పైరసీ శాశ్వతంగా ఆగిపోయేది కాదు: సీవీ ఆనంద్‌ | IPS CV Anand Key Comments Piracy And hacking | Sakshi
Sakshi News home page

పైరసీ శాశ్వతంగా ఆగిపోయేది కాదు: సీవీ ఆనంద్‌

Nov 20 2025 9:36 AM | Updated on Nov 20 2025 9:36 AM

IPS CV Anand Key Comments Piracy And hacking

సాక్షి, హైదరాబాద్‌: హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు హోంశాఖ కార్యదర్శి ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌. ఒకడిని అరెస్ట్‌ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతడి స్థానంలో మరొకడు వస్తాడని అన్నారు. దీంతో, ఆయన తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌ నేపథ్యంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘హ్యాకర్లు, హ్యాకింగ్‌ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఒకడు పోతే మరొకడు వస్తాడు. వాడు మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తాడు. కొందరిని అరెస్ట్‌ చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్‌ నేరాలు పూర్తిగా ఆగిపోతాయనుకోవడం అసాధ్యమని వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడిన సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల ముఠాను పట్టుకున్న తర్వాత దొంగతనాలు, దాడులు, మోసాలు ఆగిపోయాయా? మనిషి ఉన్నంతకాలం ఈ రకాల నేరాలు కూడా జరుగుతూనే ఉంటాయి. వీటికి మన చేతిలో ఉన్న మార్గం నివారణ ఒక్కటే. ఈజీ మార్గాల్లో డబ్బు సంపాదించాలన్న కోరికలను తగ్గించుకోవాలి. సైబర్‌ క్రైమ్స్‌ పెరగడానికి అదే మూల కారణం. సైబర్‌ స్పేస్‌, అకౌంట్లను సేఫ్‌గా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలి. జీవితంలో ఏదీ ఫ్రీగా రాదని డైరెక్టర్‌ రాజమౌళి చెప్పినమాటే జీవిత సత్యం’ అని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement