breaking news
Premante Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో హాలీవుడ్ మూవీ 'అవతార్ 3' రిలీజ్ కానుంది. దీంతో పాటు 'గుర్రం పాపిరెడ్డి', 'సకుటుంబానాం', ఫెయిల్యూర్ బాయ్స్, దేవగుడి, కామ ది డిజిటల్ సూత్రాస్ లాంటి చిన్న తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. మన దగ్గర అవతార్ 3తో పాటు దేనిపైనా పెద్దగా బజ్ అయితే ప్రస్తుతానికి లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ 18 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: అత్యధిక రెమ్యునరేషన్‌తో 'బిగ్‌బాస్' నుంచి భరణి ఎలిమినేట్..)ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే కొత్త మూవీస్ విషయానికొస్తే.. ప్రేమంటే, దివ్యదృష్టి అనే సినిమాలతోపాటు నయనం, ఫార్మా అనే తెలుగు సిరీస్‌లు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ వచ్చేసరికి ఏమైనా సడన్ సర్ప్రైజులు ఉండొచ్చు. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏయే చిత్రం స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (డిసెంబరు 15 నుంచి 21వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్ఏక్ దివానే కి దివానత్ (హిందీ సినిమా) - డిసెంబరు 16ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 18ప్రేమంటే (తెలుగు సినిమా) - డిసెంబరు 19రాత్ అఖేలీ హై- ద బన్సాల్ మర్డర్స్ (హిందీ మూవీ) - డిసెంబరు 19ద గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సినిమా) - డిసెంబరు 19ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ టాక్ షో) - డిసెంబరు 20అమెజాన్ ప్రైమ్ఫాలౌట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 17ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - డిసెంబరు 19హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 19హాట్స్టార్మిసెస్ దేశ్‌పాండే (హిందీ సిరీస్) - డిసెంబరు 19ఫార్మా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 19జీ5హార్ట్లీ బ్యాటరీ (తమిళ సిరీస్) - డిసెంబరు 16నయనం (తెలుగు సిరీస్) - డిసెంబరు 19డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ (మలయాళ సినిమా) - డిసెంబరు 19సన్ నెక్స్ట్దివ్యదృష్టి (తెలుగు సినిమా) - డిసెంబరు 19ఉన్ పార్వైల్ (తమిళ మూవీ) - డిసెంబరు 19ఆపిల్ టీవీ ప్లస్బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 19లయన్స్ గేట్ ప్లేరూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 19(ఇదీ చదవండి: అఖండ2 సినిమాపై పవన్ కల్యాణ్ సైలెంట్.. ఎందుకు?) -
ఓటీటీకి ప్రియదర్శి రొమాంటిక్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రియదర్శి పులికొండ, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రేమంటే. ఈ మూవీలో సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కంచారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. నవంబర్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.ప్రేమంటే కథేంటంటే..మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీ. Andhamaina vaibhavala veduka ey kadha premante 🤩❤️ pic.twitter.com/NF7ic6xETm— Netflix India South (@Netflix_INSouth) December 14, 2025 -
21న థియేటర్లలో 21 సినిమాలు రిలీజ్.. ఏది హిట్? ఏది ఫట్?
'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు'.. టాలీవుడ్ నిర్మాతలు పదేపదే చెప్పే మాట. ప్రతిదానికి ప్రేక్షకుడినే నిందిస్తుంటారు తప్పితే తప్పు ఎక్కడ జరుగుతుందో చూసుకోరు. ఎందుకంటే ప్రేక్షకుడు అంటే అంత అలుసు. ఈ వారమే తీసుకుందాం. ఏకంగా 21 సినిమాలు థియేటర్లలో రిలీజైతే వీటిలో తెలుగు చిత్రాలు 16 ఉన్నాయి. పోనీ వీటిలో ఏమైనా బాగున్నాయా అంటే లేదు! ఉన్నంతలో ఒక్కదానికే పాజిటివ్ టాక్ వచ్చింది. మరి మిగతా వాటి సంగతేంటి? వాటి గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: 'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్)చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పడే కష్టం ఒకటే. ఎందుకంటే ఒక మూవీ తీయాలంటే వందలాది మంది కష్టపడాలి. కష్టపడితే సరిపోదు దాన్ని ప్రేక్షకుడి వరకు చేరేలా చూడాలి. కానీ టాలీవుడ్లో కొందరి తీరు చూస్తుంటే జాలేస్తుంది. ఈ వారమే తీసుకోండి. 20కి పైగా మూవీస్ థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో తెలుగువి కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రేక్షకులకు రెండు మూడింటివి తప్పితే మిగతా వాటి పేర్లు కూడా తెలీదు. కనీసం తెలిసేలా చేయనప్పుడు రిలీజ్ చేయడం ఎందుకనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న.ఈ వారం వచ్చిన వాటిలో కాస్తోకూస్తో పబ్లిసిటీతో వచ్చినవి మూడో నాలుగు సినిమాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 'రాజు వెడ్స్ రాంబాయి'కి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. ఉన్నంతలో దీన్ని చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మిగతా వాటి విషయానికొస్తే అల్లరి నరేశ్ హీరోగా చేసిన '12ఏ రైల్వే కాలనీ' మూవీని థ్రిల్లర్ జానర్లో తీశారు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయేలా కనిపిస్తుంది. ప్రియదర్శి 'ప్రేమంటే' కూడా రిలీజ్‌కి ముందు ఇదో ప్రేమకథ అన్నట్లు ప్రచారం చేశారు. తీరాచూస్తే ఇదో దొంగలైన భార్యభర్త కథ. దీని కంటెంట్ కూడా అంతంత మాత్రమే ఉంది. ఇది కూడా నిలబడటం కష్టమే.(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)ఈ మూడు కాకుండా రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ఓ కామెడీ మూవీ. అసలు ఇదొకటి వచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు. వీటితో పాటు కలివనం, శ్రీమతి 21 ఎఫ్, జనతా బార్, ఇట్లు మీ ఎదవ, క్షమాపణ గాధ, మఫ్టీ పోలీస్, హ్యాపీ జర్నీ, ఫేస్ టూ ఫియర్ లెస్, ప్రేమలో రెండోసారి, డ్యూయల్, కొదమ సింహం రీ రిలీజ్, ఆవారా రీ రిలీజ్.. ఇలా బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. వీటిలో ఒక్కటైనా హిట్ అయిందా అంటే లేదు. అసలు ఇవి రిలీజ్ అయ్యాయనే సంగతి కూడా ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయారు.చిన్నదా పెద్దదా అనే సంగతి పక్కనబెడితే.. ఇంతా కష్టపడి ఓ సినిమా తీసి, దాన్ని పోటీలో రిలీజ్ చేయడం అవసరమా? లేదంటే ఖాళీగా ఉండే వారంలో విడుదల చేయడం మంచిదా అనేది నిర్మాతలే ఆలోచించుకోవాలి. అలా చేస్తే ఒకరో ఇద్దరో ప్రేక్షకులైనా మీ చిత్రాలకు వస్తారు. చిన్న చిత్రాలు తీసే నిర్మాతలందరూ ఈ విషయంలో కాస్త దృష్టి పెట్టాలి. ఏదో తీశామా, థియేటర్లలో రిలీజ్ చేశామా అని వదిలేయకుండా కాస్త కంటెంట్‌పై కూడా దృష్టి పెడితే మంచిది. అలానే సరైన తేదీన రిలీజ్ కూడా ముఖ్యమే. ఇలాంటివేం చేయకుండా ప్రేక్షకుల్ని నిందించడం మాత్రం సరికాదు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!) -
ప్రేక్షకుల స్పందన సంతోషాన్నిస్తోంది: ప్రియదర్శి
ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా, సుమ కనకాల ముఖ్య పాత్రలో నటించిన సినిమా ‘ప్రేమంటే..’. రానా దగ్గుబాటి సమర్పణలో నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న (శుక్రవారం) విడుదలైంది. కాగా, సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది.శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రియదర్శి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు మా సినిమాను చూసి, థియేటర్స్ నుంచి హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు రావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘చాలా క్లీన్ సినిమా అని ఆడియన్స్ చెబుతుంటే హ్యాపీగా ఉంది. మా చిత్రాన్ని థియేటర్స్‌లో చూడాలని ఆడియన్స్‌ను కోరుకుంటున్నాను’’ అని చెప్పారు నవనీత్. ‘‘ప్రేక్షకులు వారి టెన్షన్స్ను మర్చి పోయి, హ్యాపీగా మా సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని తీసిన చిత్రం ఇది’’ అన్నారు ఆనంది. ‘‘ప్రేమంటే..’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన నిర్మాతగా నాకు సంతోషాన్నిస్తోంది’’ అని చెప్పారు జాన్వీ నారంగ్. -
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
ప్రియదర్శి (Priyadarshi Pulikonda), ఆనంది (Anandhi) హీరో హీరోయిన్లుగా, సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘ప్రేమంటే..’ థ్రిల్ ప్రాప్తిరస్తు ఉపశీర్షికను చేర్చారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) థియేటర్స్‌లోకి వచ్చేసింది. మల్లేశం, బలగం, కోర్ట్ సినిమాలతో ప్రియదర్శికి క్రేజ్ బాగానే ఉంది. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలుగమ్మాయి ఆనంది ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ప్రేమ, పెళ్లి జీవితంతో ముడిపడిన కథతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?ప్రేమంటే కథ సాధారణంగానే మొదలైనప్పటికీ కేవలం 15 నిమిషాల తర్వాత యూనిక్ కాన్సెప్ట్‌గా ఉందే అనిపిస్తుంది. ప్రియదర్శి (మధు సూదన్/మది) సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్ బిజనెస్ చేస్తుంటాడు. ఆనంది (రమ్య) చదువు పూర్తి చేసి ఉద్యోగంలో ఉంటుంది. అయితే, వీరిద్దరు పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో ఊహించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని సంబంధాలు కూడా రిజెక్ట్ చేస్తుంటారు. అయితే ఒక పెళ్లిలో అనుకోకుండా మధి, రమ్య కలుసుకుంటారు. ఇద్దరి అభిరుచులు కలుస్తాయి. ఆపై వారి కుటుంబాలు కూడా కలిసిపోతాయి. తర్వాత పెళ్లితో ఒక్కటైపోతారు. రమ్యకు థ్రిల్లింగ్ అనిపించే పనులు చేయాలంటే ఇష్టం.. మధి తన కుటుంబం కోసం ఏమైనా చేయాలనే మనస్థత్వంతో ఉంటాడు. సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్ బిజనెస్ చేసే మధి రాత్రి సమయంలో తన టీమ్‌తో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. తన ప్రవర్తనలో ఏదో తేడా ఉందని రమ్య గుర్తిస్తుంది. అయితే, మధి గురించి అసలు విషయం తెలిసిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతుంది. ఇలాంటి సమయంలో రమ్యకు ఏం చెప్పి మధి ఒప్పించాడు..? మధి ఎందుకోసం దొంగతనాలు చేస్తున్నాడు..? ఫైనల్‌గా రమ్య కూడా మధితో పాటు చోరీలు చేయడానికి కారణం ఏంటి..? పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ జోడీ వేస్తున్న స్కెచ్ ఏంటి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రేమంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో అని ముందే ఊహించుకుంటాం. కానీ, అందుకు విరుద్దంగా లైఫ్ కొనసాగితే ఎలా ఉంటుందో ఈ మూవీలో చక్కగా చూపించారు. ప్రేమలో ఉన్నప్పుడు వారి ప్రయాణం థ్రిల్లింగ్‌గా, ఓ సాహసోపేతమైన ప్రయాణంలా ఉండొచ్చు. కానీ, ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారన్నది ప్రమంటేలో దర్శకుడు చూపించారు. కథలోని పాయింట్ కాస్త యూనిక్‌గా ఉన్నప్పటికీ చెప్పిన విధానం మాత్రం రెగ్యులర్ సినిమా కథలాగే ఉంటుంది. లాజిక్స్ వెతుకుతే సినిమా నచ్చకపోవచ్చు. ఫస్టాఫ్ ఫుల్ కామెడీగా మంచి ఎంటర్టైనర్గా ఉంటుంది. దొంగతనం అంటే ఇష్టం లేని రమ్య తన భర్త మధితో పాటు చేసేందుకు రెడీ అవుతుంది.. ఎందుకు అనేది బలమైన కారణం ఉండదు. కానీ, చోరీ చేసే ప్లాన్స్, సన్నివేశాలు తప్పకుండా థ్రిల్‌ను పంచుతాయి. నగరంలో వరుసగా చోరోలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును ఛేదించేందుకు హెడ్ కానిస్టేబుల్ సుమ (ఆశ) రంగంలోకి దిగుతుంది. ఆమెకు పై అధికారిగా వెన్నెల కిషోర్ (సంపత్) ఉంటాడు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అందరినీ మెప్పిస్తాయి. దొంగతనాల వెనుక ఎవరున్నారని తెలుసుకునేందుకు ఆశ జరిపిన విచారణ ప్రేక్షకులను మెప్పించేలా సరదాగానే కొనసాగుతుంది. థ్రిల్ ప్రాప్తిరస్తు క్యాప్షన్‌కు న్యాయం చేసేలా ప్రీఇంటర్వెల్ సీన్ అదరగొడుతుంది. ముఖ్యంగా సుమ, వెన్నెల కిషోర్, ఆది, రామ్ ప్రసాద్ సరదా సంభాషణలు నవ్వులను తెప్పిస్తే.. ప్రియదర్శి, ఆనంది చేసే చోరీలు తప్పకుండా థ్రిల్‌ను పంచుతాయి. పాటలు పెద్దగా మెప్పించవు. సెకండాఫ్ కొంచెం మైనస్. ఫైనల్‌గా ప్రేమంటే సినిమా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ రైడ్ అని చెప్పొచ్చు.ఎవరెలా చేశారంటే..?ప్రియదర్శి కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లలో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ నటించారు. తెలుగమ్మాయి ఆనంది తన నటనతో దుమ్మురేపింది. ఫుల్ ఎనర్జీగా స్క్రీన్‌పై కనిపించడమే కాకుండా భావోద్వేగ సీన్స్‌లలో మెప్పించింది. ఈ మూవీకి మరో ప్రధాన బలం సుమ, వెన్నెల కిషోర్ జంట.. వీరిద్దరి మధ్య మరికొన్ని సరదా సీన్లు ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. సుమ వేసే పంచ్‌లకు వెన్నెల కిషోర్ ఇచ్చే రియాక్షన్ పంచ్‌లకు అదిరిపోయేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సీన్స్‌కు తగ్గట్లు సంగీతం ఉండటంతో ప్రెక్షకులు కనెక్ట్ అవుతారు. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ ప్రేమంటే చిత్రంతో తన టాలెంట్ చూపించాడు. దొంగతనం సీన్స్ తెరకెక్కించిన తీరు భేష్ అనిపించేలా ఉంటాయి. 'ప్రేమంటే' థ్రిల్ ఉంటది. -
నేను కాస్ట్ ఫెయిల్యూర్ హీరోని కాదు: ప్రియదర్శి
‘‘సినిమాల్లో నేను పోషించేపాత్రలపై నా వ్యక్తిత్వ ప్రభావం ఉండదు. నేననేవాడిని లేకుండా సినిమాల్లో నేను పోషించే పాత్రల్లోకి నటుడిగా నేను ఎంటర్ కావాలి. నన్ను నేను వెనక్కి పెట్టుకుంటేనే ప్రయోగాత్మక చిత్రాలు, కొత్త తరహాపాత్రలు చేయగలను. ‘మల్లేశం, బలగం, కోర్టు’ వంటి చిత్రాలు ఇలా వచ్చినవే. ఎవరైనా మీ స్టైల్లో ఒక సినిమా చేద్దామంటే నాకేం స్టైల్ లేదు. మీరేదైనా కొత్తగా చెప్తే అదే నా స్టైల్ అవుతుందని చెప్తుంటాను’’ అని ప్రియదర్శి అన్నారు.ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా, సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘ప్రేమంటే..’. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రియదర్శి చెప్పిన విశేషాలు... ⇒ ప్రతి సినిమా రిలీజ్‌కి ముందు ఉండే టెన్షనే నాకు ఈ సినిమాకి కూడా ఉంది. ఒక రైతు వాన కోసం ఎదురు చూసినట్లు నేను కూడా సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటాను (నవ్వుతూ...). మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత మొదలయ్యే జీవితంలో చాలా డైనమిక్స్ మారతాయి. ప్రేమంటే ఇంత బాగుంటుంది అని అనుకోవడం దగ్గర్నుంచి ఇలా కూడా ఉండొచ్చని మా సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం. పెళ్లి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ మనం ఎప్పుడు, ఏ విధంగా, ఏ టైమ్‌లైన్‌లో చె΄్పాం అన్నది ముఖ్యం. ‘ప్రేమంటే..’ని అందరూ రిలేట్ చేసుకుంటారు.⇒ ఈ సినిమాలో నా క్యారెక్టర్ కాస్త కొత్తగా ఉంటుంది. ఆనంది మంచి పెర్ఫార్మర్. చాలా ప్రోఫెషనల్. సుమక్క నుంచి చాలా నేర్చుకున్నాను. నవనీత్ మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్. పెళ్లిపై మెచ్యూరిటీతో ఈ కథ రాశాడు. సునీల్ నారంగ్, రామ్మోహన్రావు, జాన్వీగార్లు మంచిగా సపోర్ట్ చేశారు. ∙నేను విలక్షణమైన కథలు చేస్తాననే గుర్తింపును ప్రేక్షకులు ఇచ్చారు. ఈ బాధ్యతతో సినిమాలు చేస్తున్నాను. అలాగే నాతో సినిమాలు చేసే నిర్మాతలు నష్టపోకూడదనుకుంటాను. ‘డార్లింగ్’ సినిమా ప్రాఫిటబుల్ వెంచర్. ‘సారంగపాణి, డార్లింగ్, మిత్రమండలి’ సినిమాలు థియేటర్స్‌లో ఆడకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ... ఇప్పటి వరకు నేను కాస్ట్ ఫెయిల్యూర్ హీరోని అయితే కాదు. ప్రస్తుతం ‘అసమర్థుడు’, ‘సుయోధన’ అనే సినిమాలు చేస్తున్నాను. -
'ప్లీజ్ అన్నా.. సినిమాలు ఆపేయ్'.. నెటిజన్‌కు ప్రియదర్శి స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమంటే'. ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో యాంకర్ సుమ.. కానిస్టేబుల్ పాత్రలో నటించింది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.మూవీ రిలీజ్‌కు ముందు ప్రియదర్శి నెటిజన్లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు నెటిజన్స్. అయితే ఓ నెటిజన్ చాలా ఆసక్తికర ప్రశ్న వేశాడు. అన్న నువ్వు సినిమాలు చేయడం అపు అన్న.. ప్లీజ్ అన్నా అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన ప్రియదర్శి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకమంటావా? అంటూ ప్రశ్నించాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమంటే కథేంటంటే..?మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. స్వతహాగా యాంకర్ అయిన సుమ.. గతంలో 'జయమ్మ పంచాయతీ' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. Mari em cheyyamantavGaddi Peekalna?😅 https://t.co/HFnQJk2ujL— Priyadarshi Pulikonda (@Preyadarshe) November 20, 2025 -
నాకు లవ్‌స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం: నాగచైతన్య
‘‘ఒక నటుడిగా, ప్రేక్షకుడిగా నాకు లవ్‌స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం. కోవిడ్ తర్వాత అందరూ యాక్షన్ , సినిమాటిక్ యూనివర్స్, కొత్త వరల్డ్ నేపథ్యంలో వచ్చే సినిమాలకే ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని చెప్పారు. కానీ ప్రేమకథలు థియేటర్స్‌లోకి వస్తే, విజయాలు సాధిస్తాయని ఇటీవల మరోసారి ప్రూవ్ అయ్యింది. లవ్‌స్టోరీస్ టైమ్‌లెస్’’ అని చెప్పారు నాగచైతన్య. ప్రియదర్శి, ఆనంది జంటగా, సుమ కనకాల కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమంటే..’. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరై, బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. తొలి టికెట్‌ను రూ.లక్షా పదహారువేల నూటపదహార్లకు కడివేలు సాయి కొనుగోలు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటుల్లో ప్రియదర్శి ఒకరు. స్మాల్, బిగ్ బడ్జెట్ చిత్రాలు.. హారర్, కామెడీ, యాక్షన్ , లీడ్ యాక్టర్, హీరో... ఇలా తను ఒక మంచి కెరీర్‌ను బిల్డ్ చేసుకున్నాడు. నవనీత్ ఓ ఫ్రెష్ లవ్‌స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సుమగారు యాక్ట్ చేయడం ఓ సర్ప్రైజ్. ఈ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’’ అని చెప్పారు.‘‘ప్రియదర్శి మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నవనీత్ టెన్షన్ లేకుండా కనిపిస్తున్నాడు. సినిమా బాగా వచ్చిందనుకుంటున్నాను. చిన్న సినిమాలు బాగా ఆడుతున్న టైమ్ ఇది. ఈ యంగ్ టీమ్ చేసిన ఈ చిత్రం సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు శేఖర్ కమ్ముల. ‘‘ఏషియన్స్ ప్రొడక్షన్స్ హౌస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో నేను సినిమా చేసే అవకాశాన్ని ఫ్యాన్స్ ప్రేమ వల్లే పొందగలిగాను’’ అన్నారు ప్రియదర్శి. ‘‘పెళ్లయిన తర్వాత ఎంత కొట్లాడుకున్నా, ఎంత అరుచుకున్నా, ఒక చాయ్ తాగుతూ మాట్లాడుకుని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు’ అన్నదే ఈ సినిమా కథ’’ అని తెలి΄ారు నవనీత్. తెలుగు పరిశ్రమలోనివారిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవారిని హైపర్ ఆది విమర్శించారు. నిర్మాతలు సురేష్‌బాబు, జాన్వీ నారంగ్ మాట్లాడారు. -
‘ప్రేమంటే’ సినిమా ప్రీ రిలీజ్.. ముఖ్య అతిథిగా నాగచైతన్య (ఫొటోలు)
-
పెళ్లి జీవితంపై తీసిన 'ప్రేమంటే' ట్రైలర్ రిలీజ్
కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్న ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ 'ప్రేమంటే'. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. ఇందులో ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్. యాంకర్ సుమ.. కానిస్టేబుల్ పాత్రలో నటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఫన్నీగా ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: 'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?)మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. స్వతహాగా యాంకర్ అయిన సుమ.. గతంలో 'జయమ్మ పంచాయతీ' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. చూడాలి మరి ఆమె నటన ఎలా ఉండబోతుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


