మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్టు అందుకోబోతున్నాడు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే వినిపిస్తోంది. వింటేజ్ చిరును చూశామని అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'మన శంకర వరప్రసాద్‌గారు' సినిమా చూసి తన అభిప్రాయం చెప్పాడు.
బాస్ ఈజ్ బాస్
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయ్యాను. బాస్ చింపేశాడు. బాస్ ఈజ్ బాస్. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం మళ్లీ ఇన్నాళ్లకు కలిగింది. పాత చిరంజీవిని చూసే అవకాశం దొరికింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. వింటేజ్ చిరును తీసుకొచ్చారు. చిరంజీవి- వెంకటేశ్ కాంబినేషన్ అదిరిపోయింది. జనాలకు ఇది పైసా వసూల్ మూవీ అని ప్రశంసలు కురిపించాడు.
మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


