నెల రోజుల్లో కొత్త విద్యా విధానం | New education policy within a month | Sakshi
Sakshi News home page

నెల రోజుల్లో కొత్త విద్యా విధానం

Mar 5 2026 12:40 AM | Updated on Mar 5 2026 12:40 AM

New education policy within a month

వారంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం: కె.కేశవరావు 

అందరితో చర్చించాకే పాలసీపై నివేదిక 

విద్యా కమిషన్‌ ఇచ్చిన నివేదిక విధానం కాదు.. సిఫారసులు మాత్రమే 

సాక్షి, హైదరాబాద్‌:  వారంలో ఉపాధ్యాయ సంఘాల తో సమావేశం ఏర్పాటు చేస్తామని, మరో నెల రోజు ల్లో కొత్త విద్యా విధానం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభు త్వ సలహాదారు, తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు ఏర్పాటైన కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు చెప్పా రు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్‌ ఇచ్చిన నివేదిక విద్యా విధానం కాదని, సిఫారసులు మాత్రమేనని కేకే స్పష్ట చేశారు. ముర ళి నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 

విద్యా కమిషన్‌ నివేదికతో పాటు మరో మరో 14 నివేదికలపై చర్చించి, అందరి అభిప్రాయా ల మేరకు మరో నెల రోజుల్లో కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, మేధావులతో చర్చించిన తర్వాతే హైపవర్‌ కమిటీ నూతన విద్యా పాలసీని రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తుందని తెలిపారు. ఈ పాలసీలోని అంశాల అమలు, వాటి సాధ్యాసాధ్యాలపైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని కేకే చెప్పారు.  

మురళి కమిషన్‌ బాగా పని చేసింది 
విద్యకు సంబంధించి పలు సిఫారసులు చేయడంలో మురళి కమిషన్‌ బాగా పని చేసిందని అన్నారు. విద్యా కమిషన్‌లో పీహెచ్‌డీ చేసిన వారు లేరనడం సరైంది కాదని, విశ్వవిద్యాలయ విభాగం హెడ్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ పీఎస్‌ విశ్వేశ్వర్‌రావు లాంటి వారు ఉన్నారని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించాయని, వీటన్నింటిపైనా చర్చిస్తామని అన్నారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విశ్వవిద్యాలయ ఉప కులపతులు, ప్రొఫెసర్లు, మేధావుల స్థాయిలో మొత్తంగా 11 కమిటీలను ఏర్పాటు చేశామని కేకే వివరించారు. విద్యా రంగంలో గురువుల సేవలు వెలకట్టలేమని, తాను కూడా టీచర్‌గా పని చేశానని గుర్తు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement