే, దివ్యదృష్టి అనే సినిమాలతోపాటు నయనం, ఫార్మా అనే తెలుగు సిరీస్‌లు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ వచ్చేసరికి ఏమైనా సడన్ సర్‌ప్రైజులు ఉండొచ్చు. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏయే చిత్రం స్ట్రీమింగ్ కానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (డిసెంబరు 15 నుంచి 21వ తేదీ వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ఏక్ దివానే కి దివానత్ (హిందీ సినిమా) - డిసెంబరు 16

  • ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 18

  • ప్రేమంటే (తెలుగు సినిమా) - డిసెంబరు 19

  • రాత్ అఖేలీ హై- ద బన్సాల్ మర్డర్స్ (హిందీ మూవీ) - డిసెంబరు 19

  • ద గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సినిమా) - డిసెంబరు 19

  • ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ టాక్ షో) - డిసెంబరు 20

అమెజాన్ ప్రైమ్

  • ఫాలౌట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 17

  • ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - డిసెంబరు 19

  • హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 19

హాట్‌స్టార్

  • మిసెస్ దేశ్‌పాండే (హిందీ సిరీస్) - డిసెంబరు 19

  • ఫార్మా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 19

జీ5

  • హార్ట్‌లీ బ్యాటరీ (తమిళ సిరీస్) - డిసెంబరు 16

  • నయనం (తెలుగు సిరీస్)  - డిసెంబరు 19

  • డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ (మలయాళ సినిమా) - డిసెంబరు 19

సన్ నెక్స్ట్

  • దివ్యదృష్టి (తెలుగు సినిమా) - డిసెంబరు 19

  • ఉన్ పార్వైల్ (తమిళ మూవీ) - డిసెంబరు 19

ఆపిల్ టీవీ ప్లస్

  • బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 19

లయన్స్ గేట్ ప్లే

  • రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 19

(ఇదీ చదవండి: అఖండ2 సినిమాపై పవన్‌ కల్యాణ్‌ సైలెంట్.. ఎందుకు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement