నాకు లవ్‌స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం: నాగచైతన్య | Naga Chaitanya Talk About Premante Movie At Pre Release Event | Sakshi
Sakshi News home page

నాకు లవ్‌స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం: నాగచైతన్య

Nov 19 2025 1:46 PM | Updated on Nov 19 2025 2:59 PM

Naga Chaitanya Talk About Premante Movie At Pre Release Event

‘‘ఒక నటుడిగా, ప్రేక్షకుడిగా నాకు లవ్‌స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం. కోవిడ్‌ తర్వాత అందరూ యాక్షన్‌ , సినిమాటిక్‌ యూనివర్స్, కొత్త వరల్డ్‌ నేపథ్యంలో వచ్చే సినిమాలకే ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని చెప్పారు. కానీ ప్రేమకథలు థియేటర్స్‌లోకి వస్తే, విజయాలు సాధిస్తాయని ఇటీవల మరోసారి ప్రూవ్‌ అయ్యింది. లవ్‌స్టోరీస్‌ టైమ్‌లెస్‌’’ అని చెప్పారు నాగచైతన్య. ప్రియదర్శి, ఆనంది జంటగా, సుమ కనకాల కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమంటే..’. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకత్వంలో రానా సమర్పణలో పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, జాన్వీ నారంగ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నాగచైతన్య, దర్శకుడు శేఖర్‌ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరై, బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేశారు. తొలి టికెట్‌ను రూ.లక్షా పదహారువేల నూటపదహార్లకు కడివేలు సాయి కొనుగోలు చేశారు. 

నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటుల్లో ప్రియదర్శి ఒకరు. స్మాల్, బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలు.. హారర్, కామెడీ, యాక్షన్‌ , లీడ్‌ యాక్టర్, హీరో... ఇలా తను ఒక మంచి కెరీర్‌ను బిల్డ్‌ చేసుకున్నాడు. నవనీత్‌ ఓ ఫ్రెష్‌ లవ్‌స్టోరీతో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సుమగారు యాక్ట్‌ చేయడం ఓ సర్‌ప్రైజ్‌. ఈ టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు’’ అని చెప్పారు.

‘‘ప్రియదర్శి మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నవనీత్‌ టెన్షన్‌ లేకుండా కనిపిస్తున్నాడు. సినిమా బాగా వచ్చిందనుకుంటున్నాను. చిన్న సినిమాలు బాగా ఆడుతున్న టైమ్‌ ఇది. ఈ యంగ్‌ టీమ్‌ చేసిన ఈ చిత్రం సక్సెస్‌ సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు శేఖర్‌ కమ్ముల. ‘‘ఏషియన్స్‌  ప్రొడక్షన్స్‌  హౌస్‌ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో నేను సినిమా చేసే అవకాశాన్ని ఫ్యాన్స్‌ ప్రేమ వల్లే పొందగలిగాను’’ అన్నారు ప్రియదర్శి. 

‘‘పెళ్లయిన తర్వాత ఎంత కొట్లాడుకున్నా, ఎంత అరుచుకున్నా, ఒక చాయ్‌ తాగుతూ మాట్లాడుకుని ఎలా సాల్వ్‌ చేసుకోవచ్చు’ అన్నదే ఈ సినిమా కథ’’ అని తెలి΄ారు నవనీత్‌. తెలుగు పరిశ్రమలోనివారిపై సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నవారిని హైపర్‌ ఆది విమర్శించారు. నిర్మాతలు సురేష్‌బాబు, జాన్వీ నారంగ్‌ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement