నవనీత్, ప్రియదర్శి, ఆనంది, జాన్వీ
ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా, సుమ కనకాల ముఖ్య పాత్రలో నటించిన సినిమా ‘ప్రేమంటే..’. రానా దగ్గుబాటి సమర్పణలో నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న (శుక్రవారం) విడుదలైంది. కాగా, సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది.
శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రియదర్శి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు మా సినిమాను చూసి, థియేటర్స్ నుంచి హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు రావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘చాలా క్లీన్ సినిమా అని ఆడియన్స్ చెబుతుంటే హ్యాపీగా ఉంది. మా చిత్రాన్ని థియేటర్స్‌లో చూడాలని ఆడియన్స్‌ను కోరుకుంటున్నాను’’ అని చెప్పారు నవనీత్. ‘‘ప్రేక్షకులు వారి టెన్షన్స్‌ను మర్చి పోయి, హ్యాపీగా మా సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని తీసిన చిత్రం ఇది’’ అన్నారు ఆనంది. ‘‘ప్రేమంటే..’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన నిర్మాతగా నాకు సంతోషాన్నిస్తోంది’’ అని చెప్పారు జాన్వీ నారంగ్.


