'ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా!' సాంగ్‌ రిలీజ్‌ | Anaganaga Oka Raju Movie: Andhra To Telangana Song Released | Sakshi
Sakshi News home page

అనగనగా ఒక రాజు: ఆంధ్రా టు తెలంగాణ పాట విన్నారా?

Jan 12 2026 8:29 PM | Updated on Jan 12 2026 8:29 PM

Anaganaga Oka Raju Movie: Andhra To Telangana Song Released

సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌', చిరంజీవి 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాలు దిగాయి. మరో రెండు రోజుల్లో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా రిలీజవుతోంది. మీనాక్షి చౌదని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భీమవరం బాల్మా.. పాటకైతే నవీన్‌ పొలిశెట్టి చాలాసార్లు స్టెప్పులేశాడు. 

మూడో సాంగ్‌ రిలీజ్‌
తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. అదే ఆంధ్రా టు తెలంగాణ సాంగ్‌. 'నాలోన సోకులున్నయ్‌, సొంపులున్నయ్‌ సానా.. నీతానా సొమ్ములుంటే ఎల్దాం ఎక్కడికైనా.. ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా..' అన్న లిరిక్స్‌తో పాట మొదలవుతుంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం సమకూర్చాడు. ధనుంజయ్‌ సీపన, సమీరా భరద్వాజ్‌ కలిసి ఆలపించారు. ఈ స్పెషల్‌ సాంగ్‌లో హీరోయిన్‌ శాన్వి మేఘన నవీన్‌ పొలిశెట్టితో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఈ పాటను మీరూ చూసేయండి..

చదవండి: బాస్‌ చింపేశాడు.. మెగాస్టార్‌పై అల్లు అరవింద్‌ ప్రశంసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement