టాలీవుడ్ నటుడు ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమంటే'. ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో యాంకర్ సుమ.. కానిస్టేబుల్ పాత్రలో నటించింది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.
మూవీ రిలీజ్‌కు ముందు ప్రియదర్శి నెటిజన్లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు నెటిజన్స్. అయితే ఓ నెటిజన్ చాలా ఆసక్తికర ప్రశ్న వేశాడు. అన్న నువ్వు సినిమాలు చేయడం అపు అన్న.. ప్లీజ్ అన్నా అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన ప్రియదర్శి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకమంటావా? అంటూ ప్రశ్నించాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రేమంటే కథేంటంటే..?
మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. స్వతహాగా యాంకర్ అయిన సుమ.. గతంలో 'జయమ్మ పంచాయతీ' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది.
Mari em cheyyamantav
Gaddi Peekalna?😅 https://t.co/HFnQJk2ujL— Priyadarshi Pulikonda (@Preyadarshe) November 20, 2025


