సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంకాంత్రి అనగానే కోడి పందాలు, గొబ్బెమ్మలు, ముగ్గులు, పంతగులు గుర్తుకు వస్తాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన పంతగులను(కైట్స్) ఎగురవేస్తారు. అయితే, కైట్స్ కోసం వాడే చైనీస్ మాంజా వినియోగంపై నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చైనీస్ మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై ప్రత్యేక నిఘా ఉంది. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులతో సంయుక్త దాడులు చేస్తున్నాం. కైట్స్ షాపులు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. అక్రమ రవాణాపై ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలపై కూడా కేసులు పెడుతున్నాం. చైనీస్ మాంజాతో ప్రాణాపాయం. అందుకే అందరినీ హెచ్చరిస్తున్నాం. మాంజా వినియోగంపై సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యతగా ఉంచుతాం. డయల్ 100/ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 165559కు ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.
Zero tolerance for Chinese Manja in Hyderabad
Chinese manja is a silent killer that has caused serious injuries and even deaths of pedestrians, two-wheeler riders, birds, and animals.
#Hyderabad Police has formed special teams to curb its illegal manufacture, storage,… pic.twitter.com/t8soSwDIsi— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 5, 2026


