breaking news
iBOMMA
-
ఐబొమ్మ రవి బెయిల్ పై ఉత్కంఠ
-
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోకుండానే.. మరోసారి నాంపల్లి కోర్టును సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఇవాళ్టి నుంచి మూడు రోజలపాటు రవిని విచారణ జరపాల్సి ఉంది.. అయితే.. చంచల్‌గూడ్ జైలు నుంచి రవిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. కోర్టు ఇచ్చిన మూడు రోజుల సమయం సరిపోదని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మరింత టైం కావాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్ పోలీసులు. ఈ క్రమంలో.. నాలుగు కేసులకు సంబంధించి కస్టడీకి అనుమతించాలని పిటిషన్ వేశారు. అయితే.. ఇందులో ఒక కేసును తోసిపుచ్చిన కోర్టు.. మిగిలిన మూడు కేసులకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం నుంచి రవిని విచారించాలని ఆదేశించింది. గత విచారణలో రవి నుంచి సైబర్‌క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్నే సేకరించారు. అయితే కీలకమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. అందుకే మూడో విడత కస్టడీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నిందితుడికి నిరీక్షణ తప్పదా?ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ విచారణ కస్టోడియల్ ఎంక్వైరీ కారణంగానే ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీకి ఆదేశించిన సమయంలోనే నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ విచారణపై స్పష్టత ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో(మూడు రోజుల విచారణ ముగుస్తుంది కాబట్టి) విచారణ జరుపుతామని నిందితుడి తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయంతో ఈ పిటిషన్ విచారణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. నిందితుడు రవికి షాక్ అనే చెప్పొచ్చు. -
'ఐబొమ్మ' రవికి జాబ్ ఆఫర్.. క్లారిటీ ఇచ్చిన డీసీపీ
పైరసీ సినిమాలతో ఆరేళ్లపాటు సినీ పరిశ్రమతో పాటు పోలీసులను కూడా ముచ్చెమటలు పట్టించిన ఐబొమ్మ రవి కొద్దిరోజుల క్రితమే అరెస్ట్ కావడం జరిగింది. పోలీసులు విచారణలో ఇప్పటికే అతను సంచలన విషయాలను తెలిపాడు. ఏవిధంగా నెట్‌వర్క్‌ను హ్యాక్ చేయగలడొ పోలీసులకు చూపించాడు. పలు వెబ్‌సైట్స్‌తో పాటు కొత్త సినిమా శాటిలైట్ పిన్ వంటి వాటిని సులువుగా హ్యాక్ చేయగలనని తెలిపాడు. దీంతో రవికి పోలీసులు జాబ్ ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే, ఇదే అంశంపై తాజాగా సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు స్పందించారు.ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన వార్తలు నిజం కాదని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలేనని పేర్కొన్నారు. ఐబొమ్మ రవికి తాము ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదని డీసీపీ తెలిపారు. 8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడని ఆయన అన్నారు. తప్పు చేశాననే బాధ రవిలో అసలు కనిపించలేదన్నారు. అతను 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు తాము గుర్తించామని ఆయన పేర్కొన్నారు. రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. -
ఐబొమ్మ రవిగాడిని రాబిన్‌హుడ్ చేశారు: నాగవంశీ
సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవిపై ప్రముఖ నిర్మాత నాగవంశీ తాజాగా రియాక్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటిస్తున్న తాజా సినిమా ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. పైరసీ చేసిన అతడిని హీరోని చేసి చూస్తున్న సమాజంలో మనం జీవిస్తున్నామంటూ వంశీ అన్నారు. సినిమాకు రూ.50 టికెట్ ధర పెంచితే తమను తప్పుబట్టి కామెంట్లు చేసిన వారున్నారని ఆయన పేర్కొన్నారు. 'ఐబొమ్మ రవినే రాబిన్‌హుడ్ చేసిన లోకం ఉన్నాం మనం.. మేమేదో తప్పు చేసినట్టు టికెట్ రూ. 50 రూపాయలు పెంచితే మేము తప్పు చేసిన వాళ్లం అయ్యాం. ఆ అబ్బాయి హీరో అయిపోయాడు.' అని వంశీ అన్నారు.‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటిస్తున్న తాజా సినిమాకి ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ అనే టైటిల్ ఖరారైంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.#NagaVamsi :#Ibomma రవి నే ROBINHOOD చేసిన లోకం లో ఉన్నాం మనం " మేమేదో తప్పు చేసినట్టు, రేటు 50 రూపాయలు పెంచితే, ఆ అబ్బాయి హీరో అయిపోయాడు.#EPIC #News #Tollywood pic.twitter.com/FNEiqVrZ5i— IndiaGlitz Telugu™ (@igtelugu) December 1, 2025 -
విజయ్ దేవరకొండకు 'ఐబొమ్మ' రవి సవాల్.. విచారణలో వెల్లడి
సినీ పైరసీ కేసులో ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఐబొమ్మ వెనుక ఉన్న రహస్యాలను పోలీసులు రాబడుతున్నారు. పైరసీతో సంబంధం ఉన్న నెట్వర్క్ గురించి చెప్పాలని రవిని ప్రశ్నించగా.. ఇందులో ఎవరూ లేరని, అన్నింటికీ తానే బాధ్యత వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు. డబ్బు సంపాధించేందుకు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, ఈ క్రమంలో విజయ్‌దేవరకొండకు విసిరిన సవాల్ గురించి రవి పోలీసులకు చెప్పాడు.ఈ ఏడాది ఆగష్టులో విజయ్‌దేవరకొండను ఉద్దేశించి సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. 2023లో ఖుషీ సినిమాను పైరసీ చేసి విజయ్ దేవరకొండకు ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా రవి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో రవి ఒప్పుకున్నాడు. ఖుషీ సినిమా సమయంలో ఏం జరిగిందో రవి ఇలా చెప్పాడు. 'మేము మీకు ముందే చెప్పాము.. మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మీ మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుందని..! కానీ, మీరు మా మాట పట్టించుకోలేదు. మీరు ఏజెన్సీస్‌కి డబ్బులు ఇస్తున్నారు. కానీ, వాళ్లు మమ్మల్ని తొక్కి మా పేరుతో ఐ బొమ్మ ఎఫ్ఎఫ్ డాట్ ఇన్ పేరుతో రన్ చేస్తున్నారు. అలా మా పేరుతో తప్పుడు వెబ్సైట్లు రన్ చేస్తున్నారు. దీనిని ముందే హెచ్చరించాం.. అందుకే మీ కింగ్డమ్ సినిమాను విడుదలకు ముందే బయటకు తెస్తాం.' అంటూ గతంలోనే విజయ్ దేవరకొండను రవి హెచ్చరించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని పోలీసులు తెలిపారు. -
అందుకే ఐబొమ్మ అని పేరు పెట్టా: ఇమ్మడి రవి
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ఇమ్మడి రవి రెండవ విడత పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన నిందితుడి మెయిల్స్ నుంచి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో మొత్తం 21 వేల సినిమాలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఫైరసీకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి రవి సైబర్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో రవి తెలిపిన వివరాలు.. విశాఖలో సినిమాను బొమ్మ అనేవాళ్లం. ఐ బొమ్మ అంటే ఇంటర్నెట్ బొమ్మ. ఇంటర్నెట్లో బొమ్మ చూపిస్తున్నాం కదా.. అందుకే అలా పేరు పెట్టా. అలాగే మరో వెబ్సైట్ బప్పంగా మొదట అనుకున్న పేరు అది కాదు. బలపం అని పేరు పెడదామని అనుకున్నాం. కానీ, డొమైన్ నేమ్‌లో ఎల్(L) అనే అక్షరంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అందుకే బప్పం అని పెట్టాల్సి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్స్ నుంచే సినిమాలు రికార్డు చేశాం. ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను సైతం రికార్డింగ్ చేయగలిగాం. అలా రికార్డింగ్ చేసిన సినిమా ఆడియో.. వీడియో క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో ఔట్ సోర్సింగ్ వాళ్లతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే తాను అప్లోడ్ చేసిన సినిమాలను టెలిగ్రామ్ చానెల్స్ నుంచి సేకరించినవే అని రవి ఒప్పుకున్నాడు.ఇక.. రవి మెయిల్స్‌లో స్పామ్, హైడ్ ఫైల్స్‌లోనే డాటా మొత్తం దాటి ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. అలాగే ప్రహ్లద్ అనే వ్యక్తి గురించి వివరాలు సేకరించారు. తాము ఎన్జిల ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయ్యామని రవి తెలిపాడు. అయితే ఆ లింకును సైబర్ క్రైమ్ పోలీసులకు చూపించగా అంతలోపే లింక్ రివోక్ అయ్యాయి. దీంతో వాటిని సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. రెండో విడత కస్టడీ మొదటిరోజు విచారణలో.. ఎన్జీల నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్‌ను పోలీసులు సంపాదించారు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తున్నా ముఠాలపై ఆరా తీశారు. రెండో రోజు విచారణలో మాత్రం రవి సరిగ్గా నోరు విప్పలేదు. పైగా.. బయటకు రాగానే మంచి పనులు చేస్తానంటూ పోలీసులతో అన్నట్లు సమాచారం. మొత్తంగా.. మూడు రోజులపాటు సాగిన రెండో విడత కస్టడీ నేటితో పూర్తైంది. దీంతో రవిని నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి.. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోసారి కస్టడీ కోరతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సినీ పైరసీ కేసులో ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
ఐబొమ్మ రవిని నిర్దోషిగా బయటకు తెస్తా
హైదరాబాద్: మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పెటేటి రాజారావు అన్నారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానంలో ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి, త్వరలోనే జైలు నుండి బెయిల్‌పై విడుదల చేయిస్తానని అన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లే అని తెలిపారు. SHORTSNow playingAP High Court Advocate Peteti Raja Rao Intresting Comments on IBOMMA Ravi CaseSHORTSNow playingAP High Court Advocate Peteti Raja Rao Intresting Comments on IBOMMA Ravi Case -
iBOMMA కేసు అప్ డేట్.. వాళ్ళను పట్టుకోవడం అంత ఈజీ కాదు..
-
Ibomma Ravi Case: ‘టెలిగ్రామ్’లో సినిమాల కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’, ‘బపం’ వెబ్సైట్లు నడిపించిన ఇమ్మడి రవికి అనేక పైరసీ సినిమాలు విక్రయించిన వారిని గుర్తించడం అంత ఈజీ కాదని... దాదాపు అసాధ్యమని సైబర్ క్రైమ్ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. అతడు టెలిగ్రాం యాప్ ద్వారా వీటిని ఖరీదు చేయడమే అందుకు కారణమని చెప్తున్నారు. రవి ఆరేళ్ల కాలంలో తన వెబ్సైట్లలో 21 వేలకు పైగా సినిమాలను పొందుపరిచాడు. వీటిలో ఏ ఒక్కటీ తాను నేరుగా పైరసీ చేయలేదు. మూవీ రూల్స్, తమిళ్ వన్ సహా అనేక పైరసీ వెబ్సైట్లలో ఉన్న సినిమాలను స్క్రీన్ రికార్డింగ్ చేసే వాడు. దీంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన వాటినీ ఇదే విధానంలో రికార్డు చేసే వాడు. దీనికోసం రవి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎస్) అనే సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి వినియోగించాడు. ఇలా రికారి్డంగ్ చేసిన చిత్రాలు ఆయా సైట్లు, ఓటీటీల్లో విడుదలైన కొన్ని గంటల తర్వాత ఐబొమ్మతో పాటు దాని అనుబంధ వెబ్సైట్లలోకి వచ్చేవి. టెలిగ్రాం యాప్స్ నుంచీ ఖరీదుసోషల్మీడియా యాప్ టెలిగ్రాం వేదికగానూ పైరసీ చిత్రాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయని, తాను ఆ రకంగానూ కొన్నింటిని కొన్నానని రవి పోలీసుల విచారణలో చెప్పారు. వివిధ రకాలైన ఐడీలతో ఈ యాప్‌లోకి ప్రవేశించే వ్యక్తులు పైరసీ సినిమాలను హైపర్ లింక్ ద్వారా పొందుపరుస్తారు. యూఎస్డీటీ, బిట్ కాయిన్ల రూపంలో వారికి చెల్లింపులు జరిపితే ఆ చిత్రాన్ని చూసే అవకాశం ఇస్తారు. ఇలా ఆ చిత్రాలను రవి ఖరీదు చేసి, రికార్డు కూడా చేశాడు. ఓ ఐడీ ద్వారా ప్రవేశించిన విక్రేత నిర్ణీత మొత్తం అందిన వెంటనే అంతర్ధానం అయిపోతాడు. ఈ కారణంగానే విక్రేత ఆచూకీ కనిపెట్టడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు. రవి వెబ్సైట్లలో దాదాపు హెడ్డీ క్వాలిటీ సినిమాలే ఉంటాయి. దీన్ని చూసిన పోలీసులు అతడి వెనుక భారీ నెట్వర్క్ ఉంటుందని, సర్వర్లను హ్యాక్ చేసి ఈ సినిమాలు సంగ్రహిస్తాడని భావించారు. అయితే విచారణలో రవి బయటపెట్టిన అంశాలు ఈ అనుమానాలను పటాపంచలు చేశాయి. ఓ సినిమాను రికారి్డంగ్ చేసిన తర్వాత దాని ఆడియో, వీడియోల క్వాలిటీలను పెంచేవాడు. దీనికోసం కరేబియన్ దీవుల్లో ఉన్న కొందరితో ఔట్ సోర్సింగ్ విధానంలో ఒప్పందాలు చేసుకున్నాడు.మరో మూడు రోజుల పోలీసు కస్టడీరవిపై మొత్తం ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఈ నెల రెండో వారంలో పోలీసులు ఓ కేసులో అతడిని అరెస్ట్ చేసి ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మరో వారం రోజులు అదనపు కస్టడీ కోరగా... మూడు రోజులకు అనుమతిస్తూ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతన్ని గురువారం చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని శనివారం వరకు విచారించనున్నారు. మరోవైపు మిగిలిన నాలుగు కేసుల్లో రవిని కోర్టు నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ పొందడం ద్వారా అరెస్టు చేయాల్సి ఉంది. రెండు కేసుల్లో ఈ వారెంట్ పొందిన అధికారులు ఒకదాంట్లో అరెస్టు చేశారు. ప్రస్తుత కస్టడీ ముగిసిన తర్వాత ఈ కేసులోనూ పోలీసు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇదే పంథాలో మిగిలిన మూడు కేసుల్లోనూ చేయనున్నారు.ఇంటర్నెట్ బొమ్మ, బలపాలే పేర్లు...రవి నిర్వహించిన వెబ్సైట్లకు పెట్టిన పేర్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు క్లారిటీ వచ్చింది. ఐబొమ్మ పూర్తి స్వరూపం ఇంటర్నెట్ బొమ్మ. రవి స్వస్థలం విశాఖపట్నం. ఆ ప్రాంతంలో సినిమాను బొమ్మగా పిలుస్తుంటారు. తాను ఆ బొమ్మను ఇంటర్నెట్లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అనే పేరు పెట్టాడు. మరో వెబ్‌సైట్‌కు బలపం అని పేరు పెట్టాలని భావించి, డొమైన్లో వచ్చిన సాంకేతిక సమస్యతో దాని స్పెల్లింగ్ నుంచి ‘ఎల్’ తీసేసి ‘బపం’గా మార్చాడు. -
ఐబొమ్మ రవికి 14రోజుల రిమాండ్
సాక్షి హైదరాబాద్: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీ సోమవారం ముగిసింది. కస్టడీలో అతని నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ సినీ పైరసీ ఐబొమ్మ రవి ఒక్కడే చేశాడని అలా రూ. 100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇందులో రూ.30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా బేరమాడి మరీ సినిమాలు కొనుగోలు చేశాడు. మూవీపై క్లిక్ చేయగానే.. 15 యాడ్స్‌కు డైరెక్ట్ లింక్ అయ్యేలా ఏర్పాటు చేశాడని విచారణలో పోలీసులు గుర్తించారు.కాగా, రవిపై చాలా సెక్షన్లతో కేసులు పెట్టారని.. అందులో రెండు మాత్రమే వర్తిస్తాయని అంటున్నారు అడ్వకేట్ సీవీ శ్రీనాథ్ . రవి ఐదు రోజుల కస్టడీ రెండు రోజుల క్రితం ముగిసిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచి చంచల్గూడా జైలుకు తరలించారు. అయితే రవికి బెయిల్ వస్తుందని ఆయన తరుఫు లాయర్ శ్రీనాథ్ భావించినప్పటికీ, మరో 14 రోజుల పాటుజ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.ఇదిలా ఉంచితే, వీటితో పాటు రవిపై పోలీసులు మరో మూడుకేసుల్లో పీటీ వారెంట్ జ్యారీ చేశారు. ఈ వారెంట్లపై విచారించిన కోర్టు ఐబొమ్మ రవిని మరోసారి విచారించడానికి 3 రోజుల కస్టడీకి పోలీసులకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో రేపు చంచల్ గూడ జైలులో ఐబొమ్మ రవిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. -
ఐబొమ్మ కేసు: ఆధారాలు అడిగి అడ్డంగా దొరికాడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోనే ఉంటూ దాదాపు ఆరేళ్ల పాటు ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లను నడిపించిన ఇమంది రవి ఆచూకీ నాటకీయంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీ సులకు చిక్కింది. గేమింగ్ యాప్స్ కంపెనీలతో ముడిపడి ఉన్న ఓ అమెరికన్ కంపెనీ నుంచి దర్యాప్తు అధికారులు వివ రాలు కోరుతూ మెయిల్ పెట్టారు. దాని యజమాని అయిన ఇమంది రవికే ఆ మెయిల్ చేరగా... సమాధానం ఇస్తూ అతడు ఆధారాలు కోరడంతో మొదలైన అనుమానం అత గాడి అరెస్టు వరకు వెళ్లింది. ఈ వివరాలను అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.వారికి వచ్చే ట్రాఫిక్‌ను బట్టే చెల్లింపులు...ఐబొమ్మ (iBomma)) వెబ్సైట్ డొమైన్‌ను రవి ఎన్ జెలా అనే సంస్థలో రిజిస్టర్ చేశాడు. ఆ సమయంలో తన గుర్తింపుకార్డు, ఈ–మెయిల్ ఐడీలు ఇవ్వడంతో పాటు తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపాడు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను హోస్ట్ చేయడం కోసం ఐపీ వాల్యూమ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. కొన్నాళ్లకు గేమింగ్, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుని తన సైట్స్ ద్వారా వారి యాప్స్‌కు రీడైరెక్ట్ అయ్యేలా ప్రోగ్రామింగ్ మార్చాడు. ఈ గేమింగ్/బెట్టింగ్ యాప్స్ రవి వెబ్సైట్ ద్వారా తమకు వచ్చే ట్రాఫిక్ (వినియోగదారులు) ఆధారంగా చెల్లింపులు చేసే వాళ్లు. ఈ చెల్లింపులు తొలుత గేమింగ్ కంపెనీ నుంచి యాడ్ క్యాష్, యాడ్ స్టెరా అనే కంపెనీలకు వెళ్లేవి. వాటి నుంచి రవికి చెందిన యాడ్ బుల్ అనే సంస్థ ద్వారా రవి ఖాతాల్లోకి వచ్చేవి. ఇక్కడి వరకు అంతా యూఎస్‌డీటీగా పిలిచే డిజిటల్ కరెన్సీ రూపంలో జరిగినా.. దీన్ని భారత కరెన్సీలోకి మార్చి రవి డ్రా చేసుకునే వాడు.డొమైన్ రిజిస్ట్రీ ఇచ్చిన సమాచారంతో...యూఎస్డీటీని సాధారణ కరెన్సీగా మార్చడం కోసం రవి గెటింగ్ అప్ పేరుతో అమెరికాలోనూ ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఐబొమ్మ ద్వారా రీడైరెక్ట్ అవుతున్న గేమింగ్/బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను సంప్రదించిన సైబర్ క్రైమ్ పోలీసులు చెల్లింపుల విధానానికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఇలా గెటింగ్ అప్ కంపెనీ పేరు బయటకు వచ్చింది. ఇది రవికి చెందినదని తెలియని సైబర్ క్రైమ్ అధికారులు దీని నుంచి నగదు ఎక్కడికి వెళ్తోందో తెలుసు కోవాలని భావించి అధికారిక మెయిల్ ఐడీకి ఈ–మెయిల్ పంపారు. దీన్ని అందుకున్న రవి... పోలీసుల్ని తప్పుదారి పట్టించే ఉద్దేశంతో నేరం నిరూపించే బలమైన ఆధారాలు చూపాలంటూ సమాధానం ఇచ్చాడు. సాధారణంగా అమెరి కన్ కంపెనీలు ఆ దేశ పోలీసు, కోర్టు లేదా ఎం–లెట్‌గా పిలిచే ఒప్పందం ద్వారా సంప్రదించాలని అంటాయి.భిన్నంగా స్పందించడంతో ఆరాగెటింగ్ అప్ సంస్థ భిన్నంగా స్పందించడంతో సైబర్ క్రైమ్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కంపెనీ పూర్వాపరాలు, డొమైన్ వివరాలు తదితరాలు సేకరించగా... అవి రవికే చెందిన ఈఆర్ ఇన్ఫోటెక్‌కు దారి తీశాయి. ఇలా తొలిసారి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిగా గుర్తించిన పోలీసులు అతడి వివరాలు ఆరా తీయడం మొదలెట్టారు. ఈలోపు పోలీసుల ద్వారా తన సైట్స్ పేరు బయటకు రావడంతో దేశం వదిలేసి విదేశాలకు పారిపోయాడు. అప్పటికే అతడి ఫోన్ నంబర్ సహా ఇతర వివరాలు సేకరించిన అధికారులు సాంకేతిక నిఘా ఉంచారు. ఇలా అతడి రాకను గుర్తించి అరెస్టు చేశారు. ఐబొమ్మ వెబ్సైట్లో సినిమా పోస్టర్ తయారీకి రవికి నిఖిల్ అనే స్నేహితుడు సహకరించినట్లు తేలింది. అతడినీ విచారించిన పోలీసులు పాత్ర రూఢీ అయితే అరెస్టు చేయాలని నిర్ణయించారు. రవిలో కష్టపడే తత్వం లేదని, మిగిలిన కేసుల్లోనూ అతడిని అరెస్టు చేసి కస్టడీకి కోరతామని పోలీసులు తెలిపారు. -
పోస్టర్‌కు రూ.50 వేలు.. ఐబొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే విషయాలు
సాక్షి హైదరాబాద్: ఇమ్మడి రవి అలియాస్ (ఐబొమ్మ రవి) కన్ఫెషన్ రిపోర్టులో (నేరాంగీకారం) కీలక విషయాలు వెలుగు చూశాయి. కన్ఫెషన్ రిపోర్టు ప్రకారం రవిది మెుదటి నుండి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు వెల్లడించారు. స్నేహితుడి గుర్తింపుకార్డుతో పలు మోసాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. రవి తన భార్యా, పిల్లలను సైతం చిత్రహింసలు పెట్టేవాడని.. అతని ప్రవర్తన నచ్చకే భార్య అతనికి విడాకులు ఇచ్చిందని అన్నారు. రవి భార్యను విచారిస్తే ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపారు. పోస్టర్ డిజైన్ చేసినందుకుగాను అతని స్నేహితుడు నిఖిల్‌కు ప్రతినెలా రూ. 50 వేలు ఇచ్చేవాడని తెలిపారు. ఐ బొమ్మ సైట్లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్‌కి 50 డాలర్లు వచ్చేవన్నారు. ఇదిలా ఉంటే.. సినీ పైరసీ కేసులో అరెస్టైన రవికి నేటితో ఐదు రోజుల కస్టడీ పూర్తి కావడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. మంగళవారం నగర కమిషనర్ సీవీ సజ్జనార్ ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
నాంపల్లి కోర్టుకు ఐబొమ్మ రవి
-
ఇమ్మడి రవి ఒక్కడే ఐబొమ్మతో..
సాక్షి హైదరాబాద్: సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగిసింది. దీంతో నిందితుడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి జైలుకు తరలించారు. అయితే కస్టడీలో అతని నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవి ఒక్కడే పైరసీ చేశాడని.. అలా రూ. 100 కోట్లకు పైగా సంపాదించాడని నిర్ధారించుకున్నారు. ఇందులో రూ.30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా బేరమాడి మరీ సినిమాలు కొనుగోలు చేశాడు. మూవీపై క్లిక్ చేయగానే.. 15 యాడ్స్‌కు డైరెక్ట్ లింక్ అయ్యేలా ఏర్పాటు చేశాడని గుర్తించారు.రవికి బెయిల్ రావొచ్చు.. రవిపై చాలా సెక్షన్లతో కేసులు పెట్టారని.. అందులో రెండు మాత్రమే వర్తిస్తాయని అంటున్నారు అడ్వొకేట్ సీవీ శ్రీనాథ్. రవి బెయిల్ వ్యవహారంపై ఆయన సాక్షితో మాట్లాడారు. ‘‘మా క్లయింట్ రవి ఐదు రోజుల కస్టడీ ముగిసింది. కోర్టులో హాజరుపరిచి చంచల్గూడా జైలుకు తరలించారు. 27వ తేదీన తిరిగి తమ ఎదుట హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. బెయిల్ పిటిషన్ రిమాండ్ అయిన రెండో రోజే వేశాం. కస్టడీ విధించాక వేశాం కాబట్టే ఆలస్యమైంది. రేపు పీపీ కౌంటర్ వేశాక బెయిల్ మూమెంట్ ఉంటుంది. అతనిపై రెండు సెక్షన్ లు మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. మిగతా కేసులపై కోర్టులో కొట్లాడుతాం. బెయిల్ వస్తుందని భావిస్తున్నాం. అన్నీ ట్రయల్స్‌లో చూసుకుంటాం అని రవి లాయర్ శ్రీనాథ్ తెలిపారు.రవి ఐదు రోజుల కస్టడీలో వెబ్ సైట్, డొమైన్ నెట్వర్స్, ఐపీమాస్క్ తదితర అంశాలపై ఆరాతీసినట్లు సమాచారం. రవితో కలిసి అతని స్నేహితుడు ఇద్దరు కలిసి టైక్నికల్ ఆపరేషన్స్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్ తదితర అంశాల్లో పాల్గొన్నట్లు తేల్చుకున్నారు. రూ.20 కోట్ల బదిలీ వివరాలను బ్యాంకు అధికారుల ద్వారా తెప్పించుకున్న పోలీసులు ఆ నగదు విషయంపై ఆరా తీశారు.1xbet అనే బెట్టింగ్ యాప్‌తో పాటు ఇతర యాప్‌ల ద్వారా రవి భారీగా డబ్బులు సంపాదించినట్లు ఇప్పటికే పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ డబ్బులను క్రిఫ్టో కరెన్సీ ద్వారా నిఖిల్ అనే తన స్నేహితుడికి పంపినట్లు గుర్తించారు. కాగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు అన్ని తానొక్కడినే చేశాను తన వెనుక ఎవరూ లేరు అని రవి సమాధానం చెప్పినట్లు సమాచారం. రవిపై ఇతర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలోనూ ఐదు కేసులు నమోదయ్యాయి మిగతా కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఐబొమ్మ రవిని సైబర్ పోలీసులు మరోసారి విచారించే అవకాశమూ లేకపోలేదు. కాగా రేపు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఐబొమ్మ రవి కేసులో ప్రెస్‌మీట్ ద్వారా మిగతా వివరాలను వివరించే అవకాశం ఉంది. -
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న iBOMMA రవి
-
iBOMMA One రవిది కాదు..! కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు
-
సర్వర్ లేదు..క్లౌడ్ సర్వీసే..
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’నిర్వాహకుడు ఇమంది రవి పోలీసు కస్టడీ సోమవారంతో ముగియనుంది. ఇతడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం నుంచి విచారిస్తున్నారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సహకరించాడన్నది ఇతడిపై ఉన్న ప్రధాన ఆరోపణలు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో రవి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంతో పాటు ‘ఐబొమ్మ’, సంబంధిత సైట్ల సర్వర్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కొన్ని కీలక అంశాలు గుర్తించారు. ఇతర పైరసీ వెబ్సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఆరేళ్లల్లో 21 వేల సినిమాలు సేకరించి వెబ్సైట్లలో ఉంచిన రవి.. దీనికి సంబంధించి ప్రత్యేకంగా సర్వర్ ఏదీ ఏర్పాటు చేయలేదని పోలీసులు గుర్తించారు. క్లౌడ్ సర్వీస్ సేవలను సర్వర్‌గా వినియోగించుకున్నాడని తేల్చారు. బ్యాకప్ కోసం మరో క్లౌడ్ సర్వీస్‌ను వాడినట్లు గుర్తించారు. వెబ్ డిజైనర్‌గా చెప్పుకుంటూ.. మూసాపేటలోని అపార్ట్మెంట్లో నివసించినప్పుడు అతి తక్కువ మందితోనే సంప్రదింపులు జరిపేవాడు. తన గురించిన వివరాలు పెద్దగా వెల్లడించకుండా.. వెబ్ డిజైనింగ్ సంస్థలో పని చేస్తున్నానని, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో సేవలు అందిస్తుంటానని చెప్పాడు. వెబ్ డిజైనింగ్ కోసమే తరచూ ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు వెళ్లివస్తుంటానంటూ చెప్పేవాడు. రవి కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర చిరునామాతో, తన ఫొటోను వినియోగించి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తీసుకున్నాడు. ఇందులో తన పేరును ప్రహ్లాద్‌కుమార్ వెల్లెలగా పేర్కొన్నాడు. అందరి దృష్టినీ ఆకర్షించేందుకే.. తన ఈ–మెయిల్ ఐడీలకు సంబంధించిన పాస్వర్డ్స్ చెప్పడానికి రవి నిరాకరించాడు. దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో వాటిని ఓపెన్ చేసిన పోలీసులు ఈ సర్వర్‌తో పాటు బ్యాకప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు గుర్తించారు. ఓ నటుడితోపాటు తెలుగు పరిశ్రమకు సవాల్ చేయడం వెనుక ఆంతర్యం పైనా పోలీసులు ప్రశ్నించారు. తన వెబ్సైట్ మరికొందరి దృష్టికి వెళ్లేలా చేయాలనే ఆ పని చేసినట్లు రవి బయటపెట్టాడు. ఇటీవల కాలంలో ఐబొమ్మ వన్‌తో పాటు మరో పేరుతో తెరపైకి వచి్చన వెబ్సైట్లకు, రవికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఈ రెండు ఓపెన్ చేసిన వారిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి గాలిస్తున్నారు. రవిని దర్యాప్తు అధికారులు సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు. రవిపై సైబర్ క్రైమ్ ఠాణాలో మరో నాలుగు కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రవి నెట్‌వర్క్‌లో మరె వరూ లేరని స్పష్టం కావడంతో అతడి ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లనున్నారు. 25 బ్యాంకు ఖాతాలు ఉండటంతో పాటు బిట్ కాయిన్ల రూపంలోనూ భారీ లావా దేవీలు నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఐ బొమ్మ రవికి ఏమి శిక్ష పడబోతుందో తెలుసా? షాక్ అయ్యే విషయాలు!
-
ఐబొమ్మ రవి విలనా? హీరోనా?
పైరసీ అనేది చట్టరిత్యా నేరం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించే నిర్మాతలకు ఓ రకంగా అది మరణ శాసనం. అలాంటి పైరసీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ అయితే అందరూ సంతోషించాలి. పోలీసులను అభినందించాలి. కానీ ఇమ్మడి రవి అలియాస్ ‘ఐబొమ్మ’ రవి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. పోలీసులను ద్వేషిస్తూ.. రవికి మద్దతుగా లక్షలాది మంది నిలుస్తున్నారు. ‘రవి మా రాబిన్‌హుడ్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇమ్మడి రవికి సోషల్ మీడియాలో అంత మద్దతు ఎందుకు? ఒక నిందితుడికి మద్దతుగా లక్షలాది మంది గళం విప్పడం వెనక కారణం ఏంటి? స్టార్స్ ఏమంటున్నారు? సామాన్యులు ఏమంటున్నారు?చట్టం ప్రకారం రవి( iBomma Ravi) చేసింది నేరం. కొత్త సినిమాను పైరసీ చేయడమే కాకుండా.. హెచ్డీ ప్రింట్‌ని సామాన్యులకు ఉచితంగా అందించాడు. అయితే ఇదోదే సంఘ సేవ అయితే కాదు. ఫ్రీగా సినిమా చూపిస్తూనే.. వెనకాల ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్, గేమింగ్ సైట్లను ప్రమోట్ చేసి కోట్లు సంపాదించాడని పోలిసులు చెబుతున్నారు. అంతేకాదు వ్యక్తిగత డేటాని కూడా దొంగిలించాడని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అరెస్టు అయితే, సోషల్ మీడియాలో అతనిపై పాజిటివ్ పోస్టులు పెట్టడం అనేది ఆందోళనకరమైన విషయమే. అయితే తాము ఎందుకు రవికి మద్దతు తెలపాల్సి వస్తుందో కూడా కొంతమంది నెటిజన్స్ చెబుతున్నారు. మొత్తంగా చూస్తే..రెండు బలమైన కారణాల వల్లే రవికి సామాన్యుల మద్దతు లభిస్తుందనే విషయం తెలుస్తోంది.సామాన్యుడిని దూరం చేశారు!సినిమా అనేది ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ఓ వినోదం. కానీ ఇప్పుడు కొందరికి మాత్రమే అన్నట్లుగా మారిపోయింది. సామాన్యులు థియేటర్స్‌కి రావాలంటే భయపడిపోతున్నారు. టికెట్ల రేట్లను అంతలా పెంచేశారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఓ సినిమా చూడాలంటే దాదాపు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఈజీగా ఖర్చు అవుతుంది. పాప్ కార్న్‌తో పాటు కూల్‌డ్రింక్స్ రేట్లు కూడా భారీగానే ఉంటుంది. పైగా భారీ బడ్జెట్ సినిమా అంటూ టికెట్ల రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. స్పెషల్ షో, ప్రీమియర్ షో అంటూ ఫ్యాన్స్ జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేని సామాన్యుడికి ‘ఐబొమ్మ’ అనే పైరసీ వెబ్సైట్ ఉచిత వినోద సాధనంగా మారింది. రూ. 30 ఉండే పాప్ కార్న్‌ని రూ. 700 వరకు అమ్ముతుంటే సినిమా ఎలా చూస్తామని నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు.క్వాలిటీ కంటెంట్.. ఓ వ్యక్తి సినిమాకు వచ్చేదే ఎంటర్టైన్మెంట్ కోసం. అన్ని మర్చిపోయి హాయిగా రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేయడానికి థియేటర్స్‌కి వస్తారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం పెట్టిన డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నాయి. రిలీజ్ ముందు వరకు భారీ హైప్ క్రియేట్ చేసుకొని..టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు. తీరా థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుడికి తలపోటు తెప్పించి బయటకు పంపిస్తున్నారు. ఇది కూడా ఓ రకంగా పైరసీని ప్రోత్సహించడానికి కారణం అవుతుంది. నాసిరకం సినిమాలకు వందల రూపాయలు ఖర్చు చేసి థియేటర్స్‌కి వెళ్లడం కంటే.. ఇంట్లో కూర్చోని ఫోన్లో చూడడం బెటర్ అనే భావనకు ప్రేక్షకులు వచ్చారు. రిలీజైన గంటల్లోనే తన ఫోన్లోకి సినిమా వచ్చేస్తే.. సామాన్య ప్రేక్షకుడికి అంతకన్నా కావాలిసిందేముంది? ఇదే ఇప్పుడు సామాన్యుల దృష్టిలో రవిని హీరోగా చేసింది. సినీ ప్రముఖులు ఏమంటున్నారు?రవి అరెస్ట్ పట్ల సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవిని రాబిన్ హుడ్ అంటూ పొగడడాన్ని ఆర్జీవీ తప్పుబట్టాడు. టికెట్లు పెరిగాయాని పైరసీ తీసి అందరికి చూపిస్తానంటే.. ఈ లెక్కన బంగారం దుకాణాన్ని దోచుకొని అందరికి ఉచితం ఎందుకు పంచట్లేదు? BMW కార్లను కొట్టేసి మురికి వాడల్లో ఉన్నవాళ్లకి ఇవొచ్చు కదా అని లాజిక్‌తో ప్రశ్నించాడు. అంతేకాదు పైరసీ చేసినవాడిని కాదు పైరసీ చూసిన వాళ్లను కూడా అరెస్ట్ చేయడమే దీనికి సరైన పరిష్కారం అని సలహా ఇచ్చాడు. ఇక సినీ నిర్మాత సి. కల్యాణ్ అయితే పైరసీని చేసిన రవికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఎలా హానికరమో, పైరసీ సినిమాలు అదే స్థాయిలో హానికరం అని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. ఒక సినిమా వెనుక ఎంతో మంది కష్టం ఉటుందని, ఇల్లీగల్‌గా ముమ్మాటికే తప్పే అని అని దిల్ రాజు అన్నారు. ఏదీ ఉచితంగా రాదు. సినిమాలు ఉచితంగా చూస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు. వెబ్సైట్ల నిర్వాహకులకు డబ్బును ప్రజలే ఇస్తున్నారు. పర్సనల్ డాటాను విక్రయించడం ద్వారా ఇస్తున్నారు. పేరు, ఫోన్ నంబరు, ఆధార్ నంబరు ఇవ్వడం ద్వారా వాటిని నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు’’ అని అన్నారు రాజమౌళి. మొత్తానికి సామాన్యులకు రవి హీరోగా కనిపిస్తే.. సినీ స్టార్స్‌కి మాత్రం విలన్‌గా కనిస్తాడు. కొంతమంది మాత్రం రవి చేసింది తప్పని అంటూనే.. రేట్ల విషయంలో సినిమా పరిశ్రమ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. -
సి.కళ్యాణ్‌ని ఎన్కౌంటర్ చేస్తే బాధ తెలుస్తుంది: ఐబొమ్మ రవి తండ్రి
'ఐ బొమ్మ' రవి అరెస్ట్.. గత కొన్నిరోజుల నుంచి ఈ టాపిక్కే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. రవి చేసింది అక్షరాలా తప్పే కానీ జనాలు అతడికే మద్ధతు తెలుపుతుండటం ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమా వాళ్లకు సపోర్ట్‌గా ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. దీనికి కారణాలు ఏంటనేది పక్కనబెడితే నిర్మాత సి.కల్యాణ్ అయితే ఏకంగా రవిని ఎన్కౌంటర్ చేసేయాలని నాలుగైదు రోజుల క్రితం షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్)నిర్మాత కల్యాణ్ చేసిన 'ఎన్కౌంటర్' వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి గట్టిగానే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు కూడా కల్యాణ్ చేసి కామెంట్స్‌ని తప్పుబట్టారు. 'సి.కళ్యాణ్‌ని గానీ, ఆయన కొడుకుని గానీ ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు దారుణంగా రేట్లు పెరిగాయి. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారు. రవి అరెస్ట్ అయిన తర్వాత నేను రెండుసార్లు మాట్లాడాను. నా కొడుకు తరపున వాదించే న్యాయవాదికి ఆర్థిక సాయం చేస్తా' అని అప్పారావు చెప్పుకొచ్చారు.'ఎన్కౌంటర్ చేయాలని చెప్పే హక్కు సినిమా వాళ్లకు ఎవరు ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. సినిమా వాళ్లు ఎందుకు జడ్జిమెంట్లు ఇస్తున్నారు' అని కూడా అప్పారావు.. నిర్మాత సి.కల్యాణ్‌పై రెచ్చిపోయారు. ఇదే అప్పారావు.. కొడుకు అరెస్ట్ అయిన వెంటనే మాట్లాడుతూ.. కొడుకు చేస్తున్న వాటి గురించి తనకు ఏ మాత్రం తెలియదని, అలానే పట్టుకోలేరని పోలీసులకు సవాలు చేయడం అస్సలు కరెక్ట్ కాదని తన అభిప్రాయం చెప్పారు. ఏదేమైనా రవితో పాటు తండ్రి అప్పారావు కూడా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు.(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ) -
ఐబొమ్మ రవి ‘కొత్త సినిమా చూపిస్తున్నాడా?’
సాక్షి,హైదరాబాద్: టాలీవుడ్ సినిమాల పైరసీ అడ్డుకట్ట పోలీసులకు మరింత సవాలుగా మారింది. ఐబొమ్మ,బప్పంటీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాతే ఇబ్బడి ముబ్బడిగా కొత్తకొత్త పైరసీ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. విడుదలైన మరుసటి రోజే కొత్త సినిమాలు సదరు పైరసీ వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. గత శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలు సైతం పైరసీసైట్లో అప్లోడ్ చేయడంపై సినీ దర్శక,నిర్మాతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల కిందట ప్రేమంటే,12ఏ రైల్వే కాలనీ,రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఆ సినిమాలే ఇప్పుడు పైరసీ వెబ్సైటలో అప్లోడ్ చేసి ఉన్నాయి. థియేటర్లో కెమెరా ద్వారా రికార్డ్ చేసి వెబ్ సైట్లో అప్లోడ్ చేసినట్లు సైబర్ క్రైమ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మడి రవి అరెస్టుతో సినిమా పైరసీ ముఠాకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా నిర్వాహకులు వాటిని బేఖాతరు చేస్తూ..ఇబ్బడి ముబ్బడిగా పైరసీ వెబ్సైట్లు తయారు చేసి వాటిల్లో కొత్త సినిమాల్ని పైరసీ చేస్తుండగా.. సంబంధిత పైరసీ వెబ్సైట్ల లిస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పైరసీ వెబ్సైట్లపై పోలీసుల తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేది తెలియాల్సి ఉండగా.. అరెస్టు అనంతరం ఇమ్మడి రవి నియమించిన వ్యక్తులే కొత్త సినిమాలను పైరసీ చేస్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. నిన్నమొన్నటి వరకు పైరసీ నడిపించేది ఒక్కరే అనుకున్నా.. ఇప్పుడు పదుల సంఖ్యలో వెబ్సైట్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుండడంపై రవి వేర్వేరు దేశాల నుంచి పైరసీ దందా నడిపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో పోలీసులకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని సమాచారం. అయితే, ఐబొమ్మ రవి అరెస్టయినా కొత్త సినిమాలు పైరసీ జరుగుతున్నట్లు తేలింది.సోషల్‌మీడియాలో భారీ ఫాలోయింగ్ చట్టప్రకారం ఇమ్మడి రవి చేసింది నేరం. కానీ, సోషల్‌మీడియాలో మాత్రం అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అతడి అరెస్టు విషయం తెలిసినప్పటి నుంచి పుంఖానుపంఖాలుగా గ్రూపులు ఏర్పాడుతున్నాయి. వివిధ వెబ్సైట్లలో రవి అరెస్టు వార్తను చూసిన అతడి అభిమానులు కామెంట్లలో తమ మద్దతు తెలుపుతున్నారు. ‘ఐబొమ్మ పోరాట సమితి’, ‘అమీర్‌పేట కుర్రాళ్లు’, ‘రవి ఫ్యాన్ క్లబ్’ పేర్లతో గ్రూపులు కనిపిస్తున్నాయి. ‘సినిమా విడుదల సందర్భంలో రేట్లు పెంచేస్తూ ప్రభుత్వమే జీఓలు ఇస్తుంది. అలా పేద వాడికి దూరమైన సినిమాను విడుదలైన కొన్ని గంటల్లోనే రవి ఉచితంగా అందిస్తున్నాడు. అది తప్పెలా అవుతుంది?’ అని, ‘ఇప్పుడిక అమీర్‌పేట కుర్రాళ్లు, మిడిల్ క్లాస్ స్టూడెంట్ల పరిస్థితి ఏమిటో?’ అని కామెంట్లు కనిపిస్తున్నాయి. -
ఐబొమ్మ రవి పొంతనలేని సమాధానాలు..!
హైదరాబాద్: జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఐబొమ్మ’ పైరసీ సినిమా వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. తనను ఏమీ అడిగినా గుర్తు లేదు.. మరిచిపోయా అనేది మాత్రమే చెబుతున్నాడు. ఈరోజు(శనివారం, నవంబర్ 22వ తేదీ) మూడో రోజు విచారణలో భాగంగా పోలీసులకు ఐబొమ్మ రవి సహకరించలేదు. యూజర్ ఐడీ, పాస్వర్డ్లు అడిగితే.. గుర్తు లేవు.. మరిచిపోయా అని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్‌లు ఓపెన్ చేస్తున్నారు పోలీసులు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే బ్యాంక్ ఖాతాల వివరాలపైనా రవి నోరు విప్పడం లేదు. దాంతో రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసలు. ప్రతీ 20 రోజులకు ఒక్కో దేశానికి వెళ్లడంపై రవిని ఆరా తీయగా, విదేశీ పర్యటనలు అంటే ఇష్టం ఉండటం వల్లే వెళ్ళాను అని చెప్పినట్లు సమాచారం. కాగా, సినిమా పైరసీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐబొమ్మ ఇమ్మడి రవికి నాంపల్లి హైకోర్టు ఐదురోజుల పోలీసు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. వారం రోజుల పోలీసు కస్టడీ కోరిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసులో ఉన్న సాంకేతిక అంశాలు, డిజిటల్ ఆధారాలు, నెట్వర్క్ లింకులు తదితరాలను విశ్లేషించేందుకు రవిని ప్రత్యక్షంగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు. కోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగా ఇప్పటివరకూ మూడు రోజుల విచారణ పూర్తి కాగా, ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది.ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం -
రవిని కాదు.. ముందు వాళ్లను అరెస్ట్ చేయండి: ఆర్జీవీ
సినీ పరిశ్రమను ఊపిరాడకుండా చేస్తున్న పైరసీ సమస్య గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కూడా పైరసీ ఆగదని ఆయన చెప్పారు. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందడం, పోలీసింగ్ చాలా బలహీనంగా ఉండటం వల్లనే ఇలాంటి వెబ్సైట్లు వస్తున్నాయనుకుంటే పొరపాటే అన్నారు. పైరేటెడ్ సినిమా చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నంత కాలం వారికి సర్వీస్ అందించడానికి రవి లాంటి సరఫరాదారులు ఎల్లప్పుడూ ఉంటారని ఆర్జీవీ పేర్కొన్నారు.చాలామంది నెటిజన్లు రవిని రాబిన్ హుడ్‌తో పోలుస్తున్నారని ఆర్జీవి (RGV) ఇలా అన్నారు. 'రాబిన్ హుడ్ హీరో కాదు.. నేటి నిర్వచనాల ప్రకారం చూస్తే, అతను ప్రపంచంలోనే మొట్టమొదటిగా నమోదైన ఉగ్రవాది. అతను ఉన్నవారిని దోచుకుని, చంపి, లేనివారికి ఇస్తాడు. అలా అయితే ధనవంతులు చేసిన ఏకైక నేరం వారు ధనవంతులు కావడమేనా.. కష్టపడి ఆర్థికంగా విజయం సాధించిన వారిని దోచుకోవడం ఎంత నీచమైనదో ఊహించుకోండి. నేరస్థుడిని సాధువుగా చూపించడానికి టన్నుల కొద్దీ అజ్ఞానం అవసరం' అని ఆర్జీవీ పేర్కొన్నారు.పైరసీ విషయంలో లాజిక్స్ కొన్ని పాయింట్స్ చెబుతున్నవారికి కూడా వర్మ కౌంటర్ ఇచ్చారు. 'సినిమా ఖరీదైనదా..? -పైరసీ ఓకే, పాప్‌కార్న్ ఖరీదా..? — సినిమాను లీక్ చేయండి, మూవీ టికెట్ రేట్లు ఎక్కువా..? -పైరసీ ఓకే ఈ లాజిక్ ప్రకారం చూస్తే.. BMW కారు ఖరీదైతే షోరూమ్‌ను దోచుకోవాలి కదా.. మురికివాడలో ఉన్న అందరికీ ఆ కార్లను ఇవ్వాలి కదా.. అలా ఎందుకు చేయరని ప్రశ్నించారు. బంగారం (Gold) ఖరీదైనదే కదా.. ఆ దుకాణాన్ని దోచుకుని ఉచితంగా ఎందుకు పంపిణీ చేయరంటూ.. అన్ని వస్తువులకు ఇదే లాజిక్ వర్తిస్తుందని గుర్తుచేశారు. ఇలాంటి ఆలోచనలు సమాజంలో అరాచకానికి దారితీస్తాయని వర్మ హెచ్చరించారు. పైరసీ ద్వారా సినిమా చూడటం వల్ల కొంతమందికి డబ్బు ఆదా చేయవచ్చు.. మరికొందరికి థియేటర్‌కి వెళ్లడం కంటే లింక్‌పై క్లిక్ చేసి సినిమా చూడటం ద్వారా సమయం ఆదా కావచ్చన్నారు. తనతో సహా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా ఇదే కారణంతో పైరసీ కంటెంట్‌ను చూస్తారని వర్మ ఓపెన్‌గానే చెప్పారు. నిజంగా పైరసీని ఆపాలంటే చూసే వారినీ నేరస్తులుగా పరిగణించాలని పేర్కొన్నారు. పైరసీ ద్వారా సినిమా చూస్తున్న 100 మందిని అరెస్టు చేసి వారి పేర్లను ప్రచారం చేస్తే ఆగిపోయే ఛాన్స్ ఉందన్నారు. పైరసీ విషయంలో నైతికత (Moral) పనిచేయదని కేవలం భయం మాత్రమే పనిచేస్తుందన్నారు.ROBIN HOOD RAVIPiracy will never stop. Not because technology is too advanced or policing too weak , but because as long as there are a large number of people to watch a pirated film there will always be Ravis to serve them. Now the funniest thing is Ravi supporters proudly…— Ram Gopal Varma (@RGVzoomin) November 22, 2025 -
ఐబొమ్మ రవి 6 ఏళ్ల బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖలు
-
ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల విచారణ జరుపుతున్న సీఐడీ.. రవి కేసులోనూ ఆ కోణంలో దర్యాప్తును జరపనుందని తెలుస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో సినిమాలు పైరసీ చేశాడు. సినిమాలు పైరసీ చేస్తూనే మరోవైపు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశాడు రవి. తద్వారా వందల కోట్ల లాభం పొందినట్లు ఇప్పటికే విచారణలో తేలింది. తాజాగా ఇమ్మడి రవి వివరాలు సేకరించిన తెలంగాణ సీఐడీ.. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఐబొమ్మ ద్వారా ఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ సైట్స్ నాలుగింటిని రవి ప్రమోట్ చేశాడని సీసీఎస్ ఇప్పటికే నిర్ధారించుకుంది. దీంతో సీసీఎస్‌తో పాటే రవి ఆర్థిక వివరాలను సీఐడీ సేకరిస్తున్నట్లు సమాచారం. -
iBomma Ravi: లీకులు లేకుండా టాప్ సీక్రెట్‌గా..
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో కస్టడీ విచారణ మూడో రోజుకి చేరింది. అత్యంత గోప్యంగా, ఎలాంటి లీకులు లేకుండా సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి వివరాలు రాబడుతున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నత స్థాయి అధికారులే స్వయంగా ఈ విచారణను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పైరసీ కేసులో నిందితుడు ఇమ్మడి రవికి సంబంధించిన ఆరు అకౌంట్ల వివరాల కోసం బ్యాంకు అధికారులకు సీసీఎస్ లేఖ రాసింది. ఇప్పటికే డబ్భుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు ఒప్పుకున్న రవి.. 1xbet యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించాడు. అలాగే.. మూవీ రూల్జ్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశానని.. అందుగానూ క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్జ్‌కి డబ్బులు చెల్లించానని రవి పోలీసులకు తెలిపాడు. దర్యాప్తులో రవి తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కి గేట్ వే చేసి.. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతోనే రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఫ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్‌ని పోస్ట్ చేసేవాడని.. కరేబియన్ దీవుల్లో ఆఫీస్ ఏర్పాటు చేసి ఏకంగా 20 మంది యువకుల్ని రవి నియమించినట్లు తెలుస్తోంది. అయితే రెండ్రోజులపాటు జరిగిన విచారణలో రవి నుంచి కొద్దిపాటి సమాచారాన్నే మాత్రమే సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో రవి నెట్ వర్క్ పై లోతైన విచారణ జరుపుతున్నారు. రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. -
పోలీసులకు సహకరించని ఐబొమ్మ రవి..!
హైదరాబాద్: ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసినా అతను పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదు. ఈరోజు(శుక్రవారం, నవంబర్ 21 వ తేదీ) ఐ బొమ్మ రవిని పోలీసులు విచారించారు. రెండో రోజు విచారణలో భాగంగా ఐ బొమ్మ రవి నుంచి పోలీసులకు పూర్తి సహకారం లభించలేదు. అయితే డబ్బు కోసమే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశానని చెప్పిన రవి.. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఇదిలా ఉంచితే, రవికి చెందిన ఆరేళ్ల బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలన బ్యాంకు అధికారులకు పోలీసులకు లేఖ రాశారు. ఆ వివరాలు ఆధారంగా ఐ బొమ్మ రవి జరిపిన బ్యాంకు లావాదేవీల గురించి దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. రేపు)శనివారం, నవంబర్ 22వ తేదీ) ఐ బొమ్మ రవిని మరోసారి విచారిణ చేయనున్నారు. -
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!
“సినిమాటిక్ లిబర్టీ” అనే సాకుతో దోపిడీ, చట్టవ్యతిరేక చర్యలను ‘న్యాయం’ పేరిట చూపిస్తూ, నేరస్తులకే కిరీటాలు పెట్టే సంస్కృతిని మీరు ఎన్నేళ్లుగా పెంచారు. అందుకే సామాన్యులను నిలువునా దోచే సినిమా ఇండస్ట్రీకి ప్రతిస్పందనగా చట్టవ్యతిరేకంగా సినిమాలను పైరసీ చేసిన iBOMMA రవిని ప్రజలు ‘దేవుడు’గా చూసినా, ‘రాబిన్ హుడ్’గా కీర్తించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రజలకు ఇదే ధర్మం ఇది మీరు నేర్పినది.ప్రజలు iBOMMA వంటి పైరసీ సైట్లను ఆశ్రయించడానికి అస్సలు కారణాన్ని పరిశీలించకుండా లేదా తెలిసినా తెలియనట్టు నటిస్తూ మూలసమస్యలను పట్టించుకోకుండా,సినిమా ఇండస్ట్రీ సామాన్యులను చేస్తున్న నిలువు దోపిడీ గురించి మాట్లాడకుండా,సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన టికెట్ రేట్లను నియంత్రించకుండా,ఒక్క iBOMMA ban చేశారంటే సమస్యను పరిష్కరించినట్టు కాదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి .. అటు సినిమా ఇండస్ట్రీకి, ఇటు సామాన్య ప్రజలకు నష్టం కలగకుండా సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, మీరు ఆ సమయంలో ప్రతిపక్ష మీడియా సహకారంతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ప్రజలు అర్థం చేసుకోకుండా, ఆ నిర్ణయాన్నే వ్యతిరేకించేలా మోసపర్చారు.కానీ ‘నిజం అనేది నిప్పు’, దానిని దాచలేరు, ఆపలేరు. ఆ రోజున అర్థం కాలేకపోయిన విషయాలు iBOMMA ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత ఈ రోజు ప్రజలు స్పష్టంగా గ్రహిస్తున్నారు.ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్న వాస్తవం ఏమిటంటే:వైఎస్ జగన్ సినిమా ఇండస్ట్రీ దోపిడిని తొలిసారి ప్రశ్నించిన నాయకులుసామాన్య ప్రజలకు అందుబాటు ధరలో సినిమా అందాలని ఉద్దేశంతో టికెట్ రేట్లపై సంస్కరణలు తీసుకువచ్చారుఆ రోజు ప్రతిపక్ష మీడియా అడ్డు అదుపు లేకుండా చేసిన మాయాప్రచారం వల్ల మోసపోయాముఇప్పుడు iBomma వర్సెస్ సినిమా ఇండస్ట్రీ ఘర్షణ బయటపడడంతో ప్రజలు దీని అసలు రూపాన్ని “సామాన్యుడు వర్సెస్ ఇండస్ట్రీ దోపిడి”గా చూస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో iBomma వ్యవస్థాపకుడిపై ఇటీవల జరిగిన చర్యలు కొత్త ప్రశ్నల శ్రేణిని లేవనెత్తాయి. పైరసీ నేరం అయినప్పటికీ, ఈ చర్య అసలు సమస్యను పరిష్కరిస్తుందా అనే సందేహం ప్రజల్లో పెరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్న టికెట్ రేట్ల పెరుగుదల, సామాన్య ప్రజలను తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.తెలుగు సినిమా రంగంలో టికెట్ ధరల పెరుగుదల, ప్రభుత్వ నియంత్రణల్లో అసంగత,ప్రజల్లో పైరసీ సైట్ల వైపు ఆధారణ పెరుగుతున్న దృశ్యం… ఇవన్నీ ఒకే కథ చెబుతున్నాయి: సమస్య వ్యక్తుల్లో కాదు, వ్యవస్థల్లో ఉంది. అయినా ఎలా జరుగుతోంది? వ్యక్తులను పట్టుకుని శిక్షించడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపుతున్నట్టు చూపడం.ఇటీవల iBomma వ్యవస్థాపకుడిపై జరిగిన చర్యలు చట్టపరంగా సరైనవే. పైరసీ అనేది నేరమే. కానీ ఈ చర్య ఒక పెద్ద ప్రశ్నను మాత్రం తప్పించలేదు: ఇది నిజంగా సమస్యకు శాశ్వత పరిష్కారమా?“తెలుగు సినిమాల టికెట్ రేట్లు అసహజంగా పెరగడం కొత్త విషయం కాదు. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం ధరలు ఆకాశాన్నంటుతాయి. కుటుంబంతో కలిసి సినిమా చూడడం సాధారణ ప్రేక్షకుడికి ఈ రోజుల్లో ఒక చిన్న ‘ఈవెంట్’లా మారిపోయింది; ఖర్చు 1,000 నుంచి 2,000 రూపాయల వరకు వెళ్తోంది. ‘సరే, OTTలో చూద్దాం’ అనుకుంటే, వాటి ధరలు కూడా సామాన్యుడికి అందే స్థాయిలో లేవు. సినిమాలు మన జీవన విధానంలో భాగమైనప్పటికీ, ఈ పరిస్థితుల్లో పైరసీ వేదికలు ఎదగడం ఆశ్చర్యకరం కాదు సహజమే.”అంటే iBomma కారణంగా టికెట్ ధరలు తగ్గలేదు; టికెట్ ధరలు అధికంగా ఉండటమే iBomma వంటి వేదికలకు ప్రాణవాయువు.అయితే ప్రభుత్వ వైఖరి మాత్రం విచిత్రంగా ఉంది. చట్టవిరుద్ధ ప్రవర్తనను చూపించే సినిమాలు సులభంగా సెన్సార్ అవుతాయి. అదే సినిమాలను ప్రైడ్, కల్చర్, ఇండస్ట్రీ గ్రోత్ పేరుతో ప్రోత్సహించడంలో వెనుకాడదు.కానీ పైరసీ విషయానికి వస్తే మాత్రం "కఠిన చర్యలు" అనే నినాదం.ఇది ద్వంద్వ వైఖరి కాదు అంటే ఇంకేమిటి?ఇది సనస్యకు శాశ్వత పరిష్కారం కాదు కేవలం తాత్కాలిక విరామం మాత్రమే.ఎందుకంటే..iBOMMA పుట్టింది అంటె అది ప్రజల తప్పు కాదు.. మీరు సంవత్సరాలుగా పట్టించుకోని దోపిడీ, అధికారదుర్వినియోగం,అదుపుతప్పినవ్యవస్థలవల్లే.,ఈ రోజు iBOMMA ban చేస్తే,రేపు అదే కారణాలతో ఇంకో వెబ్సైట్ పుడుతుంది.మరో రోజు ఇంకోటి.సైట్లను మూసేయడం కాదు.. సమస్యను మూసేయడం అవసరం.ఒక బొమ్మను మూసేస్తే మరొక బొమ్మ వస్తుంది—ఇది ఇంటర్నెట్ యుగం యొక్క వాస్తవం.వ్యక్తులు మారవచ్చు, వెబ్సైట్లు మూసుకోవచ్చు, కానీ వ్యవస్థలు మారకపోతే సమస్య మారదు.పైరసీ ఒక సాంకేతిక నేరం కాదు, ఒక ఆర్థిక–సామాజిక ప్రతిస్పందన.సమస్యను చూడాల్సిన నిజమైన కోణం• సినిమా టికెట్ ధరలు సాధారణీకరణ • ప్రభుత్వ పాలసీల్లో స్పష్టత • OTTలను అందుబాటులో ఉంచడం • మార్కెటింగ్ వ్యయం, సినీ నటుల పారితోషక నియంత్రణ • ప్రజలను శత్రువులుగా చూసే వ్యవహారం ఆపడం ఇవి జరిగితేనే పైరసీకి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితేనే iBomma తరహా వేదికలు నిలిచిపోతాయి.ఇది ప్రపంచం నిరూపించిన మోడల్ —Netflix, Aahaa,Amazon prime,Hot Star and YouTube Premium… అన్నీ చవకగా చేస్తే ప్రజలు పైరసీ వైపు వెళ్ళడం తగ్గిపోతుంది.అందువల్ల ప్రశ్న ఒక్కటే: ప్రభుత్వం, సినీ పరిశ్రమ,మూల సమస్యను ఎందుకు పరిష్కరించడంలేదు?ఎందుకు వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా తీసుకుని పబ్లిసిటీ యుద్ధం చేస్తోంది?“ఒక వ్యక్తిని జైలుకు పంపితే వ్యవస్థలోని లోపాలు తొలగిపోవు. ఒక వెబ్‌సైట్‌ను మూసేసినా, ఆ సమస్యను పుట్టించే కారణాలు మాత్రం అలాగే బతికే ఉంటాయి. అందువల్ల ఇప్పుడు అయినా ప్రభుత్వం మరియు సినిమా ఇండస్ట్రీ పెద్దలు మేల్కొని, అసలు సమస్యకు కారణమేమిటో నిజాయితీగా పరిశీలించి, ఈ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాలి.”-పి. నేతాజి పవన్ కుమార్ -
పోలీసులకు పెను సవాల్.. iBOMMA One వచ్చేసింది
-
విచారణలో 'ఐబొమ్మ' సినిమా చూపించిన రవి
‘ఐబొమ్మ’ పైరసీ సినిమా వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని దర్యాప్తు అధికారులు కస్టడీలోకి తీసుకుని ఐదు రోజులపాటు విచారించనున్నారు. ఈ క్రమంలో రవిని పోలీసులు మొదటిరోజు విచారించారు. అందులో భాగంగా రవి 'నేను ఒంటరిని… మీ ఇష్టం వచ్చింది చేసుకోండి' అంటూ ఎలాంటి భయం లేకుండా అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారట. అతని కోసం వెళ్లిన న్యాయవాదులను కూడా కలిసేందుకు అతను ఇష్టపడలేదట. తన స్నేహితుడు వస్తాడని మాత్రం చెప్పినట్లు తెలుస్తోంది. తనది ఒంటరి జీవితమని.. పట్టించుకునేవారు ఎవరూ లేరని చెబుతూనే.. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని పోలీసులతో రవి పేర్కొన్నాడట.విచారణలో భాగంగా చంచల్‌గూడ జైలు నుంచి రవిని సీసీఎస్‌కు పోలీసులు తీసుకొచ్చారు. మొదటిరోజు విచారణలో అతని నెట్వర్క్ గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. విడుదలైన సినిమాను ఎలా పైరసీ చేస్తాడు.. ఆపై ఎలా ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాడు వంటి అంశాలను రవి నుంచి రాబట్టారట. అయితే, రవి కూడా అధికారులకు పూర్తిగా సహకరించారట. నాకు తెలియదు, చెప్పను అనే సినిమా డైలాగ్స్ పేల్చకుండా విచారణ అధికారులకు తన వెబ్‌సైట్‌ను ఎలా నిర్వహిస్తాడో చెప్పాడట. ఐబొమ్మ సినిమాను పోలీసులకు కళ్లకు కట్టినట్టు చూపించాడట.అప్పుడే విడుదలైన సినిమాను ఎక్కడ రికార్డ్ చేస్తారు..? క్వాలిటీ ఎలా పెంచుతారు..? వంటి అంశాలతో పాటు ఐబొమ్మ సర్వర్లోకి ఎలా పంపుతారనే అంశాలన్ని చాలా క్లియర్‌గా రవి వివరించాడట. ఈ క్రమంలో ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే వాటిని అధిగమించే ప్లాన్‌ను కూడా పంచుకున్నాడట. తన కోసం పనిచేసే ఏజెంట్లు కూడా ఉన్నట్లు తెలిపాడట. వాళ్లకు కొంత డబ్బులిచ్చి సినిమా ప్రింట్ తీసుకుంటానని రవి చెప్పాడట. సినిమా విడుదలకు ముందే క్యూబ్‌ను ఏ విధంగా హ్యాక్ చేస్తారో కూడా రవి వివరంగా తెలిపాడట. -
ఒకటి పోతే మరొకటి.. ఆన్ లైన్ లో మరో ఐబొమ్మ
-
పైరసీ శాశ్వతంగా ఆగిపోయేది కాదు: సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు హోంశాఖ కార్యదర్శి ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్. ఒకడిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతడి స్థానంలో మరొకడు వస్తాడని అన్నారు. దీంతో, ఆయన తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఒకడు పోతే మరొకడు వస్తాడు. వాడు మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తాడు. కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ నేరాలు పూర్తిగా ఆగిపోతాయనుకోవడం అసాధ్యమని వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడిన సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల ముఠాను పట్టుకున్న తర్వాత దొంగతనాలు, దాడులు, మోసాలు ఆగిపోయాయా? మనిషి ఉన్నంతకాలం ఈ రకాల నేరాలు కూడా జరుగుతూనే ఉంటాయి. వీటికి మన చేతిలో ఉన్న మార్గం నివారణ ఒక్కటే. ఈజీ మార్గాల్లో డబ్బు సంపాదించాలన్న కోరికలను తగ్గించుకోవాలి. సైబర్ క్రైమ్స్ పెరగడానికి అదే మూల కారణం. సైబర్ స్పేస్, అకౌంట్లను సేఫ్‌గా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలి. జీవితంలో ఏదీ ఫ్రీగా రాదని డైరెక్టర్ రాజమౌళి చెప్పినమాటే జీవిత సత్యం’ అని పేర్కొన్నారు. -
‘ఐబొమ్మ వన్’ పేరుతో మరో వెబ్సైట్.. సోషల్‌మీడియాలో ట్రెండింగ్
సినిమా పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ‘ఐబొమ్మ’ (Ibomma), ‘బప్పంటీవీ’ (Bappamtv) పూర్తిగా క్లోజ్ అయ్యాయి. దీంతో టాలీవుడ్ నిర్మాతలు, సినీ నటులు సీసీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ఇమ్మడి రవి లాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలని నిర్మాత సీ కల్యాణ్ కామెంట్ కూడా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో కొత్తగా ‘ఐబొమ్మ వన్’ వెబ్సైట్ తెరపైకి వచ్చింది.గతంలో ఉన్న ఐబొమ్మ మాదిరిగానే కొత్త సినిమాలు అందులో ఉన్నాయి. సినిమాను చూసేందుకు క్లిక్ చేస్తే ‘మూవీరూల్స్’కు కనెక్ట్ కావడం గమనార్హం. అలా మళ్లీ తెరపైకి ఐబొమ్మ పేరు వచ్చేసింది. ఈ రకంగా పైరసీ ద్వారా సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఐబొమ్మ క్లోజ్ కావడంతో ఇండస్ట్రీ, పోలీసులు సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఐబొమ్మ వన్ తెరపైకి రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. -
iBomma రవి చేసింది పైరసీ కాదు? సినిమా ఇండస్ట్రీ వాళ్లే పెద్ద క్రిమినల్స్
-
ఫ్లాట్ నంబర్ 1903.. ఐబొమ్మ రవి కేసులో మరిన్ని షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’సహా పదుల సంఖ్యలో పైరసీ వెబ్సైట్లు నిర్వహించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులకు చిక్కిన ఇమ్మడి రవి పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు నాంపల్లి న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని దర్యాప్తు అధికారులు గురువారం కస్టడీలోకి తీసుకుని ఐదు రోజులపాటు విచారించనున్నారు.ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు అతడి నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టారు. పైరసీ సర్వర్లు ఎక్కడెక్కడ ఉంచాడు? ఆయా వ్యవహారాల్లో సహకరించింది ఎవరు.. ఇతర సాంకేతిక అంశాలపై ప్రశ్నించనున్నారు. మరోపక్క ఆరేళ్లలో 21 వేల చిత్రాలను పైరసీ చేసిన, బెట్టింగ్/గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇమ్మడి రవి ఆర్థికాంశాలపైనా అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న కొన్ని స్థిరాస్తుల్ని గుర్తించారు. అతడు పౌరసత్వం తీసుకున్న కరేబియన్ దీవుల్లోని దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్లోనూ కొన్ని ఆస్తులు ఖరీదు చేసినట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలోనూ విచారించనున్నారు.ఏడాదిలోనే హోంలోన్ క్లోజ్... పైరసీ, బెట్టింగ్ దందా ద్వారా రవి భారీ మొత్తం ఆర్జించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబీకులకు దూరంగా ఉంటున్న రవి ఓ సమీప బంధువుతో మాత్రం సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. వివిధ సందర్భాల్లో ఆ బంధువు రవి ఖాతాకు రూ.కోటి బదిలీ చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 2018 నుంచి పైరసీ వెబ్సైట్లు నిర్వహిస్తున్న రవి మూసాపేట్‌లోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లోని ఎ–బ్లాక్‌లోని 1903 ఫ్లాట్‌ను 2019లో ఖరీదు చేశాడు.ఆ సమయంలో కేవలం కొంత మొత్తం చెల్లించిన అతడు.. మిగిలింది హోంలోన్ తీసుకున్నాడు. అయితే కేవలం ఏడాదిలోనే ఆ లోన్‌ను రవి క్లియర్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇప్పటివరకు రవికి సంబంధించిన ఆరు బ్యాంకు ఖాతాలను విశ్లేషించిన పోలీసులు వాటిలో రూ.28 కోట్ల లావాదేవీలు గుర్తించారు. దాదాపు మరో 25 బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. బిట్ కాయిన్ల రూపంలోనూ భారీ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు కస్టడీలో భాగంగా పోలీసులు రవికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ వాలెట్స్ వివరాలు సేకరించనున్నారు. -
ఐ బొమ్మ ఇమ్మడి రవికి ఐదురోజుల పోలీసు కస్టడీ
సాక్షి,హైదరాబాద్: సినిమా పైరసీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐబొమ్మ ఇమ్మడి రవికి నాంపల్లి హైకోర్టు ఐదురోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐ బొమ్మ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని మరింత లోతుగా విచారణ జరిపేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పోలీసు కస్టడీ కోరిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసులో ఉన్న సాంకేతిక అంశాలు, డిజిటల్ ఆధారాలు, నెట్వర్క్ లింకులు తదితరాలను విశ్లేషించేందుకు రవిని ప్రత్యక్షంగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు. కోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.ఇప్పటికే ఈ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా దృష్టి సారించింది. రవికి సంబంధించి ఫైనాన్షియల్ లింకులు, లావాదేవీలు, విదేశీ నిధుల ప్రవాహం వంటి అంశాలపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పైరసీ రాకెట్ వెనుక ఉన్న మిగతా వ్యక్తులు, టెక్నికల్ మద్దతుదారులు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి అంశాలపై కూడా విచారణ జరగనుంది. ఈ కేసు తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేసిన నేపథ్యంలో, పరిశ్రమ వర్గాలు, నిర్మాతలు, డిజిటల్ హక్కుల పరిరక్షణ సంస్థలు ఈ విచారణను ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
రవి బొమ్మ కనబడిందా? తవ్వే కొద్దీ షాకింగ్ నిజాలు
-
ఆస్తుల్ని అమ్మడానికి వచ్చి.. పోలీసులకు చిక్కి..
సాక్షి, హైదరాబాద్: సినీ పరిశ్రమతో పాటు పోలీసులకు చుక్కలు చూపించిన ‘ఐబొమ్మ’రవి కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దా దాపు మూడు నెలల పాటు వేటాడారు. ఓపక్క పైరసీ చేస్తుండటం.. మరోపక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో పాటు సవాళ్లు విసరడంతో ఇతడి అరెస్టును సవాల్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్మడి రవికి సహకరించిన ఇద్దరు నిందితుల్ని సెప్టెంబర్‌లో పట్టుకున్నా... ఇతడి గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో సాంకేతికంగా ముందుకు వెళ్లిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు రవి ఆచూకీ కనిపెట్టింది. కరేబియన్ దీవుల్లో సెటిల్ అయిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఆస్తుల్ని అమ్మేయడానికి వచి్చన అతన్ని అరెస్టు చేసింది. ఆ ఇద్దరి సహకారంతో వెబ్సైట్ ఏర్పాటు.. రవి బీఎస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత వెబ్ డిజైనర్, డొమైన్ డెవలపర్‌గా మా రాడు. ఇలా వ్యాపారులకు అవసరమైన వెబ్సై ట్లు డిజైన్ చేసి, అభివృద్ధి చేసి ఇచ్చేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సినీ పైరసీ కో సం 2018లో ఐబొమ్మ వెబ్సైట్ ఏర్పాటు చే యాలని నిర్ణయించుకున్నాడు. ఈ డొమైన్ రిజి్రస్టేషన్‌కు అవసరమైన సెల్‌ఫోన్ నంబర్ కోసం సిమ్‌కార్డును తన ఎంబీఏ క్లాస్మేట్ అయిన నెల్లూరుకు చెందిన ఎస్.ప్రశాంత్‌ది వినియోగించాడు. అప్పట్లో వెబ్సైట్ రూపకల్పనకు స్నేహి తుడైన నెల్లూరు వాసి, వెబ్ సైట్ డెవలపర్ శివాజీ నుంచి సాంకేతిక సహకారం తీసుకున్నాడు. దీంతో ఆ డొమైన్లో వీరి వివరాలు నిక్షిప్తమయ్యాయి. వరుసగా ఐదు కేసులు నమోదు కావడంతో.. ఐబొమ్మ, బప్పం, ఐరాదే సహా మొత్తం 65 వెబ్సైట్లు, మిర్రర్ సైట్లపై ఇటీవల కాలంలో ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రవి సినీ పరిశ్రమను, పోలీసుల్ని చేతనైతే తమను పట్టుకోవాలన్నట్టుగా సవాల్ చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేసేందుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్లు ఎస్.నరేష్ కుమార్, కె.మధుసూదన్‌రావు, ఎస్సై మహిపాల్, హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్‌రెడ్డిలతో కూడిన ఈ టీమ్ సాంకేతిక దర్యాప్తు చేపట్టింది. ఐబొమ్మ వెబ్సైట్ ఏర్పాటు పూర్వాపరాలు పరిశీలించి ప్రశాంత్, శివాజీ పాత్ర గుర్తించారు. వీరికోసం ముమ్మరంగా గాలించి సెపె్టంబర్ 22న పుణేలో ప్రశాంత్‌ని, అదే నెల 24న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శివాజీని అరెస్టు చేశారు. అయితే 2019 తర్వాత వీరికి రవితో ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో అతడి తాజా వివరాలు వారు చెప్పలేకపోయారు. దీంతో పూర్తిస్థాయి సాంకేతిక దర్యాప్తుపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. ఎట్టకేలకు లభించిన తాజా వివరాలు.. రవి 2018లోనే ఐబొమ్మ వెబ్సైట్ డిజైన్ చేసినప్పటికీ.. 2020లో లాక్డౌన్ అమలు తర్వాత ఇది ఫేమస్ అయ్యింది. వెబ్సైట్ ట్రాఫిక్ మానిటరింగ్ చేసే వారు ఈ విషయం గమనించడంతో అనేక గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్ల నిర్వాహకులు యాడ్స్ పోస్టు చేయడం కోసం సంప్రదించారు. వారితో ఒప్పందాలు చేసుకున్న రవి తొలినాళ్లలో ప్రతి నెలా రూ.5 లక్షల వరకు.. ప్రస్తుతం రూ.20 లక్షలు ఆర్జిస్తున్నాడు. మరోవైపు గూగుల్ యాడ్స్ నుంచి నగదు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నంలోనూ కొన్ని ఆస్తులు కొన్నాడు. ఇవన్నీ గమనించిన సైబర్ క్రైమ్ పోలీసులకు రవి తాజా బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు తెలిశాయి. వీటిని పరిశీలించగా..అతను 2022లో భారత పాస్‌పోర్టు అప్పగించి, లక్ష డాలర్లు చెల్లించడం ద్వారా కరేబియన్ దీవిల్లో ఒక దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పౌరసత్వం, పాస్‌పోర్టు తీసుకున్నట్లు గుర్తించారు. కాగా పోలీసులు తనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని తెలుసుకున్న రవి.. సెయింట్ కిట్స్ అండ్ నెవీస్‌లో స్థిరపడిపోవాలని భావించాడు. తనకు ఉన్న ఆస్తుల్ని విక్రయించాలని భావించి గత వారం విజిట్ వీసాపై వచ్చి, హైదరాబాద్ మూసాపేటలోని తన ఫ్లాట్‌లో బస చేశాడు. ఈ విషయం గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసుల బృందం తక్షణమే స్పందించి అతడిని అరెస్టు చేసింది. -
ఐబొమ్మ ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి,హైదరాబాద్: దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఇమ్మడి రవి పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇమ్మడి రవి విడాకుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో అతని భార్య పోలీసులకు సమాచారం ఇచ్చిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, రిమాండ్ రిపోర్టులో మాత్రం ఈ విషయం ఖండించింది. రవిని పట్టించడంలో అతని భార్య పాత్ర లేదని, అతను వినియోగించిన రెండు డొమైన్ల ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించినట్లు తేలింది. టెక్నికల్ ఆధారాలు, డొమైన్ల వివరాలురవి ‘ఐబొమ్మ’తో పాటు ‘బప్పం టీవీ’ పేరుతో 17 ప్రధాన వెబ్సైట్లు, అలాగే 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లు నిర్వహించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వెబ్సైట్లకు నెలకు సుమారు 3.7 మిలియన్ల యూజర్లు లాగిన్ అవుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ భారీ ట్రాఫిక్‌ను ఉపయోగించి, రవి బెట్టింగ్ సైట్లకు లింక్ చేసిన రెండు ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేశాడు. వాటిలో ఒకటి అమెరికా నుంచి, మరొకటి అమీర్‌పేట నుంచి రిజిస్టర్ చేయించారని రిపోర్టులో ఉంది. ఈ రెండు డొమైన్లే రవిని పట్టించాయి.నేరాన్ని అంగీకరించిన రవిరిమాండ్ రిపోర్టులో రవి తానే సినిమాలను పైరసీ చేసినట్లు అంగీకరించాడని, ఏ విధంగా సైట్లు నడిపాడో వివరంగా పేర్కొన్నారు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీల ఆధారంగా సైబర్‌క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. అంతేకాకుండా, రవి బెదిరింపులకు పాల్పడ్డ స్టేట్మెంట్లు, విదేశీ పౌరసత్వం తీసుకున్న వివరాలు కూడా రిపోర్టులో ఉన్నాయి.పోలీసుల హెచ్చరిక‘దేశ డిజిటల్ భద్రతకు ఇమ్మడి రవి లాంటి వ్యక్తులు హానికరం’ అని పోలీసులు వ్యాఖ్యానించారు. అతన్ని అరెస్ట్ చేయకపోతే, ఇలాంటి వెబ్సైట్లు మళ్లీ మళ్లీ సృష్టించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. -
పైరసీ చేసేవాళ్లను ఎన్కౌంటర్ చేయాలి: నిర్మాత సి.కళ్యాణ్
పైరసీ చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేశారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్‌కి సినీ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వందలాది మంది కష్టం సినిమా. అలాంటి కష్టాన్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా ఉన్న సమయంలో.. యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటైంది. పైరసీని అరికట్టడం సాధ్యమేనా? అని అప్పుడు చాలామంది అడిగారు. మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలన్న బాధ్యతతో దానిని ప్రారంభించాం. కొందరు రిటైర్ పోలీసు అధికారులు అందులో భాగమయ్యారు.పైరసీ అరికట్టేందుకు ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసి పైరసీ సెల్ ఎంతో కృషి చేసింది. ఇక్కడే కాదు విదేశీ సినిమాల విషయంలోనూ పైరసీని అరికట్టేందుకు ఈ విభాగం ఎంతో పని చేసింది. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ దేశాలకు చెందిన సినీ పెద్దలను పైరసీ సెల్‌ని అభినందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ‘ఐబొమ్మ’ వాళ్లను పట్టుకోవడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు డిపార్ట్మెంట్కి టాలీవుడ్ తరపున ధన్యవాదాలు. పైరసీ అరికట్టడంతో ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తాం’ అన్నారు. ఫిలిం చాంబర్ అధ్యక్షకులు భరత్ భూషన్ మాట్లాడుతూ.. ‘ఛాంబర్ కు సంబంధించిన వీడియో పైరసీ సెల్ కూడా పైరసీకి అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తుంది. పైరసీ చేస్తున్న వాళ్ళను అరెస్ట్ చేసిన తెలంగాణా ప్రభుత్వానికి , సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు’ అన్నారు.చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... " పోలీస్ వారిని, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాలను పైరసీలో చూస్తున్నారు అంటున్నారు. కానీ ఈ పరిస్థితి వల్ల మిగతా చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే సినిమా క్యూబ్, యుఎఫ్ఓ వెళుతున్న సంగతి అర్థమవుతుంది. వారి సర్వర్లు బలంగా ఉండేలా చూసుకోవాలి" అని అన్నారు.వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ... "సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. అది టెక్నాలజీ మారుతూ వచ్చిన ప్రతిసారి పైరసీ కూడా రూపం మార్చుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం చాలెంజ్‌గా తీసుకుని పైరసీ చేసేవారిని పట్టుకోవడం జరిగింది. అది సినీ పరిశ్రమకు వరం. టికెట్ ధరలు కూడా కుటుంబంతో సహా వచ్చి చూసే విధంగా టికెట్ ధరలు ఉండేలా చూడాలి. పైరసీని పూర్తిగా అరికడితేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు" అని అన్నారు. -
ఐబొమ్మ ఇమ్మడి రవికి మరో బిగ్ షాక్!
సాక్షి,హైదరాబాద్: ఐబొమ్మ ఇమ్మడి రవి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. సినిమా పైరసీకి సంబంధించిన కేసును తెలంగాణ పోలీసులు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐబొమ్మ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.ఇందులో భాగంగా ఐబొమ్మ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు లేఖ రాసింది. ఐబొమ్మ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు అనుమానాలున్నాయి. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి రాసిన లేఖలో పేర్కొంది. కాగా,అరెస్టు సమయంలో ఐబొమ్మ ఇమ్మడి రవి బ్యాంక్ అకౌంట్ నుండి రూ. 3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు.. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు గుర్తించారు. నెలకు రూ. 15 లక్షలు రూపాయలు క్రిప్టో వాలెట్ నుండి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు ట్రాన్స్‌ఫరయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో వీటిపై ఈడీ దర్యాప్తు చేయనుంది. -
'ఐబొమ్మ రవి'పై భార్య, అత్త హేళన
ఐబొమ్మ అనే సినిమా పైరసీ వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ యాప్స్న్ ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు ఇమ్మడి రవి సంపాధించాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత తన మనస్తత్వాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. చిన్న తనం నుంచి కాలేజీ రోజులు ఆపై తన పెళ్లి వంటి అంశాలను ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అయితే, డబ్బు కోసం జీవితంలో ఎక్కువగా అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. బాగా డబ్బున్న ముస్లిం కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి 2016లో పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదనతో నెట్టుకురావడం కష్టమైంది. రోజువారి కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడటం.. ఆపై కూతురు కూడా ఉండటంతో ఖర్చలు మరింత పెరగడం జరిగింది. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు రావడం మొదలైంది. డబ్బు సంపాదించి పోషించడం నీ వల్ల కాదంటూ భార్యతోపాటు అత్త కూడా హేళన చేయడాన్ని రవి భరించలేక పోయాడు. ఈ క్రమంలో వెబ్ డిజైనర్‌గా తనకున్న అనుభవంతో పైరసీ దందాలోకి దిగి.. 2019లో ఐ బొమ్మ, 2022లో బప్పం టీవీ పేర్లతో వెబ్సైట్లు ఏర్పాటు చేశాడు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మరోటి తెరుస్తూ మొత్తం 65 మిర్రర్ సైట్లు రూపొందించాడు. కొద్దిరోజులకే బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావడంతో తను ఎన్నడూ ఊహించనంత డబ్బు వచ్చేసింది. కానీ, తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని భార్యకు చూపించినప్పటికీ అతనితో కలిసి ఉండేందుకు ఆమె ఇష్టపడలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో 2021లో వారిద్దరూ విడిపోయారు. ఆ ఘటన తర్వాత నెదర్లాండ్ వెళ్లిపోయాడు అక్కడే హోస్ట్ సర్వర్లను పెట్టాడు. కరేబియన్ దీవులతోపాటు ఫ్రాన్స్, దుబాయ్‌ల్లోనూ సంచరిస్తూ ఆయా దేశాల్లో ఖరీదు చేసిన 110 డొమైన్స్ ద్వారా ఈ వెబ్సైట్లు హోస్ట్ చేశాడు. ప్రస్తుతం తన ఖాతాలో రూ. 20 కోట్లకు పైగా డబ్బు ఉంది. ఇప్పటికే రూ. 3 కోట్లు సీజ్ చేశారు. అయితే, కూకట్‌పల్లిలోని తన ఫ్లాట్‌ను విక్రయించి విదేశాల్లోనే స్థిరపడిపోవాలని హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయాడు. -
IBomma: ఇమ్మడి రవి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
-
ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్
-
ఇమ్మడి రవి అరెస్ట్‌లో బిగ్ ట్విస్ట్.. ఐ-బొమ్మ నుంచి మరో మెసేజ్!
సాక్షి,హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను గందరగోళంలోకి నెట్టిన పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. సినిమాలను పైరసీ చేస్తూ అటు సినీ పరిశ్రమకు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరిన ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఐబొమ్మ వెనుక మరికొందరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.అందుకు ఊతం ఇచ్చేలా ఐబొమ్మ వెబ్సైట్ ఓ మెసేజ్‌ను విడుదల చేసింది. అందులో..‘మీరు ఇటీవల మా గురించి విని ఉండచ్చు. ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు. ఏదేమైనా, మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాము’ అని ఉంది. అరెస్టు అనంతరం, సీసీఎస్ పోలీసులు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను మూసేయించారు. అయినప్పటికీ ఇవాళ ఆ సైట్ నుంచి తాజా మెసేజ్ రావడంతో ఇమ్మడి రవితో పాటు మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు.. ఫోటోలు
-
మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు: నాగార్జున
పైరసీ సైట్ 'ఐ బొమ్మ' సూత్రధారి ఇమ్మది రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు రిమాండ్‌లో ఉన్నాడు. ఇతడిని అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ సీపీ సజ్జనార్.. సోమవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. పోలీసులని మెచ్చుకుంటూనే పలు విషయాలు మాట్లాడారు. అయితే నాగార్జున చెప్పింది మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.(ఇదీ చదవండి: తెలంగాణ పల్లెలో చావు చుట్టూ జరిగే కథ.. టీజర్ రిలీజ్)'ఉచితంగా సినిమా చూపించడం అనేది ఓ ట్రాప్. ఆరు నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం. కానీ సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నాడు. ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్సైట్ తెరిస్తే మన వివరాలు అన్ని వాళ్ళకు వెళ్ళిపోతాయి. పైరసీ ద్వారా రూ.20 కోట్లు సంపాదించారు అనేది చాలా చిన్న సొమ్ము. వాళ్ల సంపాదన వేల కోట్లల్లో ఉంటుంది' అని నాగార్జున తన కుటుంబంలో ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు.డిజిటల్ అరెస్ట్ అంటే?డిజిటల్ అరెస్ట్‌లో భాగంగా మోసగాళ్లు.. ఆయా వ్యక్తులకు వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ చేస్తారు. సీబీఐ, ఆదాయ పన్ను, కస్టమ్స్ అధికారుల్లా నటించి సదరు వ్యక్తులని ఫోన్లోనే బెదిరిస్తారు. మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మనీలాండరింగ్, పన్ను ఎగ్గొట్టడం, డ్రగ్స్ రవాణా లాంటి కేసులో బుక్ అయ్యారని, అందులో మీ పేరు లేదా అడ్రస్ ఉందని అంటారు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని భయపెడతారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)ఈ కేసులో మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరిస్తూ, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు కోరతారు లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా పెద్ద మొత్తంలో మీ తరపున హామీగా డబ్బు డిపాజిట్ చేయాలని, కేసు దర్యాప్తు పూర్తయ్యాక దాన్ని తిరిగి ఇచ్చేస్తామని అంటారు. సమాజంలో తమ పరువు పోతుందనే భయంతో చాలామంది ఈ ట్రాప్‌లో పడిపోతుంటారు.ఇలా జరగడానికి ప్రధాన కారణం.. మనం అనధికారిక సైట్లలోకి వెళ్లినప్పుడు మన వివరాలు వాళ్లకు చేరిపోతాయి. తర్వాత మనకు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరిస్తారు. హీరో నాగార్జున కూడా తమ కుటుంబంలోని ఓ వ్యక్తికి ఇలా జరిగిందని చెప్పడం షాకిచ్చింది.(ఇదీ చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఈవారం బిగ్ బాస్ నామినేషన్స్) -
సజ్జనార్ కి కృతజ్ఞతలు తెలిపిన సినీ ప్రముఖులు
-
ఐబొమ్మ నిర్వాహకుడు వందలాది మంది కష్టాన్ని దోచుకున్నాడు
-
'దమ్ము ఉంటే పట్టుకోండి' అన్నాడు.. పైరసీపై చిరంజీవి వ్యాఖ్యలు
ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహుకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పైరసీ వల్ల సినీ రంగం చాలా నష్టం పోయిందని సజ్జనార్ తెలిపారు. ఆపై అతను 'దమ్ము ఉంటే పట్టుకోండి చూద్దాం ' అన్నాడు దీంతో అతన్ని అరెస్ట్ చేయాలని గట్టిగానే అనుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి, దిల్ రాజు కూడా పైరసీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు.దమ్ము ఉంటే పట్టుకోండి అంటూ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేసిన సవాల్‌ను ఒక ఛాలెంజ్‌గా స్వీకరించిన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి చూపించారని చిరంజీవి కొనియాడారు. ఈ క్రమంలోనే పైరసీ అనేది ఇండస్ట్రీకి పెద్ద సవాల్‌గా మారిందని ఇలా చెప్పారు. 'సినిమాను నమ్మకుని కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. గత సీపీ సీవీ ఆనంద్‌తో పాటు ప్రస్తుత సీపీ సజ్జనార్ కలిసి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. చాలా ఏళ్ల నుంచి చిత్రపరిశ్రమను పైరసీ అనేది పీడిస్తూనే ఉంది. ఎన్నో కష్టాలను తట్టకుని ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తున్నారు.' అని చిరు అన్నారు.సినిమా పైరసీకి సంబంధించిన కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులకు నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు చెబుతూ ఇలా పేర్కొన్నారు. 'మూడు నెలల క్రితమే పైరసీ గురించి అరెస్ట్‌లు మొదలయ్యాయి. ఇలాంటి వెబ్సైట్ల వల్ల మీ వ్యక్తిగత డేటా కూడా చోరి అవుతుంది. మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం. ప్రేక్షకులు కూడా ఇలాంటి వెబ్సైట్లను ఎంకరేజ్ చేయకండి. మీకు కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నెలరోజుల్లోనే ప్రతి సినిమా ఓటీటీలోకి వస్తుంది. సంతోషంగా ఇంట్లోనే చూసేయండి. ఇలాంటి పైరసీ వెబ్‌సైట్స్‌లను ఎంకరేజ్ చేసి పరిశ్రమకు నష్టం చేకూర్చకండి.' అంటూ దిల్ రాజు తెలిపారు. -
అతడు మాస్టర్ మైండ్.. ఐబొమ్మ రవి గురించి సజ్జనార్ సంచలన నిజాలు
-
IBomma: ఐబొమ్మతో రవి 20 కోట్లు సంపాదించాడు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల చాలా నష్టం జరిగిందన్నారు హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్. పైరసీ మాస్టర్ మైండ్, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి రవి సినిమాలు అప్లోడ్ చేసేవాడు. పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై నిఘా పెట్టినట్టు సజ్జనార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడని సజ్జనార్ వెల్లడించారు.హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐబొమ్మపై చాలా రోజులుగా దర్యాప్తు చేస్తున్నాం. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించాం. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. దేశవ్యాప్తంగా పైరసీ సమస్య ఉంది. నిందితుడు రవి.. కొత్త టెక్నాలజీ ఉపయోగించి సినిమాలు అప్లోడ్ చేసేవాడు. రవిని విచారిస్తున్నాం. నిందితుడికి అంతర్జాతీయ లింకులు ఉన్నాయి. ఐబొమ్మ రాకెట్ ఛేదించేందుకు జాతీయ సంస్థల సపోర్టు తీసుకుంటాం. ఉదయం విడుదలైన సినిమా.. సాయంత్రానికి ఐబొమ్మ రవి వద్ద ఉండేది. ఐబొమ్మ రవిపై మూడు పైరసీ కేసులు ఉన్నాయి. రవి వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. రవి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది డిజిటల్ అరెస్ట్ అయ్యారు. ఐబొమ్మ రవి వెనుక డార్క్ వెబ్సైట్లు ఉన్నాయి. రవి స్వస్థలం విశాఖపట్నం. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. రవి.. పోలీసులకే సవాల్ విసిరాడు. 50 లక్షల మంది సబ్స్కైబర్ల డేటా ఇమంది రవి దగ్గర ఉంది. ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టాడు. రవి హార్ట్ డిస్క్‌లో అన్ని సినిమాలు ఉన్నాయి. టెలిగ్రామ్ యాప్‌లో కూడా పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాడు. నిందితులు ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారు. పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై నిఘా పెట్టామన్నారు. రవి చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో చాలా మంది నష్టపోయారు. రవిపై ఐదు కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడు. రవి నుంచి రూ.3 స్వాధీనం చేసుకున్నారు. సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల చాలా నష్టం జరిగింది. పైరసీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందన్నారు. 21వేల సినిమాలు హార్ట్ డిస్క్‌లో ఉన్నాయి. రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం జరిగింది. నిందితుడిపై ఐటీ సెక్షన్ల కింది కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. 1970 మూవీస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు రవి వద్ద ఉన్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఐబొమ్మ రవిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేశారు. ఐబొమ్మ వెనుక పెద్ద రాకెట్ ఉంది. రవి.. పలు పేర్లతో లైసెన్స్‌లు, పాన్ కార్డులు తీసుకున్నాడు. నిందితుడు డేటా ఎక్కడ నుంచి సేకరించారనే దానిపై విచారిస్తున్నాం’ అని తెలిపారు. -
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్! సజ్జనార్ సంచలన ప్రెస్ మీట్
-
'ఐబొమ్మ'పై సీపీ సజ్జనార్ మీడియా సమావేశం
ఐబొమ్మ వెబ్సైట్ పేరుతో సినిమాలను పైరసీ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమతోపాటు పోలీసులకు సవాల్ విసిరిన అతన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతని అరెస్ట్‌పై నేడు 11 గంటలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇమ్మడి రవికి సంబంధించిన నెట్వర్క్ గురించి ఆయన వివరాలు వెళ్లడించనున్నారు.సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో టాలీవుడ్ సినీ హీరోలతో పాటు నిర్మాతలు కూడా పాల్గొననున్నారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ సైట్లు ప్రమోట్ చేసి కోట్లు సంపాదించిన రవిపై 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాంపల్లి న్యాయస్థానం ఇతడికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఐబొమ్మ సహా 65 వెబ్సైట్లను పోలీసులు మూసేయించారు. -
iBOMMA రవి గురించి అపార్ట్ మెంట్ వాసుల షాకింగ్ నిజాలు
-
iBOMMA రవి అరెస్ట్ వెనుక మహిళ..!
-
నో బొమ్మ.. 65 పైరసీ వెబ్సైట్లు క్లోజ్
సాక్షి, హైదరాబాద్: సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమతోపాటు పోలీసులకు సవాల్ విసిరి, ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవికి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు అంతా భావిస్తున్నట్లు అతడి వెనుక ఎలాంటి ముఠా లేదని బయటపడింది. తన గుట్టు బయటపడకుండా ఒక్కడిగానే పనిచేస్తూ పైరసీ సైట్ల నుంచి కాపీ చేస్తూ కథ నడిపాడని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నాంపల్లి న్యాయస్థానం ఇతడికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఐబొమ్మ సహా 65 వెబ్సైట్లను పోలీసులు మూసేయించారు. ఎంబీఏ చదివి... కంపెనీ పెట్టి.. ఇమ్మడి రవి దేశవ్యాప్తంగా ఏజెంట్లను పెట్టుకుని థియేటర్లలో రికార్డింగ్ చేయించడం, డిజిటల్ మీడియా సంస్థలు, ఓటీటీల సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్స్ సంగ్రహిస్తాడని అందరూ అంచనా వేశారు. వీటినే ఐ బొమ్మ, బప్పం, ఇరాదే... ఇత్యాది 65 వెబ్సైట్లలో ఉంచుతున్నాడని అనుకున్నారు. రవి పట్టుబడిన తర్వాత అతడి విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పోలీసులు అవాక్కయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన రవి ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. ఆపై కొన్నాళ్లు ఉద్యోగం చేయడంతోపాటు ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సైతం నిర్వహించాడు. సినీ పైరసీపై దృష్టి పెట్టి తన చేతికి మట్టి అంటకుండా పని చేసుకుపోయాడు. ఆ సైట్లలో ఉన్న సినిమాలను రికార్డు చేసి.. ఏళ్లుగా పైరసీ సినిమాలను తన వెబ్సైట్లలో ఉంచి సినీ రంగానికి భారీ నష్టం రావడానికి కారణమైన రవి ఇప్పటివరకు ఏనాడూ ఒక్క చిత్రాన్ని కూడా రికార్డు చేయలేదు.. చేయించలేదు.. సర్వర్లు హ్యాక్ చేయలేదు. మూవీరూల్జ్, తమిళ్వన్ సహా వివిధ పైరసీ వెబ్సైట్లను క్రమం తప్పకుండా వీక్షించే ఇతగాడు అందులో అప్లోడ్ అయిన సినిమాను కొన్ని సాఫ్ట్వేర్స్ వాడి రికార్డు చేసేవాడు. ఇలా రికార్డు చేసిన ప్రింట్‌ను తన వెబ్సైట్లలో పొందుపరిచే వాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అప్లోడ్ అయిన సినిమాలను ఇలానే రికార్డు చేసి తన సైట్లో పెట్టేవాడు. అయితే ఇతర పైరసీ వెబ్సైట్లలో యాడ్స్ ఎక్కువగా ఉండి వీక్షకుడిని డిస్ట్రబ్ చేస్తుంటాయి. రవికి సంబంధించిన వాటిలో మాత్రం ఓ సినిమా వీక్షించడానికి క్లిక్ చేసినప్పుడు మాత్రమే యాడ్ వస్తుంది. దాన్ని క్లోజ్ చేసి మరోసారి తెరిస్తే ఆద్యంతం ప్రకటన అనేది రాదు. ఈ కారణంగానే ఇతడి వెబ్సైట్లకు లక్షల్లో వీక్షకులు ఉంటున్నారు. ప్రాక్సీ సర్వర్లతో ఉనికి బయటపడకుండా... ప్రధానంగా కొన్ని గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన యాడ్స్ ద్వారా రవికి భారీగా లాభాలు వచ్చేవి. ఐబొమ్మ వెబ్సైట్ ప్రాచుర్యం పొందిన నాటి నుంచి దాని నిర్వాహకుడి వివరాల కోసం సినీ, పోలీసు విభాగాలు ప్రయత్నించాయి. అయితే ప్రాక్సీ సర్వర్లను వాడుతూ, కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ సహా వివిధ ప్రాంత్లాల్లో ఉన్న సర్వర్లలో హోస్ట్ చేస్తూ కథ నడిపించడంతో నగరంలోనే ఉన్నా రవి ఆచూకీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. పోలీసులకు, సినీ రంగానికి ఇతడు సవాల్ విసరడంతో వేట ముమ్మరమైంది. ఈ విషయం తెలిసి విదేశాలకు పారిపోయిన రవి ఫ్రాన్స్‌లో తలదాచుకున్నాడు. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి ఐబొమ్మ నిర్వాహకుడికి జరిగిన చెల్లింపుల ఆధారంగా ముందుకెళ్లిన పోలీసులకు ఓ ఐపీ అడ్రస్ లభించింది. అది మూసాపేట్‌లోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లోని ఎన్.బ్లాక్‌లో ఉన్న 1903 ఫ్లాట్‌కు దారి తీసింది. దానిపై నిఘా వేసి ఉంచిన సైబర్ క్రైమ్ పోలీసులు రెండు రోజుల క్రితం విదేశాల నుంచి తిరిగి వచ్చిన రవిని పట్టుకున్నారు. సోషల్‌మీడియాలో భారీ ఫాలోయింగ్ చట్టప్రకారం ఇమ్మడి రవి చేసింది నేరం. కానీ, సోషల్‌మీడియాలో మాత్రం అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అతడి అరెస్టు విషయం తెలిసినప్పటి నుంచి పుంఖానుపంఖాలుగా గ్రూపులు ఏర్పాడుతున్నాయి. వివిధ వెబ్సైట్లలో రవి అరెస్టు వార్తను చూసిన అతడి అభిమానులు కామెంట్లలో తమ మద్దతు తెలుపుతున్నారు. ‘ఐ»ొమ్మ పోరాట సమితి’, ‘అమీర్‌పేట కుర్రాళ్లు’, ‘రవి ఫ్యాన్ క్లబ్’ పేర్లతో గ్రూపులు కనిపిస్తున్నాయి. ‘సినిమా విడుదల సందర్భంలో రేట్లు పెంచేస్తూ ప్రభుత్వమే జీఓలు ఇస్తుంది. అలా పేద వాడికి దూరమైన సినిమాను విడుదలైన కొన్ని గంటల్లోనే రవి ఉచితంగా అందిస్తున్నాడు. అది తప్పెలా అవుతుంది?’ అని, ‘ఇప్పుడిక అమీర్‌పేట కుర్రాళ్లు, మిడిల్ క్లాస్ స్టూడెంట్ల పరిస్థితి ఏమిటో?’ అని కామెంట్లు కనిపిస్తున్నాయి. -
ఐ-బొమ్మ రవి అరెస్టుపై ఆయన తండ్రి ఏమన్నారంటే?
సాక్షి,విశాఖ: ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్టును ఆయన తండ్రి అప్పారావు సమర్ధించారు. ఇమ్మడి రవి అరెస్టు వేళ మీడియా తండ్రి అప్పారావును కదలించింది. ‘రవి నేరం చేయలేదని నేను చెప్పను పరిణామాలు చూసి నేరం చేసినట్టు అంగీకరించాల్సిందే. రవి ఇంటికి వచ్చి రెండేళ్లు అవుతుంది. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా..?. కోట్లు సంపాదించడం అంటే మాటలా..నేను సాదాసీదా జీవితం గడుపుతున్నాను. రవి తప్పు చేసి చేయలేదంటే ఊరుకుంటారా..?.రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యా, భర్తలిద్దరికీ విభేదాలు ఉన్నాయి. ఏది ఏమైనా రవి చేసింది తప్పే’అని వ్యాఖ్యానించారు. ఇమ్మడి రవి అరెస్టు ఇలావిదేశాల్లో ఉన్న ఇమ్మడి రవి భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ సమయంలో రవి గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఇమ్మడి రవి తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇమ్మడి రవి విడుదలైన కొత్త సినిమాను పైరసీ చేయడం వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్లోడ్ చేస్తుండేవాడు. తద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కొత్త మార్గాల్ని ఎంచుకున్నాడు. అందుకు టెలిగ్రామ్‌ను వేదిక చేసుకున్నాడు. టెలిగ్రామ్‌లో యూజర్లు సినిమా లింక్స్ క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్స్,గేమింగ్ యాప్స్ యాడ్స్ వచ్చేవి.వాటి ద్వారా భారీ ఆదాయాన్ని గడించాడు.పోలీసుల దర్యాప్తు ఇలా అదే సమయంలో తెలంగాణ సీఐడీ పోలీసులు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌పై సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తులో ఉండగా పోలీసులకు ఇమ్మడి రవి సైతం బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఐబొమ్మ,బప్పం టీవీలో పైరసీ సినిమా చూసే సమయంలో అనైతిక గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌కు సంబంధిత యాడ్స్‌ను ప్రసారం చేసేవాడు. పైరసీ సినిమాను ఓపెన్ చేయాలన్నా, డౌన్లోడ్ చేయాలన్నా, ఇంటర్వెల్ తర్వాత సినిమా చూడాలన్నా, సినిమా చూసే సమయంలో పాజ్ క్లిక్ మళ్లీ చూడాలన్నా ఆ యాడ్స్‌ను క్లిక్ చేసేలా వ్యవస్థను తయారు చేశాడు. ఇమ్మడి రవి అనుచరులు అరెస్టుఅలా పోలీసులు బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు చేస్తుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పైరసీ కంటెంట్‌కు సంబంధించి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వారిలో శివాజీ,ప్రశాంత్ ఉన్నారు. వారిద్దరూ ఇమ్మడి రవికి ప్రధాన అనుచరులుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్లిద్దరూ అరెస్ట్ అనంతరం కూకట్పల్లి నుంచి తప్పించుకుని నెలకొకసారి దేశాలు మారుతూ వచ్చాడు. కూకట్ పల్లి నుంచి నెదర్లాండ్, ఫ్రాన్స్, కరేబీయన్ దీవుల్ని అడ్డగా చేసుకొని పైరసీ సైట్లను నిర్వహించాడు. ఐబొమ్మ రవి ప్రస్తుతం భార్యతో విడాకుల కేసులో హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరవుతున్నాడు. అదే క్రమంలో తదుపరి విచారణ కోసం అతడు ఫ్రాన్స్ నుంచి కూకట్ పల్లికి రాగా.. రవిని పోలీసులు అరెస్టు చేశారు. రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన విషయం అతడి దగ్గరి వ్యక్తుల నుంచి పోలీసులకు లీకైందని కూడా ఒక గుసగుస వినిపిస్తోంది. 70కి పైగా పైరసీ సైట్లు కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో అతనిని అరెస్టు చేసే సమయంలో వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, ఐబొమ్మ, బప్పం టీవీలో విడుదల చేసేందుకు అప్లోడ్ చేసిన కొత్తగా విడుదలైన సినిమాలు, సర్వర్లను మెయింటైన్ చేసేందుకు వినియోగించిన సాఫ్ట్వేర్లు కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లను సీజ్ చేశారు. 2018 నుంచి నివాసం ఉంటున్న ఫ్లాట్‌ను కేంద్రంగా చేసుకున్న ఇమ్మడి రవి ఐబొమ్మ,బప్పంటీవీలలో సినిమాలను అప్లోడ్ చేసేవారని,కరేబియన్ దీవుల్లో సైతం కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలింది. ఐబొమ్మ, బప్పంటీవీలను ప్రధానంగా ఉంచుకొని.. అదనంగా మరో 70కి పైగా ఆపరేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారాల్ని సేకరించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అన్నాడనిఅనంతరం, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీని నిలిపివేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఈ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ ఇమ్మడి రవి విసిరిన సవాలను స్వీకరించి అతడితోనే ఐబొమ్మ, బప్పం టీవీలను నిలిపివేయించారు. ఇమ్మడి రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్‌లను, బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. -
ఆ కక్కుర్తే… ఐబొమ్మ ఇమ్మడి రవి కొంపముంచింది!
సాక్షి,హైదరాబాద్:పలు రాష్ట్రాలకు చెందిన సినీ ఇండస్ట్రీకి తలనొప్పిగా మారిన ప్రముఖ సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ,బప్పం టీవీలకు సంబంధించిన కీలక నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్మడి రవి అరెస్ట్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇమ్మడి రవి అరెస్ట్‌కు ప్రధాన కారణం కాసుల కక్కుర్తే అని తెలుస్తోంది.ఇమ్మడి రవి అరెస్టు ఇలావిదేశాల్లో ఉన్న ఇమ్మడి రవి భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ సమయంలో రవి గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఇమ్మడి రవి తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇమ్మడి రవి విడుదలైన కొత్త సినిమాను పైరసీ చేయడం వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్లోడ్ చేస్తుండేవాడు. తద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కొత్త మార్గాల్ని ఎంచుకున్నాడు. అందుకు టెలిగ్రామ్‌ను వేదిక చేసుకున్నాడు. టెలిగ్రామ్‌లో యూజర్లు సినిమా లింక్స్ క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్స్,గేమింగ్ యాప్స్ యాడ్స్ వచ్చేవి.వాటి ద్వారా భారీ ఆదాయాన్ని గడించాడు.పోలీసుల దర్యాప్తు ఇలా అదే సమయంలో తెలంగాణ సీఐడీ పోలీసులు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌పై సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తులో ఉండగా పోలీసులకు ఇమ్మడి రవి సైతం బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఐబొమ్మ,బప్పం టీవీలో పైరసీ సినిమా చూసే సమయంలో అనైతిక గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌కు సంబంధిత యాడ్స్‌ను ప్రసారం చేసేవాడు. పైరసీ సినిమాను ఓపెన్ చేయాలన్నా, డౌన్లోడ్ చేయాలన్నా, ఇంటర్వెల్ తర్వాత సినిమా చూడాలన్నా, సినిమా చూసే సమయంలో పాజ్ క్లిక్ మళ్లీ చూడాలన్నా ఆ యాడ్స్‌ను క్లిక్ చేసేలా వ్యవస్థను తయారు చేశాడు. ఇమ్మడి రవి అనుచరులు అరెస్టుఅలా పోలీసులు బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు చేస్తుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పైరసీ కంటెంట్‌కు సంబంధించి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వారిలో శివాజీ,ప్రశాంత్ ఉన్నారు. వారిద్దరూ ఇమ్మడి రవికి ప్రధాన అనుచరులుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్లిద్దరూ అరెస్ట్ అనంతరం కూకట్పల్లి నుంచి తప్పించుకుని నెలకొకసారి దేశాలు మారుతూ వచ్చాడు. కూకట్ పల్లి నుంచి నెదర్లాండ్, ఫ్రాన్స్, కరేబీయన్ దీవుల్ని అడ్డగా చేసుకొని పైరసీ సైట్లను నిర్వహించాడు. ఐబొమ్మ రవి ప్రస్తుతం భార్యతో విడాకుల కేసులో హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరవుతున్నాడు. అదే క్రమంలో తదుపరి విచారణ కోసం అతడు ఫ్రాన్స్ నుంచి కూకట్ పల్లికి రాగా.. రవిని పోలీసులు అరెస్టు చేశారు. రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన విషయం అతడి దగ్గరి వ్యక్తుల నుంచి పోలీసులకు లీకైందని కూడా ఒక గుసగుస వినిపిస్తోంది. 70కి పైగా పైరసీ సైట్లు కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో అతనిని అరెస్టు చేసే సమయంలో వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, ఐబొమ్మ, బప్పం టీవీలో విడుదల చేసేందుకు అప్లోడ్ చేసిన కొత్తగా విడుదలైన సినిమాలు, సర్వర్లను మెయింటైన్ చేసేందుకు వినియోగించిన సాఫ్ట్వేర్లు కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లను సీజ్ చేశారు. 2018 నుంచి నివాసం ఉంటున్న ఫ్లాట్‌ను కేంద్రంగా చేసుకున్న ఇమ్మడి రవి ఐబొమ్మ,బప్పంటీవీలలో సినిమాలను అప్లోడ్ చేసేవారని,కరేబియన్ దీవుల్లో సైతం కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలింది. ఐబొమ్మ, బప్పంటీవీలను ప్రధానంగా ఉంచుకొని.. అదనంగా మరో 70కి పైగా ఆపరేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారాల్ని సేకరించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అన్నాడనిఅనంతరం, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీని నిలిపివేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఈ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ ఇమ్మడి రవి విసిరిన సవాలను స్వీకరించి అతడితోనే ఐబొమ్మ, బప్పం టీవీలను నిలిపివేయించారు. ఇమ్మడి రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్‌లను, బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.పోలీసుల కస్టడీ పిటిషన్లో బెట్టింగ్ యాప్,గేమింగ్ యాప్ సంస్థలతో ఇమ్మడికి రవికి సంత్సంబంధాలు ఉన్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇమ్మడి రవికి ఎవరైనా సహకరిస్తున్నారా?. డిసస్టట్రిబ్యూటర్లు సినిమా కాపీనీ పలు డిజిటల్ ఛానెళ్లకు ఇస్తుంటారు. ఆ సర్వర్లలోకి వెళ్లిమరీ హ్యాక్ చేశాడు. ఎంతో పకడ్బందీగా ఉండే సర్వర్లలో ఎలా ఎంటర్ అయ్యాడు? సినిమాని ఎలా కాపీ చేశాడు? ఆ సినీమాని ఎలా పైరసీ చేశారనే విషయాలు వెలుగులోకి రావాలల్సి ఉంది. ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్న పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా, అరెస్టు అనంతరం ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ibomma : ఇమ్మడి రవికి 14 రోజులు రిమాండ్
-
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్.. లాగిన్ వివరాలు ఇచ్చేసిన రవి
సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ (i-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేపించారు. విచారణలో భాగంగా అతని నుంచి వెబ్ లాగిన్స్‌తో పాటు సర్వర్ వివరాలను తీసుకుని మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు వెబ్సైట్లు ఓపెన్ కావడం లేదు. కూకట్‌పల్లిలోని అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను నిలిపివేశారు.ఐబొమ్మ నిర్వహుకుడు ఇమ్మడి రవి గతంలో పోలీసులకు ఛాలెంజ చేశాడు. తన వద్ద కోట్లమంది డేటా ఉందని తనను టార్గెట్ చేస్తే ఏం చేయాలో తెలుసు అంటూ హెచ్చరించాడు. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అతని ఆదీనంలో ఉన్న వందల హార్డ్ డిస్క్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతన్ని మెజిస్ట్రేట్ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. ఇమ్మడి రవిపై ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఫిలిం చాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతల ఫిర్యాదులతో ఈ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకొని బెదిరింపులకు కూడా ఇమ్మడి రవి పాల్పడినట్లు తెలుస్తోంది. -
‘ఐ బొమ్మ’ రవి ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్
పైరసీ భూతంలో గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ప్రశాంతత లేకుండా చేస్తున్న ఐ-బొమ్మ(ibomma) నిర్వాహకుల్లో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవిని.. సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో శుక్రవారమే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. ఇమ్మడి రవికి, అతని భార్యకి కొంత కాలంగా తగాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం కేసు కోర్టులోనూ నడుస్తోంది కూడా. ఈ క్రమంలో.. విడాకుల కేసు కోసమే రవి ఇండియాకు వచ్చాడు. ఈ కోపంలోనే భర్త వస్తున్నాడనే సమాచారం పోలీసులకు అతని భార్యే అందించినట్లు తెలుస్తోంది. అలా.. భార్య అందించిన టిప్పుతో రవి హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. చంచల్‌గూడ జైలుకు రవి.. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు మెజిస్ట్రేట్ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో రవిని 7 రోజులపాటు పోలీసులు కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. I BOMMA , BAPPAM వెబ్ సైట్లను పోలీసులు బ్లాక్ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. పైరసీ కంటెంట్‌తో బెట్టింగ్ యాప్‌లను సైతం ప్రమోట్ చేశాడని తెలుస్తోంది.కంటెంట్‌ను ఆపేసి..ఇక విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం రాబట్టారు. కూకట్‌పల్లిలోని అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను నిలిపివేశారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లనూ కూడా గుర్తించారు. కరీబియన్ దీవుల్లో ఉంటూ.. ఐ-బొమ్మ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు.. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖలో స్థానిక పోలీసుల సహాయంతో ఈ ఉదయం నుంచి సీసీఎస్ బృందాలు సోదాలు నిర్వహించాయి. అతని స్నేహితులనూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనికి సంబంధించిన రూ.3 కోట్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చేసింది. గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఐ బొమ్మపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో గతంలో పోలీసులకి, సినీ పెద్దలకి ఐ-బొమ్మ ఓ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ దాకా వస్తే.. పోలీసుల సంగతి చూడాల్సి వస్తుందంటూ ఓ బహిరంగ పోస్ట్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ వ్యవహారంలోనూ రవి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐ-బొమ్మ కారణంగా.. సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రూ.22వేల కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ.వందల కోట్లు ఇమ్మడి రవి సంపాదించినట్టుగా గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌లో రవి పాత్ర ఇంకా ధృవీకరణ కావాల్సి ఉంది. ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు? నెట్ వర్క్ ఎక్కడెక్కడ ఉంది? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
'ఐ-బొమ్మ' రవి అరెస్ట్.. పోలీసుల చేతిలో కీలక ఆధారాలు!
పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ(iBomma ) నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో రవి(Immadi Ravi)ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సాయంత్రం నాంపల్లి కోర్టుకి తరలించారు. రవి నుంచి వైరసీ వెబ్‌సైట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. రవి ఆంధప్రదేశ్‌లోని వైజాగ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.కూకట్‌పల్లిలోని అపార్ట్మెంట్లో అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను హోల్డ్ చేసినట్టు సమాచారం. రవిని అదుపులోకి తీసుకొని విచారించగా..సంచలన విషయాలు బయటపడ్డాయట. పైరసీ వెబ్‌సైట్‌ని రన్ చేస్తున్న మరికొంతమంది పేర్లు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. త్వరలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్సైట్ నిర్వాహకులు పోలీసులకు సవాలు విసిరారు. ఆ ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని.. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ
-
నిర్మాతలకు శుభవార్త.. ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
-
'ఐ-బొమ్మ' నిర్వాహకుడు అరెస్ట్
సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ (i-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కరేబియన్ దీవుల్లో ఉంటూనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను రవి నిర్వహిస్తున్నట్లు వారు గుర్తించారు. ఫ్రాన్స్ నుంచి తాజాగా అతను హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు సమాచారం రావడంతో పక్కా ప్లాన్‌తో కూకట్‌పల్లిలో రవిని అదుపులో తీసుకున్నారు. భార్యతో విడాకులు తీసుకుని ఇమ్మడి రవి ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.సినీ పరిశ్రమకు సుమారు రూ. 3 వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చేకూర్చిన రవి అకౌంట్లో ఉన్న రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ కాపీని ఐబొమ్మలో రిలీజ్ చేయడంతో సినీ పరిశ్రమ భారీగా నష్టపోతుందని నిర్మాతలు వాపోయిన విషయం తెలిసిందే.సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తున్న ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు గట్టిగానే కొనసాగించారు. కొద్దిరోజుల క్రితం థియేటర్లో సినిమాను రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న కొందరిని అరెస్టు చేశారు. అయితే, పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఐబొమ్మ వెబ్‌సైట్‌పై కూడా దృష్టి పెట్టారు. దీంతో ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. -
‘ఐ బొమ్మ’పై ఫైర్ అయిన నిర్మాత
సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ( IBomma)పై సినీ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఐబొమ్మ ఇచ్చిన అల్టిమేటం (2023లో చేసిన ఒక X పోస్ట్) గురించి ప్రస్తావిస్తూ – ‘సినీ తారల పారితోషికాలు, డైరెక్టర్స్ ఫీజులు, నిర్మాణ వ్యయాలపై మాట్లాడే హక్కు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే పైరసీదారులకు లేదు. దొంగ పనులు చేసే వారు పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నేరంలో పాలు పంచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 500 చిత్రాలు పైరసీ చేయబడ్డాయి. ఈ నేరంలో పాలుపంచుకున్న వారిని తెలంగాణ పోలీసులు బీహార్, పూణే, తమిళనాడులో అదుపులోకి తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను. విచారణలో తెలిసిన వివరాలు సినీ రంగానికి షాక్ ఇచ్చాయి.కొన్ని సినిమాలను థియేటర్లలో కామ్‌కార్డర్ ద్వారా రికార్డు చేశారు. అంతేకాకుండా, డిజిటల్ ప్రొవైడర్స్ అయిన యూఎఫ్ఓ(UFO), క్యూబ్(Qube)ల సైట్లను హ్యాక్ చేసి, విడుదలకు ముందే దాదాపు 120 చిత్రాలను నేరుగా డౌన్లోడ్ చేసినట్లు బీహార్‌లోని గోపాలగంజ్కు చెందిన A1 నిందితుడు అశ్విన్ కుమార్ వాంగ్మూలంలో వెల్లడించాడు.నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కంటెంట్‌ను ఈ డిజిటల్ ప్రొవైడర్స్‌కి అందజేస్తారు. వీరు ఒకే కోడ్‌తో అన్ని థియేటర్లకు ప్రొజెక్షన్ కోసం అప్లోడ్ చేస్తారు. అయితే ఈ సైట్లను హ్యాక్ చేయడం వల్లే పెద్ద నష్టం జరిగింది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ సకాలంలో చేయకపోవడం, భద్రతా చర్యలు పాటించకపోవడం వలన ప్రొడ్యూసర్లు నష్టపోయారు.అదే సమయంలో నిర్మాతల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న ఈ డిజిటల్ ప్రొవైడర్స్ నిర్లక్ష్యం పట్ల వారు సమాధానం ఇవ్వడమే కాకుండా, నష్టపరిహారం కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం, పైరసీ వల్ల నష్టపోయిన నిర్మాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో నిర్మాతలు సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతారు అని ఆయన హెచ్చరించారు. -
'ఐబొమ్మ' వార్నింగ్.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం
సినిమా పైరసీ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఈ మూఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద డెబిట్‌కార్డులు, హార్డ్‌డిస్క్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ పేరుతో తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు అంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది. తాజాగా వాటిని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై వచ్చిన బెదిరింపుల వార్తలు అవాస్తం అంటూ తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ (Fact Check) టీమ్ చెప్పింది.ఐ బొమ్మ గురించి తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ పేజీ తమ ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది. 'కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ ఐబొమ్మ (iBomma) తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్షాట్లు 2023 నాటివి. అవి కూడా పోలీసులకు కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవే. దీనిని స్పష్టం చేస్తూ, తెలంగాణ పోలీసులకు ఇలాంటి ఎటువంటి బెదిరింపు రాలేదని తెలియజేస్తున్నాం. ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేసే, షేర్ చేసే విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందిగా మనవి.' అని తెలిపింది.#అలర్ట్: కొన్ని మీడియా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్షాట్లు 2023 నాటివి మరియు అవి పోలీసులకు కాకుండా… pic.twitter.com/gkcoqYtIqg— FactCheck_Telangana (@FactCheck_TG) October 3, 2025 -
'ఐ' బొమ్మ చూపిస్తాం! TFI, పోలీసులకు స్వీట్ వార్నింగ్..
-
మా జోలికొస్తే పోలీసులకు ఐ‘బొమ్మ’ చూపిస్తాం!
పైరేటెడ్ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం(iBomma) ఇప్పుడు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే(Hyderabad Police) సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఓ నోట్ విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..ఐబొమ్మ పేరిట విడుదలై వైరల్ అవుతున్న నోట్ యధాతథంగా ఇలా ఉంది.. ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది.ఈ మిడిల్ లో - వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు చేయకండి.మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to loose.).సీవీ ఆనంద్ స్థానంలో ఇప్పుడు వీసీ సజ్జనార్(VC Sajjnar) హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే.. పైరసీ, సైబర్ నేరాలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఈ తరుణంలో ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఆయన ఎంత సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి. -
టాలీవుడ్‌కు ఐ బొమ్మ వార్నింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ ప్రేక్షకులకు ఐ బొమ్మ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఓటీటీలో రిలీజైన సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండా అభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చే వెబ్సైట్ ఇదే. సినీ ప్రియులకు రూపాయి ఖర్చు లేకుండా వినోదాన్ని అందిస్తోంది. అంతలా ఆదరణ దక్కించుకున్న ఐ బొమ్మపై ఇప్పటివరకు చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. గతంలో ఈ వెబ్సైట్ పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. అయితే తాజాగా ఐ బొమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!) తాజాగా ఐ బొమ్మ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ నోట్ విడుదల చేసింది. మా మీద మీరు ఫోకస్ పెడితే.. మేం ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేస్తామంటూ హెచ్చరిక చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికైనా మా వెబ్సైటు మీద ఫోకస్ చేయడం ఆపండి.. లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సింవస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఈ పోస్ట్ టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు సినీ ప్రముఖులు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నోట్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరీ ఈ నోట్‌ను నిజంగానే ఆ సంస్థ విడుదల చేసిందా లేక కావాలని ఎవరైనా ఆ పేరుతో ఇలా అసత్యం ప్రచారం చేస్తున్నారా? అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఓ పైరసీ సైట్ ఇలా నిర్మాతలకు వార్నింగ్ ఇవ్వడమేంటని చర్చించుకుంటున్నారు. (ఇది చదవండి: మాజీ భార్యతో జతకట్టిన అమిర్ ఖాన్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత!) iBOMMA warning to Telugu Film industry 😲🤯 pic.twitter.com/1utGXhlwPt — 𝙐𝙨𝙩𝙝𝙖𝙖𝙙🔥ᵖˢᵖᵏ𝙘𝙪𝙡𝙩🦅 (@USTHAAD_PK_CULT) September 6, 2023 -
iBOMMAలో సినిమా చూసే వాళ్ళ పై ఆలీ సీరియస్ కామెంట్స్
-
సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్
ఐబొమ్మ.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఓటీటీకి వచ్చిన కొత్త సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండా హై క్వాలిటీతో ఫ్రీగా చూసేందుకు వెసులుబాటు కల్పిస్తూ వస్తుంది ఈ వెబ్సైట్. తాజాగా బిగ్ షాకిచ్చింది ఐబొమ్మ. ఇప్పటికే డౌన్లోడ్ ఆప్షన్ తీసేసిన ఐబొమ్మ తాజాగా శాశ్వతంగా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి సినీ ప్రేమికులకు షాకిచ్చింది. సెప్టెంబర్ 9నుంచి తమ ఇండియాలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా లేదని, తమకు ఎవరు మెయిల్స్ చేయొద్దని యూజర్స్‌ను కోరింది. ఇంతకాలం తమపై చూపించిన ప్రేమకు అభినందలు చెప్పారు ఐబొమ్మ నిర్వహకులు. చదవండి: సినిమా హిట్.. కానీ ఆడియన్స్‌ని క్షమాపణలు కోరిన ‘కోబ్రా’ డైరెక్టర్ కాగా హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్‌తో కొత్త సినిమాలను ఫ్రీగా అందుబాటులో ఉంచుతూ ఎంతో సినీ ప్రియులను ఆకట్టుకుంది ఐబొమ్మ. దీంతో ఇండియాలో ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించే యూజర్లు సంఖ్య ఎక్కువే అని చెప్పొచ్చు. ఎంతో యూజర్లను సంపాదించుకు ఐబొమ్మ గతంలో కూడా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నిర్వహకులు.. ఆ తర్వాత మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సినిమా డౌన్లోడ్ ఆప్షన్ తీసేసి ఆంక్షలు విధించింది. తాజాగా మరికొద్ది రోజుల్లో పూర్తిగా సేవలను నిలివేస్తున్నట్లు వెల్లడించడంతో యూజర్స్ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇది సినీ ప్రియులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి ఈ నిర్ణయాన్ని ఐబొమ్మ మళ్లీ వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాలి. చదవండి:జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్?


