మీనా, వినీత్ నటించిన థ్రిల్లర్‌ సిరీస్‌.. తెలుగులోనూ వచ్చేసింది | Meena And Vineeth Psychological Thriller Roslin Web Series Released In OTT, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

మీనా, వినీత్ నటించిన థ్రిల్లర్‌ సిరీస్‌.. తెలుగులోనూ వచ్చేసింది

Feb 27 2026 11:55 AM | Updated on Feb 27 2026 12:38 PM

Roslin web series Streaming Now Ott

ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ కీలక పాత్రల్లో నటించిన రోస్లిన్‌(Roslin) వెబ్‌ సిరీస్‌ ఓటీటీలోకి వచ్చేసింది.  సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్‌గా దర్శకుడు సుమేష్ నందకుమార్ తెరకెక్కించారు.   ‘దృశ్యం’ మూవీ దర్శకుడు జీతూ జోసెఫ్ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సుమేష్ పనిచేశారు. అందుకే ఈ సిరీస్‌పై అంచనాలు పెరిగాయి.

రోస్లిన్(Roslin) వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 27న  జియోహాట్‌స్టార్‌లో విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ,మలయాళం, మరాఠీ, బెంగాళీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. రోస్లిన్ టైటిల్‌ పాత్రలో సంజన దిపు అనే అ‍మ్మాయి నటించింది. మలయాళ హిట్‌ సినిమా మూథోన్‌తో మెప్పించిన సంజన.. మలయాళ పరిశ్రమలో గుర్తింపు పొందింది. నటుడు వినీత్ చాలా కాలం తర్వాత  ఒక వెబ్‌ సిరీస్‌ కోసం కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement